practicals
-
తర్ఫీదు ఇవ్వకుంటే చిక్కులే!
సాక్షి, హైదరాబాద్ : ఇంటర్మీడియెట్‌లో కొత్తగా ఈ సంవత్సరం నుంచి ఇంగ్లీష్ సబ్జెక్టులోనూ ప్రయోగ పరీక్షలు నిర్వహించాలని బోర్డు నిర్ణయించినా, ఇందుకు సంబంధించిన సన్నద్ధత ఎక్కడా కన్పించడం లేదు. ముఖ్యంగా ప్రభుత్వ కళాశాలల్లో దీనిపై ఏమాత్రం శ్రద్ధ పెట్టకపోవడం సందేహాలకు తావిస్తోంది. అసలీ సంవత్సరం ఇంగ్లిష్ ప్రాక్టికల్స్ ఉంటాయా? ఉండవా? అనే అనుమానం విద్యార్థులతో పాటు అధ్యాపకుల నుంచీ వ్యక్తమవుతోంది. ఇప్పటివరకు సాధారణ క్లాసులే కొనసాగుతుండటం, ఇంగ్లిష్ ప్రాక్టికల్స్‌పై ఏ విధమైన కసరత్తు ప్రారంభం కాకపోవడం అనుమానాలకు తావిస్తోంది. బోర్డు నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పష్టమైన మార్గదర్శకాలు రాలేదని అధ్యాపకులు అంటున్నారు. మార్చి, ఏప్రిల్‌లో ఇంటర్ పరీక్షలుంటాయని, మొదట్నుంచీ సరైన శిక్షణ లేకుంటే పరీక్షలు ఎలా రాస్తారని కొంతమంది అధ్యాపకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రాక్టికల్స్ విధానంపై విద్యార్థులకు అవగాహన కల్పించడం, మాక్ టెస్టులు నిర్వహించడం అవసరమని వారు అభిప్రాయపడుతున్నారు. దసరా తర్వాత కార్యాచరణ ఈ ఏడాది నుంచే ప్రాక్టికల్స్ ఉంటాయి. ఇందుకు సంబంధించిన కార్యాచరణ రూపొందిస్తున్నాం. దసరా తర్వాత అన్ని స్థాయిల్లోనూ అవగాహన కల్పించేందుకు ప్రయల్పింస్తున్నాం. అధ్యాపకులకూ దీనిపై స్పష్టత వచ్చేలా చేస్తాం. ఇంటర్ ప్రవేశాలు ఇంకా జరుగుతున్న కారణంగా ప్రాక్టికల్స్‌కు సమయం ఉంది. –జయప్రదాభాయ్ (ఇంటర్ పరీక్షల నియంత్రణాధికారి) విధివిధానాలు విడుదలైతే స్పష్టత ఇంగ్లీష్‌లో ప్రాక్టికల్స్ తీసుకురావాలన్న ప్రయోగం మంచిదే. దీనిపై అన్ని స్థాయిల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. విధివిధానాలపై బోర్డు త్వరలో స్పష్టత ఇస్తుందని భావిస్తున్నాం. – మాచర్ల రామకృష్ణగౌడ్ (ప్రభుత్వ జూనియర్ కాలేజీల అధ్యాపకుల సంఘం రాష్ట్ర కన్వీనర్) ఆఖరులో హడావుడితో నష్టం ఆంగ్ల సబ్జెక్టులో 80 మార్కులకు థియరీ పరీక్ష ఉంటుంది. మిగిలిన 20 మార్కులకు ప్రాక్టికల్స్ నిర్వహిస్తారు. విద్యార్థి ఒక నిమిషంలో తనకు నఇంగ్లీష్ న టాపిక్‌లో మాట్లాడటం, రికార్డు రాయడం, విద్యార్థులు ఇంగ్లీష్‌లో ముచ్చటించడం, ఇంగ్లీష్ చదవడం అనే అంశాలు ప్రాక్టికల్స్‌లో ఉంటాయని అధికారులు చెబుతున్నారు. అయితే ఏదైనా అంశం గురించి మాట్లాడటం అనే దానిపై తరగతి గదిలో తర్ఫీదు అవ్వాల్సి ఉంటుందని అధ్యాపకులు అంటున్నారు. లేనిపక్షంలో అప్పటికప్పుడు ఏదో ఒక టాపిక్‌పై బట్టీ పట్టి వచ్చే అవకాశం ఉంటుందని, అందువల్ల ప్రయోజనం ఏమిటని ప్రన్పిస్తున్నారు. విద్యార్థులకు ఇంగ్లీష్‌పై పట్టు పెరగాలంటే విద్యార్థులు పరస్పరం ఇంగ్లీష్‌లో సంభాషించుకోవడం ముఖ్యం. ఈ ఉద్దేశంతోనే దాన్ని ప్రాక్టికల్స్‌లో చేర్చారు. మరికొద్ది నెలల్లో పరీక్షలు జరగనుండగా ఇప్పటికీ ఈ తరహా ప్రయోగాలు కాలేజీల్లో జరగడం లేదు. రికార్డుల విషయంలోనూ ఇదే నిర్లక్ష్యం కొనసాగుతోంది. తీరా పరీక్షల ముందు హడావుడి చేస్తే విద్యార్థులు నష్టపోయే ప్రమాదం ఉందన్న విమర్శలు విన్పిస్తున్నాయి. మరోవైపు చాలావరకు ప్రైవేటు కాలేజీల్లో ఇప్పటికే సిలబస్ మొత్తం పూర్తయి రివిజన్‌కు వెళ్తున్నారు. ఇంగ్లీష్ సబ్జెక్టులో ప్రాక్టికల్స్‌పైనా విద్యార్థులకు శిక్షణ నడుస్తోందని తల్లిదండ్రులు చెబుతున్నారు. -
ఇంటర్ ఆంగ్లంలోనూ ప్రాక్టికల్స్
సాక్షి, హైదరాబాద్: ఇప్పటివరకు ఇంటర్మీడియె ట్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీల్లోనే ప్రాక్టి కల్స్ పరీక్షలు ఉండగా ఈ ఏడాది నుంచి కొత్తగా ఆంగ్లం సబ్జెక్టులోనూ ప్రాక్టికల్స్ పరీక్షలు ఉండబో తున్నాయి. మొత్తం నాలుగు విభాగాలుగా ప్రాక్టి కల్స్ను విడగొట్టి ఒక్కో విభాగానికి 4 మార్కులు చొప్పన కేటాయించనున్నారు. దీంతోపాటే మొద ట్నుంచీ క్లాస్‌వర్క్ మాదిరి రికార్డు రాయడాన్ని చేర్చనున్నారు. దీనికి కూడా 4 మార్కులు ఇవ్వను న్నారు. మొత్తం 20 మార్కులకు ప్రాక్టికల్స్ ఉంటా యి. ఇందులో విద్యార్థులు కనీసం 7 మార్కులు తెచ్చుకోవాలి. థియరీని 80 మార్కులకు నిర్వహించనుండగా అందులో కనీసం 28 మార్కులు రావా లి. ఈ ఏడాది ఇంటర్ ప్రథమ సంవత్సరంలోనే ప్రాక్టికల్స్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఇందుకోసం ఇ ప్పటికే కసరత్తు చేపట్టిన ఇంటర్ బోర్డు... నిపుణుల చేత ఆంగ్ల ప్రాక్టికల్ విధానంపై వివరాలను క్రోడీ కరించి ముఖ్య విషయాలను పరిగణనలోకి తీసు కుంది. ఆంగ్ల భాష కీలకమైనది కావడం, ఇంటర్ పూర్తయినా విద్యార్థులకు దీనిపై పట్టులేకపోవడంతో ప్రాక్టికల్స్‌ను అనివార్యంగా భావిస్తోంది. కేంద్ర, రాష్ట్ర అధ్యయనాలు సైతం ఇంటర్ విద్యార్థులు ఆంగ్లంపై పట్టు సాధించాలని చెబుతుండటం, విదేశీ విద్యకు వెళ్లేందుకూ ఆంగ్లంపై పట్టు అనివార్యం కావడంతో ఈ దిశగా చర్యలు చేపట్టింది. కాలేజీలకు సూచనలు... ఆంగ్ల సబ్జెక్టులో ప్రాక్టికల్స్ విధానంపై క్షేత్రస్థాయిలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకొనేందుకు ఇంటర్ బోర్డు సిద్ధమవుతోంది. పరీక్షలకు కావల్సిన సమయం ఉన్నప్పటికీ బోధన సమయంలోనే విద్యార్థులను సిద్ధం చేయాలని అధికారులు భావిస్తున్నారు. ప్రాక్టి కల్స్ ఆవశ్యకత, సన్నద్ధత ఎలా ఉండాలనే దానిపై ప్రతి కాలేజీలోనూ అవగాహన కల్పించాలని ప్రభు త్వ, ప్రైవేటు కాలేజీలను ఉన్నతాధికారులు ఆదేశించారు. ప్రధానంగా కమ్యూనికేషన్ స్కిల్స్‌కు ప్రా ధాన్యం ఇవ్వాలని సూచిస్తున్నారు. తరగతి గదిలో పరస్పర సంభాషణలు, ఏదైనా అంశంపై మాట్లా డించే పద్ధతిని అనుసరించాలని సూచించారు. వారానికి ఒక గంటపాటు ఈ తరహా కసరత్తు చేయాలని పేర్కొన్నారు. ఆంగ్లంలో ధారాళంగా చదవడం, రాయడం కూడా అభివృద్ధి చేయాల న్నారు. దీంతోపాటే స్పెల్లింగ్లపైనా పట్టు సాధించేలా ప్రోత్సహించాలని, ఆంగ్ల దినపత్రికలను చదవడం ద్వారా దీన్ని పెంచాలని భావిస్తున్నారు. కోవిడ్ దెబ్బతో సాధ్యమా? ఇంగ్లిష్ సబ్జెక్టులో ప్రాక్టికల్స్ నిర్వహణ సాధ్యా సాధ్యాలపై అధ్యాపకుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. గత రెండేళ్లుగా టెన్త్‌లో కోవిడ్ ప్రభావం కన్పిస్తోంది. లెర్నింగ్ లాస్ ఎక్కువగా ఉందని విద్యాశాఖ సైతం పేర్కొంది. ముఖ్యంగా ఆంగ్ల భాషలో గ్రామర్, స్పెల్లింగ్లపై విద్యార్థులు సరైన స్థాయిలో పట్టు సాధించలేదనే భావన సర్వత్రా వ్యక్తమవుతోంది. ఇంటర్ ప్రాక్టికల్స్‌లోకి తీసుకొనే అంశాలన్నీ గ్రామర్‌తో ముడివడి ఉన్నాయి. గ్రామర్‌లో బేసిక్స్ లేకుండా సరైన కమ్యూనికేషన్ స్కిల్స్‌ను గుర్తించడం కష్టమని అధ్యాపకులు అంటున్నారు. రోల్ ప్లే, లిజనింగ్ కాంప్రహెన్షన్లోనూ విద్యార్థులు వెనుకబడొచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేక శిక్షణ ఇస్తాం ఇంగ్లిష్ సబ్జెక్టులో ప్రాక్టికల్స్ నిర్వహణపై రాష్ట్ర వ్యాప్తంగా శిక్షణ ఇస్తాం. ఇంటర్ అడ్మిషన్లు పూర్తయ్యాక ప్రతి జిల్లాలోనూ సబ్జెక్టు లెక్చరర్లకు ప్రత్యేక శిక్షణ నిర్వహిస్తాం. విద్యార్థులను అన్ని విధాలా సిద్ధం చేయడం దీని ముఖ్యోద్దేశం. ప్రాక్టికల్స్ కొత్తగా చేపడుతున్నా విద్యార్థులను మానసికంగా సిద్ధం చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటాం. – జయప్రదాబాయ్, ఇంటర్ పరీక్షల విభాగం ముఖ్య అధికారి -
విద్యాలయాలుగా ఆర్బీకేలు
సాక్షి, అమరావతి : అన్నదాతలకు విత్తు నుంచి విక్రయం వరకు గ్రామస్థాయిలో సేవలందిస్తున్న వైఎస్సార్ రైతుభరోసా కేంద్రాలు (ఆర్బీకే) యూనివర్సిటీల్లో పాఠ్యాంశమయ్యాయి. వ్యవసాయ, ఉద్యాన, మత్స్య, వెటర్నరీ, కళాశాల విద్యార్థులకు ప్రాక్టికల్ తరగతులుగా కూడా మారాయి. యూనివర్సిటీలు, అనుబంధ, ప్రైవేటు కళాశాలల్లో డిగ్రీ చదివే విద్యార్థులు ఇక నుంచి విధిగా ఆర్బీకేల్లో ఇంటర్న్‌షి ప్ నిర్వహించేలా మార్పుచేశారు. ఇప్పటికే వ్యవసాయ, ఉద్యాన, వెటర్నరీ విద్యార్థులు ఇందుకు శ్రీకారం చుట్టగా, మత్స్య యూనివర్సిటీ వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. విజ్ఞాన భాండాగారాలుగా ఆర్బీకేలు.. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటుచేసిన ఈ ఆర్బీకేలు రెండున్నరేళ్లుగా రైతులకు విశేష సేవలందిస్తూ అంతర్జాతీయ మన్ననలు అందుకుంటున్నాయి. రాష్ట్రంలో సచివాలయాలకు అనుబంధంగా మొత్తం 10,778 ఆర్బీకేలను ఏర్పాటుచేశారు. వన్‌స్టాప్ సెంటర్‌గా వీటిని తీర్చిదిద్దారు. బుక్ చేసుకున్న 24 గంటల్లోనే సబ్సిడీ, నాన్ సబ్సిడీ విత్తనాలు, పురుగుల మందులతోపాటు ఎరువులను రైతు ముంగిటకు సరఫరా చేస్తున్నారు. వీటికి అనుబంధంగా ఏర్పాటుచేసిన వైఎస్సార్ యంత్ర సేవా కేంద్రాల ద్వారా అద్దెకు సాగు యంత్రాలనూ అందుబాటులోకి తెచ్చారు. అలాగే, ఆర్బీకేల్లో ఏర్పాటుచేసిన కియోస్‌్కలు, డిజిటల్, స్మార్ట్ గ్రంథాలయాల ద్వారా అంతర్జాతీయంగా వస్తున్న ఆధునిక పోకడలు, మెళకువలను మారుమూల రైతులకు అందిస్తూ వాటిని నాలెడ్జ్ హబ్‌లుగా తీర్చిదిద్దారు. ఇక వీటిల్లో ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా పండించిన పంట ఉత్పత్తులను కళ్లాల వద్దే కొనుగోలు చేస్తున్నారు. ఇలా రెండున్నరేళ్లలో రెండు కోట్ల మందికి పైగా రైతులు వీటి ద్వారా సేవలందుకున్నారు. వీటి గురించి తెలుసుకున్న కేంద్రం సహా పలు రాష్ట్రాలు ఏపీ బాట పట్టగా, పలు దేశాల ప్రతినిధులూ ఇక్కడికొచ్చి వీటిపై అధ్యయనం చేశారు. ఈ కేంద్రాల్లో ఇంటర్న్‌షిప్ సాధారణంగా.. మెడికోలకు బోధనాస్పత్రుల్లోనూ, ఇంజనీరింగ్, పాలిటెక్నిక్ విద్యార్థులకు సంబంధిత పరిశ్రమల్లోనూ చివరి ఏడాది ఇంటర్న్‌షి ప్ ఉంటుంది. అదేరీతిలో వ్యవసాయ వర్సిటీ విద్యార్థులను జిల్లా కేంద్రాల్లో ఉండే డాట్ సెంటర్లకు, మిగిలిన వర్సిటీలు రీసెర్చ్ స్టేషన్, కేవీకేలకు అటాచ్ చేసేవారు. వాటి పరిధిలో ఓ వారం పదిరోజుల పాటు విద్యార్థులు స్టడీ చేసేవారు. ప్రస్తుతం ఆర్బీకేలు కేంద్రంగా ఇంటర్న్‌షిప్ నిర్వహించేలా ప్రభుత్వం కార్యాచరణ సిద్ధంచేసింది. ఉద్యాన విద్యార్థులకు ఆర్నెల్లు, వ్యవసాయ విద్యార్థులకు మూడు నెలలు, వెటర్నరీ విద్యార్థులకు నెలరోజుల చొప్పున ఇంటర్న్‌షి ప్ నిర్వహించేలా ఆయా యూనివర్సిటీ వీసీలు ఇప్పటికే ఆదేశాలు జారీచేశారు. అలాగే, వచ్చే విద్యా సంవత్సరం నుంచి కనీసం 20 నుంచి నెలరోజులపాటు ఇంటర్న్‌షి ప్ ఉండేలా మత్స్య యూనివర్సిటీ కూడా షెడ్యూల్ రూపొందిస్తోంది. ఇప్పటికే వ్యవసాయ, ఉద్యాన, వెటర్నరీ వర్సిటీల్లో ఈ ఇంటర్న్‌షి ప్‌కు శ్రీకారం చుట్టారు. ఆర్బీకేల్లో ఇన్ఫర్మేషన్ కార్నర్ ఇక ఇంటర్న్‌షి ప్ కోసం ఆర్బీకేల్లో ఇన్ఫర్మేషన్ కార్నర్‌ను ఏర్పాటుచేశారు. రీసెర్చ్, ఎక్స్టెన్షన్ సెంటర్ల శాస్త్రవేత్తలతో పాటు స్థానిక అధికారులు, ఆర్బీకే సిబ్బందితో అనుసంధానం చేశారు. ప్రతీరోజు ఆర్బీకేలను విజిట్ చేస్తూ వాటి ద్వారా అందిస్తున్న సేవలను పరిశీలించేలా షెడ్యూల్ రూపొందించారు. ప్రధానంగా ఇన్పుట్స్ సరఫరా, కియోస్‌్కల పనితీరు, వాతావరణ సమాచారం, నాలెడ్జ్ షేరింగ్, ఈ–క్రాప్ బుకింగ్, మార్కెట్ ఇంటెలిజెన్స్ సరీ్వస్, కొనుగోలు తీరు, ఆర్బీకే సిబ్బంది, బ్యాంక్ మిత్రల సేవలు, పశువులకు వ్యాక్సినేషన్, హెల్త్‌కార్డుల జారీ, సీహెచ్‌సీలు, పొలంబడులు, తోటబడులు, పశు విజ్ఞాన బడులు, వ్యవసాయ సలహా మండళ్ల పనితీరు, ఎఫ్పీఓలు, జేఎల్‌జీ గ్రూపుల పనితీరుతో పాటు పంటల బీమా, రైతుభరోసా, సున్నా వడ్డీ పంటల రుణాలు వంటి పథకాల అమలు తీరుతో పాటు క్షేత్రస్థాయి పరిశీలనలో గుర్తించిన అంశాలపై ప్రాజెక్టు రిపోర్టు సమరి్పంచాల్సి ఉంటుంది. ఈ మొత్తంపై విద్యార్థుల అధ్యయనాన్ని అంచనా వేస్తూ 5–10 మార్కుల వరకు ఇస్తారు. తరగతి గదుల్లో ఆర్బీకేల గురించి.. ఈ నేపథ్యంలో.. రైతులకు అన్ని విధాలుగా అండదండలందిస్తూ వ్యవసాయ, అనుబంధ రంగాలకు వెన్నుదన్నుగా నిలుస్తున్న ఆర్బీకేల అంశాన్ని వ్యవసాయ, ఉద్యాన, వెటర్నరీ యూనివర్సీటీల్లో పాఠ్యాంశంగా చేర్చారు. గ్రామీణ ఆరి్థక వ్యవస్థ రూపురేఖలు మారుస్తున్న వీటిæ గురించి తరగతి గదుల్లో బోధిస్తున్నారు. సచివాలయాలకు అనుబంధంగా ఆర్బీకేలు ఎందుకు ఏర్పాటుచేయాల్సి వచ్చింది? వాటి ఆవశ్యకత, లక్ష్యాలు, వాటి ద్వారా గ్రామస్థాయిలో వ్యవసాయ, అనుబంధ రంగాలకు అందిస్తున్న సేవలు, రైతుల జీవితాల్లో ఆర్బీకేలు ఎలాంటి మార్పును తీసుకొచ్చాయి.. ఇతర రాష్ట్రాలు, దేశాలు ఆర్బీకేలను ఎందుకు ఆదర్శంగా తీసుకుంటున్నాయి వంటి అంశాలను పాఠ్యాంశాల్లో చేర్చారు. ఆర్బీకేల ద్వారా ఎంతో నేర్చుకుంటున్నాం నేను బీఎస్సీ హానర్స్ ఫైనల్ ఇయిర్ చదువుతున్నా. నాతో పాటు మరో ఆరుగురు విద్యార్థులు తూర్పు గోదావరి జిల్లా నల్లజర్ల మండలం సింగరాజుపాలెం ఆర్బీకే పరిధిలో ఇంటర్న్‌షి ప్ చేస్తున్నాం. ఆర్బీకేల పనితీరు.. అందిస్తున్న సేవలను పరిశీలిస్తున్నాం. రోజూ ఫీల్డ్ విజిట్స్ చేస్తున్నాం. సాయంత్రం పూట రైతులతో భేటీ అవుతూ వారి సమస్యలకు సలహాలు, సూచనలిస్తున్నాం. – దాసరి షీలా జయశ్రీ, పార్వతీపురం ఉద్యాన కళాశాల విద్యార్థిని ఆర్బీకేల గురించి కాలేజీలో ఎంతో చెప్పారు నేను బ్యాచురల్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ చదువుతున్నా. ఏప్రిల్ నుంచి ఇంటర్న్‌షి ప్‌కు వెళ్లబోతున్నాం. ఈసారి ఇంటర్న్‌షి ప్లో ఆర్బీకేల విజిట్‌ను కూడా చేర్చారు. కాలేజిలో కూడా వాటి కోసం ఎంతో చెప్పారు. ఇంటర్న్‌షిప్‌లో వాటి పనితీరుపై ప్రత్యక్షంగా స్టడీ చేస్తాం. – భూక్యాసాయి, కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్, తిరుపతి సుశిక్షితులుగా తీర్చిదిద్దడమే లక్ష్యం విద్యాబోధన తరగతి గదులకే పరిమితం కాకూడదు. వారు నేర్చుకున్న పాఠాలు.. క్షేత్రస్థాయిలో పరిస్థితులపైనా అవగాహన పెంపొందించుకోవాలి. యూనివర్సిటీ నుంచి బయటకొచ్చేసరికి పరిశోధనలు చేసేలా విద్యార్థులను తీర్చిదిద్దడమే లక్ష్యం. అందుకే ఆర్బీకేల్లో ఇంటర్న్‌షి ప్ నిర్వహిస్తున్నాం. – డా.ఆదాల విష్ణువర్థన్‌రెడ్డి, వీసీ, ఏపీ ఎన్జీ రంగా వ్యవసాయ వర్సిటీ ఆర్బీకేలను పాఠ్యాంశంగా చేర్చాం ప్రస్తుత విద్యాసంవత్సరం నుంచి ఆర్బీకేలను పాఠ్యాంశంగా చేర్చాం. ఆర్బీకేలు కేంద్రంగా ఇంటర్న్‌షి ప్‌కు శ్రీకారం చుట్టాం. దాదాపు ఆర్నెల్ల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది. కనీసం ఐదు నుంచి ఆరుగురు చొప్పున ఒక్కో ఆర్బీకేకు అటాచ్ చేశాం. – డాక్టర్ టి.జానకీరామ్, వీసీ, డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం -
ఇంటర్ ప్రాక్టికల్స్ వాయిదా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు వాయిదా పడే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఏప్రిల్ 7 నుంచి ప్రాక్టికల్ పరీక్షలు జరగనున్నా.. విద్యాసంస్థల మూసివేత కారణంగా ఎలా ముందుకు వెళ్లాలో అర్థం కాని స్థితిలో ఇంటర్మీడియట్ బోర్డు ఉంది. ఫిబ్రవరి 1 నుంచి కాలేజీల్లో ప్రత్యక్ష బోధన ప్రారంభమైనా కరోనా కేసులు పెరుగుతుండటంతో మార్చి 24 నుంచి మళ్లీ ప్రత్యక్ష బోధనను ప్రభుత్వం నిలిపేసింది. ముంద స్తు షెడ్యూలు ప్రకారం ఏప్రిల్ 7 నుంచి 20 వరకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. అయితే ఇప్పుడు ప్రభుత్వం విద్యాసంస్థలను మూసేసినందున ఎలా ముందుకు వెళ్లాలన్న విషయంలో 3 ప్రత్యామ్నాయాలను రూపొందించి ప్రభుత్వానికి పంపింది. అందులో యథావిధిగా ప్రాక్టికల్స్ నిర్వహణకు అనుమతించడం, లేదంటే ఏప్రిల్ 10 వర కు వాయిదా వేయడం, అదీ కుదరకపోతే మేలో ఇం టర్ పరీక్షలు, జేఈఈ మెయిన్ పరీక్షలు పూర్తయ్యా క ప్రాక్టికల్స్ నిర్వహించడం వంటి 3 ప్రత్యామ్నా యాలను పేర్కొన్నట్లు తెలిసింది. మరోవైపు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాక్టికల్స్ నిర్వహించాల్సిందేనని, ప్రాక్టికల్ పరీక్షలు లేకుండా మార్కులు వేయ డం సాధ్యం కాదన్న భావనను వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రాక్టికల్ పరీక్షల వాయిదా వైపే మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ప్రాక్టికల్ ఏప్రిల్ 7 నుంచి నిర్వ హించినా, 10 నుంచి నిర్వహించినా పెద్ద తేడా ఏ మీ ఉండదు. అందుకే ప్రాక్టికల్స్‌ను మే నెలాఖరు కు వాయిదా వేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం ప్రాక్టికల్స్‌కు బదులు మరేమైనా ప్రత్యామ్నాయాలు ఉన్నాయా? ఇంటర్నల్ అసైన్మెంట్స్ ఇచ్చి వాటినే ప్రాక్టికల్ మార్కులుగా పరిగణనలోకి తీసుకుంటే ఎలా ఉంటుందనే కోణంలో యోచిస్తు్తన్నట్లు తెలిసింది. ఏదేమైనా రెండు మూడ్రోజుల్లో ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణపై స్పష్టత రానుంది. ఆందోళనలో 2,62,169 మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలకు హాజరు కావాల్సిన సైన్స్ కోర్సులకు చెందిన ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 2,62,169 మంది ఉన్నట్లు ఇంటర్ బోర్డు లెక్కలు వేసింది. వొకేషనల్ ప్రథమ సంవత్సర విద్యార్థులు 48,026 మంది, వొకేషనల్ ద్వితీయ సంవత్సర విద్యార్థులు 40,287 మంది, జాగ్రఫీ విద్యార్థులు 557 మంది ప్రాక్టికల్స్‌కు హాజరు కావాల్సి ఉంది. మరోవైపు ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరయ్యేందుకు ప్రథమ సంవత్సర విద్యార్థులు 4,58,814 మంది, ద్వితీయ సంవత్సర విద్యార్థులు 4,73,523 మంది పరీక్ష ఫీజు చెల్లించినట్లు బోర్డు వర్గాలు వెల్లడించాయి. -
ఐలవ్యూ అంటే ఐలవ్యూ..!
కార్తీక్ ఆమెను మళ్లీ చూశాడు. ఆరోజు ఒక పెళ్లిలో చూసినప్పట్నుంచీ ఆమె గురించే ఆలోచిస్తున్నాడతను. ఆమె మళ్లీ కనిపించదన్న ఆలోచనే అతనికి ఎలాగో ఉండింది ఇన్నాళ్లూ. ఇప్పుడామె మళ్లీ కనిపించింది. కార్తీక్ ఉన్న లోకల్ ట్రైన్‌కి ఆపోజిట్ డైరెక్షన్లో వెళుతోన్న ట్రైన్లో ఆమె కనిపించింది. ఆమె కార్తీక్‌నే చూస్తోంది. కార్తీక్ ఆమెనుండి చూపు తిప్పుకోలేకపోయాడు. కొన్ని క్షణాల్లో ఆ రైళ్లు వాటి వాటి దిశల్లో ముందుకెళ్లిపోయాయి. ఇద్దరూ దూరమైపోయారు. కార్తీక్ ఫ్రెండ్స్‌తో మీటింగ్ పెట్టాడు. ‘‘ఆమె ఎక్కడుంటుందో ఎలాగైనా కనిపెట్టి తీరాలి!’’ అన్నాడు వాళ్లతో. ఆమె మెడిసిన్ స్టూడెంట్ అన్న విషయం, లోకల్ ట్రైన్లో ప్రయాణిస్తుందన్న విషయం తప్ప వాళ్లకు ఇంకేం తెలీదు. కానీ కనిపెట్టారు. ఆ వెంటనే కార్తీక్ ఆమె వెంటపడడాన్ని డైలీ రొటీన్‌గా మార్చేసుకున్నాడు. ఆమె రైలెక్కే ప్లేస్, ఇల్లు.. అన్నీ రౌండ్లు వేయడం మొదలుపెట్టాడు. ఆమెకూ ఇవన్నీ కొత్తగానే ఉన్నాయి. ఒకవిధంగా కార్తీక్ అలా వెంటపడ్డాన్ని ఆమె ఎంజాయ్ చేస్తోంది కూడా! ఒకరోజు ఆమె రైల్లో కాలేజీకి వెళుతోంటే, ఆమెకు దగ్గరగా వెళ్లి నిలబడ్డాడు కార్తీక్. ఈ ఐదారు రోజుల్లో అతనామెకు అంత దగ్గరగా వెళ్లడం అదే మొదటిసారి. ఆమె చేతిలో ఉన్న ఒక పుస్తకాన్ని లాక్కొని అందులో పేరు చూశాడు. ‘‘శాంతి..!’’ అన్నాడు నవ్వుతూ. శాంతి ఏం మాట్లాడలేదు. ‘‘నువ్వంటే నాకిష్టం లేదు. నీమీద ఆశ పడటం లేదు. నువ్వు అందగత్తెవు అనుకోవడం లేదు. కానీ ఇవన్నీ జరుగుతాయేమో అని నాకు భయంగా ఉంది. ఆలోచించి చెప్పు..’’ రైలు కొంచెం కొంచెం కదులుతూ ఉంటే, చెప్పాలనుకున్నదంతా చెప్పేసి అక్కణ్నుంచి పరిగెత్తుకుంటూ వెళ్లిపోయాడు కార్తీక్. రైలు కూడా వేగమందుకొని ప్లాట్‌ఫామ్ దాటేసింది. శాంతి సిగ్గుపడుతూ నవ్వింది. తర్వాతిరోజు శాంతి చదువుతున్న కాలేజీకి వెళ్లాడు కార్తీక్. ‘ఇక్కడ కూడా వచ్చిపడ్డాడు..’ అనుకుంటూ శాంతి అతనికి దగ్గరగా వెళ్లింది. అతణ్ని సమీపిస్తున్నా కొద్దీ అంతకంతకూ పెరిగిపోతోన్న సిగ్గుతో ‘‘పేరేంటీ?’’ అనడిగింది. ‘‘కార్తీక్..’’శాంతి కార్తీక్ వైపు నవ్వుతూ చూసి, ‘‘కార్తీక్! నువ్వు డబ్బున్నవాడివా? క్లాస్‌లో లాస్టా? ఎక్కువసార్లు ఫెయిలవుతావా? ఎందుకంటే డబ్బున్న వాళ్లే బుద్ధిలేకుండా అన్నీ వదిలేసి ఇలా అమ్మాయిల వెంటపడుతుంటారు..’’ అని తిరిగి వెళ్లిపోతూంటే, ‘‘ఏయ్!’’ అన్నాడు కార్తీక్. శాంతి చిన్నగా నవ్వింది, ఆ పిలుపుకి వెనక్కి తిరుగుతూ. ‘‘హేయ్! తను నన్ను చూసి నవ్విందీ..’’ అంటూ గట్టిగా అరుస్తూ ఆ రోజంతా శాంతి పేరే తల్చుకుంటూ కూర్చున్నాడు కార్తీక్. శాంతి ఫోన్ నంబర్ కనుక్కున్నాడు కార్తీక్. ఫోన్ చేశాడు. శాంతి ఫోన్ ఎత్తింది. ‘‘హలో ఎవరూ?’’ ‘‘హలో!’’ అన్నాడు కార్తీక్. ‘‘ఏయ్! నంబర్ ఎలా తెలిసిందీ?’’ ‘‘నీకో విషయం చెప్పాలని ఫోన్ చేశాను.’’‘‘పొయ్యి మీద చారు పెట్టొచ్చాను. రేపు ప్రాక్టికల్స్. అమ్మ ఇప్పుడే ఇంటికొచ్చింది. ఫర్వాలేదు.. ఓపిగ్గా వింటాను. చెప్పేంటి విషయం?’’ ‘‘ఆ! రేపు మా ఇంట్లో ఫంక్షన్.’’‘‘అయితే?’’‘‘అందుకని నువ్వు రావాలి..’’ ‘‘నేనా? ఎందుకు?’’ ‘‘ఇలా చూడూ! నేన్నిన్ను బీచ్‌కు రమ్మనలేదు. సినిమాకు రమ్మనలేదు. పార్క్‌కు రమ్మనలేదు. ఇంటికేగా రమ్మందీ..’’‘‘నేనెందుకు రావడం?’’ ‘‘నువ్విక్కడికి రాకపోతే, నేనే అక్కడికి వస్తాను. చక్కగా చీర కట్టుకొని రా..’’ తను చెప్పాలనుకున్నదంతా చెప్తూ, అడ్రెస్ కూడా చెప్పేసి ఫోన్ కట్ చేశాడు కార్తీక్. శాంతి చెప్తున్నదేదీ అతను వినిపించుకోలేదు. కార్తీక్ ఇంట్లో ఫంక్షన్. ‘నేనేందుకు రావాలి?’ అన్న శాంతి కూడా ఆ ఫంక్షన్‌కు వచ్చింది. ఇల్లంతా కార్తీక్ చుట్టాలు. ‘‘ఎవర్రా ఆ అమ్మాయి?’’ కార్తీక్‌ను అడిగింది వాళ్లమ్మ. ‘‘తనే నేను పెళ్లిచేసుకోబోయే అమ్మాయి..’’ అన్నాడు కార్తీక్. ఆ మాట కార్తీక్ వాళ్లమ్మతో పాటు అక్కడున్న ఇంకో ఇద్దరు విన్నారు. వెంటనే ‘ఆ అమ్మాయినే అంట.. కార్తీక్ పెళ్లి చేసుకునేది.’ ఇల్లంతా పాకింది ఈ మాట. ఫంక్షన్ అయిపోయింది. శాంతి తిరిగి రైల్లో ఇంటికి వెళ్లిపోతోంది. కార్తీక్ కూడా ఆమెతో పాటే ఉన్నాడు. ‘‘అసలు నువ్వెందుకలా అన్నావ్?’’ అడిగింది శాంతి. ‘‘నువ్వు పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నావని అన్లేదే? నేను ఆశపడుతున్నా అన్నాను. అది నిజమేగా!’’ ‘‘నన్నొక మాట అడగొచ్చుగా?’’ ‘‘సరే! ఇప్పుడడుగుతా..’’‘‘వద్దు..’’‘‘ఏయ్! అడక్కుండా చెప్తే కోప్పడతావ్. అడుగుతానంటే వద్దంటావ్?’’‘‘ఏమిటిది పెళ్లీ గిల్లీ అనీ..’’ కార్తీక్ శాంతి చెయ్యి పట్టుకొని ఆమెను దగ్గరకు లాక్కున్నాడు. ‘‘ఏయ్! చెప్పనా..?’’‘‘ఏంటి?’’‘‘ఐలవ్యూ..’’‘‘అంటే..? దానర్థమేమిటీ?’’‘‘ఐలవ్యూ అంటే ఐలవ్యూ..’’ ‘‘ఇప్పుడీ ప్రేమా గీమా అవసరమా?’’‘‘తెలీదు. కానీ ఐ లవ్యూ..’’ కార్తీక్ శాంతికి ఈమాట చెప్పిన కొన్ని రోజులకు వాళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఇద్దరూ ఆశపడి. -
జూన్ 2నుంచి ప్రాక్టీకల్ పరీక్షలు
కర్నూలు సిటీ: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ తృతీయ సంవత్సర డిగ్రీ సైన్స్ విద్యార్థులకు జూన్ 2నుంచి ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నట్లు యూనివర్సిటీ రీజినల్ డైరెక్టర్ అజంతకుమార్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జువాలజీ 2నుంచి 4వ తేదీ వరకు, కెమిస్ట్రీ 4నుంచి 6 వరకు, ఫిజిక్స్ 7నుంచి 9వరకు, బోటని 10నుంచి 11వ తేదీ వరకు ప్రాక్టికల్ పరీక్షలు జరుగనున్నాయన్నారు. -
25 నుంచి ‘ఓపెన్’ విద్యార్థులకు ప్రాక్టికల్స్
అనంతపురం రూరల్ : అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం బీఎస్సీ డిగ్రీ మూడవ సంవత్సరం విద్యార్థులకు ఈ నెల 25 నుంచి ఆర్ట్స్ కళాశాలలో ప్రాక్టికల్స్ నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ రంగస్వామి ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 25 నుంచి మార్చి 2 వరకు జూవాలజీ, మార్చి3 నుంచి 8 వరకు బోటనీ, మార్చి 9 నుంచి 14 వరకు కెమెస్ట్రీ, మార్చి15 నుంచి 20వరకు ఫిజిక్స్ ప్రాక్టికల్స్ ప్రతి రోజు ఉదయం 7 గంటల నుంచి మద్యాహ్నం ఒంటిగంట వరకు ఉంటాయన్నారు. -
జబ్లింగ్ విధానంలోనే ప్రాక్టికల్స్
– నేటి నుంచి ప్రారంభం కర్నూలు(సిటీ): ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్ పరీక్షల్లో జబ్లింగ్ విధానాన్ని అడ్డుకోవాలని ప్రయత్నించిన కార్పొరేట్ల ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఆరేళ్ల తర్వాత ఎట్టకేలకు జబ్లింగ్ విధానంలోనే ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. శుక్రవారం నుంచి ఈనెల 22వరకు జిల్లాలో మొత్తం 93 కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందుకు 20,734 మంది విద్యార్థులు హాజరు కానున్నట్లు బోర్డు అధికారులు తెలిపారు. -
రేపటి నుంచి ఇంటర్‌ప్రాక్టికల్స్
ఈ ఏడాది నుంచి జంబ్లింగ్ పరీక్షలకు సర్వసిద్ధం చేసిన జిల్లా ఇంటర్‌బోర్డు అధికారులు జిల్లాలో హాజరుకానున్న 33,594 మంది విద్యార్థులు ఈ ఏడాది నుంచి జంబ్లింగ్ కంబాలచెరువు : ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలకు సర్వసిద్ధమైంది. శుక్రవారం నుంచి ప్రారంభంకానున్న ఈ పరీక్షలకు జిల్లా ఇంటర్‌బోర్డు అధికారులు సమయాత్తమయ్యారు. ఇంటర్ విద్యాశాఖ అధికారులు టెలికాన్ఫరెన్స్ ద్వారా జిల్లా అధికారులతో మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా 96 కళాశాలల్లో.. ఈనెల మూడోతేదీ నుంచి 22 వరకు ఈ పరీక్షలు జిల్లావ్యాప్తంగా మొత్తం 96 కళాశాలల్లో జరగనున్నాయి. వీటికి మొత్తం 33,594 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఉదయం తొమ్మిది నుంచి మ«ధ్యాహ్నం 12 వరకు, మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు రెండు సెషన్లుగా వీటిని నిర్వహించనున్నారు. నాలుగు స్పెల్స్‌లో జరిగే ఈ పరీక్షలు ప్రథమ స్పెల్‌గా 43 కళాశాలలు, రెండో స్పెల్‌లో 48 కళాశాలలు, మూడో స్పెల్‌లో 51 కళాశాలలు, నాలుగో స్పెల్స్‌లో 43 కళాశాలల్లో జరగనున్నాయి. సైన్స్ విద్యార్థులకు బోటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ విభాగాల్లో, ఒకేషనల్ విద్యార్థులకు 19 రకాల సబ్జెక్టుల్లో ఈ పరీక్షలు జరుగుతాయి. ప్రైవేట్ కళాశాలల్లో జరిగే ప్రాక్టికల్స్‌కి 32 మంది డిపార్ట్మెంటల్ ఆఫీసర్లను నియమించారు. ఈ ఏడాది నుంచి జంబ్లింగ్ విధానం అమలు చేస్తున్నారు. అలాగే నాలుగు ఫ్లయింగ్ స్క్వాడ్స్, కలెక్టర్‌తో ఉండే హైపవర్ కమిటీలో అధికారిగా జిల్లా ఆర్‌ఐవోగా పనిచేసిన వెళ్లిన కేపీ దాశరథి వ్యహరించనున్నారు. వీరితో పాటు రెవెన్యూ స్క్వాడ్, పోలీస్‌శాఖ ఉంటుంది. ఆర్జేడీ ఎ.అన్నమ్మ, ఆర్ఐఓ ఎ.వెంకటేష్, డీవీఈవో కె.హెప్సీరాణి ఆధర్యంలో ఈనెల 24న సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రాక్టికల్స్, మార్చిలో జరిగే పరీక్షలకు సంబంధించి ఎటువంటి అవాంతరాలు రాకుండా ముందస్తు జాగ్రత్తగా చర్యలు తీసుకున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీస్‌శాఖ వి««ధులపై ఆ శాఖాధికారితో, ఆరోగ్య సమస్యలపై మెడికల్ అధికారులతో, పరీక్ష సమయంలో విద్యుత్ అవాంతరాలు రాకుండా విద్యుత్ అధికారులతో సమీక్షించారు. పరీక్షా కేంద్రంలోకి విధులు నిర్వర్తించే డిపార్ట్మెంట్ ఆఫీసర్లతో సహా ఎవరూ సెల్‌ఫోన్ వాడరాదని ఉత్తర్వులు జారీచేశారు. -
‘జంబ్లింగ్’ రద్దు కోసం ధర్నా
కర్నూలు సిటీ: ఇంటర్మీడియట్ కాలేజీ విద్యార్థులకు ప్రాక్టికల్‌లో అమలు చేస్తున్న జంబ్లింగ్ విధానాన్ని రద్దు చేయాలని ప్రైవేటు జూనియర్ కాలేజీల యాజమాన్య సంఘం డిమాండ్ చేసింది. సోమవారం ఆ సంఘం ఆధ్వర్యంలో రాజ్‌విహార్ సెంటర్ నుంచి పెద్దపార్కు, పాత కంట్రోల్ రూం మీదుగా భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్ఐఓ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆ సంఘం నాయకులు శేషిరెడ్డి, వెంకటేశ్వర్లు, చంద్రశేఖర్‌లు మాట్లాడుతూ.. ఇంటర్ ప్రాక్టికల్స్‌లో మొట్ట మొదటి సారిగా అమలు చేస్తున్న జంబ్లింగ్ విధానంతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు కాలేజీలన్నీ ప్రభుత్వ విధానాన్ని వ్యతిరేకిస్తున్నాయన్నారు. అనంతరం ఆర్ఐఓ వై.పరమేశ్వరరెడ్డికి వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు రామచంద్రారెడ్డి, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
జంబ్లింగ్‌లో గ్యాంబ్లింగ్
- జంబ్లింగ్‌లో ‘కార్పొరేట్’ మాయ - సెంటర్లను మార్చుకున్న కార్పొరేట్ కాలేజీలు? - ఇంటర్ బోర్డులో చక్రం తిప్పిన వైనం - వ్యతిరేకిస్తున్న ప్రైవేట్ కళాశాలలు సాక్షి ప్రతినిధి, కర్నూలు: రెండు కార్పొరేట్ జూనియర్ కళాశాలలు..పరస్పర అవగాహన..ఫలితం..జంబ్లింగ్ ప్రాక్టికల్ పరీక్షలు అపహాస్యం. ఆ కాలేజీలోని విద్యార్థులు ఈ కాలేజీ...ఈ కాలేజీలోని విద్యార్థులు ఆ కాలేజీలో పరీక్ష రాసే ఒప్పదం.. జంబ్లింగ్ పేరుతో పరీక్ష సెంటర్ల ఏర్పాటులో జరిగిన అక్రమాలు ఇవి. ఇందుకు జిల్లా కేంద్రమైన కర్నూలు నగరమే సాక్షి. కుడిఎడమైతే పొరపాటులేదోయ్ అనుకున్నారో ఏమో కానీ అధికారులు కూడా జంబ్లింగ్ విధానమని మోసం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జంబ్లింగ్ పేరుతో జరుగుతున్న ఈ మొత్తం నాటకం కేవలం రెండు కాలేజీలకే మేలు చేసేందుకే అన్న ఆరోపణలూ తాజాగా వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా జంబ్లింగ్ అసలు స్ఫూర్తితో ప్రాక్టికల్స్ పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం ఉంది. మరోవైపు తమను నష్టం చేసేందుకే ఈ జంబ్లింగ్ నాటకం తెరమీదకు వచ్చిందనే ప్రైవేటు కాలేజీలు మండిపడుతున్నాయి. వ్యతిరేకిస్తున్న ప్రైవేట్ కాలేజీలు...! కార్పొరేట్ కాలేజీలు ఆడుతున్న నాటకంలో విద్యార్థులతో పాటు సాధారణ ప్రైవేటు కాలేజీలు కూడా ఇబ్బందులు పడుతున్నాయి. అసలు ప్రాక్టికల్స్ పరీక్షలకు జంబ్లింగ్ విధానం దేశంలో ఎక్కడా లేదని వాదిస్తున్నాయి. ఇది కార్పొరేట్ కాలేజీలు ఆడుతున్న నాటకం అని మండిపడుతున్నాయి. రెండు కార్పొరేట్ కాలేజీలు సెంటర్లను తమకిష్టం వచ్చినట్టుగా కేటాయించుకుని....తమ విద్యార్థులను సమిధలు చేస్తున్నాయని వాపోతున్నాయి. ఇంటర్ ఫలితాల్లో ఈ రెండు కార్పొరేట్ కాలేజీలను కాదని తమ విద్యార్థులకు ర్యాంకులు వస్తుండటంతో ఈ విధంగా కేవలం వారు మాత్రమే లాభపడి... తమ విద్యార్థులను మోసం చేస్తున్నాయనేది సాధారణ ప్రైవేటు కాలేజీ యాజమాన్యాల వాదనగా ఉంది. అయితే, అంతిమంగా విద్యార్థులు మాత్రమే ఈ మొత్తం వ్యవహారంలో నష్టపోతున్నారు. విద్యార్థులే సమిధలు.. వాస్తవానికి ఇటు జంబ్లింగ్ విధానమైనా... సాధారణ విధానంలోనైనా విద్యార్థులే ఇబ్బందుల పాలవుతున్నారు. అటు కార్పొరేట్ కాలేజీల్లోనూ ఇటు ప్రైవేటు కాలేజీల్లోనూ ప్రాక్టికల్స్ పరీక్షలు జరగడం లేదు. వాస్తవానికి ప్రాక్టికల్స్ పరీక్షల్లో వచ్చే సబ్జెక్టును ప్రయోగాత్మకంగా చేసి చూస్తే థియరీ పరీక్షలు రాసే సమయంలో వారికి ఉపయుక్తంగా ఉంటుంది. అయితే, ఎక్కడా కూడా ప్రాక్టికల్స్ పరీక్షలు జరగడం లేదు. ఫలితంగా తీరా పరీక్ష సమయానికి వచ్చే సరికి విద్యార్థులు తెల్లమొహం వేయాల్సి వస్తోంది. దీంతో దీనిని తమకు అనుకూలంగా మార్చుకుని కాలేజీ యాజమాన్యాలు పరీక్ష పాస్ కావాలంటే సబ్జెక్టుకు ఇంత మొత్తం ఇవ్వాలని వసూలు చేస్తున్నాయి. ఈ మొత్తాన్ని పరీక్షను పర్యవేక్షించేందుకు వచ్చే ఇన్విజిలేటర్లకు ఇస్తున్నామని బహిరంగంగానే విద్యార్థులకు చెబుతున్నాయి. మీకు 30కి 30 మార్కులు ఏమీ చేయకపోయినా రావాలంటే సబ్జెక్టుకు కొంత మొత్తం ఇవ్వాలని యాజమాన్యాలు ఖరాఖండిగా తేల్చిచెబుతున్నాయి. అంటే కాలేజీలు చేస్తున్న తప్పునకు విద్యార్థులు ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తోందన్నమాట. కాలేజీల కేటాయింపు అధికారం బోర్డుదే: వై. పరమేశ్వరరెడ్డి, ఆర్ఐవో జంబ్లింగ్ విధానంలో పరీక్షా కేంద్రాలను కేటాయించే అధికారం ఇంటర్మీడియట్ బోర్డుకు ఉంటుంది. ఆ కాలేజీ విద్యార్థులు ఈ కాలేజీలో.. ఈ కాలేజీ విద్యార్థులు ఆ కాలేజీలో పడ్డారన్న సమాచారం లేదు. అయితే, జంబ్లింగ్ విధానంలో ఏ కాలేజీ విద్యార్థులు అదే కాలేజీలో మాత్రం పరీక్ష రాసేందుకు అవకాశం ఉండదు. -
మేల్కొంటున్నారు
ప్రయోగాలపై పట్టు సాధిస్తున్న విద్యార్థులు జంబ్లింగ్ విధానం ఖరారుతో ముమ్మర సాధన బాలాజీచెరువు(కాకినాడ) :ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఈ ఏడాది నుంచి ప్రయోగ పరీక్షలను జంబ్లింగ్ విధానంలో నిర్వహించనున్నారు. దీంతో ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో సైన్స్ విద్యార్థులు ప్రయోగంపై పట్టు సాధించి మంచి మార్కులు కైవసం చేసుకునేందుకు శ్రమిస్తున్నారు. ఉన్నది రెండు నెలలే.. ప్రయోగ పరీక్షలు 2017 ఫిబ్రవరిలో నిర్వహించనున్నారు. ఇటీవల వరకు ఈ పరీక్షలు విద్యార్థులు ఏ కళాశాలలో చదువుతున్నారో! అక్కడే జరిగేవి. ఈ విధానం వల్ల కొంత మంది విద్యార్థులకు ఎక్కువ మార్కులు వేస్తున్నారనే ఆరోపణలు వినిపిం చాయి. చాలా ప్రైవేట్ కళాశాల్లో ప్రయోగశాలలు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయకుండా తూతూమంతంగా విద్యార్థులను తయారు చేస్తున్నారనే విమర్శలు వినిపించాయి. పరీక్షల నిర్వహణకు వచ్చే వారిని ప్రసన్నం చేసుకుని ఎక్కువ మా ర్కులు ప్రైవేట్ కళాశాలల విద్యార్థులకు వేస్తున్నారనే అపవా దూ ఉంది. ఈ నేపథ్యలో ప్రభుత్వం ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్‌కు జంబ్లింగ్ విధానం ప్రకటిస్తూనే పరీక్షలు దగ్గరికి వచ్చే సరికి వాయిదా వేస్తూ వచ్చారు. ఈ సారి మాత్రం ముందుగానే కొత్త విధానంలో ప్రయోగ పరీక్షలు జరుగుతాయని స్పష్టం చేయడంతో అన్ని కళాశాలలు ఈ ప్రాక్టికల్స్‌పై దృష్టిసారించాయి. ఏంపీసీ విద్యార్థులు భౌతిక, రసాయనశాస్రా్తలు, బైపీసీ విద్యార్థులు రసాయన, భౌతిక శాస్రా్తలతో పాటు వృక్ష, జంతు శాస్రా్తల ప్రయోగాలపై పట్టు సాధిస్తున్నారు. సమయం రెండు నెలలే ఉండడంతో విద్యార్థులు రికార్డులు, రసాయనాల విశ్లేషణ, కణజాలల గుర్తింపు, స్లైడ్ చూడటం, బొమ్మల తర్ఫీదు వంటి పనుల్లో బిజీగా ఉన్నారు. అ«లాగే అధ్యాపకులు విద్యార్థులను జంబ్లింగ్ విధానానికి అనుగుణంగా సిద్ధం చేస్తున్నారు. జంబ్లింగ్ ప్రాక్టికల్స్‌కు ఏర్పాట్లు పూర్తి ఈ ఏడాది ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్ జంబ్లింగ్ విధానంలోనే జరుగుతాయి. విద్యార్థులకు ఏవిధమైన అసౌకర్యం లేకుండా ల్యాబ్‌లలో సౌకర్యాలు ఏర్పాటు చేయాలని పరీక్ష కేంద్రాల నిర్వాహకులను ఆదేశించాం. – ఎం.వేంకటేష్, ఇంటర్మీడియట్ కళాశాలల తనిఖీ అధికారి, రాజమండ్రి -
ఇంటర్ ప్రాక్టికల్స్ ‘జంబ్లింగ్’
–జిల్లాలో 61 పరీక్షా కేంద్రాలు – మూడునెలల ముందే ప్రకటన ఏలూరు సిటీ : ఇంటర్మీడియెట్ విద్యార్థులు ఈ ఏడాది జంబ్లింగ్ విధానంలో ప్రాక్టికల్ పరీక్షలు రాయాల్సి ఉంది. కొన్నేళ్లుగా ప్రాక్టికల్ పరీక్షల్లో జంబ్లింగ్ విధానాన్ని వాయిదా వేస్తూ వచ్చిన ఇంటర్మీడియట్ విద్యామండలి ఈసారి కచ్చితంగా అమ లు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు మూడు నెలల ముందే జంబ్లింగ్ పరీక్షా కేంద్రాలను ప్రకటించారు. జిల్లావ్యాప్తం గా ప్రాక్టికల్ పరీక్షలకు 61 పరీక్షా కేంద్రాలను ఎంపిక చేశారు. ఆయా కళాశాలల యాజమాన్యాలు తగు జాగ్రత్తలు పాటిం చాల్సి ఉంది. నిర్దేశించిన పరీక్షా కేంద్రం లో ఆయా కాలేజీల విద్యార్థులు ల్యాబ్‌లకు వెళ్లి అవగాహన తెచ్చుకునే వెసులుబాటు కల్పించారు. ఫిబ్రవరిలో జరిగే ప్రాక్టికల్ పరీక్షలకు ముందుస్తు చర్యల్లో భాగంగానే కేంద్రాలను ప్రకటించారు. జిల్లాలోని 254 జూనియర్ కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులను సిద్ధం చేసేందుకు అవకాశం కల్పించారు. పరీక్షా కేంద్రాలివే.. ∙తాడేపల్లిగూడెం : తాడేపల్లిగూడెం ప్రభుత్వ జూనియర్ కళాశాల, డాక్టర్ గోయెంకా జూనియర్ కాలేజ్, ప్రభుత్వ జూనియర్ కాలేజ్, పెంటపాడు, శ్రీ వాసవీ కాలేజ్, తాడేపల్లిగూడెం. ∙పాలకొల్లు : ఆదిత్య కళాశాల, పాలకొల్లు, ప్రభుత్వ బాలుర కళాశాల పాలకొల్లు, ప్రభుత్వ బాలికల కళాశాల, పాలకొల్లు, కేవీఎం చాంబర్స్ కళాశాల, పాలకొల్లు. ∙భీమవరం : డాక్టర్ సీఎస్ఎన్ కాలేజ్, శ్రీచైతన్య జూనియర్ కాలేజ్, డీఎన్ఆర్ కాలేజ్, ఆదిత్య జూనియర్ కాలేజ్, శ్రీ సాయి ఆదిత్య కాలేజ్, బ్రౌనింగ్ జూనియర్ కాలేజ్ ∙తణుకు: ఎస్సీఐఎం జీజేసీ, తణుకు, ప్రగతి కాలేజ్, నారాయణ కాలేజ్, శశి జూనియర్ కాలేజ్, ఎస్‌ఎన్‌వీటీ జీజేసీ తణుకు. ∙ఏలూరు: ప్రభుత్వ జూనియర్ కాలేజ్, ఏలూరు, ఎస్‌పీడీబీటీ కాలేజ్, సెయింట్ థెరిస్సా బాలికల కాలేజ్, ఎన్ఆర్ఐ కాలేజ్, సర్ సీఆర్ఆర్ కాలేజ్, శశి జూనియర్ కాలేజ్ ఏలూరు, డీపాల్ కాలేజ్, పినకడిమి ∙నరసాపురం: ఆదిత్య కళాశాల, బీజీబీఎస్ ఉమెన్స్ కాలేజ్ నరసాపురం. ∙కొవ్వూరు : జీజేసీ బాలుర కళాశాల, జీజేసీ బాలికల కళాశాల కొవ్వూరు, శ్రీచైతన్య వేములూరు ∙నిడదవోలు : జీజేసీ బాలుర కళాశాల, జీజేసీ బాలికల కళాశాల నిడదవోలు ∙పోలసానిపల్లి : ఏపీఎస్‌డబ్ల్యూఆర్ (బాలిక) పోలసానిపల్లి ∙కొయ్యలగూడెం : ప్రభుత్వ జూనియర్ కాలేజ్ కొయ్యలగూడెం ∙గోపాలపురం : ఏపీఎస్‌డబ్ల్యూఆర్ బాలికల కళాశాల, గోపాలపురం ∙చింతలపూడి : ప్రభుత్వ జూనియర్ కాలేజ్ చింతలపూడి ∙జంగారెడ్డిగూడెం : ప్రభుత్వ జూనియర్ కాలేజ్, సూర్య కాలేజ్ జంగారెడ్డిగూడెం, బుట్టాయగూడెం ప్రభుత్వ జూనియర్ కాలేజ్ ∙అత్తిలి జోన్: ఎస్వీఎస్ఎస్ జీజేసీ, అత్తిలి ∙పెనుగొండ : ఎస్వీకేపీ అండ్ పీవీ కాలేజ్ పెనుగొండ, ఎంవీఆర్ జీజేసీ ఆచంట ∙వీరవాసరం : వీఈసీ కళాశాల, వీరవాసరం ∙వేగేశ్వరపురం : ప్రభుత్వ జూనియర్ కాలేజ్, వేగేశ్వరపురం ∙నల్లజర్ల : డాక్టర్ ఎస్ఆర్కే అండ్ కేఎస్ఆర్ కో–ఆప్ కాలేజ్ ∙దుంపగడప ఏకేపీఎస్ జీజేసీ ∙నారాయణపురం జీజేసీ ∙గణపవరం జీజేసీ ∙పెదవేగి ఏపీఎస్‌డబ్ల్యూఆర్(బీ) ∙యండగండి జీజేసీ ∙జీలుగుమిల్లి జీజేసీ ∙వేరేరుపాడు జీజేసీ ∙కుకునూరు జీజేసీ ల్యాబ్‌లపై అవగాహన కోసం.. ఈ విద్యాసంవత్సరం నుంచి ఇంటర్ విద్యార్థులకు ప్రాక్టికల్ పరీ క్షలు జంబ్లింగ్ విధానంలో నిర్వహించేం దుకు చర్యలు చేపట్టాం. విద్యార్థులు కావాలంటే పరీక్షా కేంద్రాలకు వెళ్లి అక్కడ ప్రాక్టికల్స్‌పై అవగాహన పెంచుకోవచ్చు. ప్రాక్టికల్ పరీక్షలపై విద్యార్థులు భయపడకుండా ఉండేలా అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకున్నాం. పారదర్శకంగా పరీక్షలు నిర్వహిస్తాం. – ఎస్ఏ ఖాదర్, ఆర్ఐవో -
ఇంటర్ ప్రాక్టికల్స్ ‘జంబ్లింగ్’
–జిల్లాలో 61 పరీక్షా కేంద్రాలు – మూడునెలల ముందే ప్రకటన ఏలూరు సిటీ : ఇంటర్మీడియెట్ విద్యార్థులు ఈ ఏడాది జంబ్లింగ్ విధానంలో ప్రాక్టికల్ పరీక్షలు రాయాల్సి ఉంది. కొన్నేళ్లుగా ప్రాక్టికల్ పరీక్షల్లో జంబ్లింగ్ విధానాన్ని వాయిదా వేస్తూ వచ్చిన ఇంటర్మీడియట్ విద్యామండలి ఈసారి కచ్చితంగా అమ లు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు మూడు నెలల ముందే జంబ్లింగ్ పరీక్షా కేంద్రాలను ప్రకటించారు. జిల్లావ్యాప్తం గా ప్రాక్టికల్ పరీక్షలకు 61 పరీక్షా కేంద్రాలను ఎంపిక చేశారు. ఆయా కళాశాలల యాజమాన్యాలు తగు జాగ్రత్తలు పాటిం చాల్సి ఉంది. నిర్దేశించిన పరీక్షా కేంద్రం లో ఆయా కాలేజీల విద్యార్థులు ల్యాబ్‌లకు వెళ్లి అవగాహన తెచ్చుకునే వెసులుబాటు కల్పించారు. ఫిబ్రవరిలో జరిగే ప్రాక్టికల్ పరీక్షలకు ముందుస్తు చర్యల్లో భాగంగానే కేంద్రాలను ప్రకటించారు. జిల్లాలోని 254 జూనియర్ కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులను సిద్ధం చేసేందుకు అవకాశం కల్పించారు. పరీక్షా కేంద్రాలివే.. ∙తాడేపల్లిగూడెం : తాడేపల్లిగూడెం ప్రభుత్వ జూనియర్ కళాశాల, డాక్టర్ గోయెంకా జూనియర్ కాలేజ్, ప్రభుత్వ జూనియర్ కాలేజ్, పెంటపాడు, శ్రీ వాసవీ కాలేజ్, తాడేపల్లిగూడెం. ∙పాలకొల్లు : ఆదిత్య కళాశాల, పాలకొల్లు, ప్రభుత్వ బాలుర కళాశాల పాలకొల్లు, ప్రభుత్వ బాలికల కళాశాల, పాలకొల్లు, కేవీఎం చాంబర్స్ కళాశాల, పాలకొల్లు. ∙భీమవరం : డాక్టర్ సీఎస్ఎన్ కాలేజ్, శ్రీచైతన్య జూనియర్ కాలేజ్, డీఎన్ఆర్ కాలేజ్, ఆదిత్య జూనియర్ కాలేజ్, శ్రీ సాయి ఆదిత్య కాలేజ్, బ్రౌనింగ్ జూనియర్ కాలేజ్ ∙తణుకు: ఎస్సీఐఎం జీజేసీ, తణుకు, ప్రగతి కాలేజ్, నారాయణ కాలేజ్, శశి జూనియర్ కాలేజ్, ఎస్‌ఎన్‌వీటీ జీజేసీ తణుకు. ∙ఏలూరు: ప్రభుత్వ జూనియర్ కాలేజ్, ఏలూరు, ఎస్‌పీడీబీటీ కాలేజ్, సెయింట్ థెరిస్సా బాలికల కాలేజ్, ఎన్ఆర్ఐ కాలేజ్, సర్ సీఆర్ఆర్ కాలేజ్, శశి జూనియర్ కాలేజ్ ఏలూరు, డీపాల్ కాలేజ్, పినకడిమి ∙నరసాపురం: ఆదిత్య కళాశాల, బీజీబీఎస్ ఉమెన్స్ కాలేజ్ నరసాపురం. ∙కొవ్వూరు : జీజేసీ బాలుర కళాశాల, జీజేసీ బాలికల కళాశాల కొవ్వూరు, శ్రీచైతన్య వేములూరు ∙నిడదవోలు : జీజేసీ బాలుర కళాశాల, జీజేసీ బాలికల కళాశాల నిడదవోలు ∙పోలసానిపల్లి : ఏపీఎస్‌డబ్ల్యూఆర్ (బాలిక) పోలసానిపల్లి ∙కొయ్యలగూడెం : ప్రభుత్వ జూనియర్ కాలేజ్ కొయ్యలగూడెం ∙గోపాలపురం : ఏపీఎస్‌డబ్ల్యూఆర్ బాలికల కళాశాల, గోపాలపురం ∙చింతలపూడి : ప్రభుత్వ జూనియర్ కాలేజ్ చింతలపూడి ∙జంగారెడ్డిగూడెం : ప్రభుత్వ జూనియర్ కాలేజ్, సూర్య కాలేజ్ జంగారెడ్డిగూడెం, బుట్టాయగూడెం ప్రభుత్వ జూనియర్ కాలేజ్ ∙అత్తిలి జోన్: ఎస్వీఎస్ఎస్ జీజేసీ, అత్తిలి ∙పెనుగొండ : ఎస్వీకేపీ అండ్ పీవీ కాలేజ్ పెనుగొండ, ఎంవీఆర్ జీజేసీ ఆచంట ∙వీరవాసరం : వీఈసీ కళాశాల, వీరవాసరం ∙వేగేశ్వరపురం : ప్రభుత్వ జూనియర్ కాలేజ్, వేగేశ్వరపురం ∙నల్లజర్ల : డాక్టర్ ఎస్ఆర్కే అండ్ కేఎస్ఆర్ కో–ఆప్ కాలేజ్ ∙దుంపగడప ఏకేపీఎస్ జీజేసీ ∙నారాయణపురం జీజేసీ ∙గణపవరం జీజేసీ ∙పెదవేగి ఏపీఎస్‌డబ్ల్యూఆర్(బీ) ∙యండగండి జీజేసీ ∙జీలుగుమిల్లి జీజేసీ ∙వేరేరుపాడు జీజేసీ ∙కుకునూరు జీజేసీ ల్యాబ్‌లపై అవగాహన కోసం.. ఈ విద్యాసంవత్సరం నుంచి ఇంటర్ విద్యార్థులకు ప్రాక్టికల్ పరీ క్షలు జంబ్లింగ్ విధానంలో నిర్వహించేం దుకు చర్యలు చేపట్టాం. విద్యార్థులు కావాలంటే పరీక్షా కేంద్రాలకు వెళ్లి అక్కడ ప్రాక్టికల్స్‌పై అవగాహన పెంచుకోవచ్చు. ప్రాక్టికల్ పరీక్షలపై విద్యార్థులు భయపడకుండా ఉండేలా అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకున్నాం. పారదర్శకంగా పరీక్షలు నిర్వహిస్తాం. – ఎస్ఏ ఖాదర్, ఆర్ఐవో -
సైన్స్‌లో సగం సిలబస్ ప్రాక్టికల్స్‌కే!
* ఇంటర్ సైన్స్ గ్రూపుల్లో అమలు చేయాలని సిలబస్ కమిటీ ప్రతిపాదన * మ్యాథ్స్, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో పూర్తిగా ఒకే సిలబస్ * ఇతర గ్రూపుల్లో 70 శాతం కామన్ కోర్ సిలబస్‌కు చర్యలు * వచ్చే నెల 6న ఢిల్లీలో జరిగే సమావేశంలో తుది నిర్ణయం సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్‌లోని సైన్స్ గ్రూపుల్లో 50 శాతం సిలబస్‌ను ప్రాక్టికల్స్‌కే కేటాయించేలా చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నియమించిన ఇంటర్ సిలబస్ సమీక్ష కమిటీ అభిప్రాయపడింది. జాతీయ స్థాయి విద్యా సంస్థల ప్రమాణాలకు అనుగుణంగా అన్ని రాష్ట్రాల్లోని ఇంటర్, సీబీఎస్ఈ విద్యాసంస్థల్లోని 10+2 విధానంలో ఉమ్మడి (కామన్ కోర్) సిలబస్ ఉండేలా చర్యలు చేపట్టాలని తీర్మానించింది. అయితే సైన్స్ గ్రూపులకు చెందిన సబ్జెక్టు (మ్యాథ్స్, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ)ల్లో మాత్రం 100 శాతం కామన్ కోర్ సిలబస్ (అన్ని రాష్ట్రాల్లో ఒకేలా) ఉండేలా చూడాలని నిర్ణయించింది. ఇందులో 50 శాతం పాఠ్యాంశాలు రాత పరీక్షల కోసం ఉండాలని, మరో 50 శాతం సిలబస్ ప్రాక్టికల్స్ చేసేలా ఉండాలని భావిస్తోంది. ప్రస్తుతం సైన్స్ సబ్జెక్టుల్లో 70 శాతం సిలబస్ థియరీకి అనుగుణంగా ఉందని, దాన్ని మార్చాలని నిర్ణయించింది. వివిధ రాష్ట్రాల ఇంటర్ బోర్డులు, సీబీఎస్ఈ ప్రతినిధులతో కూడిన కమిటీ ఇటీవల హైదరాబాద్‌లో సమావేశమైంది. సిలబస్ సమీక్ష కమిటీ కన్వీనర్, రాష్ట్ర ఇంటర్ బోర్డు కార్యదర్శి డాక్టర్ అశోక్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కమిటీ సభ్యులు జమ్మూకశ్మీర్ ఇంటర్ బోర్డు చైర్మన్ జహూర్ అహ్మద్, మహారాష్ట్ర ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణకుమార్ పాటిల్, నాగాలాండ్ బోర్డు ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ చైర్మన్ అసానో సెఖోస్, ఐసీఎస్సీ ప్రతినిధులు కల్నల్ శ్రీజిత్, శిల్పిగుప్తా, ఎన్సీఈఆర్టీ ప్రతినిధులు రంజనా అరోరా, సీబీఎస్ఈ అదన పు డెరైక్టర్ సుగంధ్ శర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సైన్స్ గ్రూపులతోపాటు ఇతర గ్రూపులు, సబ్జెక్టుల్లో 70 శాతం సిలబస్ అన్ని రాష్ట్రాల్లో ఒకేలా ఉండాలన్న నిర్ణయానికి వచ్చారు. మిగతా 30 శాతం సిలబస్‌ను ఆయా రాష్ట్రాల అవసరాలకు అనుగుణంగా మార్పులు చేసుకునేందుకు వీలు కల్పించేలా ప్రతిపాదనలను సిద్ధం చేసి, కేంద్ర మానవ వనరుల శాఖకు పంపారు. ఇతర గ్రూపుల్లోనూ 90 శాతం కామన్ కోర్ సిలబస్ ఉండాలని... 5 నుంచి 10 శాతం వరకే మార్చుకొనేందుకు అవకాశం కల్పించాలని పలువురు కమిటీ సభ్యులు అభిప్రాయపడ్డారు. కానీ దానిపై ఏకాభిప్రాయం కుదరలేదు. మొత్తంగా కామన్ కోర్ సిలబస్‌లో ఇంటర్ ప్రాక్టికల్స్‌కు ప్రాధాన్యం పెంచాలని నిర్ణయించారు. ఈ ప్రతిపాదనలపై వచ్చే నెల 6న ఢిల్లీలో జరిగే సమావేశంలో కేంద్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది. -
సైన్స్ గ్రూపుల్లో సగం సిలబస్‌లో ప్రాక్టికల్స్
-ఇంటర్మీడియట్లో దేశ వ్యాప్త అమలుకు ప్రతిపాదన - ఇతర గ్రూపుల్లో 70 శాతం కామన్ కోర్ సిలబస్ అమలుకు సిలబస్ కమిటీ చర్యలు - వచ్చే నెల 6న ఢిల్లీలో జరిగే సమావేశంలో తుది నిర్ణయం హైదరాబాద్: ఇంటర్మీడియట్లోని సైన్స్ గ్రూపుల్లో 50 శాతం సిలబస్ ప్రాక్టికల్స్ చేసేలా చర్యలు చేపట్టాల్సిందేనని కేంద్ర ప్రభుత్వం నియమించిన ఇంటర్మీడియట్ సిలబస్ సమీక్ష కమిటీ అభిప్రాయ పడింది. జాతీయ స్థాయి విద్యా సంస్థల్లో ఉన్నత స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా అన్ని రాష్ట్రాల్లోని ఇంటర్మీడియట్ విద్యలో, సీబీఎస్ఈ విద్యా సంస్థల్లో 10+2 విధానంలోనూ కామన్ కోర్ సిలబస్ ఉండేలా చర్యలు చేపట్టాలని గురువారం తీర్మానించింది. అయితే సైన్స్ గ్రూపులకు చెందిన సబ్జెక్టుల్లో (మ్యాథ్స్, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ) మాత్రం 100 శాతం కామన్ కోర్ సిలబస్ (అన్ని రాష్ట్రాల్లో ఒకేలా) ఉండాలని నిర్ణయానికి వచ్చింది. ఇందులో 50 శాతం పాఠ్యాంశాలు రాత పరీక్షల మేరకు ఉండాలని, మరో 50 శాతం సిలబస్ ప్రాక్టికల్స్ చేసేలా ఉండాలని పేర్కొంది. ప్రస్తుతం సైన్స్ సబ్జెక్టుల్లో 70 శాతం సిలబస్ థియరీకి అనుగుణంగానే ఉందని, దానిని మార్పు చేయాలని నిర్ణయానికి వచ్చింది. ఇటీవల వివిధ రాష్ట్రాలకు చెందిన ఇంటర్మీడియట్ బోర్డులు, సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) ప్రతినిధులతో కూడిన కమిటీ ఇటీవల హైదరాబాద్‌లో సమావేశమైంది. సిలబస్ సమీక్ష కమిటీ కన్వీనర్, తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి డాక్టర్ అశోక్ అధ్యక్షతన జరిగిన కమిటీ సమావేశంలో కమిటీ సభ్యులైన జమ్మూ కాశ్మీర్ ఇంటర్మీడియట్ బోర్డు ఛైర్మన్ జహూర్ అహ్మద్, మహారాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి కృష్ణకుమార్ పాటిల్, నాగాలాండ్ బోర్డు ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఛైర్మన్ అసానో సెఖోస్, ఐసీఎస్సీ ప్రతినిధులు కల్నల్ శ్రీజిత్, శిల్పిగుప్తా, జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎన్సీఈఆర్టీ) ఆర్‌ఎంఎస్‌ఏ విభాగం హెడ్ ప్రొఫెసర్ రంజనా అరోరా, సీబీఎస్ఈ అదన పు డెరైక్టర్ సుగంధ్ శర్మ పాల్గొన్నారు. ఈ సమావేశంలో సైన్స్ గ్రూపులతోపాటు ఇతర గ్రూపులు, ఆయా సబ్జెక్టుల్లోనూ 70 శాతం సిలబస్ అన్ని రాష్ట్రాల్లో ఒకేలా ఉండాలన్న నిర్ణయానికి వచ్చింది. మిగితా 30 శాతం సిలబస్‌ను ఆయా రాష్ట్రాల అవసరాలకు అనుగుణంగా మార్పులు చేసుకునేలా వీలు కల్పించేలా ప్రతిపాదనలను సిద్ధం చేసి, కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖకు పంపించింది. ఇతర గ్రూపుల్లోనూ 90 శాతం కామన్ కోర్ సిలబస్ ఉండాలని, 5 నుంచి 10 శాతం వరకే ఆయా రాష్ట్రాలు తమ స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఆప్షనల్ సిలబస్‌ను రూపొందించుకునే అవకాశం కల్పించాలని పలువురు కమిటీ సభ్యులు అభిప్రాయపడినా దానిపై ఏకాభిప్రాయం కుదరలేదు. మొత్తంగా కామన్ కోర్ సిలబస్ ఇంటర్మీడియట్లో ప్రాక్టికల్స్‌కు ప్రాధాన్యం పెంచేలా ఉండేలా ఈ చర్యలు చేపట్టింది. ఈ ప్రతిపాదనలపై వచ్చే నెల 6న ఢిలీలో జరిగే సమావేశంలో కేంద్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది. -
రాసుకున్నోళ్లకు రాసుకున్నంత..
అనంతపురం మెడికల్ : ఒక రోగి త్వరగా కోలుకోవాలంటే వైద్యుడు ఎంత కీలకమో.. నర్సింగ్ కేర్ అంతకంటే కీలకం అని వైద్య నిపుణులు చెబుతుంటారు. అలాంటి నర్సింగ్ కోర్సును పూర్తి చేయూలంటే నిరంతర అధ్యయనం, పరిశీలన ఎంతో ముఖ్యం. వీటన్నింటికీ తిలోదకాలిస్తూ అనంతపురం సర్వజనాస్పత్రిలో బుధవారం జనరల్ నర్సింగ్ ఆఫ్ మిడ్వైఫరీ(జీఎన్ఎం) ప్రాక్టికల్స్‌లో ఇన్విజిలేటర్ల సమక్షంలోనే జోరుగా మాస్ కాపీయింగ్ చేరుుంచారు. వివరాల్లోకి వెళితే.. ప్రభుత్వ సర్వజనాస్పత్రిలోని కాన్పుల విభాగంలో జీఎన్ఎం ఎక్స్టర్నల్ పరీక్షలు నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వందల సంఖ్యలో నర్సింగ్ విద్యార్థినిలు హాజరయ్యారు. వీరంతా ఒక చోట కూర్చొని కాపీయింగ్‌కి పాల్పడ్డారు. ఉదయం 10 నుంచి పరీక్షలు ప్రారంభమయ్యూరుు. వైవాతో పాటు, రోగి జబ్బుకి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోవాలో వాటిని జవాబు పత్రంలో రాయాల్సి ఉంటుంది. అధ్యయనం, స్వయంగా చూసి తెలుసుకోవడం ద్వారా సమాధానాలు రాయూల్సి ఉండగా, ధైర్యంగా రికార్డులు తెరుచుకుని పరీక్షలు రాశారు. థియరీ పార్ట్ ఒక ఎత్తై ప్రధానంగా నర్సింగ్ గురించి ప్రాక్టికల్‌గా ప్రతిభ చూపాలి. అప్పుడు వారిని పాస్ చేస్తారు. అటువంటిది నిబంధనలకు విరద్ధంగా పరీక్షలు జరిపారు. ఆస్పత్రిలో ఎప్పుడూ లేని విధంగా పరీక్షలు నిర్వహించారు. ప్రైవేట్ నర్సింగ్ కళాశాలలతో కుమ్మక్కైనట్లు స్పష్టంగా తెలుస్తోంది. గర్భిణిల మధ్యే చూచిరాత న ర్సింగ్ విద్యార్థినుల అలజడితో ఆస్పత్రిలో గర్భిణిలు, బాలింతలకు ఇబ్బందులు ఎదురయ్యూరుు. రోగుల మధ్యే చూచి రాతలు రాశారు. ఓ వైపు నిండు చూలాలు ప్రసవ వేదనతో బాధపడుతుంటే పట్టించుకున్న వారు లేరు. బాలింతలు కాలు చాపుకుని పడుకునేందుకు వీలు లేకుండా పోయింది. ఏమైనా అంటే కసురుకుంటారేమోనని బాలింతలు ఆవేదన వ్యక్తం చేశారు. వాస్తవంగా రోగులను ఇబ్బందులకు గురి చేయకుండా పరీక్షలు జరపాలి. పరీక్షలు ఇలా నిర్వహించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇన్విజిలేటర్ల అండతోనే మాస్ కాపీరుుంగ్ ప్రాక్టికల్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్ జరిగినా ఇన్విజిలేటర్లు ఏమాత్రం పట్టీపట్టనట్లుగా వ్యవహరించారు. దీనిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వారికి తెలిసే మాస్ కాపీయింగ్ జరిగిందని స్పష్టంగా తెలుస్తోంది. ‘సాక్షి’ ఈ విషయంపై ఆరా తీయగా అప్పుడు మేలుకున్నారు. ఫోటోలు తీయాల్సిన పనిలేదని, నిబంధనల ప్రకారమే జరుపుతున్నామన్నారు. చివరకు గుంపులుగా ఉన్న విద్యార్థినిలను ఓ ఇన్విజిలేటర్ చెదరగొట్టింది. వారు తమ విద్యార్థులు కాదని దాటవేశారు. మూడేళ్ల పాటు చేయాల్సిన కోర్సును అడ్డదారుల్లో చేస్తున్నా ఉన్నతాధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఆర్ఎంఓ సైతం అటువైపు తొంగి చూడలేదు. ఆస్పత్రి ఉన్నతాధికారులకు ఈ విషయం తెలిసే కాపీయింగ్‌కి పాల్పడినట్లు తెలుస్తోంది. ఏదిఏమైనా సర్వజనాస్పత్రిలో ప్రాక్టికల్స్ ఇంత ఈజీగా ఉంటాయా అని రోగులు, వారి వెంట వచ్చిన బంధువులు ముక్కున వేలేసుకున్నారు. ఇలా కాపీ కొట్టి పరీక్షలు పాసైతే వీరేం సేవలు చేస్తారంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు. -
నేతలు.. ఫెయిల్!
కోరుట్ల, న్యూస్‌లైన్ : కోరుట్ల పశువైద్య కళాశాలకు వెటర్నరీ కౌన్సిల్ గుర్తింపు లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ కళాశాలలో 2008-09లో వెటర్నరీ వైద్య కోర్సులో చేరి నెల రోజుల క్రితం ఫైనల్ పరీక్షలు రాసిన 40 మంది విద్యార్థులకు అవస్థలు తప్పడం లేదు. వీరికే కాదు.. 2012-13లో కోర్సు నాలుగో సంవత్సరం పూర్తి చేసుకుని ఐదో సంవత్సరంలోకి అడుగుపెడుతున్న మరో 40 మంది విద్యార్థులకు వీసీఐ అనుమతిపై ఆందోళన వీడడం లేదు. ప్రచార ఆర్భాటమే! ఐదేళ్ల క్రితం పశువైద్య కళాశాలను ఆర్భాటం గా ఏర్పాటు చేసిన నేత లు వసతుల కల్పన, నిధుల మంజూరుపై మాత్రం శ్రద్ధ చూపలే దు. మూడేళ్లపాటు కళాశాల అభివృద్ధికి ఒక్క రూపాయి మంజూరు కాలేదు. అద్దె భవనంలోనే ప్రారంభమైన కళాశాలకు అవసరమైనంత మంది బోధకులు, ప్రాక్టికల్స్ కోసం పశువుల ఫాంలు, ఇతరత్రా సౌకర్యాలు లేక విద్యార్థులు కేవలం థియరీకే పరిమితమయ్యారు. మొదటి బ్యాచ్ విద్యార్థులు ఐదో సంవత్సరం చేరే వరకు వసతు లు కల్పన ఊసేలేకుండా పోయింది. కళాశాలలో చేరిన మొదటి బ్యాచ్ విద్యార్థులు ప్రాక్టికల్స్ లేకుండా కోర్సులు పూర్తి చేయలేమని ఆందోళన వ్యక్తం చేస్తూ రెండేళ్ల క్రితం హైదరాబాద్‌లో దీక్షలు చేపట్టారు. స్పందించిన వెటర్నరీ యూనివర్సిటీ అధికారులు కోరుట్లలో చివరి సంవత్సరం చదువుతున్న మొదటి బ్యాచ్ విద్యార్థులు 40 మందిని రాజేంద్రనగర్, గన్నవరం, తిరుపతి కళాశాలల్లో చదివేందుకు ఏర్పాట్లు చేశారు. ఇదే సమయంలో కోరుట్ల నుంచి కళాశాల తరలిపోతుందన్న ప్రచారం జరిగింది. ఈ ప్రచారంతో నిద్రమత్తు వదిలించుకున్న నేతలు కళాశాలలో సౌకర్యాల కోసం ఉన్నత స్థాయిలో ఒత్తిళ్లు తీసుకువచ్చారు. ఈ క్రమంలో కళాశాలకు మొదటిసారిగా పెద్ద మొత్తంలో రూ.25 కోట్లు మంజూరయ్యాయి. అనంతరం పలు దఫాల్లో రూ.70 కోట్లు నిధులు రాగా, నెల క్రితం కళాశాల హాస్టల్ భవనాలు, ఫాంల నిర్మాణం పూర్తయింది. ఈ సంబరంలో కళాశాల అనుమతి విషయాన్ని నేతలు మరిచిపోయారు. పనికిరాని పశువైద్య పట్టాలు కోరుట్ల కళాశాల మొదటి బ్యాచ్(2008-09) విద్యార్థులు 40 మంది నెలరోజుల క్రితం ఫైనలియర్ పరీక్షలు రాశారు. త్వరలో వీరికి పశువైద్య పట్టాలు చేతికందనున్నాయి. ఈ పట్టాలకు వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గుర్తింపు లేకపోవడంతో అవి ఎందుకూ పనికిరాకుండా పోయే ప్రమాదముంది. ఈ పట్టాలతో ఏవైనా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోలేని దుస్థితి. 15 రోజుల క్రితం పశువైద్య కళాశాల హాస్టల్ భవనాలు, పశువుల ఫాం ప్రారంభించడానికి జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నాల లక్ష్మయ్య, మంత్రి శ్రీధర్‌బాబు, ఎంపీ మధుయాష్కీ, ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు కళాశాలకు వచ్చారు. కళాశాల గుర్తింపు విషయమై వీరిని విద్యార్థులు నిలదీశారు. వెంటనే గుర్తింపు వచ్చే చర్యలు తీసుకుంటామని విద్యార్థులకు సర్దిచెప్పి కార్యక్రమం అయిందనిపించుకున్న నాయకులు... అనుమతి విషయమే మరిచిపోయారు. విద్యార్థుల భవిష్యత్ దృష్టిలో ఉంచుకుని కోరుట్ల పశువైద్య కళాశాలకు వెంటనే వీసీఐ గుర్తింపు వచ్చేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరముంది. గుర్తింపునకు కృషి : విద్యాసాగర్‌రావు, ఎమ్మెల్యే కోరుట్ల పశువైద్యశాలకు వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గుర్తింపు ఇప్పించాలని ఇదివరకు ఓ సారి ముఖ్యమంత్రికి వినతి చేశాం. ఆయన సానుకూలంగా స్పందించారు. ప్రస్తుతం కళాశాలకు అన్ని వసతులు కల్పించాం. ఇప్పుడు వీసీఐ గుర్తింపు విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉండకపోవచ్చు. నా పరిధిలో కళాశాల గుర్తింపు కోసం శాయశక్తులా కృషి చేస్తా. విద్యార్థులు ఆందోళన చెందవద్దు.