నేడు ఇంటర్ ఫలితాలు
ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్న డిప్యూటీ సీఎం
ఒకేసారి ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాలు
సాక్షి, హైదరాబాద్: విద్యార్థులు ఉత్కంఠతో ఎదురుచూస్తున్న ఇంటర్మీడియెట్ ఫలితాలు శుక్రవారం విడుదల కానున్నాయి. ఈసారి ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాలను ఒకేసారి విడుదల చేసేందుకు ఇంటర్మీడియెట్ బోర్డు ఏర్పాట్లు చేసింది. శుక్రవారం ఉదయం 11 గంటలకు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఫలితాలు విడుదల చేస్తారు.
ఇంటర్మీడియెట్ పరీక్షలు గత మార్చి 2వ తేదీ నుంచి 21వ తేదీ వరకు జరిగాయి. వీటికి 9,64,664 మంది (ప్రథమ సంవత్సర విద్యార్థులు-4,56,655, ద్వితీయ సంవత్సర విద్యార్థులు-5,08,009) విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఫలితాలను వెబ్‌సైట్లతో పాటు కాల్ సెంటర్ ద్వారా కూడా పొందవచ్చు. విద్యార్థులు బీఎస్‌ఎన్‌ఎల్ ల్యాండ్‌ఫోన్ నుంచి 1100 నంబరుకు, లేదా వేరే ఏదైనా ల్యాండ్‌ఫోన్, మొబైల్ నుంచి 18004251110 నంబరుకు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు. ఈ సేవా, మీ సేవ, రాజీవ్ సిటిజన్ సర్వీసు సెంటర్లు, టీఎస్/ఏపీ ఆన్‌లైన్ కేంద్రాల్లోనూ ఫలితాలు పొందవచ్చు. ఇక జూనియర్ కాలేజీల ప్రిన్సిపల్స్ తమ కాలేజీ ఫలితాలను యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ ద్వారా http://bietelangana. cgg.gov.in వెబ్‌సైట్ నుంచి పొందవచ్చు.
ఈ వెబ్‌సైట్లలో ఫలితాలు పొందొచ్చు
www.sakshieducation.com
www.sakshi.com
tsbie.cgg.gov.in
http://results.cgg.gov.in
http://examresults.ts.nic.in