కుంచనపల్లి (తాడేపల్లి రూరల్): తాడేపల్లి పట్టణ పరిధిలోని కుంచనపల్లిలో హైటెక్ వ్యభిచారం నిర్వహిస్తూ ఢిల్లీ యువతి, విజయవాడ యువకుడు శనివారం పోలీసులకు పట్టుబడ్డారు. వివరాల్లోకెళితే... విజయవాడకు చెందిన యువకుడు ఫోన్ల ద్వారా విటులతో మాట్లాడి వ్యభిచారం నిర్వహించే మహిళలను సాంప్రదాయబద్ధంగా కుంచనపల్లిలోని ఓ అపార్ట్‌మెంట్‌కు పంపించి, బ్యాంక్ అకౌంట్ ద్వారా గాని, వచ్చిన మహిళలకు గాని డబ్బులు ఇచ్చిపంపేటట్లు ఏర్పాటు చేస్తున్నాడు.
ఆ అపార్ట్‌మెంట్‌లో ఓ ప్లాట్ తీసుకొని, దానిని అమ్మకానికి పెట్టినట్లు నమ్మించి, ఈ వ్యాపారం నిర్వహిస్తున్నట్లు స్థానికులు వ్యాఖ్యానిస్తున్నారు. మూడు నెలల నుంచి ఇదే విధంగా జరుగుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఎట్టకేలకు తాడేపల్లి పోలీసులకు సమాచారం అంది దాడులు నిర్వహించారు. ఢిల్లీకి చెందిన యువతి, విజయవాడకు చెందిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.