అబిడ్స్ : ఎగ్జిబిషషన్ సొసైటీ, రాజస్థానీ ప్రగతి సమాజ్ ఆధ్వర్యంలో ఆనవాయితీగా నిర్వహిస్తున్న రామాయణ్ మేళా మహోత్సవాన్ని ఏడాదికూడా ఘనంగా నిర్వహించనున్నట్లు రామాయణ్ మేళా చీఫ్ కన్వీనర్ గోవింద్ రాఠి అన్నారు. శుక్రవారం ఎగ్జిబిషషన్ సొసైటీ కార్యాలయంలో రామాయణ్ మేళా వివరాలను వెల్లడించారు. శనివారం నుంచి ప్రారంభమయ్యే ఉత్సవాలు 11వ తేదీ వరకు కొనసాగుతాయన్నారు. మంగళవారం ఘట స్థాపన జరిపి రామాయణ్ కవి సమ్మేళనం నిర్వహించనున్నట్లు తెలిపారు.
రామాయణ్ పై ప్రశ్‌్నమంచ్ కార్యక్రమం, బాల సంస్కార్ శిబిరం ఏర్పాటు చేశామన్నారు. 11న విజయదశమి సందర్భంగా షమీ పూజ, సాంస్కృతి క కార్యక్రమాలు, శ్రీరామునికి పట్టాభిషేకం, రావణ , కుంభకర్ణ మేఘనాధుని దహనం నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో రాంచందర్, ఆదిత్య మార్గం, కృష్ణాజీ యాదవ్, రమేష్ కుమార్ బంగ్, గిరిధారిలాల్ డాగా, కళావతి జాజు, మనోజ్ జైశ్వాల్, రాజ్ కుమార్ సాంక్ల, కళావతి జాజు, కమలా రాఠి తదితరులు పాల్గొన్నారు.
గర్భాదాండియా ఉత్సవాలు
ఎగ్జిబిషన్ ఎకనామిక్ కమిటీ ఆధ్వర్యంలో నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో 6 నుంచి 10వ తేదీ వరకు గర్భాదాండియా ఉత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దాండియా నత్యాలలో పాల్గొనే వారికి అవసరమైన అన్ని వసతులు కల్పిస్తున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. దాండియా నృత్యాలల్ల్రోపతిభ కనబర్చిన వారికి ప్రతిరోజూ బహుమతులు అందజేస్తామన్నారు. ఈ సందర్భంగా ఫుడ్ కోర్టును కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
9న బతుకమ్మ ఉత్సవాలు
ఎగ్జిబిషన్ మైదానంలో ఎగ్జిబిషన్ ఎకనామిక్ కమిటీ ద్వారా ఈనెల 9న బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. వందలాది మహిళలతో బతుకమ్మ ఉత్సవాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేపట్టారు.