కల్లూరు మండలం పెద్దపాడు ఏపీ మోడల్ స్కూల్ బాలికల వసతిగృహంలో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ జాస్మిన్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
కల్లూరు (రూరల్): కల్లూరు మండలం పెద్దపాడు ఏపీ మోడల్ స్కూల్ బాలికల వసతిగృహంలో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ జాస్మిన్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విద్యార్థినులు 9, 10, ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం చదువుతున్నవారై ఉండాలని తెలిపారు. దరఖాస్తు ఫారాలు ఏపీ మోడల్ స్కూల్‌లో సోమవారం నుంచి అందజేస్తామని , పూర్తి చేసిన వాటిని 26వ తేదీ బుధవారం సాయంత్రం 4 గంటలలోపు అందజేయాలని పేర్కొన్నారు. మోడల్ స్కూల్ విద్యార్థినులకు మొదటి ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు.