హైదరాబాద్ : అబిడ్స్ చర్మాస్ వద్ద శుక్రవారం ఉదయం ఓ కారు బీభత్సం సృష్టించింది. వేగంగా వెళ్తున్న కారు ఒక్కసారిగా చర్మాస్ బస్టాప్లోకి దూసుకెళ్లింది. దీంతో బారికేడ్లు ధ్వంసమైనాయి. అప్పటికే బస్టాప్లో బస్సుల కోసం వేచి ఉన్న ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. స్థానికులు వెంటనే స్పందించి... అబిడ్స్ పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... కారు డ్రైవర్ను అదుపులోకి తీసుకుని... స్టేషన్కి తరలించారు. కాగా డ్రైవర్పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు వెల్లడించారు.