గుర్తింపు పొందిన విద్యామండళ్లు | Accredited educational councils | Sakshi
Sakshi News home page

గుర్తింపు పొందిన విద్యామండళ్లు

Published Sat, Nov 22 2014 9:28 PM | Last Updated on Thu, Jul 11 2019 5:23 PM

రాంశంకర్‌ నాయక్ - Sakshi

రాంశంకర్‌ నాయక్

 హైదరాబాద్: దేశంలో గుర్తింపు పొందిన విద్యామండళ్లు జారీ చేసిన ధృవ పత్రాలను మాత్రమే తాము పరిగణనలోకి తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ ఇంటర్‌మీడియట్ విద్యామండలి కార్యదర్శి రాంశంకర్‌నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. కౌన్సిల్ ఆఫ్ బోర్డ్స్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా(సీఓబీఎస్‌ఈ)లో సభ్యత్వం కలిగిన సంస్థలు జారీ చేసే ధృవపత్రాలకు మాత్రమే గుర్తింపు ఉందన్నారు. గుర్తింపు లేని, నకిలీ బోర్డులు, మండళ్లలో చదివే విద్యార్ధులకు జరిగే నష్టంతో తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు. దేశంలో 54 మండళ్లు, సంస్థలు, ఏడు అనుబంధ మండళ్లు, సంస్థలు జారీ చేసే ధృవపత్రాలను  గుర్తిస్తామని చెప్పారు.

 గుర్తింపు పొందిన విద్యామండళ్లు, సంస్థలు ఇవీ..
ఇంటర్‌మీడియట్ విద్యా మండలి(ఆంధ్రప్రదేశ్), బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(ఆంధ్రప్రదేశ్)
ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ (2013-14 విద్యా సంవత్సరానికి మాత్రమే)
 అసోం హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్ కౌన్సిల్
 బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, అసోం
అసోం సాంస్కృత్  బోర్డు
బీహార్ స్కూల్  ఎగ్జామినేషన్ బోర్డు
బీహార్ బోర్డ్ ఆఫ్  ఓపెన్ స్కూలింగ్ అండ్ ఎగ్జామినేషన్
 బీహార్ స్టేట్ మదర్సా ఎడ్యుకేషన్ బోర్డ్
 బీహార్ సాంస్కృత్ శిక్షా బోర్డు
 బనస్థలి విద్యాపీఠ్
 సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్
 ఛత్తీస్‌ఘడ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్
 ఛత్తీస్‌ఘడ్ స్టేట్ ఓపెన్ స్కూల్
ఛత్తీస్‌ఘడ్ సాంస్కృత్ బోర్డు, రాయ్‌పూర్
 ఛత్తీస్‌ఘఢ్ మదర్సా బోర్డు
 కౌన్సిల్ ఫర్ ది ఇండియన్ స్కూల్ +సర్టిఫికెట్ ఎగ్జామినేషన్స్
 దయాల్‌బాగ్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూట్(డీమ్డ్ యూనివర్సిటీ)
 గోవా బోర్డ్ ఆఫ్ సెకండరీ అండ్  హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్
 గుజరాత్ సెకండరీ అండ్ హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డ్
బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ హర్యానా
 హెచ్‌పీ బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్
జమ్ము కాశ్మీర్ బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్
జార్కండ్ అకడమిక్ కౌన్సిల్, రాంచీ
 డిపార్ట్‌మెంట్ ఆఫ్ ప్రి యూనివ ర్శిటీ ఎడ్యుకేషన్, గవర్నమెంట్ ఆఫ్ కర్నాటక
కర్నాటక సెకండరీ ఎడ్యుకేషన్ ఎగ్జామినేషన్ బోర్డు
 కేరళ బోర్డ్ ఆఫ్ పబ్లిక్ ఎగ్జామినేషన్
కేరళ బోర్డ్ ఆఫ్ హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్
మహారాష్ట్ర స్టేట్ బోర్డ్ ఆఫ్ సెకండరీ అండ్ హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్
బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ మధ్యప్రదేశ్
ఎంపీ స్టేట్ ఓపెన్ స్కూల్
మహర్షి పతంజలి సాంస్కృత్ సంస్థాన్
 బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ మణిపూర్
కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్, మణిపూర్
 మేఘాలయ బోర్డ్ ఆఫ్  స్కూల్ ఎడ్యుకేషన్
మిజోరం బోర్డ్ ఆఫ్  స్కూల్ ఎడ్యుకేషన్
నాగాలాండ్ బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్
కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్, ఒడిషా
బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, ఒడిషా
పంజాబ్ స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డ్
బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ , రాజస్థాన్
రాజస్థాన్ స్టేట్ ఓపెన్ స్కూల్, జైపూర్
రాష్ట్రీయ సాంస్కృతి సంస్థాన్
స్టేట్ బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎగ్జామినేషన్ (ఎస్‌ఈసీ) అండ్ బోర్డ్ ఆఫ్ హయ్యర్  సెకండరీ ఎగ్జామినేషన్స్ తమిళనాడు,
త్రిపుర బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్
యూపీ బోర్డ్ ఆఫ్  హైస్కూల్ అండ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్
యూపీ ఎస్‌ఈసీ సాంస్కృతి ఎడ్యుకేషన్ కౌన్సిల్
బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, ఉత్తరాఖండ్
వెస్ట్ బెంగాల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్
వెస్ట్ బెంగాల్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్
వెస్ట్ బెంగాల్ బోర్డ్ ఆఫ్ ప్రైమరీ  ఎడ్యుకేషన్
వెస్ట్ బెంగాల్ బోర్డ్ ఆఫ్ మదర్సా ఎడ్యుకేషన్
వెస్ట్ బెంగాల్ కౌన్సిల్ ఆఫ్ రబీంద్ర ఓపెన్ స్కూలింగ్.

 అనుబంధ మండళ్లు:
 హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డ్, నేపాల్
మారిషస్ ఎగ్జామినేషన్ సిండికేట్
భూటాన్ కౌన్సిల్ ఫర్ స్కూల్ ఎగ్జామినేషన్స్ అండ్ అసెస్‌మెంట్
ది అగాఖాన్ యూనివర్శిటీ ఎగ్జామినేషన్ బోర్డ్, కరాచి
ఇంటర్ బోర్డ్ కమిటీ ఆఫ్ ఛైర్మన్(ఐబీసీసీ) ఇస్లామాబాద్
కేంబ్రిడ్జి ఇంటర్నేషనల్ ఎగ్జామినేషన్స్(యూకే)
ఇంటర్నేషనల్ ఏజెన్సీస్(ఎడ్‌ఎక్సెల్), ఇంటర్నేషనల్ బక్కాల్యూరేట్).        
**

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement