Inter board of education
-
ఇంటర్ సిలబస్ మార్పు
ఇంటర్మీడియెట్‌లో కొత్త సిలబస్ అమలు చేసేందుకు ఇంటర్ విద్యా మండలి కసరత్తు చేస్తోంది. వర్తమాన ప్రమాణాలకు అనుగుణంగా సిలబస్‌లో మార్పులు చేయాలని అధికారులు నిర్ణయించారు. జాతీయ స్థాయి సిలబస్ అమలుకు అనుగుణంగా చేపట్టాల్సిన మార్పులపై అధ్యయనం కోసం ప్రత్యేక కమిటీలను నియమించనున్నారు. పాఠశాల విద్యా బోధనలో మార్పులపై అధ్యయనం కోసం విద్యాశాఖ అధికారులు ప్రస్తుతం 12 రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. ఇదే తరహాలో వివిధ రాష్ట్రాల్లో ఇంటర్ సిలబస్ అమలు తీరుపై ప్రత్యేక కమిటీలు అధ్యయనం చేస్తాయి.వాస్తవానికి ఇంటర్ సిలబస్‌పై అధ్యయనం చేసి మార్పులు తేవాలని వైఎస్సార్ సీపీ హయాంలోనే నిర్ణయించగా ఈ విద్యా సంవత్సరంలో అధ్యయనం నిర్వహించేలా ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో దసరా సెలవుల తర్వాత అధ్యయన కమిటీలు ఏర్పాటు కానున్నాయి. – సాక్షి, అమరావతి పుష్కర కాలంగా పాత సిలబస్సేరాష్ట్రంలో జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ) 2020 ప్రకారం పాఠశాల విద్య సిలబస్‌ను మార్చారు. అయితే ఇంటర్మీడియట్లో దాదాపు పుష్కర కాలంగా పాత సిలబస్సే కొనసాగుతోంది. ఈ క్రమంలో ఎన్ఈపీ, వర్తమాన అంశాలను దృష్టిలో ఉంచుకుని సిలబస్‌ను సవరించి 2025–26 విద్యా సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో అమలు చేయాలని నిర్ణయించారు. ఆపై 2026–27 విద్యా సంవత్సరంలో ఇంటర్ రెండో ఏడాది సిలబస్‌ను మార్చనున్నారు.పరీక్షల సరళిలో మరిన్ని మార్పులుఇంటర్ విద్యా మండలి కమిషనర్, కార్యదర్శిగా కృతికా శుక్లా బాధ్యతలు చేపట్టాక కళాశాలల పనివేళలను ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మార్చారు. యూనిట్ టెస్టుల పేపర్లను రాష్ట్ర కార్యాలయంలోనే తయారు చేసి పంపిస్తున్నారు. ఈ ఏడాది జరిగిన మొదటి యూనిట్ టెస్ట్‌ను ఆయా కాలేజీలే నిర్వహించుకోగా రెండో యూనిట్ టెస్ట్ మాత్రం రాష్ట్రవాప్తంగా ఒకే తరహాలో నిర్వహించారు. దసరా సెలవుల అనంతరం జరిగే క్వార్టర్లీ పరీక్ష సైతం ఇదే తరహాలో ఉండనుంది. గతంలో ఎవరికి వారు పరీక్షలు నిర్వహించుకునేటప్పుడు సిలబస్ పూర్తి కాని పాఠ్యాంశాలను మినహాయించి పేపర్లు తయారు చేసేవారు. కొత్తగా తెచ్చిన కేంద్రీకృత పరీక్షలతో అన్ని కాలేజీల్లో ఒకేసారి సిలబస్ పూర్తి చేసేలా మార్పు తెచ్చారు. ప్రైవేట్ కాలేజీలు సైతం ఇదే విధానం అనుసరిస్తున్నాయి. బోర్డు నిర్వహించే వార్షిక పరీక్షలను సైతం వచ్చే ఏడాది సవరించి కొత్తగా ఒక్క మార్కు ప్రశ్నలను ప్రవేశపెట్టనున్నారు.సైన్స్‌లో జాతీయ స్థాయి ఆర్ట్స్‌లో స్టేట్ సిలబస్ప్రస్తుతం ఇంటర్లో బోధిస్తున్న సిలబస్‌ను 2011–12 విద్యాసంవత్సరంలో ప్రవేశపెట్టారు. నాటి సమకాలీన అంశాలను ఇందులో చేర్చారు. అయితే ఆ పాఠ్యాంశాలు పాతబడిపోవడం, సైన్స్ పాఠాలు పూర్తిగా మారిపోవడంతో పాటు టెక్నాలజీకి సంబంధించిన అంశాలు అప్డేట్ అయ్యాయి. అయినప్పటికీ పాత సిలబస్ బోధిస్తూ, పాత విధానంలోనే పరీక్షలు నిర్వహిస్తున్నారు. మరోపక్క రాష్ట్ర ప్రభుత్వ స్కూళ్లల్లో 6–10 తరగతుల వరకు సీబీఎస్ఈ సిలబస్‌ను అమలు చేస్తున్న విషయం విదితమే. ఈ క్రమంలో ఇంటర్ సిలబస్‌ను జాతీయ సిలబస్‌కు అనుగుణంగా మార్చాలని నిర్ణయించారు. దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాలు ఇంటర్ స్థాయిలో నీట్, ఐఐటీ లాంటి పోటీ పరీక్షలకు అనుగుణంగా సిలబస్‌ను ప్రవేశపెట్టాయి. ఈ నేపథ్యంలో మన రాష్ట్రంలో ప్రధానంగా ఎంపీసీ, బైపీసీ గ్రూపులను ఐఐటీ, నీట్ సిలబస్‌కు అనుగుణంగా సిద్ధం చేస్తూ సిలబస్ మార్చనున్నారు. దీంతోపాటు హెచ్‌సీఈలో ఏపీ చరిత్రకు అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఆర్థిక శాస్త్రంలోను వర్తమాన మార్పులు జోడించనున్నారు. సిలబస్ అధ్యయన కమిటీల్లో ఇంటర్మీడియట్ సబ్జెక్టు లెక్చరర్లు నలుగురు నుంచి ఎనిమిది మంది, డిగ్రీ కాలేజీ సబ్జెక్టు లెక్చరర్, యూనివర్సిటీ ప్రొఫెసర్ ఉంటారు. -
ఇంటర్ పరీక్ష ఫీజు గడువు పొడిగింపు
సాక్షి, అమరావతి: వచ్చే ఏడాది మార్చిలో జరిగే ఇంటర్ మొదటి, రెండో ఏడాది జనరల్, ఒకేషనల్ పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపునకు ఇంటర్ విద్యా మండలి గడువు పొడిగించింది. వాస్తవానికి ఆలస్య రుసుం లేకుండా ఫీజు చెల్లించేందుకు నవంబర్ 30తో గడువు ముగిసింది. అయితే, ఈ గడువును మరో ఐదురోజులు పొడిగిస్తూ గురువారం ఇంటర్మీడియట్ విద్యా మండలి కార్యదర్శి సౌరభ్‌గౌర్ ఉత్తర్వులిచ్చారు. రెగ్యులర్, ప్రైవేటు విద్యార్థులు ఆలస్య రుసుం లేకుండా డిసెంబర్ 5 వరకు, రూ.1000 ఆలస్య రుసుంతో 15 వరకు చెల్లింపునకు అవకాశం కల్పించినట్టు ప్రకటించారు. మొదటి/ రెండో సంవత్సరం థియరీ పరీక్షలకు రూ.550, రెండో ఏడాది జనరల్, ఒకేషనల్ ప్రాక్టికల్స్‌కు రూ.250, బ్రిడ్జి కోర్సులకు రూ.150 చెల్లించాలి. ఇంటర్ రెండేళ్ల థియరీ పరీక్షలకు రూ.1100, ఒకేషనల్ రెండేళ్ల ప్రాక్టికల్స్‌కు రూ.500, ఒకేషనల్ బ్రిడ్జి కోర్సుకు రూ.300 చెల్లించాలి. ఇప్పటికే ఇంటర్ పాసై ఇంప్రూవ్మెంట్ రాసేవారు రెండేళ్లకు ఆర్ట్స్ కోర్సులకు రూ.1240, సైన్స్ కోర్సులకు రూ.1440 ఆయా కళాశాలల్లో చెల్లించాలి. -
ఇంటర్ ఫలితాల పిటిషన్లపై ముగిసిన విచారణ
సాక్షి, హైద్రాబాద్: ఇంటర్మీడియట్ ఫలితాల్లో తలెత్తిన గందరగోళ పరిస్థితులపై దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో బుధవారం విచారణ ముగిసింది. ఫలితాల్లో చిన్న తప్పులే జరిగాయని, రీ వెరిఫికేషన్‌లో 0.16 శాతం మాత్రమే ఉత్తీర్ణులయ్యారని గుర్తు చేసింది. విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం దురదృష్టకరమన్న కోర్టు, చనిపోయిన వారికి పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించలేమని పేర్కొంది. అలాగే బాధ్యుల విషయంలో ప్రభుత్వమే శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని, తాము జోక్యం చేసుకోలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది. -
ఇంటర్లో కొత్త సిలబస్
సాక్షి, అమరావతి: ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో నూతన సిలబస్‌ను ప్రవేశపెడుతున్నామని ఆంధ్రప్రదేశ్ ఇంటర్‌బోర్డు కమిషనర్ ఉదయలక్ష్మి తెలిపారు. ఈ ఏడాది నుంచే కొత్త సిలబస్ అమలులోకి వస్తుందని, నూతన సిలబస్‌తో టెస్ట్ బుక్స్‌ను రిలీజ్ చేస్తున్నట్టు ఆమె పేర్కొన్నారు. లాంగ్వేజెస్‌లో నూతన సిలబస్ ప్రవేశ పెడ్డుతున్నామని చెప్పారు. మిగతా సబెక్టుల్లో కొన్ని కొత్త చాప్టర్లను చేర్చామన్నారు. వచ్చే ఏడాది నుంచి ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరంలోనూ నూతన సిలబస్ ప్రవేశపెట్టనున్నట్లు ఉదయలక్ష్మి తెలిపారు. -
గుర్తింపు పొందిన విద్యామండళ్లు
హైదరాబాద్: దేశంలో గుర్తింపు పొందిన విద్యామండళ్లు జారీ చేసిన ధృవ పత్రాలను మాత్రమే తాము పరిగణనలోకి తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యామండలి కార్యదర్శి రాంశంకర్‌నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. కౌన్సిల్ ఆఫ్ బోర్డ్స్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా(సీఓబీఎస్ఈ)లో సభ్యత్వం కలిగిన సంస్థలు జారీ చేసే ధృవపత్రాలకు మాత్రమే గుర్తింపు ఉందన్నారు. గుర్తింపు లేని, నకిలీ బోర్డులు, మండళ్లలో చదివే విద్యార్ధులకు జరిగే నష్టంతో తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు. దేశంలో 54 మండళ్లు, సంస్థలు, ఏడు అనుబంధ మండళ్లు, సంస్థలు జారీ చేసే ధృవపత్రాలను గుర్తిస్తామని చెప్పారు. గుర్తింపు పొందిన విద్యామండళ్లు, సంస్థలు ఇవీ.. ఇంటర్మీడియట్ విద్యా మండలి(ఆంధ్రప్రదేశ్), బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(ఆంధ్రప్రదేశ్) ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ (2013-14 విద్యా సంవత్సరానికి మాత్రమే) అసోం హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్ కౌన్సిల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, అసోం అసోం సాంస్కృత్ బోర్డు బీహార్ స్కూల్ ఎగ్జామినేషన్ బోర్డు బీహార్ బోర్డ్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ అండ్ ఎగ్జామినేషన్ బీహార్ స్టేట్ మదర్సా ఎడ్యుకేషన్ బోర్డ్ బీహార్ సాంస్కృత్ శిక్షా బోర్డు బనస్థలి విద్యాపీఠ్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఛత్తీస్‌ఘడ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఛత్తీస్‌ఘడ్ స్టేట్ ఓపెన్ స్కూల్ ఛత్తీస్‌ఘడ్ సాంస్కృత్ బోర్డు, రాయ్‌పూర్ ఛత్తీస్‌ఘఢ్ మదర్సా బోర్డు కౌన్సిల్ ఫర్ ది ఇండియన్ స్కూల్ +సర్టిఫికెట్ ఎగ్జామినేషన్స్ దయాల్బాగ్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూట్(డీమ్డ్ యూనివర్సిటీ) గోవా బోర్డ్ ఆఫ్ సెకండరీ అండ్ హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్ గుజరాత్ సెకండరీ అండ్ హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డ్ బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ హర్యానా హెచ్‌పీ బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ జమ్ము కాశ్మీర్ బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ జార్కండ్ అకడమిక్ కౌన్సిల్, రాంచీ డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రి యూనివ ర్శిటీ ఎడ్యుకేషన్, గవర్నమెంట్ ఆఫ్ కర్నాటక కర్నాటక సెకండరీ ఎడ్యుకేషన్ ఎగ్జామినేషన్ బోర్డు కేరళ బోర్డ్ ఆఫ్ పబ్లిక్ ఎగ్జామినేషన్ కేరళ బోర్డ్ ఆఫ్ హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్ మహారాష్ట్ర స్టేట్ బోర్డ్ ఆఫ్ సెకండరీ అండ్ హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ మధ్యప్రదేశ్ ఎంపీ స్టేట్ ఓపెన్ స్కూల్ మహర్షి పతంజలి సాంస్కృత్ సంస్థాన్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ మణిపూర్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్, మణిపూర్ మేఘాలయ బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ మిజోరం బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నాగాలాండ్ బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్, ఒడిషా బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, ఒడిషా పంజాబ్ స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ , రాజస్థాన్ రాజస్థాన్ స్టేట్ ఓపెన్ స్కూల్, జైపూర్ రాష్ట్రీయ సాంస్కృతి సంస్థాన్ స్టేట్ బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎగ్జామినేషన్ (ఎస్ఈసీ) అండ్ బోర్డ్ ఆఫ్ హయ్యర్ సెకండరీ ఎగ్జామినేషన్స్ తమిళనాడు, త్రిపుర బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ యూపీ బోర్డ్ ఆఫ్ హైస్కూల్ అండ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ యూపీ ఎస్ఈసీ సాంస్కృతి ఎడ్యుకేషన్ కౌన్సిల్ బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, ఉత్తరాఖండ్ వెస్ట్ బెంగాల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వెస్ట్ బెంగాల్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్ వెస్ట్ బెంగాల్ బోర్డ్ ఆఫ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ వెస్ట్ బెంగాల్ బోర్డ్ ఆఫ్ మదర్సా ఎడ్యుకేషన్ వెస్ట్ బెంగాల్ కౌన్సిల్ ఆఫ్ రబీంద్ర ఓపెన్ స్కూలింగ్. అనుబంధ మండళ్లు: హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డ్, నేపాల్ మారిషస్ ఎగ్జామినేషన్ సిండికేట్ భూటాన్ కౌన్సిల్ ఫర్ స్కూల్ ఎగ్జామినేషన్స్ అండ్ అసెస్మెంట్ ది అగాఖాన్ యూనివర్శిటీ ఎగ్జామినేషన్ బోర్డ్, కరాచి ఇంటర్ బోర్డ్ కమిటీ ఆఫ్ ఛైర్మన్(ఐబీసీసీ) ఇస్లామాబాద్ కేంబ్రిడ్జి ఇంటర్నేషనల్ ఎగ్జామినేషన్స్(యూకే) ఇంటర్నేషనల్ ఏజెన్సీస్(ఎడ్ఎక్సెల్), ఇంటర్నేషనల్ బక్కాల్యూరేట్). ** -
రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు
* అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన బోర్డు * హాజరుకానున్న 19.78 లక్షల మంది * 9 గంటల తర్వాత నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ * ఇంటర్ బోర్డు కార్యదర్శి రామశంకర్ నాయక్ వెల్లడి సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను ఇంటర్ బోర్డు పూర్తి చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 2,661 కేంద్రాల్లో నిర్వహించే ఈ పరీక్షలకు 19,78,379 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. వీరిలో ప్రథమ సంవత్సర విద్యార్థులు 9,29,090 మంది ఉండగా, ద్వితీయ సంవత్సర విద్యార్థులు 10,49,289 మంది పరీక్షలు రాయనున్నారు. 975 ప్రభుత్వ, 187 ఎయిడెడ్, 1,499 ప్రైవేటు కాలేజీల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఇంటర్మీడియెట్ బోర్డు కార్యదర్శి రామశంకర్ నాయక్ వెల్లడించారు. సోమవారమిక్కడి బోర్డు కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రధాన పరీక్షలు మార్చి 26తో పూర్తవుతాయని, అన్ని పరీక్షలు ఏప్రిల్ 1న ముగుస్తాయని తెలిపారు. ప్రధాన పరీక్షల స్పాట్ వాల్యుయేషన్‌ను ఈనెల 28న ప్రారంభిస్తామని, సంస్కృతం పేప రు మూల్యాంకనాన్ని ఈనెల 19 నుంచే మొదలుపెడతామని చెప్పా రు. వీలైనంత త్వరగా ఫలితాలు వెల్లడిస్తామన్నారు. స్పాట్ వాల్యుయేషన్‌లో తప్పులు చేసే వారిపై చర్యలు ఉంటాయని స్పష్టంచేశారు. పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు విద్య, పోలీసు, రెవెన్యూ సిబ్బంది తో 133 ఫ్లైయింగ్ స్క్వాడ్స్, 135 సిట్టింగ్ స్క్వాడ్స్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. బోర్డు నుంచి కూడా సీనియర్ అధికారులు కూడా తనిఖీలు నిర్వహిస్తారని వివరించారు. ప్రథమ సంవత్సర విద్యార్థుల ద్వితీయ భాష పేపరు, ద్వితీయ సంవత్సర విద్యార్థుల మ్యాథ్స్-2ఏ, మ్యాథ్స్-2బీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ, బ్రిడ్జి కోర్సు గణితం విషయంలో ఓల్డ్, న్యూ పేపర్లు ఉన్నాయని.. ప్రశ్నపత్రం తీసుకోగానే సరిగ్గా చూసుకొని పరీక్ష రాయాలని సూచించారు. ఆలస్యంగా వస్తే అనుమతి లేదు... ఇంటర్ పరీక్షలు ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతాయి. విద్యార్థులు పరీక్ష కేంద్రాల వద్దకు ఉదయం 8:30 గంటల కంటే ముందుగానే చేరుకోవాలి. 8:30 గంటల నుంచి 8:45 గంటల వరకు పరీక్ష హాల్లోకి పంపిస్తారు. ఆ తర్వాత కూడా 9 గంటల వరకు విద్యార్థులను అనుమతిస్తారు. అయితే వారు తమ ఆలస్యానికి గల కారణాలు రాతపూర్వకంగా తెలియజేయాలి. ఉదయం 9 గంటల తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా హాల్లోకి అనుమతించరు. సెల్ఫోన్లు, ఎల క్ట్రానిక్ పరికరాలను తీసుకెళ్లకూడదు. ఇన్విజిలేషన్ విధులు నిర్వర్తించే లెక్చరర్లు కూడా ఫోన్లు తీసుకెళ్లడానికి వీల్లేదు. చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ అధికారులకు సెల్‌ఫోన్ అనుమతి ఉన్నా, వారి ఫోన్లపై ట్యాంపింగ్ తరహా నిఘా ఉంటుంది. వారి ఫోన్ల నుంచి ఏయే నంబర్లకు కాల్స్, మెసేజ్‌లు వెళ్లాయనే సమాచారం సేకరిస్తారు. తద్వారా ప్రశ్నలు లీక్ వంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపడతారు. పరీక్ష కేంద్రాల్లో విద్యుత్ సమస్య లేకుండా, విద్యార్థులకు ఆరోగ్య సమస్యలు రాకుండా ప్రథమ చికిత్స అందించే ఏర్పాట్లు చేశారు. విద్యార్థులు పరీక్షకు ముందురోజే తమకు కేటాయించిన కేంద్రానికి వెళ్లి చూసుకోవాలి. ప్రైవేటు యాజమాన్యాలు మాల్ ప్రాక్టీస్, అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు. విద్యార్థులకు హాల్ టికెట్లు నిరాకరించినా, చర్యలు చేపడతారు. హాల్‌టికెట్ సమస్యలు వస్తే జిల్లాల్లో ఆర్ఐఓ కార్యాలయాల్లో, ఇంటర్ బోర్డులో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూంలో 040-24601010 ఫోన్ నంబరు, 040-24655027 నంబరుకు ఫ్యాక్స్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. వెబ్సైట్లో ఇంటర్ హాల్‌టికెట్లు ఈనెల 12 నుంచి నిర్వహించనున్న ఇంటర్ పరీక్షల హాల్‌టికెట్లను తమ వెబ్సైట్లోనూ (ఠీఠీఠీ.ఛజ్ఛ్చీఞ.ఛిజజ.జౌఠి.జీ) అందుబాటులో ఉంచినట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి రామశంకర్ నాయక్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు ఈనెల 11న(మంగళవారం) మధ్యాహ్నం 12 గంటల నుంచి వాటిని డౌన్లోడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. వెబ్సైట్ నుంచి హాల్‌టికెట్‌ను డౌన్లోడ్ చేసుకున్న ఇంటర్ ప్రథమ సంవత్సర విద్యార్థులు తమ పదో తరగతి హాల్‌టికెట్ నంబరు, పుట్టిన తేదీ వివరాలను వెంట తీసుకెళ్లాలి. ద్వితీయ సంవత్సర విద్యార్థులైతే ప్రథమ సంవత్సర హాల్‌టికెట్ నంబరును, పుట్టిన తేదీ వివరాలను తీసుకెళ్లాల్సి ఉంటుంది. అంతే కాకుండా తాము బోర్డు వెబ్సైట్ నుంచి హాల్‌టికెట్‌ను డౌన్లోడ్ చేసుకొని వచ్చినట్లు ఇన్విజిలేటర్‌కు డిక్లరేషన్‌ను ఇవ్వాలని నాయక్ వివరించారు. అందరి అభిప్రాయాల మేరకే మూల్యాంకనం అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం చేయిస్తామని బోర్డు కార్యదర్శి రామశంకర్ నాయక్ తెలిపారు. తెలంగాణ విద్యార్థుల పేపర్లను తెలంగాణలోనే మూల్యాంకనం చేయించాలని కోరుతూ సోమవారం ఇంటర్ బోర్డు కార్యదర్శి కార్యాలయం వద్ద తెలంగాణ లెక్చరర్స్ ఫోరం సభ్యులు నినాదాలు చేశారు. ఎక్కడి పేపర్లను అక్కడే మూల్యాంకనం చేయించాలని కోరుతూ నాయక్‌కు టీఎల్ఎఫ్ కన్వీనర్ వెంకటస్వామి వినతపత్రం అందజేశారు. పరీక్ష కేంద్రాలు: 2,661. వీటిలో సెల్ఫ్ సెంటర్లు 95, సమస్యాత్మక కేంద్రాలు 230 ప్రథమ సంవత్సర విద్యార్థులు (జనరల్) - 8,69,377 (బాలురు-4,45,061, బాలికలు-4,24,316) ప్రథమ సంవత్సర వొకేషనల్ విద్యార్థులు - 59,713 (బాలురు 37,116, బాలికలు 22,597) ద్వితీయ సంవత్సర విద్యార్థులు (రెగ్యులర్) - 8,01,467 (బాలురు - 4,13,123, బాలికలు - 3,88,344) ద్వితీయ సంవత్సర విద్యార్థులు (ప్రైవేటు) - 1,52,669 (బాలురు - 98,233, బాలికలు - 54,446) ద్వితీయ సంవత్సర వొకేషనల్ విద్యార్థులు (రెగ్యులర్) - 76,433 (బాలురు- 40,405, బాలికలు - 36,028) ద్వితీయ సంవత్సర వొకేషనల్ విద్యార్థులు (ప్రైవేటు) - 18720 (బాలురు- 11,387, బాలికలు - 7,333) ఇంటర్ ఆర్ట్స్ గ్రూపుల సిలబస్ మార్పు ఇంటర్మీడియట్ ఆర్ట్స్ గ్రూపుల సిలబస్ మారనుంది. ఈ మేరకు ఇంటర్ విద్య అధికారులు చర్యలు చేపట్టారు. ఇంతకుముందు సైన్స్, మ్యాథ్స్ గ్రూపుల సిలబస్‌ను మార్పు చేసిన అధికారులు.. ఇప్పుడు ఆర్ ్ట్స సిలబస్‌లో మార్పులు చేస్తున్నారు. మొదట ప్రథమ సంవత్సర కోర్సు సిలబస్‌ను మారుస్తున్నారు. వచ్చే ఏడాది ద్వితీయ సంవత్సర కోర్సుల సిల బస్‌ను మారుస్తారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల విభజన నేపథ్యంలో కొన్ని పాఠ్యాంశాల్లో కొద్దిపాటి మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.