సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సర ఫలితాలు ఈ నెల 22న విడుదల కానున్నాయి. జనరల్, వొకేషనల్ విద్యార్థుల ఫలితాలను ఉదయం 11 గంటలకు ఇంటర్మీడియెట్ బోర్డు కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ప్రకటించనున్నారు. ఫలితాల విడుదల తరువాత విద్యార్థులు తమ మార్కులను/గ్రేడ్లను www.sakshieducation.comతో పాటుwww.examresults.ts.nic.in, www.results.cgg.gov.in వెబ్‌సైట్‌లలో పొందవచ్చు. మార్చిలో 9వ తేదీ నుంచి 27వ తేదీ వరకు ప్రధాన పరీక్షలను నిర్వహించినట్లు ఇంటర్మీడియెట్ బోర్డు కార్యదర్శి డాక్టర్ అశోక్ తెలిపారు. ఈ పరీక్షలకు హాజరయ్యేందుకు మొత్తంగా 9,73,237 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో ప్రథమ సంవత్సర విద్యార్థులు 4,66,448 మంది, ద్వితీయ సంవత్సర విద్యార్థులు 5,06,789 మంది ఉన్నారు. ద్వితీయ సంవత్సర ఫలితాలను ఈ నెల 28న విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఫలితాలను పొందే మరిన్ని సదుపాయాలు..
విద్యార్థులు బీఎస్‌ఎన్‌ఎల్ ల్యాండ్‌ఫోన్ ద్వారా 1100 (పరిష్కారం కాల్ సెంటర్) నంబరుకు, మరే ఇతర ల్యాండ్‌ఫోన్/మొబైల్ ద్వారా 18004251110 నంబరుకు ఫోన్ చేసి పొందవచ్చు. అలాగే ఏపీ ఆన్‌లైన్ కేంద్రాలు, ఈసేవ/మీసేవ/రాజీవ్ సిటిజన్ సర్వీస్ సెంటర్లలోనూ పొందవచ్చు.
ఎస్‌ఎంఎస్ ద్వారా..
బీఎస్‌ఎన్‌ఎల్ వినియోగదారులు ఇంటర్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి రోల్ నంబరు టైప్ చేసి 53346 నంబరుకు ఎస్‌ఎంఎస్ పంపించి ఫలితాలు పొందవచ్చు.
అన్ని రకాల వినియోగదారులు ఇంటర్మీడియెట్ జనరల్ ఫలితాల కోసం ఐపీఈ2 అని టైప్ చేసి (క్యాపిటల్ లెటర్స్) స్పేస్ ఇచ్చి హాల్ టికెట్ నంబరు టైప్ చేసి 54242 నంబరు ఎస్‌ఎంఎస్ పంపించి పొందవచ్చు.
వొకేషనల్ విద్యార్థులు ఐపీఈవీ2 అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి హాల్‌టికెట్ నంబరు టైప్ చేసి 54242 నంబరుకు ఎస్‌ఎంఎస్ చేసి ఫలితాలను పొందవచ్చు.
ఏపీజేఐ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి హాల్‌టికెట్ నంబరు టైప్ చేసి 56767999 నంబరుకు ఎస్‌ఎంఎస్ పంపవచ్చు. ఒక్క హాల్‌టికెట్ నంబరునే టైప్ చేసి 57272 నంబరుకు ఎస్‌ఎంఎస్ పంపొచ్చు. ఎయిర్‌టెల్ వినియోగదారులు ఏపీ12హాల్‌టికెట్ నంబరు టైప్ చేసి 52070 నంబరుకు ఎస్‌ఎంఎస్ పంపించాలి.
అన్ని రకాల వినియోగదారులు ఏపీ12హాల్‌టికెట్ నంబరు టైప్ చేసి 58888 నంబరుకు ఎస్‌ఎంఎస్ పంపించి ఫలితాలు పొందవచ్చు. అలాగే ఐపీఈజీ2 అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి హాల్‌టికెట్ నంబరు టైప్ చేసి 5676750 (జనరల్ విద్యార్థులు) ఎస్‌ఎంఎస్ పంపించాలి. వొకేషనల్ విద్యార్థులు ఐపీఈవీ2 అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి హాల్‌టికె ట్ నంబరు టైప్ చేసి 5676750 ఎస్‌ఎంఎస్ పంపించి ఫలితాలను పొందవచ్చు.