తిరుపతిలో పట్టుబడ్డ వ్యభిచార ముఠా | prostitution in spiritual capital ! | Sakshi
Sakshi News home page

తిరుపతిలో పట్టుబడ్డ వ్యభిచార ముఠా

Published Tue, Oct 21 2014 10:02 AM | Last Updated on Fri, Nov 9 2018 6:22 PM

వ్యభిచార ముఠా వారిని మీడియా ముందు హాజరుపరిచిన పోలీసులు - Sakshi

వ్యభిచార ముఠా వారిని మీడియా ముందు హాజరుపరిచిన పోలీసులు

ఆధ్మాత్మిక రాజధాని తిరుపతి వ్యభిచారానికి కేంద్ర బిందువుగా మారిపోతోంది.  రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వ్యభిచార ముఠాలు ఇక్కడికే తరలివస్తున్నాయి.  కొందరు బ్రోకర్లు యువతులను, మహిళలను ఇక్కడకు తీసుకొచ్చి వ్యభిచారం చేయిస్తున్నారు. తాజాగా తిరుపతిలో వ్యభిచారం నిర్వహిస్తున్న అయిదు ముఠాలను పోలీసులు పట్టుకోవడమే ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు.

 వ్యభిచార నిర్వాహకులు కేశవాయినగుంట, బైరాగిపట్టెడ, లీలామహల్‌ సెంటర్‌, ఎంకెనాయుడికాలనీ ప్రాంతాల్లో ఇళ్లు అద్దెకు తీసుకుని తమ వ్యాపారాన్ని యధేచ్ఛగా కొనసాగిస్తున్నారు. వారికి బ్రోకర్లు పూర్తిగా సహకరిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులతో బాధలుపడే మహిళలను,  ప్రియుడి చేతిలో మోసపోయిన యువతులను తీసుకువస్తుంటారు.  

ఇటీవల కాలంలో ఈ రకమైన కార్యకలాపాలు ఇక్కడ ఎక్కువైపోయాయని పోలీసులకు ఫిర్యాదులు అందుతున్నాయి. దాంతో పోలీసులు వ్యభిచార ముఠాలపై దృష్టి కేంద్రీకరించారు.  ఎంఆర్‌పల్లి పోలీసులు ఇద్దరు విటులతో పాటు ఐదుగురు అమ్మాయిలను అరెస్టు చేశారు. ముఖ్యంగా ఈ వ్యభిచార ముఠాలో విశ్వనాథ్‌రెడ్డితో పాటు అతని భార్య సరోజిని కీలక పాత్ర పోషించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.  ఎంఆర్‌పల్లి పోలీసులు మరికొన్ని వ్యభిచార కేంద్రాలపై కూడా దృష్టి సారించారు.

 పట్టుబడిన వ్యభిచార ముఠా సభ్యులు మాత్రం తమకు ఏ పాపం తెలియదని అంటున్నారు.  కొందరు యువతులు మాత్రం డబ్బు కోసమే వ్యభిచారం చేస్తున్నట్లు ఒప్పుకున్నారు. నెల రోజుల క్రితమే ఈ వృత్తిలోకి వచ్చినట్లు ఒక యువతి చెప్పింది.  విధిలేని పరిస్థితుల్లో వ్యభిచార కూపంలో ఇరుక్కుపోయినట్లు ఒక మహిళ చెప్పింది. 
**

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement