First year
-
పక్కా నిఘా..పటిష్ట బందోబస్తు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మిడియెట్ మొదటి సంవత్సరం పరీక్ష రాష్ట్రవ్యాప్తంగా బుధవారం ప్రశాంతంగా జరిగింది. మొత్తం 5,07,754 మంది విద్యార్థు లు పరీక్ష కోసం దరఖాస్తు చేశారు. వీరిలో 4,88,113 మంది హాజరయ్యారు. 19,641 మంది విద్యార్థులు పరీక్ష రాయలేదు. మూడుచోట్ల మాల్ ప్రాక్టీసింగ్ జరిగినట్లు ఇంటర్ బోర్డు వెల్లడించింది. కరీంనగర్, నిజామాబాద్, జనగాం జిల్లాల్లో ఈ మేరకు కేసులు నమోదైనట్టు తెలిపింది. తొలి రోజు ద్వితీయ భాష పేపర్–1 పరీక్ష నిర్వహించారు. మూడు సెట్ల ప్రశ్నపత్రాలను పరీక్ష కేంద్రాలకు పంపి అందులో ‘ఎ’సెట్‌ను ఎంపిక చేశారు. ప్రైవేటుపై ప్రత్యేక నిఘా గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని 1,521 పరీక్షా కేంద్రాల్లో విస్తృత బందోబస్తు ఏర్పాటు చేశా రు. 880 ప్రైవేటు కాలేజీల్లో కట్టుదిట్టమైన నిఘా ఉంచారు. కార్పొరేట్ కాలేజీల జోక్యంపై ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈసారి మరిన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రతి పరీక్ష కేంద్రం పరిసర ప్రాంతాల్లో 144వ సెక్షన్ విధించారు. పేపర్ లీకేజీలకు ఆస్కారం లేకుండా, అసాంఘిక శక్తుల ప్రవేశాన్ని నిరోధించేందుకు ఈసారి పోలీసు బందోబస్తు పెంచారు. 75 ఫ్లయింగ్ స్క్వాడ్లు సుడిగాలి తనిఖీలు చేపట్టాయి. 200 సిట్టింగ్ స్వా్కడ్స్ సమస్యాత్మక కేంద్రాల్లో సజావుగా పరీక్షలు జరిగేందుకు తోడ్పడ్డాయి. టెన్షన్... టెన్షన్... తొలి రోజు పరీక్ష కావడంతో పలు ప్రాంతాల్లో విద్యార్థుల్లో టెన్షన్ వాతావరణం కన్పించింది. హైదరాబాద్, రంగారెడ్డి పరిసర ప్రాంతాల్లో విద్యార్థులు ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పరీక్షకు గంట ముందే విద్యార్థులు కేంద్రాలకు చేరుకోవడం కన్పించింది. పరీక్షకు ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదని స్పష్టం చేసినప్పటికీ మారుమూల ప్రాంతాల్లో విద్యార్థుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ నిబంధనల్లో స్వల్పంగా సడలింపు ఇచ్చినట్టు జిల్లాల అధికారులు తెలిపారు. ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేసినట్లు ప్రకటించినప్పటికీ, అవి సకాలంలో అందుబాటులో లేకుండా పోయాయనే విమర్శలు విన్పించాయి. మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో కొందరు విద్యార్థులు సొంత రవాణా ఏర్పాట్లు చేసుకున్నారు. -
కొత్త మెడికల్ కాలేజీల్లో బోధన.. ఫస్టియర్ ఎంబీబీఎస్ తరగతులు షురూ
సాక్షి, హైదరాబాద్: ఒక వైద్య విద్యాసంవత్సరంలోనే ప్రభుత్వ ఆధ్వర్యంలో 8 మెడికల్ కాలేజీలు కొత్తగా ప్రారంభం కావడం, ఆయా కాలేజీల్లో ఏకంగా 1,150 ఎంబీబీఎస్ సీట్లు కొత్తగా అందుబాటులోకి రావడం రాష్ట్ర చరిత్రలో రికార్డుగా నిలవనుంది. 2022–23 వైద్య విద్యా సంవత్సరంలో కొత్తగూడెం, నాగర్‌కర్నూల్, మహబూబాబాద్, సంగారెడ్డి, రామగుండం, వనపర్తి, జగిత్యాల, మంచిర్యాల ల్లోని ప్రభుత్వ వైద్య కళాశాలలు సహా రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం నుంచి ఎంబీబీఎస్ మొదటి ఏడాది తరగతులు ప్రారంభం కానున్నాయి. 2014లో 850 ప్రభుత్వ సీట్లుండగా... ఇప్పుడు 2,815 తెలంగాణ ఏర్పడకముందు రాష్ట్రంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో 5 మెడికల్ కాలేజీలు ఉండగా వాటిల్లో 850 సీట్లు ఉండేవి. రాష్ట్రం ఏర్పడ్డాక కాలేజీల సంఖ్య 17కు పెరగ్గా సీట్ల సంఖ్య 2,815కి పెరిగినట్లు వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత నల్లగొండ, సూర్యాపేట, సిద్దిపేట, మహబూబ్‌నగర్‌లలో 4 కొత్త మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేశారు. ఈ ఎనిమిదేళ్లలో కొత్తగా 12 కొత్త మెడికల్ కాలేజీలను ప్రారంభించి ప్రభుత్వం రికార్డు సృష్టించిందని అధికారులు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 157 కాలేజీలను ఏర్పాటు చేసినప్పటికీ రాష్ట్రానికి ఒక్క మెడికల్ కాలేజీని కూడా కేటాయించలేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం సొంత నిధులతోనే కొత్త మెడికల్ కాలేజీలన్నింటినీ ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ వైద్య కళాశాలల్లో గతంలోకన్నా 3 రెట్లకుపైగా ఎంబీబీఎస్ సీట్లు పెరిగాయి. వచ్చే ఏడాది 9 కొత్త మెడికల్ కాలేజీలు, ఆ తర్వాత ఏడాది మరో 8 కొత్త మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రణాళికలు రచించింది. ఇప్పటికైనా కేంద్రం కొత్త కాలేజీలను ఏర్పాటు చేసేందుకు సహకరించాలని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు విజ్ఞప్తి చేస్తున్నారు. ► 2014లో రాష్ట్రంలో ఐదు ప్రభుత్వ, 15 ప్రైవేటు మెడికల్ కాలేజీలున్నాయి. మొత్తం 20 కాలేజీలున్నాయి. ► 2022 (ప్రస్తుతం)లో రాష్ట్రంలో 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, 24 ప్రైవేటు కాలేజీలు అయ్యాయి. ► 2014లో రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీట్లు ప్రభుత్వంలో 850, ప్రైవేటులో 2,100... మొత్తం 2,950 ► 2022లో ప్రభుత్వంలో 2,815 ఎంబీబీఎస్ సీట్లు, ప్రైవేటులో 3,800 సీట్లు... మొత్తం 6,615 ► 2014లో పీజీ మెడికల్ సీట్లు ప్రభుత్వంలో 529, ప్రైవేటులో 601... మొత్తం 1,130 ► 2022లో పీజీ మెడికల్ సీట్లు ప్రభుత్వంలో 1,850, ప్రైవేటులో 613... మొత్తం 2,463 ► 2014లో నర్సింగ్ కాలేజీలు ప్రభుత్వంలో ఐదు, ప్రైవేటులో 74... మొత్తం 79 ► 2022లో నర్సింగ్ కాలేజీలు ప్రభుత్వంలో 9, ప్రైవేటులో 83... మొత్తం 92 చదవండి: అసెంబ్లీ సెగ్మెంట్లపై నజర్.. ఎన్నికలకు సమాయత్తంపై కేసీఆర్ ఫోకస్ -
తెలంగాణ: ముగిసిన తొలిరోజు ఇంటర్ పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు ముగిశాయి. కరోనా నేపథ్యంలో గతంలో వాయిదా పడిన పరీక్షలను నేడు ప్రారంభించిన విషయం తెలిసిందే. కోవిడ్ నిబంధల ప్రకారం పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందుకోసం అధికారులు 1,768 కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 4,59,228 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. పరీక్షల కోసం ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 70 ఫ్లయింగ్ స్క్వాడ్స్‌ను రంగంలోకి దించనుంది. ఎవరైనా మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. మహబూబ్‌నగర్ జిల్లాలో 35 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. 11 వేల 354 మంది విద్యార్దులు పరీక్షలు రాయనున్నారు.ద్రాల వద్ద ధర్మల్ స్క్రీనింగ్ టెస్టులు,శానిటైజేశన్,మాస్కులు తప్పని సరి చేశారు .పరీక్షా కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. ఒక్క నిమిషం ఆలస్యం అయినా పరీక్షా కేంద్రాలకు అనుమతి ఇవ్వమని చెప్పిన నేపధ్యంలో విద్యార్దులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు తరలివచ్చారు. చివరి నిమిషంలో కూడ కొందరు విద్యార్దులు పరుగులు తీసిన దృశ్యాలు కనిపించాయి. రాష్ట్రవ్యాప్తంగా సోమవారం నుంచి ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. కాగా థర్మల్ స్క్రీనింగ్‌లో అస్వస్థతగా ఉన్నట్లు గుర్తిస్తే ఐసోలేషన్ గదిలో ఉంచుతారు. ఓపిక ఉంటే అక్కడైనా పరీక్ష రాయొచ్చని అధికారులు చెప్పారు. విద్యార్థులు ఏమైనా ఇబ్బందులకు గురైతే 040–24601010 లేదా 040–24655021కు కంట్రోల్‌రూం నంబర్లకు ఫోన్ చేయవచ్చని ఇంటర్ బోర్డు తెలిపింది. చదవండి: ఆలస్యమైనా తప్పనిసరి -
బీటెక్ ఫస్టియర్.. ఇలా చేస్తే నో ఫియర్!
బీటెక్ మొదటి సంవత్సరంలో అడుగుపెట్టాం.. నాలుగేళ్ల తర్వాత మంచి మార్కులతో పట్టా పొందితే చాలు.. కొలువు ఖాయమనే అభిప్రాయంతో చాలామంది విద్యార్థులు ఉంటారు. వాస్తవానికి కోర్సు పూర్తయ్యాక కోరుకున్న ఉద్యోగం దక్కాలంటే.. మార్కులతోపాటు మరెన్నో నేర్చుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా లేటెస్ట్ టెక్నాలజీపై అవగాహన పెంచుకోవాలి. ఇండస్ట్రీ 4.0 స్కిల్స్ సొంతం చేసుకోవాలి. ఎందుకంటే.. ప్రస్తుతం జాబ్ మార్కెట్లో ఈ స్కిల్స్ ఉన్న అభ్యర్థులకే ఆఫర్లు ఇచ్చేందుకు సంస్థలు ముందుకొస్తున్నాయి! ఈ నేపథ్యంలో.. బీటెక్ మొదటి సంవత్సరం విద్యార్థులు.. తమ నాలుగేళ్ల స్టడీని ఎలా ప్లాన్ చేసుకోవాలి.. నేర్చుకోవాల్సిన నైపుణ్యాలు తదితర అంశాలపై విశ్లేషణ.. బీటెక్‌లో అకడమిక్‌గా మంచి మార్కులతోనే కొలువుల కల సాకారమయ్యే పరిస్థితి లేదు. కాబట్టి ఇంజనీరింగ్‌లో చేరిన విద్యార్థులు తమ బ్రాంచ్‌కు అనుగుణంగా నూతన టెక్నాలజీలపై పట్టు సాధించాలి. ఇందుకోసం బీటెక్ మొదటి సంవత్సరం నుంచే కృషి చేయాలన్నది నిపుణుల సలహా. డిజిటల్ యుగం ప్రస్తుతం అంతటా డిజిటల్ టెక్నాలజీ రాజ్యమేలుతోంది. అన్ని రంగాల్లోని సంస్థలూ ఆధునిక సాంకేతికతల ఆధారంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. నైపుణ్యాలున్న వారికే నియామకాల్లో పెద్దపీట వేస్తున్నాయి. కాబట్టి బీటెక్ మొదటి సంవత్సరం విద్యార్థులు.. సదరు తాజా నైపుణ్యాలు, టెక్నాలజీలపై పట్టు సాధించేందుకు ఇప్పటి నుంచే కృషి చేయాలి. బీటెక్ మూడో సంవత్సరంలోకి వచ్చాక నేర్చుకోవాలనే ప్రయత్నం చేస్తే సఫలం కాలేరు. ఎందుకంటే.. ఆ సమయంలో ఓవైపు తృతీయ, చివరి సంవత్సరాల అకడమిక్ ఒత్తిడి.. మరోవైపు ఇంటర్న్‌షిప్‌లు, ప్రాజెక్ట్ వర్క్, ప్లేస్‌మెంట్స్ వంటివి ఉంటాయి. బ్రాంచ్ ఏదైనా బీటెక్‌లో ఏ బ్రాంచ్ విద్యార్థులైనా సరే.. తమ విభాగానికి సరితూగే ఇండస్ట్రీ పరిణామాలను నిత్యం తెలుసుకోవాలి. డిజిటల్ నైపుణ్యాలు మెరుగుపరచుకోవాలి. కోర్ బ్రాంచ్‌లు మొదలు సాఫ్ట్వేర్ కొలువులకు మార్గం వేసే సీఎస్ఈ, ఐటీ విద్యార్థుల వరకూ.. ప్రతి ఒక్కరూ ఆ దిశగా కృషి చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇండస్ట్రీ 4.0 స్కిల్స్ ► ప్రస్తుతం బీటెక్ విద్యార్థులు ఇండస్ట్రీ 4.0 స్కిల్స్గా పేర్కొంటున్న నైపుణ్యాలను నేర్చుకోవడం తప్పనిసరిగా మారింది. కారణం.. కంపెనీలు ఈ స్కిల్స్ ఉన్న వారికే ఆఫర్లు ఖరారు చేస్తుండటమే! మొత్తం విద్యార్థుల్లో ఇండస్రీ ్ట4.0 స్కిల్స్ ఉన్న వారి సంఖ్య 20 నుంచి 25 శాతం మధ్యలోనే ఉంటోంది. దీంతో అవకాశాలున్నా.. నైపుణ్యాలు లేక ఎంతోమంది నిరాశకు గురవుతున్నారు. కాబట్టి బీటెక్ మొదటి సంవత్సరం విద్యార్థులు.. భవిష్యత్ అవకాశాలు అందుకోవాలంటే.. ఇప్పటి నుంచి ఆయా నైపుణ్యాలు నేర్చుకోవడంపై దృష్టిపెట్టాలి. (ఎన్డీఏ, ఎన్ఏ 2021: ఇంటర్‌తోనే.. కొలువు + చదువు) ► ఇండస్ట్రీ 4.0 స్కిల్స్గా పేర్కొంటున్న.. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్(ఐవోటీ), ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ), డేటా అనలిటిక్స్, క్లౌడ్ కంప్యూటింగ్, బ్లాక్ చైన్ టెక్నాలజీ, రోబోటిక్స్, 3డి డిజైన్, ఎథికల్ హ్యాకింగ్, సైబర్ సెక్యూరిటీ, వీఆర్/ఏఆర్ టెక్నాలజీలు..ఉద్యోగ సాధనలో కీలకంగా మారుతున్నాయి. బీటెక్ విద్యార్థులు తొలి రోజు నుంచే వీటిని నేర్చుకునేందుకు ప్రాధాన్యం ఇవ్వాలి. అప్పుడే ఇంజనీరింగ్‌లో చేరిన లక్ష్యానికి అనుగుణంగా కెరీర్‌ను ఉజ్వలంగా మలచుకునే అవకాశం లభిస్తుంది. కళాశాలల్లో మౌలిక సదుపాయాల కొరత కారణంగా చాలామంది విద్యార్థులు లేటెస్ట్ స్కిల్స్ నేర్చుకోలేకపోతున్నారు. అలాంటి విద్యార్థులు ఆన్లైన్ మార్గాల్లో సొంతంగా నేర్చుకునే ప్రయత్నం చేయాలి. కోడింగ్.. ప్రోగ్రామింగ్ ప్రస్తుతం ఉద్యోగ సాధనంలో కీలకంగా నిలుస్తున్న నైపుణ్యాలు.. కోడింగ్, ప్రోగ్రామింగ్. వాస్తవానికి ఇంజనీరింగ్ కోర్సు స్వరూపంలోనే వీటికి అకడమిక్‌గా ప్రాధాన్యం ఉంది. కాని ప్రాక్టికల్ అప్రోచ్ తక్కువగా ఉండటంతో ఈ నైపుణ్యాలు ఆశించినంతగా లభించట్లేదు. ము ఖ్యంగా సీఎస్ఈ/ఐటీ బ్రాంచ్‌ల విద్యార్థులు కోడింగ్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లను ప్రాక్టికల్ అప్రోచ్‌తో నేర్చుకునేందుకు సిద్ధమవ్వాలి. హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావా స్క్రిప్ట్, పైథాన్, ఆర్, జావా, సీ, సీ++, పీహెచ్‌పీ, ఎస్‌క్యూఎల్ డేటాబేస్ వంటివి నేర్చుకోవడంపై దృష్టిపెట్టాలి. మూక్స్, ఆన్లైన్ వేదికలు, షార్ట్‌టర్మ్ కోర్సులు, యూట్యూబ్ వీడియోల ద్వారా అవగాహన పెంచుకోవచ్చు. ఒరాకిల్, మైక్రోసాఫ్ట్, రెడ్ హ్యా ట్, ఐబీఎం, జెట్ కింగ్ వంటి సంస్థలు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌పై సర్టిఫికేషన్ కోర్సులను అందిస్తున్నాయి. వీటిద్వారా సంబంధిత నైపుణ్యాలు పొందొచ్చు. సర్క్యూట్ బ్రాంచ్‌ల విద్యార్థులు ► ఈసీఈ, ఈఈఈ వంటి సర్క్యూట్ బ్రాంచ్‌ల విద్యార్థులు కూడా లేటెస్ట్ డిజిటల్ స్కిల్స్ సొంతం చేసుకునే దిశగా ఇప్పటి నుంచే కృషి చేయాలి. ► ఈసీఈ విద్యార్థులు వీఎల్ఎస్ఐ, నానో టెక్నాలజీ విభాగాల్లో షార్ట్‌టర్మ్ సర్టిఫికేషన్ కోర్సులు పూర్తి చేయడం ద్వారా జాబ్ మార్కెట్లో ముందుండొచ్చు. వీరికి కలిసొచ్చే మరికొన్ని సర్టిఫికేషన్ కోర్సులు.. ఫైబర్ ఆప్టిక్ టెక్నాలజీ; ఇండస్ట్రియల్ ఆటోమేషన్, డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్; రోబోటిక్స్. ► ఈఈఈ విద్యార్థులు.. ఎలక్ట్రికల్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, పవర్ సిస్టమ్స్ అనాలిసిస్, సర్క్యూట్ అనాలిసిస్, అడ్వాన్స్డ్ ట్రైనింగ్ ఇన్ సిస్టమ్స్ ఇంజనీరింగ్ వంటివి నేర్చుకోవాలి. వీటితోపాటు ఎస్సీఏడీఏ (సూపర్వైజరీ కంట్రోల్ అండ్ డేటా అక్విజిషన్), డిస్ట్రిబ్యూటెడ్ కంట్రోల్ సిస్టమ్స్ వంటి నైపుణ్యాలు సొంతం చేసుకోవాలి. వీటిని ఇప్పుడు పలు మార్గాల్లో నేర్చుకునే అవకాశం ఉంది. రోబోటిక్ స్కిల్స్ మెకానికల్ బ్రాంచ్ విద్యార్థులు.. రోబోటిక్ స్కిల్స్‌పై ప్రధానంగా దృష్టిపెట్టాలి. దీంతోపాటు ఈ బ్రాంచ్ విద్యార్థులు క్యాడ్, క్యామ్; ఆటోమేషన్, 2–డి, 3–డి డిజైన్ ప్రింటింగ్లపైనా అవగాహన పెంచుకోవాలి. ప్రస్తుతం రోబో ఆధారిత కార్యకలాపాలు అన్ని సంస్థల్లోనూ సాగుతున్నాయి. అన్ని బ్రాంచ్‌ల విద్యార్థులకు రోబోటిక్ స్కిల్ మేలు చేస్తుందని చెప్పొచ్చు. వీటిని సొంతంగా అభ్యసించేందుకు పలు ఆన్లైన్ మార్గాలు అందుబాటులోకి వచ్చాయి. వాటిని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగాలి. ప్రాక్టికల్, అప్లికేషన్ అప్రోచ్ మొదటి సంవత్సరం నుంచి నాలుగో సంవత్సరం వరకు ఇంజనీరింగ్ విద్యార్థులు.. ఏ అంశాన్నైనా ప్రాక్టికల్ ఓరియెంటేషన్, అప్లికేషన్ అప్రోచ్‌తో అధ్యయనం చేయాలి. అందుకోసం లేబొరేటరీల్లో ఆయా సబ్జెక్ట్ అంశాలకు సంబంధించి ప్రాక్టికల్స్ చేసేందుకు ఎక్కువ సమయం కేటాయించాలి. తద్వారా రియల్ టైం నైపుణ్యాలు సొంతమవుతాయి. ఇంటర్న్షిప్స్ బీటెక్ కోర్సులో చేరిన విద్యార్థులు ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణంగా రియల్ టైమ్ నైపుణ్యాలు పెంచుకునేందుకు.. కనీసం రెండు లేదా మూడు ఇంటర్న్షిప్స్ చేయాలి. ఈ మేరకు ఏఐసీటీఈ కూడా మార్గదర్శకాలు జారీ చేసింది. కాబట్టి విద్యార్థులు ఆయా విభాగాల్లో ఇంటర్న్‌షిప్ అవకాశాలు పొందేందుకు గల మార్గాలను అన్వేషించాలి. ఇందుకోసం క్యాంపస్‌లోని ఇండస్ట్రీ ఇంటరాక్షన్ సెల్, ఆయా సంస్థల్లో పని చేస్తున్న సీనియర్ల సహకారం తీసుకోవాలి. ఇంటర్న్‌షిప్ చేయడం ద్వారా తాజా పరిస్థితులపై అవగాహన వస్తుంది. ప్రాక్టికల్ నైపుణ్యాలు మెరుగుపరచుకోవచ్చు. ఇంటర్న్‌గా చూపిన ప్రతిభ ఆధారంగా సదరు సంస్థల్లోనే పూర్తిస్థాయి ఉద్యోగం సొంతం చేసుకునే అవకాశం లభిస్తుంది. సాఫ్ట్ స్కిల్స్ బీటెక్ విద్యార్థులు సాఫ్ట్ స్కిల్స్ నేర్చుకోవడానికి కూడా ప్రాధాన్యమివ్వాలి. ప్రస్తుతం సంస్థల్లో టీం వర్క్‌కు ప్రాధాన్యం పెరుగుతోంది. ప్రాజెక్టు పూర్తిచేసే క్రమంలో బృందంలోని సహోద్యోగులతోపాటు వివిధ విభాగాల సీనియర్లతో మాట్లాడాల్సి ఉంటుంది. ఆ క్రమంలో సాఫ్ట్ స్కిల్స్ ఎంతో ఉపయోగపడతాయి. కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్, బిహేవియరల్ స్కిల్స్, ఇంటర్ పర్సనల్ స్కిల్స్, లాంగ్వేజ్ స్కిల్స్, క్రియేటివ్ థింకింగ్, డెసిషన్ మేకింగ్ వంటివి ప్రధాన సాఫ్ట్‌స్కిల్స్‌గా చెప్పొచ్చు. ఆన్లైన్ సదుపాయాలు విద్యార్థులు ఇండస్ట్రీ 4.0 స్కిల్స్,సాఫ్ట్‌స్కిల్స్ పెంచుకునేందకు ఆన్లైన్ సదుపాయాలను సద్వినియోగం చేసుకోవచ్చు. మూక్స్, ఎన్పీటీఈఎల్,స్వయం వంటి పోర్టల్స్ ద్వారా జాతీయ, అంతర్జాతీయ స్థాయి ప్రొఫెసర్ల లెక్చర్స్ వినే అవకాశం లభిస్తుంది. ఇలా..ఒకవైపు అకడమిక్ నాలెడ్జ్, మరోవైపు ఇండస్ట్రీకి అవసరమైన లేటెస్ట్ టెక్నాలజీని అందిపుచ్చుకునేలా.. మొదటి ఏడాది నుంచే ముందుకుసాగితే.. బీటెక్ విద్యార్థులు తమ కలల కెరీర్‌ను సొంతం చేసుకోవచ్చు. బీటెక్ మొదటి సంవత్సరం.. ముఖ్యాంశాలు ► బ్రాంచ్ ఏదైనా ఉద్యోగ సాధనలో కీలకం ఇండస్ట్రీ 4.0 స్కిల్స్. ► ప్రాక్టికల్ అప్రోచ్,అప్లికేషన్ ఓరియెంటేషన్ ఉంటేనే జాబ్ ఆఫర్స్. ► డిజిటల్ స్కిల్స్‌తోపాటు సాఫ్ట్ స్కిల్స్‌కూ ప్రాధాన్యమిస్తున్న సంస్థలు. లేటెస్ట్ స్కిల్స్ ఉంటేనే ఇప్పుడు ఏ బ్రాంచ్ విద్యార్థులైనా.. లేటెస్ట్ స్కిల్స్ ఉంటేనే ఉన్నత విద్య, ఉద్యోగాల పరంగా మెరుగ్గా రాణించే పరిస్థితి ఉంది. కాబట్టి ఇంజనీరింగ్ విద్యార్థులు మొదటి సంవత్సరం నుంచే తమ బ్రాంచ్‌కు సరితూగే టెక్నాలజీస్‌పై అవగాహన పొందేందుకు కృషి చేయాలి. అకడమిక్స్‌లో లెర్నింగ్‌తోపాటు ప్రాక్టికల్ అప్రోచ్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. – ప్రొఫెసర్ ఎన్.వి.రమణరావు, డైరెక్టర్, నిట్–వరంగల్. -
ఇంటర్లో కొత్త సిలబస్
సాక్షి, అమరావతి: ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో నూతన సిలబస్‌ను ప్రవేశపెడుతున్నామని ఆంధ్రప్రదేశ్ ఇంటర్‌బోర్డు కమిషనర్ ఉదయలక్ష్మి తెలిపారు. ఈ ఏడాది నుంచే కొత్త సిలబస్ అమలులోకి వస్తుందని, నూతన సిలబస్‌తో టెస్ట్ బుక్స్‌ను రిలీజ్ చేస్తున్నట్టు ఆమె పేర్కొన్నారు. లాంగ్వేజెస్‌లో నూతన సిలబస్ ప్రవేశ పెడ్డుతున్నామని చెప్పారు. మిగతా సబెక్టుల్లో కొన్ని కొత్త చాప్టర్లను చేర్చామన్నారు. వచ్చే ఏడాది నుంచి ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరంలోనూ నూతన సిలబస్ ప్రవేశపెట్టనున్నట్లు ఉదయలక్ష్మి తెలిపారు. -
ఇ-కామర్స్‌లోకి స్పైస్‌జెట్: 25శాతం డిస్కౌంట్
న్యూఢిల్లీ: విమానయాన సంస్థ స్పైస్ జెట్ తన వ్యాపార సరళినిమరింత విస్తరించుకుంటోంది. రిటైల్ సెగ్మెంట్లోకి అడుగుపెడుతున్న సంస్థ ఈ కామర్స్ వ్యాపారాన్ని ప్రారంభించనున్నట్టు మంగళవారం ప్రకటించింది. తద్వారా భారీ ఆదాయాలపై దృష్టిపెట్టింది. సుమారు రూ. 15 కోట్లు పెట్టుబడులు పెట్టనుంది. డబ్ల్యు.డబ్ల్యు.డబ్ల్యు. స్పైస్ స్టయిల్.కాం పేరుతో తన రీటైల్ పోర్టల్‌ను లాంచ్ చేయనుంది. దేశీయ విమానయాన రంగంలో వేగంగా పెరుగుతున్న తీవ్రమైన పోటీ నేపథ్యంలో ఆదాయాలను పెంచుకోవడానికి రిటైల్ వ్యాపారంలోకి ఎంట్రీ ఇస్తోంది. స్పైస్ స్టయిల్ పేరుతో రిటైల్ విభాగంలోకి విస్తరించిన స్పైస్‌జెట్ ఇ-కామర్స్ పోర్టల్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. దీంతో సంవత్సరానికి రూ.150 కోట్ల విలువైన అదనపు ఆదాయాన్ని ఆర్జించనున్నామని తెలిపింది. దీని ద్వారా గత రెండు సంవత్సరాల్లో 17 శాతం పెరిగిన స్పైస్ జెట్ సహాయక ఆదాయంలో మరో 6 శాతం పెరగనుందని ఆ సంస్థ పేర్కొంది. మరోవైపు అమెజాన్‌తో భాగస్వామ్యాన్ని కుదర్చుకున్నట్టు తెలిపింది. 17వివిధ కేటగిరీలను పరిచయం చేస్తున్నామని, ముఖ్యంగా ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ రోహిత్ బాల్ ప్రొడక్ట్స్‌ను అందిస్తున్నామని చెప్పింది. తన కొత్త బ్రాండ్ల లాంచింగ్ కోసం అమెజాన్‌తో చేసుకున్న వ్యూహాత్మక భాగస్వామ్యంలో 25 శాతం డిస్కౌంట్లు అందించనున్నట్టు తెలిపింది. ఈ కొత్త ఉత్తేజకరమైన ప్రయాణంలో, తమ ప్రత్యేకమైన పరిధిని పంపిణీ చేయటానికి ప్రముఖ ఇ-కామర్స్ మార్కెట్లతో భాగస్వామ్యం కుదుర్చుకున్నామని, అలాగే డబ్ల్యు.డబ్ల్యు.డబ్ల్యు. స్పైస్ స్టయిల్.కాం లో కూడా ఆర్డరు చేయవచ్చని స్పైస్ జెట్ సిఎండి అజయ్ సింగ్ చెప్పారు. కాగా స్పైస్ జెట్ ఎయిర్‌లైన్స్ 46 ప్రదేశాల్లో సగటున 364 రోజువారీ విమానాలను నిర్వహిస్తుంది. ఇందులో 7 అంతర్జాతీయ సంస్థలు కూడా ఉన్నాయి. -
నేడే ఇంటర్ ఫలితాలు
-
నేడే ఇంటర్ ఫలితాలు
ఒకేసారి ప్రథమ, ద్వితీయ ఫలితాలు సాక్షి, అమరావతి: ఇంటర్మీడియెట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షల ఫలి తాలు గురువారం విడుదల కానున్నాయి. విజయవాడలోని గేట్‌వే హోటల్లో మధ్యాహ్నం 12 గంటలకు మంత్రి గంటా శ్రీనివాసరావు ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు. ఇంటర్మీడియెట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు సంబంధించి జనరల్, వొకేషనల్ కోర్సులకు సంబంధిం చిన అన్ని ఫలితాలను ప్రకటిస్తామని ఇంటర్మీడియెట్ బోర్డు కార్యదర్శి బి.ఉద యలక్ష్మి పేర్కొన్నారు. విద్యార్ధులు తమ పరీక్ష ఫలితాలను ‘సాక్షిఎడ్యుకేషన్.కామ్’లో చూసుకోవచ్చు. ఈ సేవ, మీసేవ, రాజీవ్ సిటిజన్ సర్వీస్సెంటర్లు, ఏపీ ఆన్లైన్ సెంట్లర్ల ద్వారా కూడా పరీక్ష ఫలితాల సమాచారాన్ని పొందవచ్చని బోర్డు అధికారులు పేర్కొన్నారు. ఎస్ఎంఎస్ల ద్వారా ఫలితాల సమాచారం తెలిపే ఏర్పాట్లు చేశారు. -
22న ఇంటర్ ప్రథమ ఫలితాలు?
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ ఫస్టియర్ ఫలితాలను ఈనెల 22న విడుదల చేసేందుకు రాష్ర్ట ఇంటర్ బోర్డు కసరత్తు చేస్తోంది. ఆ రోజున వీలు కాకపోతే 23న విడుదల చేయాలని భావిస్తోంది. ఫలితాల విడుదల తేదీని మంగళవారం లేదా బుధవారం అధికారికంగా ప్రకటించనుంది. ఇక ద్వితీయ సంవత్సర ఫలితాలనూ ఈ నెలాఖరుకు విడుదల చేసేందుకు బోర్డు కసరత్తు చేస్తోంది. పదో తరగతి పరీక్ష స్పాట్ వాల్యుయేషన్ చివరి దశకు చేరుకుంది. ఈ వారంలో అది పూర్తి కాగానే మే మొదటి వారం చివర్లో లేదా రెండో వారంలో ఫలితాల విడుదలకు ప్రభుత్వ పరీక్షల విభాగం కసరత్తు చేస్తోంది. -
ఫస్టియర్ ఎంబీబీఎస్ ఫలితాలు విడుదల
విజయవాడ (హెల్త్ యూనివర్సిటీ): డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఆగస్టులో నిర్వహించిన ఎంబీబీఎస్ ప్రథమ సంవత్సరం పరీక్షల ఫలితాలను శనివారం విడుదల చేసింది. మార్కుల రీ-టోటలింగ్ కోసం నవంబర్ 9లోగా సబ్జెక్టుకు రూ.2 వేలు చొప్పున చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని యూనివర్సిటీ పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ డి.విజయకుమార్ సూచించారు. ఫలితాలు యూనివర్సిటీ (హెచ్‌టీటీపీ://ఎన్టీఆర్యూహెచ్ఎస్.ఏపీ.ఎన్ఐసీ.ఇన్) వెబ్సైట్లో పొందవచ్చని తెలిపారు. సెకండియర్ తరగతులు ఈ నెల 5 నుంచి ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. -
నేడు ఇంటర్ ‘ప్రథమ’ ఫలితాలు
-
నేడు ఇంటర్ ‘ప్రథమ’ ఫలితాలు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సర ఫలితాలు ఈ నెల 22న విడుదల కానున్నాయి. జనరల్, వొకేషనల్ విద్యార్థుల ఫలితాలను ఉదయం 11 గంటలకు ఇంటర్మీడియెట్ బోర్డు కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ప్రకటించనున్నారు. ఫలితాల విడుదల తరువాత విద్యార్థులు తమ మార్కులను/గ్రేడ్లను www.sakshieducation.comతో పాటుwww.examresults.ts.nic.in, www.results.cgg.gov.in వెబ్సైట్లలో పొందవచ్చు. మార్చిలో 9వ తేదీ నుంచి 27వ తేదీ వరకు ప్రధాన పరీక్షలను నిర్వహించినట్లు ఇంటర్మీడియెట్ బోర్డు కార్యదర్శి డాక్టర్ అశోక్ తెలిపారు. ఈ పరీక్షలకు హాజరయ్యేందుకు మొత్తంగా 9,73,237 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో ప్రథమ సంవత్సర విద్యార్థులు 4,66,448 మంది, ద్వితీయ సంవత్సర విద్యార్థులు 5,06,789 మంది ఉన్నారు. ద్వితీయ సంవత్సర ఫలితాలను ఈ నెల 28న విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఫలితాలను పొందే మరిన్ని సదుపాయాలు.. విద్యార్థులు బీఎస్ఎన్ఎల్ ల్యాండ్‌ఫోన్ ద్వారా 1100 (పరిష్కారం కాల్ సెంటర్) నంబరుకు, మరే ఇతర ల్యాండ్‌ఫోన్/మొబైల్ ద్వారా 18004251110 నంబరుకు ఫోన్ చేసి పొందవచ్చు. అలాగే ఏపీ ఆన్లైన్ కేంద్రాలు, ఈసేవ/మీసేవ/రాజీవ్ సిటిజన్ సర్వీస్ సెంటర్లలోనూ పొందవచ్చు. ఎస్ఎంఎస్ ద్వారా.. బీఎస్ఎన్ఎల్ వినియోగదారులు ఇంటర్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి రోల్ నంబరు టైప్ చేసి 53346 నంబరుకు ఎస్ఎంఎస్ పంపించి ఫలితాలు పొందవచ్చు. అన్ని రకాల వినియోగదారులు ఇంటర్మీడియెట్ జనరల్ ఫలితాల కోసం ఐపీఈ2 అని టైప్ చేసి (క్యాపిటల్ లెటర్స్) స్పేస్ ఇచ్చి హాల్ టికెట్ నంబరు టైప్ చేసి 54242 నంబరు ఎస్ఎంఎస్ పంపించి పొందవచ్చు. వొకేషనల్ విద్యార్థులు ఐపీఈవీ2 అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి హాల్‌టికెట్ నంబరు టైప్ చేసి 54242 నంబరుకు ఎస్ఎంఎస్ చేసి ఫలితాలను పొందవచ్చు. ఏపీజేఐ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి హాల్‌టికెట్ నంబరు టైప్ చేసి 56767999 నంబరుకు ఎస్ఎంఎస్ పంపవచ్చు. ఒక్క హాల్‌టికెట్ నంబరునే టైప్ చేసి 57272 నంబరుకు ఎస్ఎంఎస్ పంపొచ్చు. ఎయిర్టెల్ వినియోగదారులు ఏపీ12హాల్‌టికెట్ నంబరు టైప్ చేసి 52070 నంబరుకు ఎస్ఎంఎస్ పంపించాలి. అన్ని రకాల వినియోగదారులు ఏపీ12హాల్‌టికెట్ నంబరు టైప్ చేసి 58888 నంబరుకు ఎస్ఎంఎస్ పంపించి ఫలితాలు పొందవచ్చు. అలాగే ఐపీఈజీ2 అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి హాల్‌టికెట్ నంబరు టైప్ చేసి 5676750 (జనరల్ విద్యార్థులు) ఎస్ఎంఎస్ పంపించాలి. వొకేషనల్ విద్యార్థులు ఐపీఈవీ2 అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి హాల్‌టికె ట్ నంబరు టైప్ చేసి 5676750 ఎస్ఎంఎస్ పంపించి ఫలితాలను పొందవచ్చు. -
నేటి నుంచి ఇంటర్ పరీక్షలు
అనంతపురం ఎడ్యుకేషన్ : ఈ ఏడాది పరీక్షల సీజన్ నేటితో ప్రారంభం కానుంది. ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు మొదటి సంవత్సరం బుధవారంతో మొదలుకానున్నాయి. ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు గురువారంతో ప్రారంభమవుతాయి. జిల్లాలో మొత్తం 67,773 మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాయనున్నారు. అందులో ప్రథమ సంవత్సరం 34,500 మంది, ద్వితీయ సంవత్సరం 33,273 మంది విద్యార్థులు రాయనున్నారు. రోజూ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష ఉంటుంది. ఇందుకోసం జిల్లా వ్యాప్తగా 99 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆర్ఐఓ వెంకటేశులు ఆధ్వర్యంలో ఏర్పాట్లు సర్వం సిద్ధం చేశారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుంది. గుంపులు గుంపులుగా కనిపిస్తే మాత్రం పోలీసులు తీసుకెళ్లి కేసులు నమోదు చేస్తారని ఇంటర్ అధికారులు చెబుతున్నారు. పరీక్షల సమయంలో కరెంటు కోత విధించకుండా చర్యలు తీసుకునేలా జిల్లా కలెక్టరు ఇప్పటికే విద్యుత్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పరీక్ష కేంద్రాల చుట్టుపక్కల ఎట్టిపరిస్థితుల్లోనూ జిరాక్స్ కేంద్రాలు తీయకూడదని ఆదేశాలు జారీ చేశారు. అలాగే బస్సు సౌకర్యం లేని కేంద్రాలకు పరీక్షల సమయంలో ప్రత్యేక బస్సులు నడిపేలా ఆర్టీసీ అధికారులకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులు ఉదయం 8.15 గంటలకే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని ఆర్ఐఓ వెంకటేశులు సూచిస్తున్నారు. 8.45 నుంచి 9 గంటల వరకు ఆలస్యంగా వచ్చేవారిని అనుమతిస్తారని, ఆ తర్వాత వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరని స్పష్టం చేశారు. డిపార్టుమెంటల్ ఆఫీసర్లు, చీఫ్ సూపరింటెండెంట్లు తప్ప ఇన్విజిలేటర్లు గాని, విద్యార్థులు గాని సెల్ఫోన్లు తెచ్చుకోకూడదని సూచించారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కేంద్రాల్లో అన్ని వసతులు కల్పించామన్నారు. ఈ ఏడాది పరీక్షలు రాస్తున్న విద్యార్థులందరూ మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని ఆయన దీవించారు. -
గ్రేడ్ల వారీగా ఉత్తీర్ణత శాతం
హైదరాబాద్: ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరంలో ఉత్తీర్ణులైన వారిలో గ్రేడ్ల వారీగా విద్యార్థుల వివరాలివీ.. 75 శాతం అంతకంటే ఎక్కువ మార్కులు సాధించినవారు (ఏ గ్రేడ్) - 2,31,764 మంది 60 శాతం నుంచి 75 శాతంలోపు మార్కులు సాధించినవారు (బి గ్రేడ్) - 1,44,336 మంది 50 శాతం నుంచి 60 శాతంలోపు మార్కులు సాధించినవారు (సి గ్రేడ్) - 75,263 మంది 35 శాతం నుంచి 50 శాతంలోపు మార్కులు సాధించినవారు (డి గ్రేడ్) - 33,706 మంది ప్రభుత్వ కళాశాలల్లో తగ్గిన ఉత్తీర్ణత.. ఈసారి ప్రభుత్వ కళాశాలల్లో ఉత్తీర్ణత శాతం తగ్గింది. ప్రభుత్వ కాలేజీల్లో చదివిన విద్యార్థులు గతేడాది 46 శాతం మంది ఉత్తీర్ణులవగా.. ఈసారి 44.2 శాతం మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. వివిధ గ్రూపుల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులు హెచ్ఈసీ హాల్ టికెట్ నంబర్ పేరు మార్కులు జిల్లా 1405143508 టి.అనూహ్య 460 కృష్ణా 1412121084 వి.సురేఖ 458 కడప 1404135709 ఎస్.అశోక్ 454 పశ్చిమగోదావరి 1416135033 సనా ఫిర్దోజ్ 454 నిజామాబాద్ 1401131067 ఎన్.సునీల్‌కుమార్ 454 శ్రీకాకుళం 1424113995 జి.త్రినాథ 452 విజయనగరం 1424119345 ఆకుల రమేష్ 452 విజయనగరం 1405138476 బి.రవికుమార్ 451 కృష్ణా బైపీసీ హాల్ టికెట్ నంబర్ పేరు మార్కులు జిల్లా 1419114965 ఎ.శ్రావ్యచౌదరి 437 ఖమ్మం 1405111475 ఆదర్శవర్థన్ తంగెళ్ల 436 కృష్ణా 1405130449 వి.అక్షయ 436 కృష్ణా 1405135859 కె.సింధుభార్గవి 436 కృష్ణా 1406113115 కె.శ్రీశ్రావణి 436 గుంటూరు 1415157495 కె.లిఖిత 436 రంగారెడ్డి 1422121495 ఆర్.అనూష వర్ణవి 436 హైదరాబాద్ బైపీసీలో 435 మార్కులు సాధించిన వారు 13 మంది ఉన్నారు... ఎంఈసీ హాల్ టికెట్ నంబర్ పేరు మార్కులు జిల్లా 1405136817 వి.అఖిల 492 కృష్ణా 1406130995 సి.వెంకటఅఖిలాండేశ్వరి 492 గుంటూరు 1402122404 ఎ.శ్రీవిద్య 491 విశాఖపట్నం 1406130986 బి.పృధ్వీరాజ్ 491 గుంటూరు 1406130997 మహ్మద్ ఉమ్మయ్ హబీబా 491 గుంటూరు 1406131047 పి.రాజ్యలక్ష్మి 491 గుంటూరు 1409131712 జి.శ్రీలక్ష్మి 491 చిత్తూరు 1422122381 ఎం.లక్ష్మీప్రసన్న 491 హైదరాబాద్ 1422130680 ఎ.వినోద్‌కుమార్ 491 హైదరాబాద్ 1408119254 పి.వినీత్ 491 నెల్లూరు ఎంపీసీ హాల్ టికెట్ నంబర్ పేరు మార్కులు జిల్లా 1416122178 క్యాతం చలన 467 నిజామాబాద్ 1419116077 బోడెంపూడి స్నేహ 467 ఖమ్మం 1405149110 ఎన్.కృష్ణ విక్రాంత్ 467 కృష్ణా 1419114898 మాచవరపు నాగరాజు 467 ఖమ్మం 1414112776 చింతా సాయి తేజేశ్వర్‌రెడ్డి 467 మెదక్ 1405149102 బోయపల్లి నర్సింహారెడ్డి 467 కృష్ణా 1407117722 గుట్టి జాహ్నవి 467 రకాశం 1419118874 ఎస్.ఏ. రుబీనా కౌసర్ 467 ఖమ్మం 1415149885 గొట్టం సాయి పునీత్‌రెడ్డి 467 రంగారెడ్డి సీఈసీ హాల్ టికెట్ నంబర్ పేరు మార్కులు జిల్లా 1418131531 సాయిరాజు 481 కరీంనగర్ 1404119255 ఆర్.రేవతి 480 పశ్చిమగోదావరి 1427118214 ఎం.హరిత 480 హైదరాబాద్ 1417134293 ఆర్.కురుమూర్తి 480 మహబూబ్‌నగర్ 1406136568 షేక్ షమీమ్ 479 గుంటూరు 1409145262 వై.గీతారాణి 479 చిత్తూరు 1417121910 కె.అర్చణ పటేల్ 479 మహబూబ్‌నగర్ 1420112584 సబా యాస్మీన్ 479 వరంగ ల్ 1420136303 ఆకుల సాయిరామ్ 479 వరంగల్ -
డిగ్రీ ప్రశ్నపత్రం తారుమారు
కంప్యూటర్ కోర్సుకు బదులు కంప్యూటర్ స్కిల్స్పేపరు పంపిణీ ఆందోళనలో ఫస్టియర్ విద్యార్థులు ఇచ్ఛాపురం,న్యూస్‌లైన్: స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరుగుతున్న మొదటి సంవత్సవరం డిగ్రీ పరీక్షలలో ప్రశ్నాపత్రం మారడంతో విద్యార్థులు ఇబ్బంది పడిన సంఘటన బుధవారం చోటుచేసుకుంది. ఈ విషయం ఆలస్యంగా రాత్రి వెలుగులోకి వచ్చింది. వాస్తవంగా కంప్యూటర్ కోర్సు పేపరు రాయల్సి ఉండగా, వారికి కంప్యూటర్ స్కిల్స్ పేపరు అందజేశారు. దీంతో విద్యార్థులు చూసుకోకుండా ఆ సబ్జెక్టు పేపరుకు పరీక్ష కూడా పూర్తి చేశారు. పరీక్ష పూర్తై తర్వాత జరిగిన పొరపాటును గ్రహించిన విద్యార్థులు కళాశాల ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకెళ్లడంతో వారు రాసిన సమాధానాల పత్రాలకు వారు రాసిన ప్రశ్నాపత్రాన్నే జత చేసి బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీకి పంపారు. డిగ్రీ జనరల్ విద్యార్థులకు కంప్యూటర్ కోర్సు పేపర్, వోకేషనల్ విద్యార్థులకు కంప్యూటర్ స్కిల్స్ పేపరు ఇవ్వాల్సి ఉంది. పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రైవేటు డిగ్రీ కళాశాల విద్యార్థులకు కూడా ఇక్కడే పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. బుధవారం సుమారు 550 మంది విద్యార్థులకు 13 గదుల్లో పరీక్ష నిర్వహించారు. జనరల్ విద్యార్థులున్న ఒక పరీక్ష గదిలో కంప్యూటర్ కోర్సుకు బదులు కంప్యూటర్ స్కిల్స్ ప్రశ్నాపత్రం ఇచ్చారు. వారు పరీక్ష కూడా రాసి సమాధానపత్రాలిచ్చిన తర్వాత జరిగిన పొరపాటు తెలుసుకున్నారు. దాంతో చాలా మార్కులు కొల్పోయే పరిస్థితి ఏర్పడింది. ఇదే విషయమై కళాశాల ప్రిన్సిపాల్ రోబిన్కుమార్ పాడి వివరణ ఇస్తూ ప్రశ్నాపత్రం మారిన మాట వాస్తవమేనన్నారు. కొన్ని పరీక్ష గదుల్లో విద్యార్థులు పొరపాటును గమనించి చెప్పడంతో వారికి సరైన ప్రశ్నాపత్రం అందజేశామని, మరో గదిలోని విద్యార్థులు పరీక్ష రాసిన తర్వాత పొరపాటును గమనించి తమ దృష్టికి తెచ్చారన్నారు. వెంటనే బీఆర్‌ఏయూ అధికారుల దృష్టికి విషయాన్ని తీసుకెళ్లామన్నారు. ప్రశ్నాపత్రం మారినా సుమారు 60 శాతం ప్రశ్నలు ఒకే విధంగా ఉన్నాయని, విద్యార్థులు ఆందోళన చెందాల్సిన ఆవసరం లేదన్నారు. -
ఇంటర్ పరీక్షలు ప్రారంభం
కరీంనగర్ ఎడ్యుకేషన్, న్యూస్‌లైన్ : ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు ప్రథ మ సంవత్సరం పరీక్షలు ప్రశాంతంగా ముగిశా యి. విద్యార్థులు అరగంట ముందే పరీక్ష కేం ద్రాలకు చేరుకున్నారు. కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తుతోపాటు 144 సెక్షన్ విధించడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ జరగలేదు. తాగునీరు, వైద్యసదుపాయం అందుబాటులో ఉంచారు. 94 శాతం హాజరు ప్రథమ సంవత్సరం పరీక్షకు జిల్లావ్యాప్తంగా 50,922 మంది విద్యార్థులకు 46,870 మంది హాజరయ్యారు. 4,052 మంది గైర్హాజరయ్యారు. జనరల్ విభాగంలో 46,207 మందికి 42,964 మంది హాజరయ్యారు. ఓకేషనల్ విభాగంలో 4,715 మందికి 3,906 మంది హాజరయ్యారు. జిల్లా వ్యాప్తంగా జనరల్ విభాగంలో 75 శాతం, వోకేషనల్ విభాగంలో 19 శాతం మొత్తంగా 94 శాతం మంది పరీక్ష రాశారు. పకడ్బందీ చర్యలుతీసుకోవడంతో ఎక్కడా మాస్ కాపీయింగ్ జరగలేదని ఆర్ఐవో రమేశ్‌బాబు తెలిపారు. 10 మంది సిట్టింగ్, ఆరుగురు ఫ్లైయింగ్, ఇద్దరు అదనపు స్క్యాడ్ సిబ్బంది పరీక్షలను పర్యవేక్షించారు. -
ప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు
రాజమండ్రి సిటీ, న్యూస్‌లైన్ :జిల్లావ్యాప్తంగా ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. పరీక్షల నిర్వహణకు జిల్లావ్యాప్తంగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని, 120 ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ కళాశాలల్లోని పరీక్షా కేంద్రాల్లో ఎలాంటి అవాంఛనీయమైన సంఘటనలు లేకుండా ప్రశాంతంగా జరిగాయని ఇంటర్మీడియట్ బోర్డ్ ప్రాంతీయ అధికారి కేటీ దాశరథి తెలిపారు. కాగా జిల్లాలోని అన్ని కళాశాలల నుంచి జనరల్, ఒకేషనల్ విభాగాల్లో 48,270 మంది పరీక్షలకు హాజరు కావలసి ఉంది. అయితే 3,883 మంది ైగె ర్హాజరు కాగా 44,387 మంది పరీక్షలు రాశారు. పరీక్షల్లో మాస్ కాపీయింగ్ వంటివి జరగకుండా 10 సిట్టింగ్ స్క్వాడ్లు, 5 ఫ్లైయింగ్ స్క్వాడ్లు ఏర్పాటు చేశారు. ఉదయం 8.30లకు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాల్సి ఉంది. జిల్లావ్యాప్తంగా కొన్ని పరీక్షా కేంద్రాలకు మొత్తం 15 మంది విద్యార్థులు ఆలస్యంగా 8.45-9.00 గంటల మధ్య వచ్చారు. అయినా వారు దూరప్రాంతాల నుంచి రావడం వంటి సహేతుకమైన కారణాలు చూపడంతో పరీక్ష రాయడానికి అనుమతించినట్టు దాశరథి తెలిపారు. కాగా గురువారం నుంచి ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం పరీక్షలు ప్రారంభం కానున్నాయని చెప్పారు. పలు కేంద్రాల్లో కొరవడ్డ కనీస సౌకర్యాలు పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యమూ ఎదురు కాకుండా అన్ని ఏర్పాట్లూ చేశామని అధికారులు చెపుతున్నా.. పలు కేంద్రాల్లో అనేక సమస్యలను విద్యార్థులు చవి చూడాల్సి వచ్చింది. ఓవైపు ఎండలు ముదురుతుండడంతో.. విద్యుత్ సదుపాయం లేని చోట్ల, ఉన్నా ఫ్యాన్లు లేని చోట విద్యార్థులు ఉక్కపోతతో, చెమటలు కారుతుండగా పరీక్షలు రాయాల్సి వచ్చింది. కొన్ని చోట్ల విద్యుత్ దీపాలు లేకపోవడంతో, ఉన్నా కరెంటు పోవడంతో మసక వెలుతురులోనే విద్యార్థులు తడుముకుంటూ జవాబులు రాయాల్సిన దుస్థితి ఎదురైంది. ధవళేశ్వరం ప్రభుత్వ జూనియర్ కళాశాల పరీక్షా కేంద్రంలో చాలినన్ని డెస్కులు లేకపోవడంతో ఎందరో విద్యార్థులు ప్యాడ్లను ఒళ్లో పెట్టుకుని, అవస్థలు పడుతూ పరీక్ష రాయాల్సి వచ్చింది. ఇక్కడ మరుగుదొడ్లు వినియోగించజాలనంత అధ్వానంగా ఉండడం కూడా విద్యార్థులకు మరో విషమ పరీక్షగా మారింది.