మహాత్మాగాంధీ శాంతి అవార్డును అందుకున్న జంగారెడ్డి | Mahatma Gandhi Peace Award to janga reddy | Sakshi
Sakshi News home page

మహాత్మాగాంధీ శాంతి అవార్డును అందుకున్న జంగారెడ్డి

Published Sun, Oct 12 2014 12:42 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

మహాత్మాగాంధీ శాంతి అవార్డును అందుకున్న జంగారెడ్డి - Sakshi

మహాత్మాగాంధీ శాంతి అవార్డును అందుకున్న జంగారెడ్డి

కందుకూరు: జిల్లా పరిషత్‌లో కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్  ఏనుగు జంగారెడ్డి మహాత్మాగాంధీ శాంతి అవార్డు-2014ను అందుకున్నారు. అంతర్జాతీయ సంస్థ సుబేదార్ అమీర్‌అలీఖాన్ గ్లోబల్ పీస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్ ఆబిడ్స్‌లోని ఆంధ్ర సరస్వతి పరిషత్ ఆడిటోరియంలో అంతర్జాతీయ అహింసాదినోత్సవం ముగింపు ఉత్సవాలు నిర్వహించారు. అందులో భాగంగా స్వాతంత్య్ర సమరయోధులతో పాటు సమాజసేవలో ఉన్న వారికి శాంతి అవార్డులను అందించారు.

ఈ సందర్భంగా జస్టిస్ వామన్‌రావు, ప్రొఫెసర్లు కె.పురుషోత్తమ్‌రెడ్డి, సీతా, సీవీ.చారి తదితరుల చేతుల మీదుగా ఆయన అవార్డు అందుకున్నారు. ఎంపీటీసీ సభ్యుడు ఈశ్వర్‌గౌడ్, మాజీ ఎంపీటీసీ సభ్యుడు కృష్ణనాయక్, ఐబీపీ మార్కెట్ కమిటీ మాజీ డెరైక్టర్ కరుణాకర్‌రెడ్డి, ఉపసర్పంచ్ గోపాల్‌రెడ్డి, సీనియర్ నాయకులు రాణాప్రతాప్‌రెడ్డి, కె.వెంకట్‌రెడ్డి, కె.గోపాల్‌రెడ్డి, సి.రఘుమారెడ్డి తదితరులు ఆయనకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement