Woman SI Mother And Brother Caught In Prostitution Case In Tirupati - Sakshi
Sakshi News home page

కేడీ పోలీస్‌.. గుట్టుగా వ్యభిచారం! మహిళా ఎస్‌ఐ కుటుంబసభ్యులే అలా..!

Published Tue, Feb 21 2023 9:53 AM | Last Updated on Tue, Feb 21 2023 1:26 PM

Woman SI Non Social Activities Tirupati District Mutyalareddy Palli - Sakshi

తిరుపతి రూరల్‌: తిరుపతి ముత్యాలరెడ్డి పల్లె పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఓ మహిళా ఎస్‌ఐ కుటుంబసభ్యులే గుట్టుగా వ్యభిచార గృహం నిర్వహిస్తున్నారు. ఏపీలోని వివిధ జిల్లాలతో పాటు తెలంగాణ నుంచి మహిళలను రప్పించి జోరుగా ఈ దందాను నడుపుతున్నారు. ఆ ఎస్‌ఐ ఏ స్టేషన్‌లో పనిచేస్తే ఆ స్టేషన్‌ పరిధిలోనే వీరు దుకాణం తెరుస్తారు.

ట్రాన్స్‌ఫర్‌ అయితే అక్కడకు మకాం మారుస్తారు. అందులో భాగంగా ఆ మహిళా ఎస్‌ఐ తిరుచానూరులో పనిచేస్తున్నప్పుడు ఆ స్టేషన్‌ పరిధిలోని లింగేశ్వరనగర్‌లో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు. ఆమె ముత్యాలరెడ్డిపల్లెకు వచ్చిన తర్వాత ఆ స్టేషన్‌ పరిధిలోకి వచ్చి వ్యభిచార గృహం నిర్వహిస్తున్నారు. స్థానికులు సమాచారం ఇవ్వడంతో నిఘా పెట్టిన ఎంఆర్‌ పల్లె పోలీసులు సీఐ సురేంద్రరెడ్డి ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం ధనలక్ష్మి నగర్‌లో దాడులుచేశారు. 

మహిళా ఎస్‌ఐ తమ్ముడు ప్రశాంత్, తల్లి, తిరుపతి అవిలాల, హైదరాబాదుకు చెందిన ఇద్దరు మహిళలు, తిరుచానూరుకు చెందిన ఓ విటుడిని పోలీసులు అరెస్ట్‌చేశారు. కేసు నమోదు చేసినట్లు సీఐ సురేంద్రరెడ్డి తెలిపారు. ఇదిలా ఉండగా తల్లి, తమ్ముడు వ్యవహారశైలి నచ్చక, వారితో గొడవ పడి మహిళా ఎస్‌ఐ ఏడాది నుంచి వారికి దూరంగా ఉంటున్నట్లు సమాచారం. ఎస్‌ఐ మెడికల్‌ లీవ్‌లో వెళ్లిన తర్వాత మూడు నెలలుగా ధనలక్ష్మినగర్‌లో అద్దె ఇంటిని తీసుకుని ఆమె తల్లి, తమ్ముడు వ్యభిచార గృహం నడుపుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement