జబ్లింగ్ విధానంలోనే ప్రాక్టికల్స్
Published Fri, Feb 3 2017 12:40 AM | Last Updated on Tue, Sep 5 2017 2:44 AM
– నేటి నుంచి ప్రారంభం
కర్నూలు(సిటీ): ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్ పరీక్షల్లో జబ్లింగ్ విధానాన్ని అడ్డుకోవాలని ప్రయత్నించిన కార్పొరేట్‌ల ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఆరేళ్ల తర్వాత ఎట్టకేలకు జబ్లింగ్ విధానంలోనే ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. శుక్రవారం నుంచి ఈనెల 22వరకు జిల్లాలో మొత్తం 93 కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందుకు 20,734 మంది విద్యార్థులు హాజరు కానున్నట్లు బోర్డు అధికారులు తెలిపారు.
Advertisement
Advertisement