ఈసారి కూడా బాలికలదే హవా..
హైదరాబాద్ : ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరం పరీక్షల ఫలితాల్లో బాలికలే పైచేయిగా నిలిచారు. బాలురు కన్నా బాలికల ఉత్తీర్ణత 16శాతం ఎక్కువగా ఉంది. ఒకేషనల్ కోర్సులో కూడా బాలికలే ప్రథమంగా నిలిచారు. మరోవైపు ఫలితాల్లో 71 శాతంతొ రంగారెడ్డి జిల్లా తొలి స్థానంలో ఉండగా, 43 శాతంతో నల్గొండ జిల్లాలో చివరి స్థానంలో నిలిచింది. ఏప్రిల్ 26 నుంచి మార్కుల జాబితా పొందవచ్చు.