
సాక్షి, హైదరాబాద్: లిటిల్ ఫ్లవర్ హైస్కూల్ (అబిడ్స్) ఆధ్వర్యంలో జరిగిన ఇంటర్ స్కూల్ టేబుల్ టెన్నిస్ (టీటీ) టోర్నమెంట్‌లో జూనియర్ బాలికల టీమ్ విభాగంలో హిందూ పబ్లిక్ స్కూల్ విజేతగా నిలిచింది. మంగళవారం జరిగిన ఫైనల్లో హిందూ పబ్లిక్ స్కూల్ 3–0తో చిరెక్ (సీబీఎస్‌ఈ–ఎ) పబ్లిక్ స్కూల్ జట్టుపై విజయం సాధించింది. అంతకుముందు జరిగిన సెమీఫైనల్స్‌లో హిందూ పబ్లిక్ స్కూల్ 3–2తో డాన్ బాస్కో జట్టుపై, చిరెక్ 3–2తో ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్‌పై గెలుపొందాయి. జూనియర్ బాలుర విభాగంలో చిరెక్ (సీబీఎస్‌ఈ–ఎ) పబ్లిక్ స్కూల్, సెయింట్ పాల్స్ హైస్కూల్ ‘బి’, సెయింట్ పాల్స్ హైస్కూల్ ‘ఎ’, చిరెక్ కేంబ్రిడ్జ్ స్కూల్ జట్లు సెమీఫైనల్లోకి అడుగుపెట్టాయి.
మంగళవారం జరిగిన క్వార్టర్ ఫైనల్స్‌లో చిరెక్ 2–0తో డీపీఎస్ (ఖాజా గూడ) జట్టుపై, చిరెక్ కేంబ్రిడ్జి స్కూల్ 2–0తో భారతీయ విద్యాభవన్ (జూబ్లీహిల్స్)పై... సెయింట్ పాల్స్ ‘ఎ’ 2–0తో చిరెక్ సీబీఎస్‌ఈ–ఎఫ్ జట్టుపై, సెయింట్ పాల్స్ ‘బి’ 2–0తో డీఏవీ జట్టుపై గెలిచాయి. సీనియర్ బాలికల విభాగంలో రోజరీ కాన్వెంట్ (అబిడ్స్), డాన్ బాస్కో హైస్కూల్, గీతాంజలి దేవాశ్రయ్, సెయింట్ పాల్స్ హైస్కూల్ జట్లు సెమీఫైనల్లోకి ప్రవేశించాయి. కామన్వెల్త్ టీటీ చాంపియన్‌షిప్‌లో మూడు పతకాలు సాధించిన తెలంగాణ అంతర్జాతీయ క్రీడాకారిణి ఆకుల శ్రీజ ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ టోర్నమెంట్‌ను ప్రారంభించింది.
Comments
Please login to add a commentAdd a comment