
సాక్షి, అమరావతి: ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో నూతన సిలబస్‌ను ప్రవేశపెడుతున్నామని ఆంధ్రప్రదేశ్ ఇంటర్‌బోర్డు కమిషనర్ ఉదయలక్ష్మి తెలిపారు. ఈ ఏడాది నుంచే కొత్త సిలబస్ అమలులోకి వస్తుందని, నూతన సిలబస్‌తో టెస్ట్ బుక్స్‌ను రిలీజ్ చేస్తున్నట్టు ఆమె పేర్కొన్నారు.
లాంగ్వేజెస్‌లో నూతన సిలబస్ ప్రవేశ పెడ్డుతున్నామని చెప్పారు. మిగతా సబెక్టుల్లో కొన్ని కొత్త చాప్టర్లను చేర్చామన్నారు. వచ్చే ఏడాది నుంచి ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరంలోనూ నూతన సిలబస్ ప్రవేశపెట్టనున్నట్లు ఉదయలక్ష్మి తెలిపారు.