ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు ప్రథ మ సంవత్సరం పరీక్షలు ప్రశాంతంగా ముగిశా యి
కరీంనగర్ ఎడ్యుకేషన్, న్యూస్‌లైన్ : ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు ప్రథ మ సంవత్సరం పరీక్షలు ప్రశాంతంగా ముగిశా యి. విద్యార్థులు అరగంట ముందే పరీక్ష కేం ద్రాలకు చేరుకున్నారు. కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తుతోపాటు 144 సెక్షన్ విధించడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ జరగలేదు. తాగునీరు, వైద్యసదుపాయం అందుబాటులో ఉంచారు.
94 శాతం హాజరు
ప్రథమ సంవత్సరం పరీక్షకు జిల్లావ్యాప్తంగా 50,922 మంది విద్యార్థులకు 46,870 మంది హాజరయ్యారు. 4,052 మంది గైర్హాజరయ్యారు. జనరల్ విభాగంలో 46,207 మందికి 42,964 మంది హాజరయ్యారు. ఓకేషనల్ విభాగంలో 4,715 మందికి 3,906 మంది హాజరయ్యారు.
జిల్లా వ్యాప్తంగా జనరల్ విభాగంలో 75 శాతం, వోకేషనల్ విభాగంలో 19 శాతం మొత్తంగా 94 శాతం మంది పరీక్ష రాశారు. పకడ్బందీ చర్యలుతీసుకోవడంతో ఎక్కడా మాస్ కాపీయింగ్ జరగలేదని ఆర్‌ఐవో రమేశ్‌బాబు తెలిపారు. 10 మంది సిట్టింగ్, ఆరుగురు ఫ్లైయింగ్, ఇద్దరు అదనపు స్క్యాడ్ సిబ్బంది పరీక్షలను పర్యవేక్షించారు.