![Adimulapu Suresh Directed To Set Up High Level Committee On Examination Results - Sakshi](/styles/webp/s3/article_images/2021/06/26/Adimulapu-Suresh1.jpg.webp?itok=xPNahk81)
సాక్షి, అమరావతి: టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు నేపథ్యంలో ఇక ఫలితాల వెల్లడిపై దృష్టి సారించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అధికారులను ఆదేశించారు. శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో మాట్లాడారు. త్వరితగతిన ఉన్నత స్థాయి నిపుణుల కమిటీని ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
వారం రోజుల్లో ఫలితాలు ప్రకటించేలా చూడాలన్నారు. ఇక పాఠశాలలు తెరిచే అంశాన్ని పరిశీలించాలన్నారు. దీనిపై అధికారులు మాట్లాడుతూ వైద్య ఆరోగ్య శాఖ అధికారుల సూచనల మేరకు తేదీ నిర్ణయించాల్సి ఉంటుందన్నారు. 2021-22 అకడమిక్ క్యాలెండర్ తయారు చేసి విద్యాబోధన దిశగా తరగతులు నిర్వహణకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ అంశాలన్నింటిపై కార్యాచరణ రూపొందించాలని అధికారులను మంత్రి సురేష్ ఆదేశించారు.
చదవండి: విద్యాభివృద్ధికి ‘సాల్ట్’ పథకం: మంత్రి ఆదిమూలపు సురేష్
ఏపీ: పంటల రవాణాపై ఆంక్షలు లేవు..
Comments
Please login to add a commentAdd a comment