lodges
-
హైదరాబాద్‌లో విచ్చలవిడిగా హాస్టళ్లు, లాడ్జీలు.. పోలీసుల ప్రత్యేక యాప్
సాక్షి, హైదరాబాద్: ఎక్కడో నేరం చేసిన వాళ్లు నగరానికి వచ్చి తలదాచుకుంటున్నారు.. ఇక్కడ నేరం చేయడానికి వచ్చినవాళ్లూ కొన్నాళ్లు మకాం వేస్తున్నారు.. ఇలాంటి వారికి సిటీలో ఉన్న కొన్ని లాడ్జీలు, హాస్టళ్లు ఆశ్రయం కల్పిస్తున్నాయి. మరోపక్క ఏ హాస్టల్లో ఎవరు ఉంటున్నారు? వాళ్లు ఎక్కడి వాళ్లు, ఇంతకు ముందు ఎక్కడ ఉన్నారు? ఇలా ఏ విషయమూ పోలీసులకు తెలియట్లేదు. ఇలాంటి సమస్యలకు పరిష్కారంగా ఎస్సార్‌నగర్ ఠాణా అధికారులు ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ఆ పోలీసుస్టేషన్ ఇన్స్పెక్టర్ కె.సైదులు ఆలోచన, కృషి ఫలితంగా కొన్ని రోజుల్లోనే ఇది అందుబాటులోకి రానుంది. గూగుల్ ద్వారా అందుబాటులోకి.. ప్రస్తుతం తుది మెరుగులు దిద్ది ఈ యాప్‌ను గూగుల్ ద్వారా అందుబాటులోకి తీసుకురావడానికి ఎస్సార్‌నగర్ పోలీసులు ఏర్పాట్లు చేశారు. పోలీసు విభాగం అధీనంలో పని చేసే దీన్ని హాస్టళ్లు, లాడ్జీల నిర్వాహకులు తమ స్మార్ట్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకోవాలి. అందులో ఉన్న కేటగిరీల ఆధారంగా బాయ్స్, మెన్స్, ఉమెన్స్ హాస్టల్స్, లాడ్జీలను ఎంచుకుంటారు. బస చేస్తున్న వ్యక్తి పేరు, ఆధార్, ఫోన్ నంబర్లతో పాటు ఎక్కడ నుంచి వచ్చాడు? ఎందుకు వచ్చాడు? ఏం చేస్తుంటాడు? గతంలో ఎక్కడ ఉండేవాడు? ప్రస్తుతం ఏ రూమ్‌లో ఉంటున్నాడు? తదితర వివరాలన్నీ నమోదు చేస్తారు. వీటితో పాటు అతడి ఫొటో, ఆధార్కార్డునూ క్యాప్చర్ చేసి అదే యాప్ ద్వారా సర్వర్‌లో నిక్షిప్తం చేస్తారు. ప్రతీ హాస్టల్, లాడ్జీ యజమాని ఈ వివరాలన్నీ యాప్‌తో సేకరించడం కచి్చతం చేస్తున్నారు. ఇది కేవలం ఒత్తిడి చేయడం ద్వారా కాకుండా యజమానులు, నిర్వాహకులకు వారంతట వారుగా వినియోగించేలా ఎస్సార్‌నగర్ పోలీసులు యోచించారు. ఓటీపీతో ఫోన్ నంబర్ వెరిఫికేషన్.. బస చేసిన వ్యక్తి ఫోన్ నంబర్ యాప్‌లో ఎంటర్ చేసిన వెంటనే దానికి ఓటీపీ వెళ్తుంది. ఇది కూడా పొందుపరిస్తేనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయ్యేలా యాప్‌ను డిజైన్ చేస్తున్నారు. ఫలితంగా నకిలీ ఫోన్ నంబర్లకు అడ్డుకట్ట వేయొచ్చు. ఈ యాప్‌నకు సంబంధించిన సర్వర్‌లో వాంటెడ్ వ్యక్తులు, పదేపదే నేరాలు చేసే వారి వివరాలతో కూడిన డేటాబేస్‌ను అనుసంధానించనున్నారు. ఎవరైనా బస చేయడానికి వస్తే... ఆ వివరాలు పొందుపరిచిన వెంటనే యాప్ దానంతట అదే అలర్ట్ ఇచ్చేలా సాఫ్ట్వేర్ డిజైన్ చేస్తున్నారు. విస్తరిస్తేనే పూర్తి స్థాయి ఫలితాలు... ఈ యాప్ ఎస్సార్‌నగర్ పోలీసుల చొరవతో రూపుదిద్దుకుంటోంది. ప్రస్తుతానికి ఆ ఠాణా పరిధిలోని హాస్టళ్లు, లాడ్జీల్లో ఉంటున్న వారి వివరాలు తెలుసుకోవడానికి, బస చేసిన వ్యక్తి పూర్వాపరాలు గుర్తించడానికి, ఆ పరిధిలో వాంటెడ్ వ్యక్తులకు చెక్ చెప్పడానికి ఉపకరించనుంది. దీనివల్ల పూర్తి స్థాయి ఫలితాలు రావాలంటే మరింత విస్తరించాల్సిన అవసరం ఉంది. ప్రాథమికంగా రాజధానిలోని మూడు కమిషనరేట్లకు ఆపై రాష్ట్ర వ్యాప్తంగా ఈ యాప్ అమలును కచ్చితం చేయడంతో పాటు ప్రోత్సహించాల్సిన అవసరముంది. -
వ్యభిచారం గుట్టురట్టు.. పోలీసులకు దొరికేసిన ఐదు జంటలు
శ్రీకాకుళం క్రైం: జిల్లా కేంద్రంలో కొంతకాలంగా సాగుతున్న వ్యభిచారం గుట్టు రట్టయ్యింది. రెండో పట్టణ పోలీస్ స్టేషన్ సీఐ ఈశ్వరప్రసాద్ తమ సిబ్బందితో ఏకకాలంలో రెండు లాడ్జీలపై దాడులు నిర్వహించి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేశారు. సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక డే అండ్ నైట్ కూడలి సమీపంలో ఉన్న శ్రీరామ, ఎన్ఎస్ఆర్ లాడ్జీల్లో కొంతకాలంగా వ్యభిచారం జరుగుతున్నట్లు సమాచారం ఉండటంతో బుధవారం మధ్యాహ్నం ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. చదవండి: కంపెనీలో అతడితో పరిచయం.. ప్రియుడి కోసం ఏం చేసిందంటే? ఈ దాడుల్లో ఐదు జంటలు పట్టుబడినట్లు సీఐ తెలిపారు. తమ బంధువులతో కొందరు ఉన్నట్లు పేర్కొన్నారు. ఆర్టీసీ కాంప్లెక్సు సమీపంలో ఇంకా కొన్ని లాడ్జీలు, బలగ తదితర ప్రాంతాల్లో వ్యభిచారం జరుగుతున్నట్లు తమకు సమాచారం ఉందన్నారు. లాడ్జిలో ఎవ రు రూమ్‌లో దిగినా పూర్తి వివరాలు ఆధార్ కార్డుతో సహా నోట్ చేసుకోవాలని, ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని సీఐ తెలిపారు. దీనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. -
బాప్రే పరదేశీ!
దేశం నలుమూలల నుంచి నగరానికి వచ్చే అతిథులు, పర్యాటకులు సికింద్రాబాద్‌లో బస చేసేందుకు ఎక్కువగా ఇష్టపడతారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి దేశంలోని అన్ని ప్రాంతాలకు ప్రయాణించేందుకు రైళ్లు అందుబాటులో ఉండటం ఒకటైతే.. బస చేయడం మొదలు అన్ని రకాలవసతులు ఈ ప్రాంతంలో ఉండటం మరో కారణం. నారాయణగూడ, ఉప్పల్,బొల్లారం, బేగంపేట్ ఇలా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి నాలుగు దిక్కులాఅతిథులకు, పర్యాటకులకు ఆశ్రయం ఇచ్చేందుకు 300 వరకు లాడ్జీలు వెలిశాయి. అందుకే సికింద్రాబాద్ నుంచి ఎటు10 కిలోమీటర్ల మేర పర్యాటకుల సందడి కనిపిస్తుంది. లాడ్జీలలో దిగే వారిపైఆధారపడి క్యాటరింగ్, ట్రావెల్స్ వ్యాపారులు జీవిస్తున్నారు. సుమారుగా5 వేల మంది యువకులు లాడ్జీలలోవార్డుబాయ్లుగా పనిచేస్తున్నారు. ఇంతవరకు పరిస్థితి బాగానే ఉన్నా.. దశాబ్దాల తరబడి ఎప్పుడు లాడ్జీల యజమానులు, సిబ్బంది వాటిపై ఆధారపడిన వ్యాపారులు ఇబ్బందుల్లో పడలేదు. సీజనల్లో ఎక్కువ.. అన్‌సీజన్‌లో తక్కువ.. అన్నట్టుగా లాడ్జీల వ్యాపారం సాగేది. 10 శాతం అటు ఇటుగా నడిచిన లాడ్జీల వ్యాపారం మూడువారాలుగా మొత్తంగా పడిపోయింది. సికింద్రాబాద్: లాడ్జీల్లో బసచేసేవారే కరువైపోగా వ్యాపారం మొత్తంగా దెబ్బతిన్నది. ఇందుకు కారణం కరోనా వైరస్. దీని కారణంగాఅతిథులు, పర్యాటకులు నగరానికి రావడం మానేయడంతో లాడ్జీల వ్యాపారంరూ.లక్షల్లోంచి వేలల్లోకి పడిపోయింది. కరోనా వైరస్ కారణంగా సికింద్రాబాద్నగరంలో స్తంభించిపోయిన లాడ్జీల వ్యాపారం గురించిన ప్రత్యేక కథనమిది. 5 వేలమంది రూమ్‌బాయ్స్.. లాడ్జీల్లో పనిచేసే రూమ్‌బాయ్స్‌కు వేతనాలు సహజంగానే తక్కువ.. వీరంతా లాడ్జీల్లో బసచేసే అతిథులు, పర్యాటకులు అందించే టిప్స్‌పైనే ఎక్కువగా ఆధారపడతారు. సాధారణంగా రూ.3 నుంచి రూ.5 వేల వరకే రూమ్‌బాయ్స్‌కు వేతనాలు ఉంటాయి. లాడ్జీల్లో బసచేసేవారి నుంచి సీజన్‌ను బట్టి నెలకు రూ.10 వేల వరకు టిప్స్ రూపంలో సంపాదించుకుంటారు. సికింద్రాబాద్ నగరంలో 300 లాడ్జీల్లో సుమారుగా 5వేల వరకు రూమ్‌బాయ్స్ పనిచేస్తున్నారు. వీరందరికీ ఈనెల మొదటి వారం నుంచి రోజు దమ్మిడీ ఆదాయం కూడా లేకుండా పోయింది. రద్దవుతున్న టూర్లు.. రెండు మూడు నెలలు ముందే నగర ప్రదర్శనకు వచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్న వారంతా కరోనా దెబ్బకు ప్రయాణాలు రద్దు చేసుకుంటున్నారు. వెస్ట్‌బెంగాల్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, హర్యానా, జార్ఖండ్ రాష్ట్రాల నుంచి ఎక్కువ సంఖ్యలోని ప్రయాణికులు నగరానికి వస్తుంటారు. ఇందులో ముఖ్యంగా గ్రూపులుగా వచ్చే విద్యార్థుల సంఖ్య ఏటా వేల సంఖ్యలోనే ఉంటుంది. నిత్యం ఐదు నుంచి పది వేల మంది పర్యాటకులు సికింద్రాబాద్ ప్రాంతంలో బసచేయడం ఉండేది. కరోనా కారణంగా మొత్తంగా పర్యాటకులు నగరానికి రావడమే మానేశారు. ఏప్రిల్, మే వేసవి సెలవుల టూర్లు కూడా ముందస్తుగా రద్దు చేసుకుంటుండటంతో లాడ్జీల యజమానులు ఆందోళనకు గురవుతున్నారు. పడిపోయిన బుకింగ్‌లు.. లాడ్జీల్లో 20 నుంచి 60 వరకు గదులు ఉంటాయి. ప్రతిలాడ్జిలో సాధారణ సమయాల్లో సగానికి ఎక్కువ, సెలవులు తదితర సీజన్లలో 80 నుంచి 90 శాతం వరకు గదులు అతిథులతో నిండి ఉంటుంటాయి. ఎంత అన్‌సీజన్‌లో అయినా 30శాతం గదుల బుకింగ్ ఉంటుంది. కరోనా కారణంగా లాడ్జీల్లో బస చేసేవారే కరువయ్యారు. ఫలితంగా రోజుకు రూ.50 వేల నుంచి రూ.1 లక్ష వరకు వ్యాపారం చేసే లాడ్జీల వ్యాపారం పూర్తిగా పడిపోయింది. రోజుకు రూ.5 వేల వ్యాపారం కావడం లేదని లాడ్జీల యజమానులు వాపోతున్నారు. క్యాటరింగ్.. ట్రావెల్స్ అంతే.. లాడ్జీల యజమానులు, ఉద్యోగుల సంగతి పక్కనపెడితే వాటిపై ఆధారపడిన క్యాటరింగ్, ట్రావెల్స్ వ్యాపారాలు కూడా కుదేలవుతున్నాయి. లాడ్జీల్లో దిగే పర్యాటకులకు భోజనాలు, టిఫిన్స్ అందించడం ద్వారా క్యాటరింగ్ వ్యాపారులు బిజీగా ఉంటుంటారు. అదేతరహాలో పర్యాటకులను, అతిథులను నగరంలోని వివిధ ప్రాంతాల సందర్శన కోసం తీసుకెళ్లేందుకు ట్రావెల్స్ నిర్వాహకులు బీజీగా ఉండేవారు. రెండు వారాలుగా లాడ్జీల్లో బసచేసేవారే లేకపోగా అక్కడి ట్రావెల్స్ వాహనాలు బయట తిరిగిన దాఖలాలే లేవు. రెండు గదులు బుక్కావడం లేదు హోటళ్లు, లాడ్జీల్లో పది గదుల్లో రెండు కూడా బుక్ కావడం లేదు. పర్యాటకుల సంఖ్య మొత్తంగా పడిపోయింది. లాడ్జీ సిబ్బంది ఖాళీగా కూర్చోవాల్సిన పరిస్థితి ఎదురైంది. గదుల్లో బసచేసే అతిథులతోపాటు బాంకెట్ హాళ్లలో సందడిగా ఉండే హోటళ్లు, లాడ్జీలు మొత్తంగా బోసిపోయాయి. – ఆనంద్‌కుమార్, లాడ్జీ నిర్వాహకుడు చిక్కడపల్లి -
ఇక నుంచి కమీషన్ 15 శాతమే
హైదరాబాద్: ఓటా, ఓయో ఆన్లైన్ బుకింగ్ సంస్థలకు ఇకనుంచి 15 శాతం కమీషన్‌ను మాత్రమే చెల్లిస్తామని, కాదంటే వచ్చేనెల 1 నుంచి దేశవ్యాప్తంగా హోటల్ ఆన్లైన్ బుకింగ్స్‌ను నిలిపివేస్తామని తెలంగాణ రాష్ట్ర హోటల్స్ అసోసియేషన్ హెచ్చరించింది. ఈ రెండు సంస్థలు తమ వ్యాపారాన్ని నిలువునా ముంచేసి రోడ్డున పడేలా చేశాయని అసోసియేషన్ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని అసోసియేషన్ కార్యాలయంలో శుక్రవారం విలేకరులతో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ రెడ్డి మాట్లాడుతూ తమకు ఆన్లైన్ ద్వారా వ్యాపారాన్ని కల్పించి లాభపడేలా చేస్తామంటే బడ్జెట్ కేటగిరీ హోటల్స్ నిర్వాహకులమంతా ఈ సంస్థల్లో చేరామని తెలిపారు. ఇలా వ్యాపారాన్ని చూపించినందుకుగాను వారికి 10 నుంచి 18% కమీషన్ ఇచ్చామన్నారు. అయితే, ఈ కమీషన్ ఇప్పుడు 40 శాతానికి చేరు కుందని, దీంతో తాము భారీగా నష్టపోతున్నామన్నారు. దేశవ్యాప్తంగా హోటల్ యాజమాన్యాలు ఈ సమస్యను ఎదుర్కొంటున్నాయన్నారు. వీరి వ్యవహారంపై ప్రభుత్వం స్పందించాలని కోరారు. 25 నుంచి గదులు ఇచ్చేది లేదు తమ డిమాండ్లకు ఆన్లైన్ బుకింగ్ సంస్థలకు ఒప్పుకోకుంటే ఈ నెల 25 నుంచి తమ హోటల్స్, లాడ్జీల్లో గదులు ఇచ్చేది లేదని వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు. హోటల్ రూమ్ వాస్తవ ధర రూ.1,500 ఉంటే వినియోగదారుల నుంచి రూ.2 వేలు వసూలు చేసి తమకు మాత్రం కేవలం రూ.700 ఇస్తున్నారన్నారు. రూమ్లపైనే కాకుండా ఫుడ్ వంటి వాటిపై కూడా తమ వద్ద డబ్బులు గుంజుతున్నారని వాపోయారు. రూ.వెయ్యిపైన వ్యాపారం జరిగితేనే పన్ను కట్టాలని, కానీ ఆన్లైన్ బుకింగ్ ద్వారా తమకు రూ.600, 700 మాత్రమే వస్తోందని హైదరాబాద్ హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అశోక్‌రెడ్డి తెలిపారు. ఆఫర్లు అంటూ చూపించే వెబ్సైట్లను ప్రజలు నమ్మవద్దని, నేరుగా వస్తే తక్కువ ధరల్లోనే రూమ్‌లను ఇస్తామని చెప్పారు. -
మహిళలపై లాడ్జీ యజమాని దాడి
నెల్లూరు,అనుమసముద్రంపేట: రొట్టెల పండగ సందర్భంగా ఏఎస్‌పేటకు వచ్చిన ఇద్దరు మహిళలపై లాడ్జీ యజమాని దురుసుగా ప్రవర్తించి చేయి చేసుకున్న వైనమిది. ప్రముఖ పర్యాటక క్షేత్రమైన ఏఎస్‌పేట దర్గా సందర్శనార్థం తెలంగాణా రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాకు చెందిన ఇద్దరు మహిళలు శుక్రవారం ఏఎస్‌పేటలోని ఓ లాడ్డీలో అద్దెకు దిగారు. సాధారణ సమయంలో రూ.200 నుంచి రూ.300 మాత్రమే అద్దెకు గదులు ఇచ్చే క్రమంలో రొట్టెల పండగ సందర్భంగా ఏఎస్‌పేట దర్గాకు భక్తులు పోటెత్తడంతో లాడ్జీ యజమాని సుబ్బరాయుడు అలియాస్ బంగారుశెట్టి అద్దెను పెంచి ఈ మహిళలకు రూ.900 రూమును అద్దెకు ఇచ్చారు. మరుసటి రోజు శనివారం మూడు గంటలకు ఖాళీ చేయాలని నిబంధన విధించాడు. శనివారం కొంత మంది భక్తులు అద్దె రూముల కోసం తిరుగుతుండగా ఈ మహిళలకు ఇచ్చిన సమయం కంటే ముందుగా ఖాళీ చేయాలని ఆదేశించాడు. మాకు మూడు గంటల వరకు టైమ్ ఉందంటూ మహిళలు సమాధానం చెప్పారు. దీనికి ఆవేశపడిన లాడ్జీ యజమాని రూంలోని మహిళల లగేజీని తానే తెచ్చి రిసెప్షన్ సెంటర్లో పెట్టి వెంటనే ఖాళీ చేయాలని వారితో గొడవకు దిగాడు. మహిళలకు దీనికి ఒప్పుకోకపోవడంతో వారిపై చేయి చేసుకున్నాడు. వారి లగేజీని బయటకు విసిరి పారేసి గందరగోళం సృష్టించాడు. మహిళలు ఏం చేయాలో తెలియక పోలీసులను ఆశ్రయించారు. స్పందించిన పోలీసులు లాడ్జీ యజమాని బంగారుశెట్టిని విచారణ నిర్వహిస్తున్నారు. -
మకాంపై మూడోకన్ను!
సాక్షి, సిటీబ్యూరో: దేశ వ్యాప్తంగా 13 రాష్ట్రాల్లోని 19 నగరాల్లోని ప్రముఖ హోటళ్లలో చేతివాటం ప్రదర్శించిన ‘స్టార్ చోర్’ జయేష్ రావ్జీ సెజ్పాల్ సిటీలోనూ మూడుసార్లు చోరీలు చేశాడు. అలా నగరానికి వచ్చిన ప్రతిసారీ లాడ్జీల్లోనే బస చేశాడు. కేవలం ఇక్కడే కాదు... ఎక్కడకు వెళ్లినా, ఎన్నిసార్లు పంజా విసిరేందుకు పథకం వేసినా ఇలానే చేస్తుంటాడు. కేవలం జయేష్ ఒక్కడే కాదు అనేక మంది ‘వలస నేరగాళ్లకు’ లాడ్జిలు షెల్టర్ జోన్లుగా మారుతున్నాయి. కర్ణాటక నుంచి వచ్చి మార్కెట్ పరిధిలో 55 తులాల బంగారం తస్కరించిన జిలానీ, మేవాట్ రీజియన్ నుంచి వచ్చి అటెన్షన్ డైవర్షన్లకు పాల్పడిన టట్లు బాజీ గ్యాంగ్, ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన ‘మస్కా’రాలతో అందినకాడికి దండుకుపోయిన ముఠాలను అరెస్టు చేసిన తర్వాత వారు నగరంలోని లాడ్జిల్లో బస చేసినట్లు తేలింది. ఈ నేపథ్యంలో ఆయా ముఠాలకు ఆశ్రయం కల్పిస్తున్న లాడ్జిలు, హోటళ్లపై నిఘా కట్టుదిట్టం చేయాలని నగర పోలీసు విభాగం భావిస్తోంది. ఇందులో భాగంగా ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ ద్వారా సిటీలోని అన్ని లాడ్జిలు, హోటళ్లను అనుసంధానించాలని యోచిస్తోంది. వాటిలో బస చేస్తున్న వారి వివరాలు ఎప్పటికప్పుడు స్థానిక పోలీసులకు అందేలా, సెంట్రలైజ్డ్ డేటాబేస్‌లో ఇవి నిక్షిప్తమయ్యేలా ప్రత్యేక ఏర్పాట్లు చేయనుంది. భవిష్యత్తులో ఓ నేరగాడు సిటీలోని ఏదైనా లాడ్జ్/హోటల్లో దిగిన వెంటనే తమను అప్రమత్తం చేసేలా ఆధునిక హంగులు సైతం అందిపుచ్చుకోవడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. ప్రస్తుతం కొంతమేర మాన్యువల్‌గా... లాడ్జిలు, హోటళ్లలో బస చేసే వారి పూర్తి వివరాలు తెలుసుకోవాలని, వాటిని సమీప పోలీసుస్టేషన్లో ఏరోజుకారోజు అందించాలనే నిబంధన అమలులోనే ఉంది. అయితే వాటి నిర్వాహకులు కస్టమర్ల వివరాలను మాన్యువల్‌గా నమోదు చేసుకుంటున్నారు. వీటినే ప్రతుల రూపంలో పోలీసులకు అందిస్తున్నారు. కొన్నాళ్ల తర్వాత ఏదైనా అంశం క్రాస్‌చెక్ చేయాలంటే ప్రస్తుతం కష్టసాధ్యంగా ఉంది. ఈ మాన్యువల్ వ్యవహారానికి బదులు సాంకేతిక పరిజ్ఞానం వినియోగించాలని సిటీ పోలీసులు నిర్ణయించారు. ఇందులో నగరంలోని లాడ్జిలు, హోటళ్లను ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా అనుసంధానిస్తారు. ఆయా చోట్ల బస చేయడానికి వచ్చే వారి వివరాలు సిబ్బంది తమ కంప్యూటర్లో నమోదు చేసిన వెంటనే అవి సర్వర్ అనుసంధానంతో పోలీసులకు చేరిపోతాయి. నిర్ణీత కాలం వీటిని భద్రంగా ఉంచేలా ఏర్పాట్లు చేస్తున్నారు. తప్పుడు వివరాలు చెప్పే చాన్స్ ఎక్కువే... బయటి ప్రాంతాల నుంచి వచ్చి నగరంలోని లాడ్జిల్లో బస చేస్తున్న నేరగాళ్లు తప్పుడు వివరాలు చెప్పేందుకు ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం వాటి నిర్వాహకులు కచ్చితంగా వినియోగదారులకు చెందిన గుర్తింపుకార్డులను పరిశీలించడంతో పాటు దాని ప్రతిని సైతం తీసుకుంటున్నారు. అయితే ఈ గుర్తింపుకార్డులే నకిలీవి అయినప్పుడు చేసేదేమీ ఉండదు. దీంతో దాదాపు ఆయా వ్యక్తులకు చెందిన పేర్లు, చిరునామాలు పక్కాగా గుర్తించేందుకు ప్రస్తుతం పోలీసు విభాగం దగ్గర ఉన్న ‘360 డిగ్రీస్ వ్యూ’ తరహా సాఫ్ట్వేర్ వాడాలని భావిస్తున్నారు. ఇలా రికార్డైన బస చేసిన నేరగాళ్ల వివరాలు పోలీసులకు ఆన్లైన్లో అందుబాటులో ఉండటంతో నిత్యం పర్యవేక్షించే ఆస్కారం ఏర్పడుతుంది. అనుమానిత ప్రాంతాల నుంచి వచ్చిన వారిపై తక్షణం కన్నేసి ఉంచడానికి అనువుగా మారనుంది. నగరంలో నేరాలు చేసే ‘వలస నేరగాళ్లకు’ ఈ విధానం ద్వారా చెక్ చెప్పే ఆస్కారం ఏర్పడుతుందని అధికారులు పేర్కొంటున్నారు. భవిష్యత్‌లో ప్రత్యేక ఎనలటిక్స్ జోడించి... ఈ ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను భవిష్యత్తులో మరింత పరిపుష్టం చేయడానికీ నగర పోలీసు విభాగం ప్రణాళికలు సిద్ధం చేసింది. దీనికోసం ఎనలటిక్స్‌గా పిలిచే సాఫ్ట్‌వేర్‌ను వినియోగిస్తారు. నగరానికి సంబంధించిన, బయటి ప్రాంతాల నుంచి వచ్చిన నగరంలో నేరాలు చేసిన వారి ఫొటోలు పోలీసు విభాగం వద్ద అందుబాటులో ఉన్నాయి. ఈ డేటాబేస్‌ను అనలటిక్స్ సాయంతో లాడ్జిలు/హోటళ్లకు చెందిన ఆన్లైన్ కనెక్టివిటీతో అనుసంధానిస్తారు. ఓ పాత నేరగాడు ఏదైనా లాడ్జిలో దిగినప్పుడు దాని నిర్వాహకులు అతడి వివరాలు నమోదు చేయడంతో పాటు వెబ్‌క్యామ్‌లో ఫొటో సైతం తీస్తారు. ఈ ఫొటో పోలీసు సర్వర్లోకి వచ్చిన వెంటనే ఎనలటికల్ సాఫ్ట్వేర్ పాత నేరగాళ్ల డేటాబేస్‌లో సరిచూస్తుంది. సదరు వ్యక్తి నేరచరితుడైనా, వాంటెడ్‌గా ఉన్నా తక్షణం గుర్తించి పోలీసులను అప్రమత్తం చేస్తుంది. ఇలా సిటీలో అడుగుపెట్టిన వెంటనే నేరగాళ్లను పట్టుకోవడానికి ఆస్కారం ఏర్పడనుంది. గరిష్టంగా మరో మూడు నెలల్లో ఈ సాఫ్ట్వేర్ అందుబాటులోకి తీసుకురావడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. -
ఆపరేషన్ లాడ్జి
నెల్లూరు(క్రైమ్): లాడ్జీలపై పోలీసు నిఘా కొరవడింది. అసాంఘిక శక్తులు లాడ్జీల్లో మకాం వేసి నేరాలకు పాల్పడుతున్నట్లు పలు ఘటనలపై విచారణలో వెలుగుచూసింది. దీంతో జిల్లా ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణ లాడ్జీ లపై దృష్టి సారించారు. క్రమం తప్పకుండా లాడ్జీల్లో తనిఖీలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేయడంతో శనివారం అర్ధరాత్రి జిల్లా వ్యాప్తం గా పోలీసులు తమ ప్రాంతాల్లోని లాడ్జీల్లో రెండు గంటల పాటు తనిఖీలు చేపట్టారు. నెల్లూరు నగరంలోని 40 లాడ్జీలు, నెల్లూరు రూరల్ పరిధిలో 11, గూడూరులో 15, కావలిలో 14, ఆత్మకూరులో 5 లాడ్జీల్లోని ప్రతి గదిని తనిఖీ చేశారు. తనిఖీల్లో పలువురు అనుమానాస్పదంగా దొరకడంతో వారి పూర్తి వివరాలను సేకరించారు. నగరంలోని బాబుఐస్‌క్రీం సమీపంలో గల ఓ లాడ్జీల్లో పోలీసు తనిఖీల సందర్భంగా ఒక మహిళ, ఇద్దరు విటులు పోలీసులకు చిక్కారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పోలీసు అధికారులు మాట్లాడుతూ లాడ్జీల్లో దిగేవారి పూర్తి వివరాలను సేకరించి విధిగా ప్రతిరోజు పోలీస్‌స్టేషన్‌కు సమాచారం అందించాలన్నారు. అనుమానాస్పద వ్యక్తులు వస్తే వెంటనే పోలీస్‌స్టేషన్‌కు ఫోను చేసి తెలపాని చెప్పారు. తనిఖీల్లో నగరంలోని పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నాు. -
జోరుగా జూదం
ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుపతి పట్టణంలో పేకాట విచ్చలవిడిగా సాగుతోంది. లక్షల్లో కరెన్సీ చేతులు మారుతోంది. స్థానికులే కాకుండా దూరప్రాంతాల నుంచి వస్తున్న పేకాటరాయుళ్లతో పట్టణంలోని హోటళ్లు జూదానికి కేంద్రాలుగా మారుతున్నాయి. ఆధ్యాత్మిక కేంద్రంపై పోలీసుల నిఘా పెద్దగా ఉండదన్న ధైర్యంతో నిర్వాహకులు చెలరేగిపోతున్నారు. సెల్ఫోన్లతో సమాచారం అందించి ఎంపిక చేసుకున్న హోటళ్లు, లాడ్జిలు, రెస్ట్ హౌస్‌లలో యథేచ్చగా జూదం నిర్వహిస్తున్నారు. సాక్షి ప్రతినిధి, తిరుపతి : జూదాన్ని వ్యసనంగా మార్చుకున్న కొంత మంది బడా బాబులకు తిరుపతి నగరం సురక్షిత ప్రాంతంగా కనిపించింది. ఎందుకంటే..ఈ పట్టణానికి నిత్యం వేలాది మంది యాత్రికులు వచ్చి పోతుంటారు. హోటళ్లు, లాడ్జిలన్నీ యాత్రికులు, పర్యాటకులతో నిండి ఉంటాయి. ఇక్కడి హోటళ్లలో జూదం ఆడితే పోలీసులు పెద్దగా పట్టించుకునే వీలుండదన్నది జూదరుల భావన. దీంతో పట్టణంలోని ఒక్కో లాడ్జిని ఒక్కో రోజు ఎంపిక చేసుకుంటూ పేకాట సాగిస్తున్నారు. సరదాగా పేకాట ప్రారంభించి వ్యసనంగా చేసుకున్న వారు కొందరైతే, అదే వృత్తిగా చేసుకున్న వారు మరికొందరు ఉన్నారు. ఆరు నెలలుగా పరిశీలిస్తే...ఐదారుసార్లు పోలీసులు దాడులు చేసి రూ.20 లక్షలకు పైగా నగదు స్వాధీనం చేసుకున్నారు. అయినప్పటికీ జూదం ఆగలేదు. సోమవారం రాత్రి తిరుచానూరు రోడ్డులోని ఓ పేరున్న స్టార్ హోటల్‌పై దాడిచేసిన పోలీసులు 8 మంది పేకాటరాయుళ్లను అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ.3 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వస్తూ.. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండే ప్రాంతాన్ని గుర్తిం చడం, అక్కడ అవసరమైన ఏర్పాట్లు చేయడం, ఆటతో సంబంధం ఉన్న వారికి ఫోన్ల ద్వారా సమాచారం ఇవ్వడమనే మూడు ప్రక్రియల్లో జూదం సాగుతోంది. తిరుపతిలోని కీలక హోటళ్లను వీరు ఎంపిక చేసుకుంటున్నారు. ఆరు నెలల కిందట బస్టాండ్ దగ్గర ఓ స్టార్ హోటల్లో పోలీసులు దాడిచేసి పది మందికిపైగా జూదరులను పట్టుకున్నారు. ఆ తరువాత కొర్లగుంట, లక్ష్మీపురం, బస్టాండ్ సెంటర్, ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిసరాల్లో దాడులు జరిగాయి. మరి కొంతమంది జూదరులను, నిర్వాహకులనూ పోలీ సులు అరెస్టు చేశారు. రియల్ వ్యాపారులు, బిల్డర్లు, పొలిటికల్ లీడర్లు వీరిలో ఉన్నారు. ఒకప్పుడు చెన్నై, బెంగళూరు వంటి పెద్ద పెద్ద నగరాల్లో నిర్వహించే క్లబ్బుల్లో ఆడే ఆటగాళ్లు కొందరు అక్కడ పోలీసుల నిఘా ఎక్కువ కావడంతో మకాం తిరుపతికి మార్చుకున్నారు. పోలీసులతో మంచి సంబంధాలు కలిగిన కొంత మంది కీలక వ్యక్తులు పేకాట స్థావరాలను మేనేజ్ చే స్తున్నారు. ఆటకింతని డబ్బు తీసి సొంతంగా నిఘా వ్యవస్థను నిర్వహిస్తున్నారు. పోలీసులకూ తెలుసు.. ఏ రోజు ఎక్కడ జూదం నడుస్తుందో పోలీసులకూ తెలుస్తుందనీ, అయితే విషయం ఎస్పీ దాకా వెళ్లే అవకాశం ఉందని పసిగట్టినపుడే దాడులు జరుగుతున్నాయని తెలుస్తోంది. చిన్నాచితకా స్థావరాలపై దాడులు జరపకుండా నెలవారీ మామూళ్లు అందుకుంటున్న పోలీసులూ ఉన్నారు. దీనివల్ల పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతికి చెడ్డ పేరు వస్తోంది. ఇప్పటికే విచ్చలవిడి మద్యం దుకాణాలతో కంపుకొట్టే నగరం జూదానికి కేంద్రంగా మారితే అసాంఘిక శక్తులు హెచ్చుమీరే ప్రమాదం ఉందని నగరవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పూర్తిస్థాయిలో నిఘా ఉంది నగరంలో జరిగే అసాంఘిక కార్యకలాపాలపై పూర్తి స్థాయిలో నిఘా ఉంది. ప్రధానంగా పేకాట స్థావరాలను ఎప్పటికప్పుడు గుర్తించేలా పోలీస్ వ్యవస్థను ఏర్పాటు చేశాం. దీనికితోడు సమర్థవంతమైన సమాచార వ్యవస్థ కూడా ఉంది. ఎవర్నీ వదలిపెట్టం. హోటళ్లకు లీగల్ నోటీసులు పంపుతున్నాం. ఇకపై ఏదైనా జరిగితే యజమానులు బాధ్యత వహిం చాల్సి ఉంటుందని చెబుతాం. – మునిరామయ్య, ఈస్ట్ సబ్ డివిజనల్ డీఎస్పీ, తిరుపతి -
వ్యభిచారం నిర్వహిస్తున్న ఐదుగురి అరెస్ట్
కరీంనగర్ : జిల్లా కేంద్రంలోని సాయి రామకృష్ణ లాడ్జి పై టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆకస్మిక దాడి నిర్వహించారు. వ్యభిచారం చేస్తున్న ఇద్దరు విటులు, ఇద్దరు యువతులతో పాటు లాడ్జి మేనేజర్‌ను అరెస్ట్ చేశారు. నిందితులను టాస్క్‌ఫోర్స్ పోలీసులు కరీంనగర్ ఒకటో పట్టణ పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. యువతులకు కౌన్సెలింగ్ ఇస్తామని చెప్పారు. వ్యభిచారం పై పూర్తి నిఘా ఉందని, ఎప్పటికైనా దీనిని నిర్వహించే వారు మానుకోవాలని, లేకుంటే చట్ట ప్రకారం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని టాస్క్ ఫోర్స్ సీఐ శ్రీనివాస రావు హెచ్చరించారు. -
యాదాద్రిలో ఏడు జంటల అరెస్ట్
యాదాద్రి: ప్రపంచస్థాయి దేవాలయంగా నల్లగొండ జిల్లా యాదాద్రిలోని శ్రీలక్ష్మీనర్సింహస్వామి ఆలయాన్ని తీర్చిదిద్దే క్రమంలో భాగంగా ఇప్పటికే ఆలయాన్ని నూతనంగా నిర్మిస్తుండగా.. ఆ మేరకు శాంతిభద్రతల నిర్వహణతోపాటు ఆలయ పరిసర ప్రాంతాల్లో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. అందులోభాగంగా ఆదివారం ఏడు జంటలతో పాటు బహిరంగంగా మద్యం సేవిస్తున్న 38 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పవిత్ర పుణ్యక్షేత్రంలో (కొండ కింద) దాదాపు 21 ప్రైవేట్ లాడ్జిలు ఉన్నాయి. వీటిలో 20 లాడ్జిలపై ఆదివారం ఒకేసారి దాడులు నిర్వహించిన పోలీసు బృందాలు.. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఏడు జంటలను అరెస్ట్ చేశాయి. నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
అద్దెకు రెక్కలు
నెల ముందుగానే బుకింగ్ షురూ లాడ్జిలన్నీ హౌస్‌ఫుల్ అంటున్న నిర్వాహకులు సమ్మెటివ్ పరీక్షల నేపథ్యంలో జాతర సిబ్బందికీ వసతి కరువే వెంకటగిరి: పోలేరమ్మ జాతర వెంకటగిరిలోని లాడ్జి యజమానులకు కాసులవర్షం కురిపిస్తోంది. జాతరలో అమ్మవారికి మొక్కులు చెల్లించేందుకు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల్లో పలువురు లాడ్జిల్లో ఆశ్రయం పొందుతారు. అయితే ఈ ఏడాది లాడ్జిల నిర్వాహకుల చెప్పే అద్దెలు విని నోరెళ్లబెడుతున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని వారిని దోచుకునేందుకు లాడ్జిల యజమానులు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. నెలముందే బుకింగ్‌లు ప్రారంభమైనప్పటికీ హౌస్‌ఫుల్ అని సమాధానమిస్తున్నారు. ఎలాగోలా చేయాలని కోరితే చేంతాడంత అద్దెలు చెబుతున్నారు. పట్టణంలో సాధారణ రోజుల్లో రూ.600 నుంచి రూ.వెయ్యి వరకు అద్దె వసూలు చేస్తారు. ప్రస్తుతం జాతర నేపథ్యంలో ఆరు రెట్లు వరకు పెంచి గదుల స్థాయి(ఏసీ, నాన్ఏసీ)రూ.2 వేలు నుంచి రూ.6 వేలు వరకు వసూలు చేస్తున్నారు. ఇక బుధవారం ఏ సమయంలో రూము తీసుకున్నా, గురువారం ఉదయం 10 గంటల వరకు తప్పనిసరిగా ఉంచుకుని రెండు రోజుల అద్దె చెల్లించాల్సిందేనని షరతులు పెడుతున్నారు. అధికారులకు తప్పని తిప్పలు జాతర విధుల్లో పాలుపంచుకునేందుకు వచ్చే పోలీసులు, వివిధ శాఖల అధికారులకు ఏటా పట్టణంలోని జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాల, మదర్ అకాడమి స్కూలుతో పాటు పలు పాఠశాలల్లో వసతి కల్పిస్తారు. అయితే ఈ ఎడాది ఈనెల 21వ తేదీ నుంచి సమ్మెటివ్ ఎసెసెమెంట్ –1 పరీక్షలను రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు పూర్తిచేసింది. సరిగ్గా జాతర ప్రారంభమయ్యే 21వ తేదీన సంస్కృతం సబ్జెక్టుతో పరీక్షలు ప్రారంభం అవుతాయి. వెంకటగిరిలోని ఉన్నత పాఠశాల స్థాయిలో సంస్కృతం సబ్జెక్ట్æ లేకపోవడంతో 22వ తేదీన ప్రారంభంకానున్నాయి. ఉదయం, మధ్యాహ్నం రెండు పేపర్లుగా ఈ పరీక్షలు నిర్వహించనుండడంతో జాతర విధులకు హజరయ్యే సిబ్బందికి వసతి ఏర్పాటుపై స్థానిక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. లాడ్జి యజమానులను కొన్ని గదులు కేటాయించాలని హుకుం జారీ చేస్తుండడంతో వారి ఆశలకు గండిపడనుంది. ఇక ప్రత్యామ్నయంగా స్థానికంగా ఉన్న కల్యాణ మండపాలను సిబ్బంది వసతి కోసం వినియోగించే చర్యలు చేపట్టారు. -
2 లాడ్జీల్లో వ్యభిచారం
పోలీసుల అదుపులో ఐదుగురు నిందితులు యజమానులపై కేసు నమోదు పెబ్బేరు : రెండు లాడ్జీల్లో వ్యభిచారం కొనసాగుతుండగా పోలీసులు దాడి చేసి ఐదుగురిని పట్టుకున్నారు. వివరాలిలా ఉన్నాయి. పెబ్బేరులోని జయదేవ్, సాయి లాడ్జీల్లో కొంతకాలంగా వ్యభిచారం జరుగుతున్నట్లు స్థానికులు ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రతి వారం జరిగే సంతకు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి కొందరు వచ్చి ఇక్కడ వ్యభిచారానికి పాల్పడుతున్నట్టు తెలుసుకున్నారు. దీంతో శనివారం అర్ధరాత్రి ఎస్ఐ రమేష్ ఆధ్వర్యంలో ఈ లాడ్జీల్లో దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇద్దరు పురుషులు, ముగ్గురు మహిళలు పట్టుబడ్డారు. ఈ మేరకు లాడ్జీల యజమానులు చెన్నయ్య, రుక్మందరెడ్డిలపై కేసు నమోదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. -
పందెంరాయుళ్లతో కిటకిటలాడుతున్న లాడ్జీలు
-
జీవితాలతో పేకాట!
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:జిల్లా కేంద్రమైన శ్రీకాకుళం పట్టణంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాలు జూదక్రీడకు స్వర్గధామంగా విలసిల్లుతున్నాయి. పేద, మధ్య తరగతి జీవితాలను నరకప్రాయం చేస్తున్నాయి. విచ్చల విడిగా జూదాలు నిర్వహిస్తూ కొందరు లక్షలాది రూపాయలను అప్పనంగా సంపాదిస్తున్నారు. పట్టణంలోని కొన్ని చోట్ల నిత్యం జూదం జరుగుతున్నా పోలీసులు, అధికారులు అటువైపు కన్నెత్తి చూడకుండా కొంతమంది బడాబాబులు, నాయకు లు లోపాయికారీగా ‘మేనే జ్’ చేస్తున్నట్టు తెలిసింది. ఎప్పటి నుంచో సాగుతున్న ఈ దందా గురించి కొందరు పోలీసు అధికారులకు తెలిసినా చూసీ చూడకుండా వ్యవహరిస్తూ నెలవారీ మామూళ్లు దండుకుంటున్నారని సమాచారం. జూదం ద్వారా ఎన్నో కుటుంబాల ఆస్తులను లాగేసుకుంటున్న నిర్వాహకులు.. ఆటలో గెల్చిన వారిపైనా అల్లరిమూకలతో దాడులు చేయించిన సంఘటనలు కూడా ఉన్నాయి. పరువు పోతుందన్న భయంతో బాధితులు ఈ విషయాలను బయటకు చెప్పుకోలేకపోతున్నారు. తాజాగా గత ఆదివారం అర్ధరాత్రి వర కు పట్టణ శివార్లలో జూదం జరిగింది. కొవ్వొత్తుల లైటింగ్‌లో మట్టిరోడ్డుకు సమీపంలోని గుడారాల్లో ఇదంతా జరిగినట్లు తెలిసింది. విచిత్రమేమిటంటే మామూలు రోజులు కన్నా వారాంతాల్లో జరుగుతున్న ఆటల్లో ప్రభుత్వ ఉద్యోగులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నట్లు సమాచారం. ఇవే జూదానికి అడ్డాలు పట్టణంలో రోజూ కొన్ని లాడ్జీలు, హోటళ్లలోని గదులు ప్రత్యేకంగా జూదం కోసమే బుక్ అవుతున్నాయి. పేకాట కోసం తీసుకునే గదులకు సాధారణ రేటు మీద రెట్టింపు వసూలు చేస్తూ చతుర్ముఖ పారాయణానికి అవసరమైన సరాంజామా సమకూరుస్తున్నట్టు కొందరు జూదప్రియులే చెబుతున్నారు. ఇక పట్టణంలోని పి.