
బ్యాంకు లాకర్ తెరిచిచూసిన మహిళకు షాక్
- 15 తులాల బంగారు అభరణాలు మాయం
హైదరాబాద్: భద్రతకు మారుపేరు బ్యాంకు లాకర్ అంటారు. ఇంట్లో ఉంటే దొంగలు ఎత్తుకెళుతారన్న భయంతో చాలామంది బ్యాంకు లాకర్లలో బంగారు అభరణాలు, విలువైన వస్తువులు, పత్రాలను దాచిపెడుతుంటారు. ఇదేవిధంగా ఎస్బీహెచ్ బ్యాంకు లాకర్ లో 15 తులాల బంగారు అభరణాలను పెట్టిన ఓ మహిళకు చేదు అనుభవం ఎదురైంది. లాకర్ ఉంచిన బంగారం మాయమైంది.
దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. నగరంలోని రాజేంద్రనగర్‌కు చెందిన అస్నా ఫర్ఖుందా తాజ్ అనే మహిళ అబిడ్స్ గన్ ఫౌండ్రీలోని ఎస్బీహెచ్ లాకర్‌లో కొన్ని రోజుల క్రితం 15 తులాల బంగారు ఆభరణాలను ఉంచింది. మంగళవారం ఆమె లాకర్ తెరిచి చూడగా.. అందులో ఆభరణాలు కనిపించలేదు. దీంతో ఆమె అబిడ్స్ పోలసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.