సమైక్య న్యాయవాదుల సభను అడ్డుకున్న టీ. లాయర్లు | Tension at apngo bhavan telangana lawyers jac obstructs | Sakshi
Sakshi News home page

Aug 25 2013 5:51 PM | Updated on Mar 21 2024 6:14 PM

రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ భవన్ లో సమైక్యాంధ్ర న్యాయవాదుల జాయింట్ యాక్షన్ సమావేశం ఉద్రిక్తంగా మారింది. హైదరాబాద్ల లోని అబిడ్స్ లోని ఏపీఎన్జీవో భవన్‌లో నిర్వహిస్తున్న సమైక్యాంధ్ర న్యాయవాదుల జేఏసీ సమావేశాన్ని తెలంగాణ న్యాయవాదుల జేఏసీ అడ్డుకున్నారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా హైదరాబాద్ లో ఎలాంటి సదస్సులు, సమావేశాలు నిర్వహించకూడదని తెలంగాణ న్యాయవాదుల జేఏసీ అభ్యంతరం తెలిపింది. ఇరువర్గాలు పోటాపోటీగా నినాదాలు చేశారు. దాంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇరువర్గాల మధ్య తోపులాట కూడా జరగడంతో ఏపీఎన్ జీవో భవన్ వద్ద వాతావరణం వేడెక్కింది. సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక బ్యానర్ ను తెలంగాణ న్యాయవాదులు చించివేశారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement