AP Intermediate Academic Calendar For 2023-24 Released - Sakshi
Sakshi News home page

ఏపీ ఇంటర్ అకడమిక్ క్యాలెండర్ విడుదల.. సెలవులు ఇవే

Published Fri, Apr 28 2023 7:36 PM | Last Updated on Fri, Apr 28 2023 7:46 PM

AP Inter Academic Calendar 2023 24 Released - Sakshi

ఏపీలో వేసవి సెలవులు అనంతరం జూన్ 1 నుంచి ఇంటర్ కళాశాలలు ప్రారంభం కానున్నాయి. రాబోయే విద్యా సంవత్సరం 2023-24 అకడమిక్ క్యాలెండర్‌ను ఇంటర్‌ బోర్డు విడుదల చేసింది.

సాక్షి, విజయవాడ: ఏపీలో వేసవి సెలవులు అనంతరం జూన్ 1 నుంచి ఇంటర్ కళాశాలలు ప్రారంభం కానున్నాయి. రాబోయే విద్యా సంవత్సరం 2023-24 అకడమిక్ క్యాలెండర్‌ను ఇంటర్‌ బోర్డు విడుదల చేసింది. వచ్చే విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్‌కి‌ 227 పని దినాలుగా ఇంటర్ బోర్డు నిర్ణయించింది.

జులై 24 నుంచి 26 వరకు యూనిట్-1 పరీక్షలు
ఆగస్ట్ 24 నుంచి 26 వరకు యూనిట్ -2 పరీక్షలు
సెప్టెంబర్ 16 నుంచి 23 వరకు క్వార్టర్లీ పరీక్షలు
అక్టోబర్ 16 నుంచి‌ 18 వరకు యూనిట్ -3 పరీక్షలు
అక్టోబర్ 19 నుంచి 25 వరకు దసరా సెలవులు
నవంర్ 23 నుంచి 25 వరకు యూనిట్ -4 పరీక్షలు

డిసెంబర్ 18 నుంచి 23 వరకు హాఫ్ ఇయర్లీ పరీక్షలు
2024 జనవరి 11 నుంచి 17 వరకు ఇంటర్ కళాశాలలకి వేసవి సెలవులు
2024 ఫిబ్రవరి రెండవ వారంలో ఇంటర్ ప్రాక్టికల్స్
2024 మార్చ్ మొదటి వారంలో ఇంటర్ పరీక్షలు
2024 మార్చ్ 28 చివరి వర్కింగ్ డే
2024 మార్చ్ 29 నుంచి మే 31 వరకు వేసవి సెలవులగా అకడమిక్ క్యాలెండర్ విడుదల
చదవండి: శ్వేత మృతికి కారణం ఏంటంటే..? షాకింగ్‌ విషయాలు వెల్లడించిన సీపీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement