
హిందూ గోరక్షా సభలో పాల్గొన్న ఎమ్మెల్యే రాజాసింగ్‌లోథను సత్కరించిన దృశ్యం
అబిడ్స్ : గోరక్షణ కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధంగా ఉన్నానని తెలంగాణ రాష్ట్ర బీజేపీ గోరక్షా సెల్ కన్వీనర్, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌లోథ పేర్కొన్నారు. గోవధ నిషేధ చట్టాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆదివారం మహారాష్ట్రలోని నాందేడ్‌లో జరిగిన హిందూ గోరక్షా సభలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు.
ఆయన ప్రసంగాన్ని ధూల్‌పేట్‌లోని ఎమ్మెల్యే కార్యాలయం మీడియాకు విడుదల చేసింది. గోవధ కాకుండా శ్రీరామ్‌సేన కార్యకర్తలు నిరంతరం హైదరాబాద్ నగరంలో కృషి చేస్తున్నారని వివరించారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున గోభక్తులు పాల్గొన్నారు.