22న ఇంటర్ ప్రథమ ఫలితాలు? | inter first year results will be declare on 22nd april | Sakshi
Sakshi News home page

22న ఇంటర్ ప్రథమ ఫలితాలు?

Published Tue, Apr 19 2016 3:23 AM | Last Updated on Sun, Sep 3 2017 10:11 PM

inter first year results will be declare on 22nd april

సాక్షి, హైదరాబాద్:  ఇంటర్ ఫస్టియర్ ఫలితాలను ఈనెల 22న విడుదల చేసేందుకు రాష్ర్ట ఇంటర్ బోర్డు కసరత్తు చేస్తోంది. ఆ రోజున వీలు కాకపోతే 23న విడుదల చేయాలని భావిస్తోంది. ఫలితాల విడుదల తేదీని మంగళవారం లేదా బుధవారం అధికారికంగా ప్రకటించనుంది. ఇక ద్వితీయ సంవత్సర ఫలితాలనూ ఈ నెలాఖరుకు విడుదల చేసేందుకు బోర్డు కసరత్తు చేస్తోంది.
 
పదో తరగతి పరీక్ష స్పాట్ వాల్యుయేషన్ చివరి దశకు చేరుకుంది. ఈ వారంలో అది పూర్తి కాగానే మే మొదటి వారం చివర్లో లేదా రెండో వారంలో ఫలితాల విడుదలకు ప్రభుత్వ పరీక్షల విభాగం కసరత్తు చేస్తోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement