తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల
ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
హైదరాబాద్: విద్యార్థులు ఉత్కంఠతో ఎదురుచూస్తున్న ఇంటర్మీడియెట్ ఫలితాలు శుక్రవారం విడుదల అయ్యాయి. ఈసారి ఇంటర్మీడియెట్ బోర్డు ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాలను ఒకేసారి విడుదల చేసింది. శుక్రవారం ఉదయం 11 గంటలకు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఫలితాలు విడుదల చేశారు. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 4,56,675 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 2,43,503 మంది పాసయ్యారు. వీరిలో బాలికలు 59 శాతం మంది, బాలురు 48 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు.
ద్వితీయ సంవత్సరంలో 4,18,231 మంది పరీక్షలు రాయగా 262,245 మంది పాసయ్యారు. వీరిలో బాలికలు 67.64 శాతం మంది, బాలురు 58 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలలో రంగారెడ్డి జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. ఇంటర్ సప్లమెంటరీ పరీక్షలను మే 24 తేదీ నుంచి 31 వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు ఉప ముఖ్యమంత్రి కడియం తెలిపారు. సప్లమెంటరీ పరీక్షల ఫీజును చెల్లించేందుకు ఏప్రిల్ 30 చివర తేదీగా ప్రకటించారు.
ఫలితాలను వెబ్‌సైట్లతో పాటు కాల్ సెంటర్ ద్వారా కూడా పొందవచ్చు. విద్యార్థులు బీఎస్‌ఎన్‌ఎల్ ల్యాండ్‌ఫోన్ నుంచి 1100 నంబరుకు, లేదా వేరే ఏదైనా ల్యాండ్‌ఫోన్, మొబైల్ నుంచి 18004251110 నంబరుకు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు. ఈ సేవా, మీ సేవ, రాజీవ్ సిటిజన్ సర్వీసు సెంటర్లు, టీఎస్/ఏపీ ఆన్‌లైన్ కేంద్రాల్లోనూ ఫలితాలు పొందవచ్చు.
ఈ వెబ్‌సైట్లలో ఫలితాలు పొందొచ్చు
www.sakshieducation.com
www.sakshi.com
tsbie.cgg.gov.in
http://results.cgg.gov.in
http://examresults.ts.nic.in