వ్యభిచారం చేయిస్తూ పట్టుబడ్డ మోడల్ | Model Held For Allegedly Running Prostitution Racket In Mumbai | Sakshi
Sakshi News home page

వ్యభిచారం చేయిస్తూ పట్టుబడ్డ మోడల్

Published Mon, Jun 27 2016 11:53 AM | Last Updated on Mon, Sep 4 2017 3:33 AM

వ్యభిచారం చేయిస్తూ పట్టుబడ్డ మోడల్

వ్యభిచారం చేయిస్తూ పట్టుబడ్డ మోడల్

ముంబయి: కొందరు యువతుల కష్టాలను అవకాశంగా తీసుకొని వారితో బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్న ఓ మోడల్ను పోలీసులు అరెస్టు చేశారు. ఆమె బారిన పడిన పలువురు మోడల్స్కు విముక్తి కలిగించారు. పశ్చిమ ముంబయిలోని వర్సోవా అనే ప్రాంతంలో ప్రొడక్షన్ హౌజ్ పేరిట ఓ నివాసం ఉంది. అందులో ఓ 24 ఏళ్ల మోడల్ ఉంటోంది.

ఆమె సినిమాలో అవకాశం కోసం ఎదురుచూస్తున్న మోడల్స్ను లక్ష్యంగా చేసుకొని వారికి లేనిపోని ఆశలు కలిగించి వ్యభిచార రొంపిలోకి దింపింది. దాంతోపాటు పలువురు మైనర్స్ను కూడా కొనుగోలు చేస్తూ వారితో ఇలాంటి పాడుపని చేయిస్తోంది. ఈ నేపథ్యంలో ఆ నివాసంపై రైడింగ్ చేసిన పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. ఒక డైరీని కూడా స్వాధీనం చేసుకొన్నారు. అందులో ఎంతోమంది మోడల్స్ ఫొటోలతోపాటు ఫోన్ నెంబర్స్ కూడా ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement