కామారెడ్డి : భర్త దూరం అయిన ఆమెపై ట్రావెల్ యజమాని కన్నేశాడు. ఆమె అవసరాలు తీరుస్తూ నాలుగేళ్లుగా ఆమెతో సహజీవనం చేస్తున్నాడు. కరోనా కారణంగా ఆర్థికంగా చితికిపోవడంతో ఆమెను వ్యభిచారం చేసి డబ్బులు సంపాదించాలని వేధిస్తున్నాడు. ఈ ఘటన నిజామాబాద్ కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని దేవునిపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం..ఇదే గ్రామానికి చెందిన నందిని అనే మహిళకు 20 ఏళ్ల క్రితం నవీన్‌పేటకు చెందిన వ్యక్తితో వివాహం జరిగింది. అయితే మనస్పర్థల కారణంగా పెళ్లయిన ఆరేళ్లకే వీరికి విడాకులు అయ్యాయి. దీంతో ఆమె దేవునిపల్లి గ్రామంలో తన కొడుకుతో కలిసి నివాసం ఉంటుంది. కుటుంబ పోషణ కోసం జిల్లా కేంద్రంలోని ఓ ట్రావెల్స్ లో పని చేసేది.
ఈ క్రమంలో యజమాని రమేష్‌తో పరిచయం సహజీవనానికి దారితీసింది. కరోనా కారణంగా ట్రావెల్స్ వ్యాపారం బాగా దెబ్బతిని ఆర్థికంగా నష్టపోయిన రమేష్...నందినినీ వ్యభిచారం వ్యభిచారం చేసి డబ్బు సంపాదించాలని ఒత్తిడి చేశాడు. తాను చెప్పినదానికి ఒప్పుకోకపోతే తనను వేశ్యగా ప్రచారం చేస్తానని, అంతేకాకుండా చంపేస్తానని కూడా బెదిరించినట్లు బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయంపై రెండు నెలల క్రితమే పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి ఫలితం లేకుండా పోయిందని, తనకు రక్షణ కల్పించాలని మీడియాను ఆశ్రయించింది. తనకు న్యాయం చేయాలంటూ వేడుకుంది.
చదవండి : (అత్త వివాహేతర సంబంధం.. అల్లుడు ఆత్మహత్య)
(పెద్దపల్లి హత్యలు: సంచలనం రేపుతున్న ఆడియో క్లిప్)
Comments
Please login to add a commentAdd a comment