యువతిని అశ్లీలంగా చిత్రీకరించి... | Couple arrested for labelling innocent woman a prostitute | Sakshi
Sakshi News home page

యువతిని అశ్లీలంగా చిత్రీకరించి...

Published Sat, Jun 18 2016 8:40 AM | Last Updated on Mon, Aug 20 2018 4:27 PM

యువతిని అశ్లీలంగా చిత్రీకరించి... - Sakshi

యువతిని అశ్లీలంగా చిత్రీకరించి...

ఆచంట: భర్త చెడుమార్గంలో నడిస్తే సరిద్దాల్సిన భార్యే అతడికి వంతపాడింది. ఓ యువతిని అశ్లీలంగా చిత్రీకరించి.. కామ వాంఛలు తీర్చుకునేందుకు సహకరించింది. అంతేకాకుండా వ్యభిచారం చేయాలని ఆ యువతిపై ఆ భార్యాభర్తలిద్దరూ ఒత్తిడి తెచ్చారు. సభ్యసమాజం తలదించుకునే ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా ఆచంటలో గురువారం వెలుగు చూసింది. పాలకొల్లు సీఐ ఎ.చంద్రశేఖర్‌ కథనం ప్రకారం.. ఆచంట పంచాయతీ పరిధి కొత్తూరు ప్రాంతానికి చెందిన నెక్కంటి శ్రీనివాస్, సుశీల భార్యాభర్తలు.

అదే ప్రాంతానికి చెందిన, డిగ్రీ చదువుతున్న ఓ యువతి తరచూ వారి ఇంటికి వస్తుండేది. గతేడాది మే 1న సాయంత్రం ఆ యువతి శ్రీను ఇంటికి వెళ్లింది. శ్రీను దంపతులు పథకం ప్రకారం ఆమెకు కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి ఇచ్చారు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన యువతితో భర్త అశ్లీలంగా వ్యవహరించిన తీరును స్వయంగా భార్యే సెల్‌ఫోన్‌లో చిత్రీకరించింది. అప్పటినుంచి వారిద్దరూ యువతిని బ్లాక్‌ మెయిల్‌  చేస్తూ వచ్చారు. ఎట్టకేలకు బాధిత యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement