
సాక్షి, హైదరాబాద్ : ప్రతి విద్యార్థి చదువు చెప్పే గురువులను, కని పెంచిన తల్లిదండ్రులను గౌరవించాలని తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ సూచించారు. మంగళవారం అబిడ్స్‌లోని లిటిల్ ఫ్లవర్ పాఠశాలకు వెళ్లిన ఆయన అక్కడ పిల్లలతో సరదాగా గడిపారు. విద్యార్థులతో ముఖాముఖీ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారు అడిగిన ప్రశ్నలకు గవర్నర్ సమాధానం చెప్పారు. తాను కూడా లిటిల్ ఫ్లవర్ స్కూల్‌లో 5వ తరగతి వరకు చదువుకున్నానని తెలిపారు.
చదువుకున్న స్కూల్‌కు గవర్నరు హోదాలో రావడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. జీవితంలో తన అనుభవాలను తాను చదువుకున్న స్కూల్ విద్యార్థులతో పంచుకోవడం సంతోషంగా ఉందన్నారు. జీవితంలో డబ్బులు ముఖ్యం కాదని, చదువు మాత్రమే ముఖ్యమని.. ఆ దిశలో విద్యార్థులు ముందుకు సాగాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment