వి.కోట: చిత్తూరు జిల్లాలో ఆటో బోల్తా పడి విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన జిల్లాలోని వి.కోట మండలం గుమ్మిరెడ్డి పల్లె వద్ద సోమవారం ఉదయం జరిగింది. గ్రామానికి చెందిన నలుగురు విద్యార్థులు పాముగానిపల్లెలోని స్కూలు వెళ్లేందుకు ఆటో ఎక్కారు. ఈ క్రమంలో గ్రామ శివారులో రాగానే ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో ఆటోలో ఉన్న మహిళతో పాటు విద్యార్థులకు గాయలయ్యాయి. గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
ఆటో బోల్తా..విద్యార్థులకు గాయాలు
Published Mon, Nov 9 2015 11:20 AM | Last Updated on Sat, Mar 9 2019 4:28 PM
Advertisement
Advertisement