Travels owner
-
సహజీవనం చేసిన మహిళను వ్యభిచారం చేయాలంటూ..
కామారెడ్డి : భర్త దూరం అయిన ఆమెపై ట్రావెల్ యజమాని కన్నేశాడు. ఆమె అవసరాలు తీరుస్తూ నాలుగేళ్లుగా ఆమెతో సహజీవనం చేస్తున్నాడు. కరోనా కారణంగా ఆర్థికంగా చితికిపోవడంతో ఆమెను వ్యభిచారం చేసి డబ్బులు సంపాదించాలని వేధిస్తున్నాడు. ఈ ఘటన నిజామాబాద్ కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని దేవునిపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం..ఇదే గ్రామానికి చెందిన నందిని అనే మహిళకు 20 ఏళ్ల క్రితం నవీన్‌పేటకు చెందిన వ్యక్తితో వివాహం జరిగింది. అయితే మనస్పర్థల కారణంగా పెళ్లయిన ఆరేళ్లకే వీరికి విడాకులు అయ్యాయి. దీంతో ఆమె దేవునిపల్లి గ్రామంలో తన కొడుకుతో కలిసి నివాసం ఉంటుంది. కుటుంబ పోషణ కోసం జిల్లా కేంద్రంలోని ఓ ట్రావెల్స్ లో పని చేసేది. ఈ క్రమంలో యజమాని రమేష్‌తో పరిచయం సహజీవనానికి దారితీసింది. కరోనా కారణంగా ట్రావెల్స్ వ్యాపారం బాగా దెబ్బతిని ఆర్థికంగా నష్టపోయిన రమేష్...నందినినీ వ్యభిచారం వ్యభిచారం చేసి డబ్బు సంపాదించాలని ఒత్తిడి చేశాడు. తాను చెప్పినదానికి ఒప్పుకోకపోతే తనను వేశ్యగా ప్రచారం చేస్తానని, అంతేకాకుండా చంపేస్తానని కూడా బెదిరించినట్లు బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయంపై రెండు నెలల క్రితమే పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి ఫలితం లేకుండా పోయిందని, తనకు రక్షణ కల్పించాలని మీడియాను ఆశ్రయించింది. తనకు న్యాయం చేయాలంటూ వేడుకుంది. చదవండి : (అత్త వివాహేతర సంబంధం.. అల్లుడు ఆత్మహత్య) (పెద్దపల్లి హత్యలు: సంచలనం రేపుతున్న ఆడియో క్లిప్) -
ఏసీ టికెట్లు బుక్ చేస్తే.. నాన్ ఏసీలో పంపారు!
బోధన్ (నిజామాబాద్): ప్రైవేటు ట్రావెల్స్ సంస్థ నిర్వాకం యాత్రికులను అవస్థల పాలు చేసింది. అటవీ ప్రాంతంలో మూడు గంటలు నడిరోడ్డుపై పడిగాపులు గాయాల్సిన అవస్థ ఎదురైంది. దీనికి సంబంధించిన హైదరాబాద్, గుంటూరు ప్రాంతాలకు చెందిన బాధితులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మహారాష్ట్రలోని షిర్డి సాయిబాబా ఆలయానికి వెళ్లిన వారు తిరుగు ప్రయాణం కోసం షిర్డీలోనే ఖురానా అనే ట్రావెల్ సంస్థలో ఏసీ సర్వీసులో టికెట్లు కొనుగోలు చేశారు. ఒక్కొక్కరి నుంచి రూ.2వేలకు పైగా వసూలు చేశారు. శనివారం రాత్రి 8.30 గంటలకు సర్వీసు బయలుదేరింది. ఆదివారం ఉదయం 10.30 గలకు హైదరాబాద్ చేరుకోవాల్సిన సర్వీసును నాందేడ్ జిల్లా నర్సి గ్రామం శివారులో ఉదయం 11 గంటల ప్రాంతంలో డ్రైవర్ నిలిపి వేశాడు. అటవీ ప్రాంతంలో మూడు గంటల పాటు బస్సును నిలిపివేయడంతో పిల్లలు, మహిళలు ఇక్కట్ల పాలయ్యారు. ఆ సర్వీసుకు తెలంగాణలో ప్రవేశానికి పర్మిట్ లేకపోవడంతో... అదే ట్రావెల్స్ సంస్థకు చెందిన మరో బస్సును హైదరాబాద్ నుంచి రప్పించి అందులోకి ఎక్కించారు. ఏసీ సర్వీసుకు టికెట్లు బుక్ చేసుకుంటే నాన్ ఏసీ బస్సులో అక్కడి నుంచి పంపించారు. దీంత ట్రావెల్స్ యాజమానిపై చర్యలు తీసుకోవాలని సాలూర అంతరాష్ట్ర ఆర్టీవో చెక్‌పోస్టులో అధికారికి ఫిర్యాదు చేశారు. -
ఆర్టీఏ అధికారిపై ట్రావెల్స్ యజమాని దాడి
కర్నూలు: ప్రైవేటు ట్రావెల్ యజమానుల ఆగడాలకు హద్దులేకుండా పోతోంది. తనిఖీలు చేస్తున్న ట్రాన్స్పోర్ట్ అధికారులపై దాడులకు కూడా వెనుకాడటంలేదు. పుల్లూరు టోల్‌ప్లాజా వద్ద తనిఖీ చేస్తున్న ఆర్టీఏ అధికారి శివరామకృష్ణపై ప్రొద్దుటూరుకు చెందిన శ్రీలక్ష్మీ ట్రావెల్స్ యజమాని దాడి చేశాడు. ఆర్టీఏ అధికారులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ప్రైవేటు బస్సుల యజమానులు ఇటీవల కాలంలో అక్రమంగా బస్సులను తిప్పడం ఎక్కువైపోయింది. బస్సు ప్రమాదాలు కూడా ఎక్కువయ్యాయి. దాంతో ఆర్టీఏ అధికారులు ముమ్మరంగా దాడులు చేస్తున్నారు. వాహనాలను తనిఖీ చేస్తున్నారు. అయితే ప్రైవేటు బస్సుల యజమానులు, డ్రైవర్లు కూడా ఆర్టీఏ అధికారులు, సిబ్బందిపై దాడులకు తెగబడుతున్నారు. నాలుగు రోజుల క్రితం హైదరాబాద్‌లో ఒక ప్రైవేటు బస్సు డ్రైవర్ ఆర్టీఏ ఉద్యోగి పట్ల దురుసుగా ప్రవర్తించాడు. అతనిని గాయపరిచాడు.