మేల్కొంటున్నారు
మేల్కొంటున్నారు
Published Thu, Dec 8 2016 11:46 PM | Last Updated on Mon, Sep 4 2017 10:14 PM
ప్రయోగాలపై పట్టు సాధిస్తున్న విద్యార్థులు
జంబ్లింగ్ విధానం ఖరారుతో ముమ్మర సాధన
బాలాజీచెరువు(కాకినాడ) :ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఈ ఏడాది నుంచి ప్రయోగ పరీక్షలను జంబ్లింగ్ విధానంలో నిర్వహించనున్నారు. దీంతో ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో సైన్స్ విద్యార్థులు ప్రయోగంపై పట్టు సాధించి మంచి మార్కులు కైవసం చేసుకునేందుకు శ్రమిస్తున్నారు.
ఉన్నది రెండు నెలలే..
ప్రయోగ పరీక్షలు 2017 ఫిబ్రవరిలో నిర్వహించనున్నారు. ఇటీవల వరకు ఈ పరీక్షలు విద్యార్థులు ఏ కళాశాలలో చదువుతున్నారో! అక్కడే జరిగేవి. ఈ విధానం వల్ల కొంత మంది విద్యార్థులకు ఎక్కువ మార్కులు వేస్తున్నారనే ఆరోపణలు వినిపిం చాయి. చాలా ప్రైవేట్ కళాశాల్లో ప్రయోగశాలలు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయకుండా తూతూమంతంగా విద్యార్థులను తయారు చేస్తున్నారనే విమర్శలు వినిపించాయి. పరీక్షల నిర్వహణకు వచ్చే వారిని ప్రసన్నం చేసుకుని ఎక్కువ మా ర్కులు ప్రైవేట్ కళాశాలల విద్యార్థులకు వేస్తున్నారనే అపవా దూ ఉంది. ఈ నేపథ్యలో ప్రభుత్వం ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్‌కు జంబ్లింగ్ విధానం ప్రకటిస్తూనే పరీక్షలు దగ్గరికి వచ్చే సరికి వాయిదా వేస్తూ వచ్చారు. ఈ సారి మాత్రం ముందుగానే కొత్త విధానంలో ప్రయోగ పరీక్షలు జరుగుతాయని స్పష్టం చేయడంతో అన్ని కళాశాలలు ఈ ప్రాక్టికల్స్‌పై దృష్టిసారించాయి. ఏంపీసీ విద్యార్థులు భౌతిక, రసాయనశాస్రా్తలు, బైపీసీ విద్యార్థులు రసాయన, భౌతిక శాస్రా్తలతో పాటు వృక్ష, జంతు శాస్రా్తల ప్రయోగాలపై పట్టు సాధిస్తున్నారు. సమయం రెండు నెలలే ఉండడంతో విద్యార్థులు రికార్డులు, రసాయనాల విశ్లేషణ, కణజాలల గుర్తింపు, స్‌లైడ్ చూడటం, బొమ్మల తర్ఫీదు వంటి పనుల్లో బిజీగా ఉన్నారు. అ«లాగే అధ్యాపకులు విద్యార్థులను జంబ్లింగ్ విధానానికి అనుగుణంగా సిద్ధం చేస్తున్నారు.
జంబ్లింగ్ ప్రాక్టికల్స్‌కు ఏర్పాట్లు పూర్తి
ఈ ఏడాది ఇంటర్‌మీడియట్ ప్రాక్టికల్స్ జంబ్లింగ్ విధానంలోనే జరుగుతాయి. విద్యార్థులకు ఏవిధమైన అసౌకర్యం లేకుండా ల్యాబ్‌లలో సౌకర్యాలు ఏర్పాటు చేయాలని పరీక్ష కేంద్రాల నిర్వాహకులను ఆదేశించాం.
– ఎం.వేంకటేష్, ఇంటర్మీడియట్ కళాశాలల తనిఖీ అధికారి, రాజమండ్రి
Advertisement
Advertisement