ఎన్.కాలనీ, అంబేద్కర్ కూడలి, దమ్మల వీధి, మంగువారితోట ప్రాంతాల తోపాటు సమీపంలోని ఫరీదుపేట, చల్లపేట తోటలు, తోటపాలెం, కిళ్లిపాలెం గ్రామ ప్రాంతాల్లో రోజూ సాయంత్రం 6 నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు పేకాట జరుగుతున్నట్టు పోలీసుల వద్ద సమాచారం ఉంది. గతంలో మండలవీధిలో పేకాట జరుగుతున్నప్పుడు తలెత్తిన ఘర్షణ లో ఓ వ్యక్తి మృతి చెందడంతో కొన్నాళ్లపాటు అక్కడ జూదం ఆపేశారని, మరికొన్నాళ్లు పెదపాడు రోడ్డులో రహస్యంగా జూదగృహం నిర్వహించేవారని స్థానికులు చెబుతున్నారు. ఇటీవల రెండు వర్గాల మధ్య జూదం విషయమై ఘర్షణ చోటు చేసుకోవడంతో ఓ వ్యక్తిపై దుండగులు మద్యం సీసాతో దాడి చేసిన సంఘటన కూడా ఉంది. ‘సూట్’లదే హవా.. పేకాట నిర్వహించాలంటే దమ్మూ ధైర్యంతో పాటు పోలీసుల రాకను పసిగట్టగలిగే నిఘా నెట్వర్క్ కూడా అవసరం. పట్టణానికి కొంతమంది గ్రూపుగా ఏర్పడి కొంత మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టి జూదగృహాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ గ్రూపులను ‘సూట్’లుగా వ్యవహరిస్తుంటారు. ఎక్కడ ఆట జరిగినా ఈ గ్రూపు సభ్యులుంటారు. తెలియని వ్యక్తుల్లా జూదంలో చేరి సిండికేట్‌గా ఏర్పడి కొత్తగా ఆటకు వచ్చిన వారి నుంచి డబ్బు రప్పించుకోవడంలో వీరు కీలకపాత్ర వహిస్తుంటారు. కొత్తవ్యక్తులను రెచ్చగొట్టి ముగ్గులోకి దించడమే వీరి ప్రధాన విధి. పేకాటకు వచ్చే వారికి కొన్ని ఆఫర్లు కూడా ఇస్తున్నారు. కార్లలో వచ్చే వారికి కనీసం రూ.3 వేలు, ద్విచక్ర వాహనంపై వచ్చే వారికి రూ.500 నజరానాగా ఇస్తున్నారు. అదే విధంగా లైటింగ్, టెంట్ ఏర్పాటు చేయడం, ఎవరికీ ఇబ్బంది లేకుండా చూడడం కూడా వీరి బాధ్యతగా పేకాట రాయుళ్లు చెబుతున్నారు. వాహనాల్లో తరలింపు ఇతర ప్రాంతాల నుంచి జూదానికి రప్పించేందుకు హైటెక్ టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నారు. పేకాట స్థావరం వివరాలను ఎస్సెమ్మెస్ రూపంలో జూదరులకు పంపిస్తున్నారు. అక్కడికి కొంత దూరంలో ఓ వాహనాన్ని ఉంచుతారు. ఆ సమాచారం కూడా పంపిస్తారు. సాయంత్రం వచ్చే జూదరులను వాహనాల్లో స్థావరానికి తరలిస్తున్నారు. ఇలా తరలించేందుకు ఒక్కో ఆటోకూ రూ.500 చెల్లిస్తున్నారు. పోలీసుల రాకను పసిగట్టే కాపలాదారులకు కూడా రోజుకు రూ. 500 చొప్పున చెల్లిస్తున్నారు. వచ్చిన మొత్తానికి మరింత కలిపి డ్రైవర్లు కూడా ఆటలో దిగుతున్నారు. లొసుగులే ఆధారం చట్టంలోని లొసుగుల ఆధారంగానే జిల్లాలో భారీగా జూదం జరుగుతున్నట్టు తెలుస్తోంది. పేకాట సమయంలో డబ్బు దొరక్కుండా నిర్వహకులు జాగ్రత్త పడుతుంటారు. కాయిన్ల రూపంలో పెట్టుబడి పెట్టి గెలిచినవారికి డబ్బు చెల్లించడం రహస్యంగా జరుగుతోంది. పోలీసులకు పట్టుబడితే ‘సూట్’దారులే బెయిల్ తెప్పించడం, వాహనాల్ని విడిపించడం కూడా చేస్తుంటారు. నాయకులతో అధికారులపై ఒత్తిళ్లు తెస్తుంటారు. అవసరమైతే ముందస్తు బెయిల్‌కూ ప్రయత్నిస్తుంటారు. ఇదంతా జరగకుండా ఉం డాలంటే స్థానిక పోలీసులకు నెలవారీ మామూళ్లు చాలు అన్న ధోరణి కనిపిస్తోంది. పోలీస్ కేసు అం టే.. వీరి దృష్టిలో కోర్టులో జరిమానా కట్టడం వ రకే అన్నట్టుగా ఉంటోంది. ‘కాయిన్లే’ కాసులు పేకాట జరిగే చోట డబ్బు అసలు ఉండదు. ప్లాస్టిక్ కాయిన్లనే డబ్బుగా ఉపయోగిస్తుంటారు. రంగు ఆధారంగా కాయిన్‌కు వెలకడుతుంటారు. పోలీసులొస్తే కాయిన్లే చూపిస్తారు తప్పితే సొమ్ము దొరకదు. అయితే వేరే చోట డబ్బు సంచులతో నిర్వాహకులు ఉంటారు. గెలిచిన వ్యక్తులు అక్కడికి వెళ్లి తమ వద్ద ఉన్న కాయిన్లు ఇస్తే వాటి విలువ ఆధారంగా సొమ్ము చెల్లిస్తుంటారు. ఒక కాయిన్ విలువ కనీసం రూ.1000 ఉంటుంది.