తెలంగాణ ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు విడుదల
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సర ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఈ రోజు ఉదయం 11 గంటలకు ఇంటర్మీడియెట్ బోర్డు కార్యాలయంలో ఫలితాలను విడుదల చేశారు. జనరల్, వొకేషనల్ విద్యార్థులు తమ మార్కులను, గ్రేడ్లను వెబ్సైట్లలో పొందవచ్చు.
4,31,361మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 2,39,954 మంది ఉత్తీర్ణులయ్యారు. 55.62శాతం నమోదు కాగా, బాలికలు 61.68%, బాలురు 49.60% ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ ఫస్టియర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీకి ఫీజు కట్టాల్సిన చివరి తేదీ మే 1. మే 25 నుంచి జూన్ 1 వరకూ ఫస్టియర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. ఇక ఒకేషనల్లో మొత్తం 53.56 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. కాగా కాగా ద్వితీయ సంవత్సర ఫలితాలను ఈ నెల 28న విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.