JUMBLING
-
గాంధీలో శిశువులను జంబ్లింగ్ చేసిన మహిళ
గాంధీఆస్పత్రి: తెలంగాణ వైద్యప్రదాయినిగా పేరుగాంచిన సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి ఇటీవల సంచలన ఘటనలకు ప్రధాన కేంద్రమైంది. గాంధీ ఆస్పత్రి ఎన్ఐసీయూ వార్డులో శిశువులను తారుమారు చేసిన సంఘటన మంగళవారం కలకలం సృష్టించింది. ఆడశిశువుకు బదులుగా మగశిశువును తీసుకువెళ్లిన మహిళను సీసీ కెమెరాల పుటేజీ ఆధారంగా పట్టుకుని కిడ్నాప్ కేసు నమోదు చేశారు. చిలకలగూడ సీఐ బాలగంగిరెడ్డి, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. మాసబ్‌ట్యాంక్ చాచానెహ్రూనగర్‌కు చెందిన సఫియాభాను కాన్పు కోసం కోసం గాంధీ ఆస్పత్రి గైనకాలజీ విభాగంలో చేరింది. ఈ నెల 21న ఆమె మగశిశువుకు జన్మనిచ్చింది. త్వరితగతిన స్వస్థత చేకూరేందుకు శిశువును పిడియాట్రిక్ విభాగంలోని ఎన్ఐసీయూ వార్డులోని ఇంక్యుబేటర్ (వైద్యపరికరం)లో ప్రతిరోజు కొంతసమయం పెడుతున్నారు. వెస్ట్‌బెంగాల్ న్యూజల్పైగురి జిల్లా కెలావాడీ గ్రామానికి చెందిన ఫూల్‌మణిమహాలీ, సోనుమహాలీలు భార్యభర్తలు. కొంతకాలం క్రితం నగరానికి వలస వచ్చి నాచారం మల్లాపూర్‌లోని వెంకటాపురం కాలనీలో ఉంటూ కూలిపనులతో జీవనోపాధి పొందుతున్నారు. గర్భిణి అయిన ఫూల్‌మణి కొద్దిరోజుల క్రితం గాంధీ ఆస్పత్రిలో చేరి ఆడశిశువుకు జన్మనిచ్చింది. ఆ శిశువును కూడా ఎన్ఐసీయూలోని ఇంక్యూబేటర్లో పెడుతున్నారు. ఈ నేపధ్యంలో మంగళవారం ఇరువురు శిశువులను ప్రక్కప్రక్కన గల ఇంక్యుబేటర్‌లో పెట్టారు. ఫూల్‌మణిని పరామర్శించేందుకు ఆమె సోదరి సరితనాయక్, బావ మంజీత్‌నాయక్‌లు మంగళవారం ఉదయం గాంధీఆస్పత్రికి వచ్చారు. సోదరి ఫూల్‌మణికి ఆడపిల్ల పుట్టిందని తెలుసుకున్న సరితనాయక్ మనస్తాపానికి గురైంది. పీఐసీయూ ఇంక్యుబేటర్‌లో తమకు చెందిన ఆడశిశువు పక్కనే మగశిశువు ఉన్నట్లు గమనించింది. మంగళవారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో వైద్యులు, సిబ్బంది కళ్లుగప్పి ఇంక్యుబేటర్‌లో ఉన్న మగ శిశువును తీసుకుని ఆస్పత్రి బయటకు వెళ్లేందుకు యత్నించింది. పీఐసీయూ వద్ద కాపలాగా ఉన్న సఫియాభాను సోదరి సాదియాభాను కొంతసేపటి తర్వాత ఇంక్యుబేటర్‌లో మగశిశువు లేని విషయాన్ని గమనించి ఎన్ఐసీయూ వైద్యులు, సిబ్బందికి చెప్పింది. స్పందించిన వైద్యులు సెక్యూరిటీ సిబ్బందిని ఎలర్ట్ చేసి ఆస్పత్రి పాలన యంత్రాంగానికి సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న అవుట్‌పోస్టు పోలీసులు ఎన్ఐసీయూ వద్దకు చేరుకున్నారు. సీసీ కెమెరాల పుటేజీ పరిశీలించగా ఇంక్యుబేటర్‌లో ఉన్న మగశిశువును సరితనాయక్ తీసుకువెళ్తున్నట్లు గుర్తించారు. సరితానాయక్‌ను ఆస్పత్రి ప్రాంగణంలో అడ్డుకున్నారు. పొరపాటు జరిగిందని బుకాయించేందుకు ఆమె ప్రయత్నించింది. సోదరికి ఆడశిశువు పుట్టిందని తెలియడంతో మనస్తాపానికి గురయ్యానని, అందుకే ఇంక్యుబేటర్‌లో ఉన్న మగశిశువును తీసుకువెళ్లేందుకు ప్రయత్నించానని పోలీసుల విచారణలో వెల్లడించింది. తారుమారైన శిశువులను తల్లుల చెంతకు చేర్చడంతో కథ సుఖాంతమైంది. బాధితురాలు సఫియాభాను సోదరి సాదియాబానుతోపాటు, గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రవణ్‌కుమార్ ఫిర్యాదుల మేరకు నిందితురాలు సరితనాయక్‌పై కిడ్నాప్ కేసు నమోదు చేసినట్లుచిలకలగూడ సీఐ బాలగంగిరెడ్డి స్పష్టం చేశారు. -
జబ్లింగ్ విధానంలోనే ప్రాక్టికల్స్
– నేటి నుంచి ప్రారంభం కర్నూలు(సిటీ): ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్ పరీక్షల్లో జబ్లింగ్ విధానాన్ని అడ్డుకోవాలని ప్రయత్నించిన కార్పొరేట్ల ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఆరేళ్ల తర్వాత ఎట్టకేలకు జబ్లింగ్ విధానంలోనే ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. శుక్రవారం నుంచి ఈనెల 22వరకు జిల్లాలో మొత్తం 93 కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందుకు 20,734 మంది విద్యార్థులు హాజరు కానున్నట్లు బోర్డు అధికారులు తెలిపారు. -
‘జంబ్లింగ్’ రద్దు కోసం ధర్నా
కర్నూలు సిటీ: ఇంటర్మీడియట్ కాలేజీ విద్యార్థులకు ప్రాక్టికల్‌లో అమలు చేస్తున్న జంబ్లింగ్ విధానాన్ని రద్దు చేయాలని ప్రైవేటు జూనియర్ కాలేజీల యాజమాన్య సంఘం డిమాండ్ చేసింది. సోమవారం ఆ సంఘం ఆధ్వర్యంలో రాజ్‌విహార్ సెంటర్ నుంచి పెద్దపార్కు, పాత కంట్రోల్ రూం మీదుగా భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్ఐఓ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆ సంఘం నాయకులు శేషిరెడ్డి, వెంకటేశ్వర్లు, చంద్రశేఖర్‌లు మాట్లాడుతూ.. ఇంటర్ ప్రాక్టికల్స్‌లో మొట్ట మొదటి సారిగా అమలు చేస్తున్న జంబ్లింగ్ విధానంతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు కాలేజీలన్నీ ప్రభుత్వ విధానాన్ని వ్యతిరేకిస్తున్నాయన్నారు. అనంతరం ఆర్ఐఓ వై.పరమేశ్వరరెడ్డికి వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు రామచంద్రారెడ్డి, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
జంబ్లింగ్‌లో గ్యాంబ్లింగ్
- జంబ్లింగ్‌లో ‘కార్పొరేట్’ మాయ - సెంటర్లను మార్చుకున్న కార్పొరేట్ కాలేజీలు? - ఇంటర్ బోర్డులో చక్రం తిప్పిన వైనం - వ్యతిరేకిస్తున్న ప్రైవేట్ కళాశాలలు సాక్షి ప్రతినిధి, కర్నూలు: రెండు కార్పొరేట్ జూనియర్ కళాశాలలు..పరస్పర అవగాహన..ఫలితం..జంబ్లింగ్ ప్రాక్టికల్ పరీక్షలు అపహాస్యం. ఆ కాలేజీలోని విద్యార్థులు ఈ కాలేజీ...ఈ కాలేజీలోని విద్యార్థులు ఆ కాలేజీలో పరీక్ష రాసే ఒప్పదం.. జంబ్లింగ్ పేరుతో పరీక్ష సెంటర్ల ఏర్పాటులో జరిగిన అక్రమాలు ఇవి. ఇందుకు జిల్లా కేంద్రమైన కర్నూలు నగరమే సాక్షి. కుడిఎడమైతే పొరపాటులేదోయ్ అనుకున్నారో ఏమో కానీ అధికారులు కూడా జంబ్లింగ్ విధానమని మోసం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జంబ్లింగ్ పేరుతో జరుగుతున్న ఈ మొత్తం నాటకం కేవలం రెండు కాలేజీలకే మేలు చేసేందుకే అన్న ఆరోపణలూ తాజాగా వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా జంబ్లింగ్ అసలు స్ఫూర్తితో ప్రాక్టికల్స్ పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం ఉంది. మరోవైపు తమను నష్టం చేసేందుకే ఈ జంబ్లింగ్ నాటకం తెరమీదకు వచ్చిందనే ప్రైవేటు కాలేజీలు మండిపడుతున్నాయి. వ్యతిరేకిస్తున్న ప్రైవేట్ కాలేజీలు...! కార్పొరేట్ కాలేజీలు ఆడుతున్న నాటకంలో విద్యార్థులతో పాటు సాధారణ ప్రైవేటు కాలేజీలు కూడా ఇబ్బందులు పడుతున్నాయి. అసలు ప్రాక్టికల్స్ పరీక్షలకు జంబ్లింగ్ విధానం దేశంలో ఎక్కడా లేదని వాదిస్తున్నాయి. ఇది కార్పొరేట్ కాలేజీలు ఆడుతున్న నాటకం అని మండిపడుతున్నాయి. రెండు కార్పొరేట్ కాలేజీలు సెంటర్లను తమకిష్టం వచ్చినట్టుగా కేటాయించుకుని....తమ విద్యార్థులను సమిధలు చేస్తున్నాయని వాపోతున్నాయి. ఇంటర్ ఫలితాల్లో ఈ రెండు కార్పొరేట్ కాలేజీలను కాదని తమ విద్యార్థులకు ర్యాంకులు వస్తుండటంతో ఈ విధంగా కేవలం వారు మాత్రమే లాభపడి... తమ విద్యార్థులను మోసం చేస్తున్నాయనేది సాధారణ ప్రైవేటు కాలేజీ యాజమాన్యాల వాదనగా ఉంది. అయితే, అంతిమంగా విద్యార్థులు మాత్రమే ఈ మొత్తం వ్యవహారంలో నష్టపోతున్నారు. విద్యార్థులే సమిధలు.. వాస్తవానికి ఇటు జంబ్లింగ్ విధానమైనా... సాధారణ విధానంలోనైనా విద్యార్థులే ఇబ్బందుల పాలవుతున్నారు. అటు కార్పొరేట్ కాలేజీల్లోనూ ఇటు ప్రైవేటు కాలేజీల్లోనూ ప్రాక్టికల్స్ పరీక్షలు జరగడం లేదు. వాస్తవానికి ప్రాక్టికల్స్ పరీక్షల్లో వచ్చే సబ్జెక్టును ప్రయోగాత్మకంగా చేసి చూస్తే థియరీ పరీక్షలు రాసే సమయంలో వారికి ఉపయుక్తంగా ఉంటుంది. అయితే, ఎక్కడా కూడా ప్రాక్టికల్స్ పరీక్షలు జరగడం లేదు. ఫలితంగా తీరా పరీక్ష సమయానికి వచ్చే సరికి విద్యార్థులు తెల్లమొహం వేయాల్సి వస్తోంది. దీంతో దీనిని తమకు అనుకూలంగా మార్చుకుని కాలేజీ యాజమాన్యాలు పరీక్ష పాస్ కావాలంటే సబ్జెక్టుకు ఇంత మొత్తం ఇవ్వాలని వసూలు చేస్తున్నాయి. ఈ మొత్తాన్ని పరీక్షను పర్యవేక్షించేందుకు వచ్చే ఇన్విజిలేటర్లకు ఇస్తున్నామని బహిరంగంగానే విద్యార్థులకు చెబుతున్నాయి. మీకు 30కి 30 మార్కులు ఏమీ చేయకపోయినా రావాలంటే సబ్జెక్టుకు కొంత మొత్తం ఇవ్వాలని యాజమాన్యాలు ఖరాఖండిగా తేల్చిచెబుతున్నాయి. అంటే కాలేజీలు చేస్తున్న తప్పునకు విద్యార్థులు ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తోందన్నమాట. కాలేజీల కేటాయింపు అధికారం బోర్డుదే: వై. పరమేశ్వరరెడ్డి, ఆర్ఐవో జంబ్లింగ్ విధానంలో పరీక్షా కేంద్రాలను కేటాయించే అధికారం ఇంటర్మీడియట్ బోర్డుకు ఉంటుంది. ఆ కాలేజీ విద్యార్థులు ఈ కాలేజీలో.. ఈ కాలేజీ విద్యార్థులు ఆ కాలేజీలో పడ్డారన్న సమాచారం లేదు. అయితే, జంబ్లింగ్ విధానంలో ఏ కాలేజీ విద్యార్థులు అదే కాలేజీలో మాత్రం పరీక్ష రాసేందుకు అవకాశం ఉండదు. -
విద్యార్థుల్లో పిరికితనం నూరిపోయకండి
కలెక్టర్ భాస్కర్ ఏలూరు సిటీ: ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళి రాణించేలా భావిభారత పౌరులను తీర్చిదిద్దాలే తప్ప వారిలో పిరికితనం, కష్టపడకుండా జీవించే మనస్తత్వాన్ని ప్రొత్సహించవద్దని కలెక్టరు కాటంనేని భాస్కర్ కళాశాల అధినేతలకు హితవు పలికారు. కలెక్టరేట్లో ఇంటర్మీడియట్ విద్యార్థులకు జంబ్లింగ్ సౌకర్యం వద్దని దానివల్ల విద్యార్ధులు ఎంతో కష్టపడాల్సి వస్తుందని, పలు కళాశాలల అధిపతులు విద్యార్ధులకు కలెక్టరకు అందచేసిన వినతిపత్రంపై కలెక్టరు స్పందించారు. పారదర్శకంగా జంబ్లింగ్ విధానాన్ని నిర్వహిస్తుంటే అభ్యంతరం ఏమిటని కలెక్టరు ప్రశ్నించారు. ఇదేనా మన పిల్లలకు పిరికితనం నూరిపోయడం ? కష్టపడవద్దని చెప్పడం మంచిది కాదని ఒక కళాశాలలో చదువుతూ మరొక కళాశాలకు వెళ్ళి పరీక్ష వ్రాయమంటే బాధపడిపోతే ఎలా ? ఉన్నత చదువులు కోసం ఉద్యోగాలు కోసం భవిష్యత్తు కోసం ప్రపంచంలో ఏ దేశానికైనా వెళ్ళి రాణించే స్దాయిలో మన యువతను తీర్చిదిద్దాలే తప్ప ప్రతిదానికి కుంఠిసాకులు చెప్పి యువతలో ఒక విధమైన నైరాస్యతకు చొప్పించడం మంచిది కాదన్నారు. తాను కూడా అనేక పరీక్షలు వ్రాశానని ఆనాడు కష్టపడి చదవబట్టే ఈ రోజు కలెక్టరు హోదాలో ఇక్కడ పనిచేస్తున్నానని చదివేటప్పుడు మరింత కష్టపడి చదివేలా తల్లిదండ్రులు, కళాశాల యాజమాన్యం ప్రొత్సాహించాలే తప్ప నిరాశ, నిస్పృహలను కల్పించవద్దన్నారు. -
పరీక్షా కాలం
ఏలూరు సిటీ : ఇంటర్మీడియెట్ పరీక్షలు దగ్గర పడుతున్నాయి. తొలిసారిగా ప్రాక్టికల్ పరీక్షలు సైతం జంబ్లింగ్ విధానంలో జరగనున్నాయి. సంక్రాంతి సెలవులు ముగిశాక.. పక్షం రోజుల్లోనే ప్రయోగ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 3వ తేదీ నుంచి 22 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. విద్యార్థులు పరీక్షా కేంద్రాల్లోని సైన్స్ ల్యాబ్‌లను సందర్శించి.. అక్కడి పరిస్థితులను ముందుగానే పరిశీలించుకునే అవకాశాన్ని అధికారులు కల్పించారు. ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థులు ఈనెల 28న ఎథిక్స్ అండ్ హ్యుమన్ వేల్యూస్, 31న ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్షలు రాయాల్సి ఉంటుంది. 21,925 మంది విద్యార్థులు ప్రాక్టికల్ పరీక్షలను ఫిబ్రవరి 3నుంచి 22వ తేదీ వరకూ నిర్వహిస్తారు. ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా 61 కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో ప్రభుత్వ కాలేజీల్లో 29, ఎయిడెడ్ కళా శాలల్లో 11, ప్రైవేట్ విద్యాసంస్థల్లో 21 కేంద్రాలు ఉన్నాయి. ఉదయం 9నుంచి 12గంటల వరకు, మధ్యాహ్నం 2నుంచి 5గంటల వరకూ పరీక్షలు నిర్వహిస్తారు. బైపీసీ విద్యార్థులు 4,662 మంది, ఎంపీసీ విద్యార్థులు 17,263 మంది కలిపి 21,925 మంది ప్రాక్టికల్స్‌కు హాజరు కావాల్సి ఉంది. పబ్లిక్ పరీక్షలకు 104 కేంద్రాలు ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షలను మార్చి 1నుంచి 18వ తేదీ వరకు నిర్వహిస్తారు. ఉదయం 9నుంచి 12గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. ఇందుకోసం జిల్లావ్యాప్తంగా 104 కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటిలో ప్రభుత్వ కాలేజీలు 29, ఎయిడెడ్ కళాశాలలు 14, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కాలేజీలు 3, ప్రైవేట్ విద్యాసంస్థలు 58 ఉన్నాయి. ఫస్టియర్ విద్యార్థుల్లో జనరల్ 33,499 మంది, ఒకేషనల్ 4,011 మంది ఉన్నారు. సెకండ్ ఇంటర్లో జనరల్ విద్యార్థులు 32,211 మంది, ఒకేషనల్ విద్యార్థులు 3,516 మంది పరీక్షలు రాయాల్సి ఉంది. జిల్లాలో 194 జూనియర్ కాలేజీలు, 60 ఒకేషనల్ కళాశాలలు ఉన్నాయి. పరీక్షలకు అంతా సిద్ధం ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్ పరీక్షలను జంబ్లింగ్ విధానంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం. పరీక్షా కేంద్రాలు ఉన్న కళాశాలల ప్రిన్సిపల్స్‌కు ల్యాబ్‌లు సిద్ధం చేయాలని ఆదేశాలిచ్చాం. విద్యార్థులు సైన్సు ల్యాబ్‌లను ముందుగానే పరిశీ లించుకునే అవకాశం కల్పించాం. ఈనెల 19న కలెక్టరేట్లో ఇంటర్ విద్యామండలి కమిషనర్‌తో జరిగే వీడియో కాన్ఫరెన్స్‌కు జిల్లాలోని 61 పరీక్షా కేంద్రాల ప్రిన్సిపల్స్ విధిగా హాజరుకావాలి. – ఎస్ఏ ఖాదర్, ఆర్ఐవో -
మేల్కొంటున్నారు
ప్రయోగాలపై పట్టు సాధిస్తున్న విద్యార్థులు జంబ్లింగ్ విధానం ఖరారుతో ముమ్మర సాధన బాలాజీచెరువు(కాకినాడ) :ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఈ ఏడాది నుంచి ప్రయోగ పరీక్షలను జంబ్లింగ్ విధానంలో నిర్వహించనున్నారు. దీంతో ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో సైన్స్ విద్యార్థులు ప్రయోగంపై పట్టు సాధించి మంచి మార్కులు కైవసం చేసుకునేందుకు శ్రమిస్తున్నారు. ఉన్నది రెండు నెలలే.. ప్రయోగ పరీక్షలు 2017 ఫిబ్రవరిలో నిర్వహించనున్నారు. ఇటీవల వరకు ఈ పరీక్షలు విద్యార్థులు ఏ కళాశాలలో చదువుతున్నారో! అక్కడే జరిగేవి. ఈ విధానం వల్ల కొంత మంది విద్యార్థులకు ఎక్కువ మార్కులు వేస్తున్నారనే ఆరోపణలు వినిపిం చాయి. చాలా ప్రైవేట్ కళాశాల్లో ప్రయోగశాలలు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయకుండా తూతూమంతంగా విద్యార్థులను తయారు చేస్తున్నారనే విమర్శలు వినిపించాయి. పరీక్షల నిర్వహణకు వచ్చే వారిని ప్రసన్నం చేసుకుని ఎక్కువ మా ర్కులు ప్రైవేట్ కళాశాలల విద్యార్థులకు వేస్తున్నారనే అపవా దూ ఉంది. ఈ నేపథ్యలో ప్రభుత్వం ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్‌కు జంబ్లింగ్ విధానం ప్రకటిస్తూనే పరీక్షలు దగ్గరికి వచ్చే సరికి వాయిదా వేస్తూ వచ్చారు. ఈ సారి మాత్రం ముందుగానే కొత్త విధానంలో ప్రయోగ పరీక్షలు జరుగుతాయని స్పష్టం చేయడంతో అన్ని కళాశాలలు ఈ ప్రాక్టికల్స్‌పై దృష్టిసారించాయి. ఏంపీసీ విద్యార్థులు భౌతిక, రసాయనశాస్రా్తలు, బైపీసీ విద్యార్థులు రసాయన, భౌతిక శాస్రా్తలతో పాటు వృక్ష, జంతు శాస్రా్తల ప్రయోగాలపై పట్టు సాధిస్తున్నారు. సమయం రెండు నెలలే ఉండడంతో విద్యార్థులు రికార్డులు, రసాయనాల విశ్లేషణ, కణజాలల గుర్తింపు, స్లైడ్ చూడటం, బొమ్మల తర్ఫీదు వంటి పనుల్లో బిజీగా ఉన్నారు. అ«లాగే అధ్యాపకులు విద్యార్థులను జంబ్లింగ్ విధానానికి అనుగుణంగా సిద్ధం చేస్తున్నారు. జంబ్లింగ్ ప్రాక్టికల్స్‌కు ఏర్పాట్లు పూర్తి ఈ ఏడాది ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్ జంబ్లింగ్ విధానంలోనే జరుగుతాయి. విద్యార్థులకు ఏవిధమైన అసౌకర్యం లేకుండా ల్యాబ్‌లలో సౌకర్యాలు ఏర్పాటు చేయాలని పరీక్ష కేంద్రాల నిర్వాహకులను ఆదేశించాం. – ఎం.వేంకటేష్, ఇంటర్మీడియట్ కళాశాలల తనిఖీ అధికారి, రాజమండ్రి -
ఇంటర్ ప్రాక్టికల్స్ ‘జంబ్లింగ్’
–జిల్లాలో 61 పరీక్షా కేంద్రాలు – మూడునెలల ముందే ప్రకటన ఏలూరు సిటీ : ఇంటర్మీడియెట్ విద్యార్థులు ఈ ఏడాది జంబ్లింగ్ విధానంలో ప్రాక్టికల్ పరీక్షలు రాయాల్సి ఉంది. కొన్నేళ్లుగా ప్రాక్టికల్ పరీక్షల్లో జంబ్లింగ్ విధానాన్ని వాయిదా వేస్తూ వచ్చిన ఇంటర్మీడియట్ విద్యామండలి ఈసారి కచ్చితంగా అమ లు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు మూడు నెలల ముందే జంబ్లింగ్ పరీక్షా కేంద్రాలను ప్రకటించారు. జిల్లావ్యాప్తం గా ప్రాక్టికల్ పరీక్షలకు 61 పరీక్షా కేంద్రాలను ఎంపిక చేశారు. ఆయా కళాశాలల యాజమాన్యాలు తగు జాగ్రత్తలు పాటిం చాల్సి ఉంది. నిర్దేశించిన పరీక్షా కేంద్రం లో ఆయా కాలేజీల విద్యార్థులు ల్యాబ్‌లకు వెళ్లి అవగాహన తెచ్చుకునే వెసులుబాటు కల్పించారు. ఫిబ్రవరిలో జరిగే ప్రాక్టికల్ పరీక్షలకు ముందుస్తు చర్యల్లో భాగంగానే కేంద్రాలను ప్రకటించారు. జిల్లాలోని 254 జూనియర్ కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులను సిద్ధం చేసేందుకు అవకాశం కల్పించారు. పరీక్షా కేంద్రాలివే.. ∙తాడేపల్లిగూడెం : తాడేపల్లిగూడెం ప్రభుత్వ జూనియర్ కళాశాల, డాక్టర్ గోయెంకా జూనియర్ కాలేజ్, ప్రభుత్వ జూనియర్ కాలేజ్, పెంటపాడు, శ్రీ వాసవీ కాలేజ్, తాడేపల్లిగూడెం. ∙పాలకొల్లు : ఆదిత్య కళాశాల, పాలకొల్లు, ప్రభుత్వ బాలుర కళాశాల పాలకొల్లు, ప్రభుత్వ బాలికల కళాశాల, పాలకొల్లు, కేవీఎం చాంబర్స్ కళాశాల, పాలకొల్లు. ∙భీమవరం : డాక్టర్ సీఎస్ఎన్ కాలేజ్, శ్రీచైతన్య జూనియర్ కాలేజ్, డీఎన్ఆర్ కాలేజ్, ఆదిత్య జూనియర్ కాలేజ్, శ్రీ సాయి ఆదిత్య కాలేజ్, బ్రౌనింగ్ జూనియర్ కాలేజ్ ∙తణుకు: ఎస్సీఐఎం జీజేసీ, తణుకు, ప్రగతి కాలేజ్, నారాయణ కాలేజ్, శశి జూనియర్ కాలేజ్, ఎస్‌ఎన్‌వీటీ జీజేసీ తణుకు. ∙ఏలూరు: ప్రభుత్వ జూనియర్ కాలేజ్, ఏలూరు, ఎస్‌పీడీబీటీ కాలేజ్, సెయింట్ థెరిస్సా బాలికల కాలేజ్, ఎన్ఆర్ఐ కాలేజ్, సర్ సీఆర్ఆర్ కాలేజ్, శశి జూనియర్ కాలేజ్ ఏలూరు, డీపాల్ కాలేజ్, పినకడిమి ∙నరసాపురం: ఆదిత్య కళాశాల, బీజీబీఎస్ ఉమెన్స్ కాలేజ్ నరసాపురం. ∙కొవ్వూరు : జీజేసీ బాలుర కళాశాల, జీజేసీ బాలికల కళాశాల కొవ్వూరు, శ్రీచైతన్య వేములూరు ∙నిడదవోలు : జీజేసీ బాలుర కళాశాల, జీజేసీ బాలికల కళాశాల నిడదవోలు ∙పోలసానిపల్లి : ఏపీఎస్‌డబ్ల్యూఆర్ (బాలిక) పోలసానిపల్లి ∙కొయ్యలగూడెం : ప్రభుత్వ జూనియర్ కాలేజ్ కొయ్యలగూడెం ∙గోపాలపురం : ఏపీఎస్‌డబ్ల్యూఆర్ బాలికల కళాశాల, గోపాలపురం ∙చింతలపూడి : ప్రభుత్వ జూనియర్ కాలేజ్ చింతలపూడి ∙జంగారెడ్డిగూడెం : ప్రభుత్వ జూనియర్ కాలేజ్, సూర్య కాలేజ్ జంగారెడ్డిగూడెం, బుట్టాయగూడెం ప్రభుత్వ జూనియర్ కాలేజ్ ∙అత్తిలి జోన్: ఎస్వీఎస్ఎస్ జీజేసీ, అత్తిలి ∙పెనుగొండ : ఎస్వీకేపీ అండ్ పీవీ కాలేజ్ పెనుగొండ, ఎంవీఆర్ జీజేసీ ఆచంట ∙వీరవాసరం : వీఈసీ కళాశాల, వీరవాసరం ∙వేగేశ్వరపురం : ప్రభుత్వ జూనియర్ కాలేజ్, వేగేశ్వరపురం ∙నల్లజర్ల : డాక్టర్ ఎస్ఆర్కే అండ్ కేఎస్ఆర్ కో–ఆప్ కాలేజ్ ∙దుంపగడప ఏకేపీఎస్ జీజేసీ ∙నారాయణపురం జీజేసీ ∙గణపవరం జీజేసీ ∙పెదవేగి ఏపీఎస్‌డబ్ల్యూఆర్(బీ) ∙యండగండి జీజేసీ ∙జీలుగుమిల్లి జీజేసీ ∙వేరేరుపాడు జీజేసీ ∙కుకునూరు జీజేసీ ల్యాబ్‌లపై అవగాహన కోసం.. ఈ విద్యాసంవత్సరం నుంచి ఇంటర్ విద్యార్థులకు ప్రాక్టికల్ పరీ క్షలు జంబ్లింగ్ విధానంలో నిర్వహించేం దుకు చర్యలు చేపట్టాం. విద్యార్థులు కావాలంటే పరీక్షా కేంద్రాలకు వెళ్లి అక్కడ ప్రాక్టికల్స్‌పై అవగాహన పెంచుకోవచ్చు. ప్రాక్టికల్ పరీక్షలపై విద్యార్థులు భయపడకుండా ఉండేలా అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకున్నాం. పారదర్శకంగా పరీక్షలు నిర్వహిస్తాం. – ఎస్ఏ ఖాదర్, ఆర్ఐవో -
ఇంటర్ ప్రాక్టికల్స్ ‘జంబ్లింగ్’
–జిల్లాలో 61 పరీక్షా కేంద్రాలు – మూడునెలల ముందే ప్రకటన ఏలూరు సిటీ : ఇంటర్మీడియెట్ విద్యార్థులు ఈ ఏడాది జంబ్లింగ్ విధానంలో ప్రాక్టికల్ పరీక్షలు రాయాల్సి ఉంది. కొన్నేళ్లుగా ప్రాక్టికల్ పరీక్షల్లో జంబ్లింగ్ విధానాన్ని వాయిదా వేస్తూ వచ్చిన ఇంటర్మీడియట్ విద్యామండలి ఈసారి కచ్చితంగా అమ లు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు మూడు నెలల ముందే జంబ్లింగ్ పరీక్షా కేంద్రాలను ప్రకటించారు. జిల్లావ్యాప్తం గా ప్రాక్టికల్ పరీక్షలకు 61 పరీక్షా కేంద్రాలను ఎంపిక చేశారు. ఆయా కళాశాలల యాజమాన్యాలు తగు జాగ్రత్తలు పాటిం చాల్సి ఉంది. నిర్దేశించిన పరీక్షా కేంద్రం లో ఆయా కాలేజీల విద్యార్థులు ల్యాబ్‌లకు వెళ్లి అవగాహన తెచ్చుకునే వెసులుబాటు కల్పించారు. ఫిబ్రవరిలో జరిగే ప్రాక్టికల్ పరీక్షలకు ముందుస్తు చర్యల్లో భాగంగానే కేంద్రాలను ప్రకటించారు. జిల్లాలోని 254 జూనియర్ కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులను సిద్ధం చేసేందుకు అవకాశం కల్పించారు. పరీక్షా కేంద్రాలివే.. ∙తాడేపల్లిగూడెం : తాడేపల్లిగూడెం ప్రభుత్వ జూనియర్ కళాశాల, డాక్టర్ గోయెంకా జూనియర్ కాలేజ్, ప్రభుత్వ జూనియర్ కాలేజ్, పెంటపాడు, శ్రీ వాసవీ కాలేజ్, తాడేపల్లిగూడెం. ∙పాలకొల్లు : ఆదిత్య కళాశాల, పాలకొల్లు, ప్రభుత్వ బాలుర కళాశాల పాలకొల్లు, ప్రభుత్వ బాలికల కళాశాల, పాలకొల్లు, కేవీఎం చాంబర్స్ కళాశాల, పాలకొల్లు. ∙భీమవరం : డాక్టర్ సీఎస్ఎన్ కాలేజ్, శ్రీచైతన్య జూనియర్ కాలేజ్, డీఎన్ఆర్ కాలేజ్, ఆదిత్య జూనియర్ కాలేజ్, శ్రీ సాయి ఆదిత్య కాలేజ్, బ్రౌనింగ్ జూనియర్ కాలేజ్ ∙తణుకు: ఎస్సీఐఎం జీజేసీ, తణుకు, ప్రగతి కాలేజ్, నారాయణ కాలేజ్, శశి జూనియర్ కాలేజ్, ఎస్‌ఎన్‌వీటీ జీజేసీ తణుకు. ∙ఏలూరు: ప్రభుత్వ జూనియర్ కాలేజ్, ఏలూరు, ఎస్‌పీడీబీటీ కాలేజ్, సెయింట్ థెరిస్సా బాలికల కాలేజ్, ఎన్ఆర్ఐ కాలేజ్, సర్ సీఆర్ఆర్ కాలేజ్, శశి జూనియర్ కాలేజ్ ఏలూరు, డీపాల్ కాలేజ్, పినకడిమి ∙నరసాపురం: ఆదిత్య కళాశాల, బీజీబీఎస్ ఉమెన్స్ కాలేజ్ నరసాపురం. ∙కొవ్వూరు : జీజేసీ బాలుర కళాశాల, జీజేసీ బాలికల కళాశాల కొవ్వూరు, శ్రీచైతన్య వేములూరు ∙నిడదవోలు : జీజేసీ బాలుర కళాశాల, జీజేసీ బాలికల కళాశాల నిడదవోలు ∙పోలసానిపల్లి : ఏపీఎస్‌డబ్ల్యూఆర్ (బాలిక) పోలసానిపల్లి ∙కొయ్యలగూడెం : ప్రభుత్వ జూనియర్ కాలేజ్ కొయ్యలగూడెం ∙గోపాలపురం : ఏపీఎస్‌డబ్ల్యూఆర్ బాలికల కళాశాల, గోపాలపురం ∙చింతలపూడి : ప్రభుత్వ జూనియర్ కాలేజ్ చింతలపూడి ∙జంగారెడ్డిగూడెం : ప్రభుత్వ జూనియర్ కాలేజ్, సూర్య కాలేజ్ జంగారెడ్డిగూడెం, బుట్టాయగూడెం ప్రభుత్వ జూనియర్ కాలేజ్ ∙అత్తిలి జోన్: ఎస్వీఎస్ఎస్ జీజేసీ, అత్తిలి ∙పెనుగొండ : ఎస్వీకేపీ అండ్ పీవీ కాలేజ్ పెనుగొండ, ఎంవీఆర్ జీజేసీ ఆచంట ∙వీరవాసరం : వీఈసీ కళాశాల, వీరవాసరం ∙వేగేశ్వరపురం : ప్రభుత్వ జూనియర్ కాలేజ్, వేగేశ్వరపురం ∙నల్లజర్ల : డాక్టర్ ఎస్ఆర్కే అండ్ కేఎస్ఆర్ కో–ఆప్ కాలేజ్ ∙దుంపగడప ఏకేపీఎస్ జీజేసీ ∙నారాయణపురం జీజేసీ ∙గణపవరం జీజేసీ ∙పెదవేగి ఏపీఎస్‌డబ్ల్యూఆర్(బీ) ∙యండగండి జీజేసీ ∙జీలుగుమిల్లి జీజేసీ ∙వేరేరుపాడు జీజేసీ ∙కుకునూరు జీజేసీ ల్యాబ్‌లపై అవగాహన కోసం.. ఈ విద్యాసంవత్సరం నుంచి ఇంటర్ విద్యార్థులకు ప్రాక్టికల్ పరీ క్షలు జంబ్లింగ్ విధానంలో నిర్వహించేం దుకు చర్యలు చేపట్టాం. విద్యార్థులు కావాలంటే పరీక్షా కేంద్రాలకు వెళ్లి అక్కడ ప్రాక్టికల్స్‌పై అవగాహన పెంచుకోవచ్చు. ప్రాక్టికల్ పరీక్షలపై విద్యార్థులు భయపడకుండా ఉండేలా అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకున్నాం. పారదర్శకంగా పరీక్షలు నిర్వహిస్తాం. – ఎస్ఏ ఖాదర్, ఆర్ఐవో -
జంబ్లింగ్‌కు తాత్కాలికంగా వెనకడుగు
తొలిసారిగా ఉమ్మడి పరీక్షా విధానం పాఠశాల స్థాయిలోనే మూల్యాంకనం రాయవరం : పాఠశాల స్థాయిలో తొలిసారిగా ఉమ్మడి పరీక్షా విధానానికి విద్యాశాఖ తెరతీసింది. సమగ్ర నిరంతర మూల్యాంకనం(సీసీఈ) విధానంలో నిర్వహిస్తున్న ఉమ్మడి పరీక్షా విధానంలో జంబ్లింగ్ తరహాలో మూల్యాంకనం చేయాలని కూడా తలపోసింది. అయితే టీచర్లు, ఉపాధ్యాయ సంఘాల నుంచి వచ్చిన ఒత్తిడి మేరకు జంబ్లింగ్ విధానాన్ని తాత్కాలికంగా వాయిదా వేశారు. జిల్లా వ్యాప్తంగా సమ్మేటివ్–1 పరీక్షలు విద్యాశాఖ తొలుతగా ప్రాథమిక, ఉన్నత స్థాయి పరీక్షల్లో ఉమ్మడి పరీక్షా విధానం అమలు చేయాలని భావించింది. ప్రైవేటు పాఠశాలలు దీనిని తీవ్రంగా వ్యతిరేకించడంతో ఆరో తరగతి నుంచి అమలు చేసేందుకు నిర్ణయించారు. పరీక్షా పత్రాల మూల్యాంకనాన్ని జంబ్లింగ్ విధానంలో నిర్వహించాలని విద్యాశాఖ అధికారులు భావించారు. ఈ విధానం అమలులో చోటు చేసుకునే ఇబ్బందులు, నష్టాలు ఉన్నాయని ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకించాయి. దీంతో పరీక్షలకు రెండు రోజుల ముందు జంబ్లింగ్ విధానంలో పరీక్షా పేపర్ల మూల్యాంకనంపై సవరణ చేశారు. ఆరు, ఏడు తరగతులకు సమ్మేటివ్–1, 2, 3 పేపర్ల మూల్యాంకనాన్ని మండల స్థాయిలో కాకుండా పాఠశాల స్థాయిలోనే నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. 8, 9 తరగతులకు సమ్మేటివ్–1, 2 పరీక్ష పేపర్ల మూల్యాంకనాన్ని జంబ్లింగ్ విధానంలో కాకుండా పాఠశాల స్థాయిలోనే నిర్వహించాలని, సమ్మేటివ్–3 పరీక్షలను మాత్రమే జంబ్లింగ్ తరహాలో మూల్యాంకనం చేయాలని నిర్ణయించారు. ఆరు నుంచి టెన్త్ వరకు సమ్మేటివ్–1, 2, 3 పేపర్లను అన్ని సబ్జెక్టుల్లోనూ ఐదు శాతం జవాబు పత్రాలను ప్రత్యేక బృందం ద్వారా మూల్యాంకనం జరుగుతుంది. ప్రస్తుత సమ్మేటివ్ పరీక్షల్లో టెన్త్ పరీక్షల్లో మాదిరిగా అన్ని పాఠశాలలకూ పర్యవేక్షకులను నియమించారు. బృందాల నియామకం .. జిల్లాలో ఆరు నుంచి పదో తరగతి వరకు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల పరిధిలోని 4.03,860 మంది విద్యార్థులు సమ్మేటివ్–1 పరీక్షలకు హాజరయ్యారు. పరీక్షలు జరుగుతున్న ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు 2,098 మంది పరిశీలకులను నియమించారు. అన్ని యాజమాన్యాల పరిధిలోని తెలుగు, ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు ఈ పరీక్షలు రాస్తుండగా, పరీక్షలను పర్యవేక్షించేందుకు మండల స్థాయిలో మోడరేటివ్ బృందాలను నియమించారు. ఎంఈవో చైర్మన్‌గా స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎం, ఒక సీనియర్ హెచ్ఎం, ఇద్దరు స్కూల్ అసిస్టెంట్లు ఈ కమిటీలో ఉంటారు. వేర్వేరు సబ్జెక్టులు బోధించే వారిని టీమ్‌లో నియమించారు. టెన్త్ పబ్లిక్ పరీక్షల మాదిరిగానే జిల్లా వ్యాప్తంగా ఈ బృందాలు సమ్మేటివ్–1 పరీక్షలు జరుగుతున్న కేంద్రాలను సందర్శించాయి. అలాగే డివిజన్ స్థాయిలో ప్రతి డివిజన్‌కు ఒక కమిటీని నియమించారు. జిల్లా వ్యాప్తంగా ఏడు టీమ్‌లు(స్కా్వడ్స్) సమ్మేటివ్–1 పరీక్షలను తనిఖీలు నిర్వహించారు. -
తొలగిన తెర
సమ్మెటివ్–3లో మాత్రమే జంబ్లింగ్ విధానంలో మూల్యాంకనం 8 జీఓ105 విడుదల బుచ్చిరెడ్డిపాళెం : ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ప్రవేశపెట్టిన సమ్మెటివ్ పరీక్షల మూల్యాంకనంలో నెలకొన్న సందిగ్ధతకు జీవో 105తో తెరపడింది. విద్యా సంస్కరణల్లో భాగంగా క్వార్టర్లీ పరీక్షల బదులు సమ్మెటివ్–1, హాఫ్ ఇయర్లీ పరీక్షల బదులు సమ్మెటివ్–2, సాంవత్సరిక పరీక్షల బదులు సమ్మెటివ్–3 పరీక్షలను తాజాగా ప్రవేశపెట్టిన విషయం విదితమే. అయితే కామన్ పరీక్ష విధానం బాగున్నా, జవాబు పత్రాల మూల్యాంకనానికి జంబ్లింగ్ విధానం ప్రవేశపెట్టడంతో గందరగోళం నెలకొంది. దీనిని ఉపాధ్యాయులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయ సంఘాలు జరిపిన చర్చలతో రాష్ట్ర ప్రభుత్వం దిగి వచ్చింది. ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు సమ్మెటివ్–1, 2 మూల్యాంకనం ఆయా పాఠశాలల్లో జరుగుతుంది. 8,9 తరగతులకు సంబంధించి సమ్మెటివ్–3 మాత్రమే ఒక మండలం పేపర్లు మరో మండలంలో మూల్యాంకనం చేస్తారు. పదో తరగతి విషయంలో సమ్మెటివ్–3 లేదు. ప్రతి ఏడాదిలా పబ్లిక్ పరీక్షలు జరుగుతాయి. గతంలో మాదిరిగా ఒక జిల్లా పేపర్లను మరో జిల్లాకు పంపి మూల్యాంకనం చేస్తారు. ఈ మేరకు జీఓ 105ను మంగళవారం ప్రభుత్వం విడుదల చేసింది. పరీక్షలకు 1,89,482 మంది విద్యార్థులు రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో 21వ తేదీ నుంచి 28వ తేదీ వరకు సమ్మెటివ్–1 కామన్ పరీక్ష జరగనుంది. అం దుకు జిల్లాలో ఆరు నుంచి పదో తరగతి వ రకు తెలుగుమీడియం 75,831 మంది,ఇంగ్లిష్ మీడియం 1,13,651మంది మొత్తం 1,89, 482మంది విద్యార్థులు హాజరుకానున్నారు. దీనికి సం బంధించి మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. సమ్మెటివ్–1 కు సంబంధించిన ప్రశ్నపత్రాలు ఈ నెల 17వ తేదీ నాటికి అన్ని మండల విద్యాధికార్యాలయాలకు చేరాయి. నేటి నుంచి సమ్మెటివ్ –1 పరీక్షలు నెల్లూరు (టౌన్): జిల్లా వ్యాప్తంగా అన్ని యాజమాన్య పాఠశాలలకు 21వ తేదీ నుంచి 28 వరకు సమ్మెటివ్–1 పరీక్షలు జరగనున్నాయి. అన్ని యాజమాన్య పాఠశాలలకు రాష్ట్ర ప్రభుత్వం ఒకే ప్రశ్నపత్రాన్ని పంపిణీ చేసింది. ఈ నేపథ్యంలో బుధవారం 6,7,8 తరగతులకు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 వరకు, 9,10 తరగతులకు మధ్యాహ్నం 2 గంటల నుంచి 4.45 గంటల వరకు వృత్తి విద్యా పరీక్షలు జరగనున్నాయి. 22 నుంచి 28వ తేదీ వరకు 6వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ఒక పేపరు, 9,10 తరగతులకు పేపరు–1, పేపరు–2 ఉదయం, మధ్యాహ్నం సమయంలో పరీక్షలు నిర్వహించనున్నారు. -
నో.. జంబ్లింగ్ !
– వెనక్కు తగ్గిన ప్రభుత్వం ! – పాఠశాలస్థాయిలోనే మూల్యాంకనం అనంతపురం ఎడ్యుకేషన్ : విద్యారంగంలో నూతన విధానం అంటూ సంగ్రహాణాత్మక మూల్యాంకనం అమలుకు పూనుకున్న రాష్ట్ర ప్రభుత్వం వెనక్కు తగ్గింది. నూతన విధానాన్ని అమలు చేసేందుకు క్షేత్రస్థాయిలో సాధ్యాసాధ్యాలు పరిశీలించి ఫలితాలను ఒకటికి రెండుసార్లు విశ్లేషించాల్సి ఉంది. అయితే ఇవేం పట్టకుండా తాను పట్టిన కుందేలుకు మూడేకాళ్లు అన్న చందంగా తన నిర్ణయాలను అమలు చేయాలంటూ ప్రభుత్వం బలవంతంగా టీచర్లపై రుద్దింది. అయితే ఈ విధానం అమలులో చోటు చేసుకున్న ఇబ్బందులు, కలిగే నష్టాలపై ప్రభుత్వంపై ముప్పేట ఒత్తిడి వచ్చింది. పోలుపోలేని స్థితిలో చివరకు పరీక్షలకు రెండు రోజుల ముందు తన నిర్ణయాన్ని మార్చుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా కామన్ పరీక్ష అమలు చేస్తున్నా.. బాహ్య మూల్యాంకనంలో పలు సవరణలు చేస్తూ మంగళవారం జీఓ విడుదల చేసింది. 8,9,10 తరగతులకు సంబంధించి ఎస్ఏ–1, ఎస్ఏ–2 మూల్యాంకనాన్ని జంబ్లింగ్ విధానంలో కాకుండా పాఠశాల స్థాయిలోనే నిర్వహించాలని ఆదేశించింది. సమ్మేటివ్–3 పరీక్షలను మాత్రమే బాహ్యమూల్యాంకనంలో (పదో తరగతికి పబ్లిక్ పరీక్షలు ఉంటాయి) నిర్వహించనున్నారు. అలాగే 6,7 తరగతులకు సంబంధించి ఎస్ఏ–1, ఎస్ఏ–2, ఎస్ఏ–3 మూల్యాంకనాలను మండల కేంద్రాల్లో కాకుండా పాఠశాల స్థాయిల్లోనే నిర్వహించాలని నిర్ణయించారు. – 6–10 తరగతులకు 1,2,3 సంగ్రహణాత్మక మూల్యంకనాల్లో అన్ని సబ్జెక్టుల్లోనూ 5 శాతం జవాబు పత్రాలను ప్రత్యేక బందం ద్వారా మూల్యాంకనం జరుగుతుంది. – 8,9 తరగతులు వార్షిక పరీక్షల్లో సాధించిన మార్కులను మాత్రమే 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు కలుపుతారు. అంటే ప్రస్తుతం 8వ తరగతి ఉన్న విద్యార్థి వార్షిక పరీక్షలో వచ్చిన మార్కులు 5 శాతం, అదే విద్యార్థి తొమ్మిదో తరగతిలో వెళ్లిన తర్వాత వార్షిక పరీక్షలో వచ్చిన మార్కులు ఆధారంగా 5 శాతం, ఈ విద్యార్థి 2019 మార్చిలో జరిగే పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా 10 శాతం కలిపి మొత్తం 20 శాతం అంతర్గతమార్కులు కేటాయిస్తారు. పరీక్షల సక్రమ నిర్వహణకు జిల్లా విద్యాశాఖ అధికారి ప్రత్యేక స్క్వాడ్ బందాలను నియమిస్తారు. ప్రభుత్వం పునరాలోచించాలి బాహ్య మూల్యాంకనం అమలు చేసే విషయంలో గ్రామీణ ప్రాంత విద్యార్థులను దష్టిలో ఉంచుకుని ప్రభుత్వం పునరాలోచించాలి. సౌకర్యాల లేమి, ల్యాబ్‌లు, ఇంటర్నెట్ లేని కారణంగా అర్బన్ విద్యార్థులతో పోటీ పడాలంటే ఇబ్బంది. ముందుగా గ్రామీణ ప్రాంతాల పాఠశాలలకు అన్ని సదుపాయాల కల్పనకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఆ తర్వాత ఈ విధానాలు అమలు చేస్తే బాగుంటుంది. – రజనీకుమార్రెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి ‘ఆప్టా’ అధ్యక్ష,ప్రధాన lకార్యదర్శులు ఏకపక్ష నిర్ణయం తీసుకుంది నూతన విధానం అమలులో ప్రభుత్వం ఎవర్నీ సంప్రదించకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్ పాఠశాలల యాజమాన్య సంఘంతో పాటు వివిధ వర్గాలు వ్యతిరేకించడంతో వెనక్కు తగ్గి ఈ విధానాన్ని విరమించుకుంది. – గోపాల్‌రెడ్డి, ప్రైవేట్ పాఠశాలల సంఘం జిల్లా ప్రధానకార్యదర్శి -
జంబ్లింగ్ జగడం
ఏలూరు సిటీ : విద్యారంగంలో సర్కారు తీసుకొస్తున్న సంస్కరణలతో గందరగోళ పరిస్థితులు నెల కొంటున్నాయి. చట్టాలు చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే వాటికి భిన్నంగా నూతన విధానాలు అమలు చేసేందు కు ప్రయత్నించటాన్ని ఉపాధ్యాయ వర్గాలు వ్యతిరేకిస్తున్నాయి. ఈనెల 21 నుంచి పాఠశాల విద్యార్థులకు నిర్వహించే సమ్మెటివ్–1 పరీక్షకు సంబంధించి జవాబు పత్రాల మూల్యాంకనను జంబ్లింగ్ విధానంలో చేయాలనే ప్రభుత్వ నిర్ణయంపై ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులందరికీ కామన్ పరీక్షా విధానం అమలు చేయటాన్ని స్వాగతిస్తున్న ఉపాధ్యాయులు మూల్యాంకనలో జంబ్లింగ్ విధానాన్ని అమలు చేయాలనే నిర్ణయాన్ని మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఒక మండలంలోని విద్యార్థులు రాసిన జవాబు పత్రాలను వేరే మండలానికి పంపించి మూల్యాంకన చేయించడం వల్ల అనే సమస్యలు ఉత్పన్నమవుతాయని వాదిస్తున్నారు. విద్యాబోధనకు విఘాతమే సమ్మెటివ్–1 పరీక్షలకు సంబంధించి విద్యార్థులందరికీ ఏకీకృత (కామన్) ప్రశ్నాపత్రాలను ఇస్తారు. దీని ప్రకారం రాష్ట్రంలోని ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులంతా ఒకే రకమైన పరీక్ష రాయాల్సి ఉంటుంది. టెన్త్ పబ్లిక్ పరీక్షల్లో అయితే ప్రశ్నాపత్రాలను పరీక్ష ప్రారంభానికి అరగంట ముందు పోలీస్ బందోబస్తు నడుమ విద్యా శాఖ అధికారులు విడుదల చేస్తారు. సమ్మెటివ్ కామన్ పరీక్షకు అటువంటి అవకాశం లేదు. దీనివల్ల పారదర్శకత లోపిస్తుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఒక మండలానికి సంబంధించిన జవాబు పత్రాలు ఇతర మండలాల్లోని స్కూల్ కాంప్లెక్స్‌ల్లో మూల్యాంకన చేస్తారు. దీనివల్ల వాటిని దిద్దేందుకు వెళ్లే ఉపాధ్యాయులు 15నుంచి 20రోజులపాటు తరగతులకు దూరమవుతారు. ఫలితంగా విద్యాబోధన కుంటుపడుతుందని, దీనివల్ల విద్యార్థులు నష్టపోతారని ఉపాధ్యాయ వర్గాలు చెబుతున్నాయి. ఏడాదిలో మూడు సమ్మెటివ్ పరీక్షలు జరుగుతాయి. ఆ జవాబు పత్రాల మూల్యాంకన కోసం ఉపాధ్యాయులు మొత్తంగా 45 రోజులకుపైగా పాఠశాలలకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి. విద్యాహక్కు చట్టం–09 ప్రకారం విద్యార్థి వయసు ఆధారంగా పాస్, ఫెయిల్‌తో సంబంధం లేకుండా పై తరగతులకు పంపించాల్సి ఉంది. ఇక నిరంతర సమగ్ర మూల్యాంకన (సీసీఈ) విధానంలోనూ ఉపాధ్యాయుడే విద్యార్థికి పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. విద్యాహక్కు చట్టం ఇలా చెబుతుంటే.. విద్యాశాఖ అధికారులు కొత్త విధానాలు అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఇదో ప్రహసనమే జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల్లో 6నుంచి 10వ తరగతి విద్యార్థులు సుమారు 2.50 లక్షల మంది ఉన్నారు. వీరందరికీ సమ్మెటివ్–1 పరీక్షలో జవాబు పత్రాల మూల్యాంకన జంబ్లింగ్ విధానంలో చేపడతారు. ఐదు పరీక్షలకు సంబంధించి లక్షల సంఖ్యలో జవాబు పత్రాలను మూల్యాంకన చేయటం ప్రహసనంగా మారనుంది. ఇలా ఏడాదిలో మూడు పరీక్షలకు జవాబు పత్రాల మూల్యాంకన చేయటం సామాన్యమైన విషయం కాదంటున్నారు. నాణ్యమైన విద్య అంటూనే విద్యారంగాన్ని కష్టాల్లోకి నెట్టేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కామన్ పరీక్ష మంచిదే కానీ.. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల్లోని విద్యార్థులకు కామన్ పరీక్షలు నిర్వహించటం మంచిదే. కానీ.. జవాబు పత్రాల మూల్యాంకనను జంబ్లింగ్ పద్ధతిలో చేయాలనే ఆలోచన సరికాదు. దీనివల్ల ఉపాధ్యాయులు పాఠశాలలకు దూరమవుతారు. విద్యార్థులకు సరైన బోధన అందదు. అధికారులు ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకోవటం మానుకోవాలి – బీఏ సాల్మన్‌రాజు, ప్రధాన కార్యదర్శి, ఏపీటీఎఫ్ జిల్లా శాఖ సంస్కరణలు ఇలాకాదు విద్యారంగంలో ఒకేసారి సంస్కరణలు చేస్తే ఆశించిన స్థాయిలో ఫలితాలు రావు. ఉపాధ్యాయ సంఘాలు, విద్యారంగ నిపుణులు, ప్రైవేట్ విద్యాసంస్థలతో చర్చించి విద్యార్థికి ప్రయోజనం కలిగేలా విధానాలు రూపొందించాలి. విద్యాహక్కు చట్టం, సీసీఈ విధానాలకు భిన్నంగా నూతన విధానాలు ఉంటున్నాయి. జవాబు పత్రాల మూల్యాంకనలో జంబ్లింగ్ విధానం సమర్థనీయం కాదు. – ఎంబీఎస్ శర్మ, ఉపాధ్యక్షుడు, అపుస్మా -
జంబ్లింగ్ జగడం
– జవాబు పత్రాల మూల్యాంకనలో కొత్త విధానం – ఒక మండలంలోని విద్యార్థుల జవాబు పత్రాల మూల్యాంకనం మరో మండలంలో – విద్యాబోధనకు విఘాతమంటున్న ఉపాధ్యాయులు ఏలూరు సిటీ : విద్యారంగంలో సర్కారు తీసుకొస్తున్న సంస్కరణలతో గందరగోళ పరిస్థితులు నెలకొంటున్నాయి. చట్టాలు చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే వాటికి భిన్నంగా నూతన విధానాలు అమలు చేసేందుకు ప్రయత్నించటాన్ని ఉపాధ్యాయ వర్గాలు వ్యతిరేకిస్తున్నాయి. ఈనెల 21 నుంచి పాఠశాల విద్యార్థులకు నిర్వహించే సమ్మెటివ్–1 పరీక్షకు సంబంధించి జవాబు పత్రాల మూల్యాంకనను జంబ్లింగ్ విధానంలో చేయాలనే ప్రభుత్వ నిర్ణయంపై ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. ప్రై వేట్, ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులందరికీ కామన్ పరీక్షా విధానం అమలు చేయటాన్ని స్వాగతిస్తున్న ఉపాధ్యాయులు మూల్యాంకనలో జంబ్లింగ్ విధానాన్ని అమలు చేయాలనే నిర్ణయాన్ని మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఒక మండలంలోని విద్యార్థులు రాసిన జవాబు పత్రాలను వేరే మండలానికి పంపించి మూల్యాంకన చేయించడం వల్ల అనే సమస్యలు ఉత్పన్నమవుతాయని వాదిస్తున్నారు. – విద్యాబోధనకు విఘాతమే : సమ్మెటివ్–1 పరీక్షలకు సంబంధించి విద్యార్థులందరికీ ఏకీకత (కామన్) ప్రశ్నాపత్రాలను ఇస్తారు. దీని ప్రకారం రాష్ట్రంలోని ప్రై వేటు, ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులంతా ఒకే రకమైన పరీక్ష రాయాల్సి ఉంటుంది. టెన్త్ పబ్లిక్ పరీక్షల్లో అయితే ప్రశ్నాపత్రాలను పరీక్ష ప్రారంభానికి అరగంట ముందు పోలీస్ బందోబస్తు నడుమ విద్యా శాఖ అధికారులు విడుదల చేస్తారు. అయితే, సమ్మెటివ్ కామన్ పరీక్షకు అటువంటి అవకాశం లేదు. దీనివల్ల పారదర్శకత లోపిస్తుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఒక మండలానికి సంబంధించిన జవాబు పత్రాలు ఇతర మండలాల్లోని స్కూల్ కాంప్లెక్స్‌ల్లో మూల్యాంకన చేస్తారు. దీనివల్ల వాటిని దిద్దేందుకు వెళ్లే ఉపాధ్యాయులు 15నుంచి 20రోజులపాటు తరగతులకు దూరమవుతారు. ఫలితంగా విద్యాబోధన కుంటుపడుతుందని, దీనివల్ల విద్యార్థులు నష్టపోతారని ఉపాధ్యాయ వర్గాలు చెబుతున్నాయి. ఏడాదిలో మూడు సమ్మెటివ్ పరీక్షలు జరుగుతాయి. ఆ జవాబు పత్రాల మూల్యాంకన కోసం ఉపాధ్యాయులు మొత్తంగా 45 రోజులకుపైగా పాఠశాలలకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి. విద్యాహక్కు చట్టం–09 ప్రకారం విద్యార్థి వయసు ఆధారంగా పాస్, ఫెయిల్‌తో సంబంధం లేకుండా పై తరగతులకు పంపించాల్సి ఉంది. ఇక నిరంతర సమగ్ర మూల్యాంకన (సీసీఈ) విధానంలోనూ ఉపాధ్యాయుడే విద్యార్థికి పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. విద్యాహక్కు చట్టం ఇలా చెబుతుంటే.. విద్యాశాఖ అధికారులు కొత్త విధానాలు అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఇదో ప్రహసనమే జిల్లాలోని ప్రభుత్వ, ప్రై వేట్ విద్యాసంస్థల్లో 6నుంచి 10వ తరగతి విద్యార్థులు సుమారు 2.50 లక్షల మంది ఉన్నారు. వీరందరికీ సమ్మెటివ్–1 పరీక్షలో జవాబు పత్రాల మూల్యాంకన జంబ్లింగ్ విధానంలో చేపడతారు. ఐదు పరీక్షలకు సంబంధించి లక్షల సంఖ్యలో జవాబు పత్రాలను మూల్యాంకన చేయటం ప్రహసనంగా మారనుంది. ఇలా ఏడాదిలో మూడు పరీక్షలకు జవాబు పత్రాల మూల్యాంకన చేయటం సామాన్యమైన విషయం కాదంటున్నారు. నాణ్యమైన విద్య అంటూనే విద్యారంగాన్ని కష్టాల్లోకి నెట్టేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. – కామన్ పరీక్ష మంచిదే కానీ.. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రై వేట్ విద్యాసంస్థల్లోని విద్యార్థులకు కామన్ పరీక్షలు నిర్వహించటం మంచిదే. కానీ.. జవాబు పత్రాల మూల్యాంకనను జంబ్లింగ్ పద్ధతిలో చేయాలనే ఆలోచన సరికాదు. దీనివల్ల ఉపాధ్యాయులు పాఠశాలలకు దూరమవుతారు. విద్యార్థులకు సరైన బోధన అందదు. అధికారులు ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకోవటం మానుకోవాలి – బీఏ సాల్మన్‌రాజు, ప్రధాన కార్యదర్శి, ఏపీటీఎఫ్ జిల్లా శాఖ – సంస్కరణలు ఇలాకాదు విద్యారంగంలో ఒకేసారి సంస్కరణలు చేస్తే ఆశించిన స్థాయిలో ఫలితాలు రావు. ఉపాధ్యాయ సంఘాలు, విద్యారంగ నిపుణులు, ప్రై వేట్ విద్యాసంస్థలతో చర్చించి విద్యార్థికి ప్రయోజనం కలిగేలా విధానాలు రూపొందించాలి. విద్యాహక్కు చట్టం, సీసీఈ విధానాలకు భిన్నంగా నూతన విధానాలు ఉంటున్నాయి. జవాబు పత్రాల మూల్యాంకనలో జంబ్లింగ్ విధానం సమర్థనీయం కాదు. – ఎంబీఎస్ శర్మ, ఉపాధ్యక్షుడు, అపుస్మా -
జంబ్లింగ్‌తో విద్యార్థులకు తీవ్ర నష్టం
ఏపీ ప్రైవేటు స్కూల్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బ్రహ్మయ్య నరసరావుపేట : ప్రభుత్వం నూతనంగా ఆరో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు ప్రవేశపెట్టాలనుకునే క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ పరీక్షలలో జంబ్లింగ్ విధానంతో విద్యార్థులకు తీవ్ర నష్టం కలుగుతుందని ఏపీ ప్రైవేటు స్కూల్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కొల్లి బ్రహ్మయ్య అన్నారు. విద్యావిధానంలో నూతన పద్ధతులను ప్రవేశపెట్టాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం చేపట్టే జంబ్లింగ్ విధానాలను విడనాడాలని డిమాండ్ చేశారు. శనివారం పలనాడురోడ్డులోని కాన్ఫరెన్స్ హాలులో విలేకర్ల సమావేశంలో ఆయన తన కార్యవర్గ ప్రతినిధులతో కలిసి మాట్లాడారు. హైదరాబాదులో తమతో ప్రభుత్వం నిర్వహించిన సమావేశంలో ఇదే విషయాన్ని స్పష్టంచేశామని, దీనికి ప్రిన్సిపల్ కార్యదర్శి సమ్మతించారన్నారు. అకడమిక్ కాలెండర్ ప్రకారం 220 రోజుల పనిదినాల్లో పదోతరగతి ఫైనల్ పరీక్షలు నిర్వహణకు 15 రోజులు, వాల్యుయేషన్‌కు పదిహేను రోజుల చొప్పున 30రోజులు తరగతులు నిర్వహించలేకపోవటంతో విద్యార్థులకు పాఠాలు చెప్పేందుకు ఉపాధ్యాయులకు 190 రోజులే మిగులుతున్నాయన్నారు. క్వార్టర్లీ, హాఫర్లీ పరీక్షల్లో జంబ్లింగ్ విధానం పెట్టి మండల స్థాయిలో వాల్యుయేషన్ నిర్వహించటం వలన రెండు పరీక్షలతో మరో 30రోజులు ఉపాధ్యాయులు వాల్యుయేషన్‌కు హాజరుకావాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు. దీంతో విద్యార్థులకు విద్యను బోధించేందుకు కేవలం 160రోజులే మిగులుతుందన్నారు. ప్రభుత్వం విద్యేతర కార్యక్రమాలకు కొన్నిరోజులు ఉపయోగించుకుంటుందన్నారు. పరీక్ష పేపర్లు దిద్దటంలో ఉపాధ్యాయులు తలోరకంగా మార్కులు వేయటం వలన విద్యార్థులకు నష్టం చేకూరుతుందన్నారు. బార్ కోడింగ్ విధానం లేకుండా పేపర్లు దిద్దటం కోసం మండలాలు మార్చటం వలన ఎవరి పేపర్లు ఎవరివి అనేది తేలికగా తెలుస్తుందన్నారు. దీంతో ఉపాధ్యాయులు, విద్యాసంస్థల మధ్య విభేదాలు పొడచూపుతాయని చెప్పారు. జంబ్లింగ్ విధానంతో పనిదినాలు వృధా కావటం తప్పితే నూతనంగా విద్యార్థులకు లభించే ప్రయోజనం ఏమీ ఉండదన్నారు. అందువలన జంబ్లింగ్ విధానాన్ని ప్రభుత్వం ఉపసహరించుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో అసోసియేషన్ ప్రతినిధులు, విద్యాసంస్థల అధిపతులు జి.రాజగోపాలరెడ్డి, (ఆక్స్ఫర్డ్), గడ్డం భూపాల్‌రెడి ్డ(నవభారత్ హైస్కూల్), జిల్లా కార్యదర్శులు పి.శ్రీనివాసరావు, బోడెపూడి శ్రీనివాసరావు, పి.యోగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పక్కాగా సమ్మెటివ్ అసెస్మెంట్
– జంబ్లింగ్‌లో స్పాట్ వాల్యుయేషన్ – నూరుశాతం ఆధార్ ఎన్రోల్మెంట్ పూర్తి చేయాలి కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : ఈ నెల 21 నుంచి 28వ తేదీ వరకు నిర్వహించే సమ్మెటీవ్ అసెస్మెంట్ను పకడ్బందీగా చేపట్టాలని డీఈఓ రవీంద్రనాథ్‌రెడ్డి డీవైఈఓలు, ఎంఈఓలను ఆదేశించారు. పదో తరగతి తరహాలో పరీక్షలు జరపాలన్నారు. సీసీఈ పద్ధతిలో ప్రభుత్వం సమ్మెటివ్ పరీక్షల్లో సంస్కరణలకు శ్రీకారం చుట్టిందన్నారు. అందులో భాగంగా కొన్ని ఇబ్బందులున్నా పొరపాట్లకు తావులేకుండా పరీక్షలు జరపాల్సిన అవసరం ఉందన్నారు. ఈ మేరకు గురువారం ఆయన ఎస్ఎస్ఏ సమావేశ మందిరంలో డీవైఈఓలు, ఎంఈఓలు, ఎంఐఎస్ కోఆర్డినేటర్లతో సమ్మెటివ్ అసెస్మెంట్పై మీక్షించారు. సమ్మెటీవ్ పరీక్షలకుమండలాన్ని యూనిట్‌గా తీసుకోవాలని, అందులో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులందరిని భాగస్వామ్యం చేయాలన్నారు. ప్రతి పాఠశాలలో జరిగే పరీక్షలకు అబ్జర్వర్లు, చీఫ్ సూపరింటెండెంట్లను నియమించాలని కోరారు. పరీక్ష ముగిసిన వెంటనే జవాబుపత్రాలను ఎంఈఓలకు అందజేయలన్నారు. వాటిని జంబ్లింగ్ పద్ధతిలో మండల స్పాట్ వాల్యూయేషన్ కేంద్రంలో దిద్దేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే ఫార్మేటివ్ అసెస్మెంట్–1 మార్కుల ఆన్లైన్ నమోదులో నిర్లక్ష్యం వహించకుండా పూర్తి చేయాలన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 100 శాతం ఆధార్ ఎన్రోల్మెంట్ పూర్తి కాలేదని, అందులో ఏమైనా సమస్యలుంటే పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో ఎస్ఎస్ఏ పీఓ వై.రామచంద్రారెడ్డి, డీవైఈఓలు తహెరాసుల్తానా, శివరాముడు, వెంకటరామిరెడ్డి, ఎస్ఎస్ఏ ఎఎంఓ హుస్సేన్ సాహేబ్ పాల్గొన్నారు. -
జంబ్లింగ్‌లో ‘నారాయణ’ మాయాజాలం
ఒక కేంద్రానికి 220 మంది విద్యార్థులు వారిలో 140 మంది నారాయణ విద్యార్థులే నేటి నుంచి పదోతరగతి పరీక్షలు కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): నారాయణ పాఠశాల యాజమాన్యం, విద్యాశాఖాధికారులు కలిసి పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో జంబ్లింగ్ స్వరూపాన్నే మార్చేశారు. కర్నూలు జిల్లాలో ఒకే కేంద్రానికి 140 మంది నారాయణ పాఠశాల విద్యార్థులను కేటాయించడంపై తీవ్ర విమర్శలు చెలరేగుతున్నాయి. మాస్ కాపియింగ్‌కు తెరలేపి ర్యాంకులు సాధన కోసమే యాజమాన్యం ఈ తతంగానికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. కర్నూలు నగరం బళ్లారి చౌరస్తాలోని నారాయణ రెసిడెన్షియల్ ఇంగ్లిష్ మీడియం ఉన్నత పాఠశాలలో 161 మంది విద్యార్థులు పదో తరగతి చదువుతున్నారు. వీరిలో 46 మంది బాలికలు, 115 మంది బాలురు ఉన్నారు. వీరిని నగరంలోని వివిధ కేంద్రాల్లో పదో తరగతి పరీక్షలు రాసేందుకు కేటాయించారు. అయితే ఒక్క సెయింట్ క్లారెట్ పాఠశాలలోని కేంద్రానికే 140 మందికిపైగా కేటాయించడంపై తీవ్ర విమర్శలు చెలరేగుతున్నాయి. ఈ కేంద్రానికి మొత్తం 220 మంది విద్యార్థులను కేటాయించగా వారిలో 140మంది నారాయణ విద్యార్థులే. మిగిలిన 80లో నాలుగు పాఠశాల విద్యార్థులు ఉన్నారు. పదో తరగతి పరీక్షల్లో జంబ్లింగ్ విధానం అమల్లో ఉంది. ఈ విధానం మొత్తం హైదరాబాద్‌లోని డైర్టరేట్‌లో జరుగుతుంది. అందుకోసం ఓ ప్రత్యేక సాఫ్ట్వేరు ఉంటుంది. ఓ కేంద్రానికి దాదాపు 10-15 పాఠశాలలను కేటాయించాల్సి ఉంది. అయితే జిల్లాల నుంచి విద్యార్థుల సంఖ్య, పాఠశాలల సంఖ్య, కేంద్రాల సంఖ్య తదితర విషయాలను మాత్రమే పంపాలి. అలా పంపడంలో జిల్లా విద్యాశాఖాధికారులు చేతివాటం ప్రదర్శించడంతోనే నారాయణ విద్యార్థులు మొత్తం ఒకే కేంద్రానికి కేటాయించారనే విమర్శలు ఉన్నాయి. దీనిపై పూర్తి స్థాయి విచారణ జరపాల్సి ఉంది. ఈ విషయమై డీఈవో రవీంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ.. నారాయణ పాఠశాలకు చెందిన 140 మంది విద్యార్థులు ఒకే కేంద్రానికి ఎలా కేటాయించారో తనకు తెలియదన్నారు. ఆ కేంద్రంలో మాస్ కాపీయింగ్‌కు అవకాశం లేకుండా సిట్టింగ్ స్క్వాడ్‌తో పర్యవేక్షిస్తామని చెప్పారు. -
జంబ్లింగ్ విధానంలోనే ఇంటర్ ప్రాక్టికల్స్
ఫిబ్రవరి 4 నుంచి పరీక్షలు ప్రారంభం సాక్షి,హైదరాబాద్: ఏపీలో ఈ ఏడాది ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్ పరీక్షలు జంబ్లింగ్ విధానంలోనే జరగనున్నాయి. ఈ మేరకు ఇంటర్మీడియెట్ విద్యా మండలి కార్యదర్శి ఎంవీ సత్యనారాయణ శనివారం ఓ ప్రకటన జారీ చేశారు. ఫిబ్రవరి 4 నుంచి 24వ తేదీ వరకు జంబ్లింగ్ విధానంలో ఈ ప్రాక్టికల్ పరీక్షలు జరగనున్నాయి. 723 పరీక్ష కేంద్రాలను ఇంటర్ బోర్డు ఏర్పాటు చేసింది. ఇందులో 378 ప్రభుత్వ కళాశాలలు కాగా 345 ప్రైవేటు, అన్ ఎయిడెడ్ కాలేజీలు. ఈ పరీక్షలకు 2,99,476 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. -
'ఇంటర్ జంబ్లింగ్' పై సర్కార్ పునరాలోచన
-
జంబ్లింగ్ వద్దు...
-
వైఎస్ఆర్ జిల్లాలో రోడ్డెక్కిన విద్యార్థులు
-
స్టాఫ్ సెలెక్షన్ కమీషన్ తీరును తప్పు పట్టిన హైకోర్టు
-
ఈసారీ జంబ్లింగ్ లేకుండానే..
తాండూరు టౌన్, న్యూస్‌లైన్: త్వరలో ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్ నిర్వహణ నుంచి డిపార్ట్మెంటల్ అధికారులను తొలగించడంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఇంటర్ విద్య ప్రాంతీయ పర్యవేక్షకుడు (ఆర్ఐఓ) ప్రతాప్ పేర్కొన్నారు. బుధవారం ఆయన తాండూరులోని జూనియర్ కళాశాలలను తనిఖీచేశారు. ఈ సందర్భంగా విలేకరులతో ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరి 12వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఇంటర్ ప్రాక్టికల్స్‌కు డిపార్ట్మెంట్ అధికారులను కేటాయించకపోవడంపై నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. ప్రాక్టికల్స్ నిర్వహణ నుంచి డిపార్ట్మెంట్ అధికారులను తొలగిస్తారని వస్తున్న వార్తలపై ఆయన పైవిధంగా స్పందించారు. గతేడాది మాదిరిగానే ప్రాక్టికల్స్ జంబ్లింగ్ లేకుండానే జరుగుతాయన్నారు. జిల్లాలో మొత్తం 530 ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలలు ఉండగా త్వరలో జరుగనున్న పరీక్షలకు 308 కేంద్రాలను కేటాయించామన్నారు. ఇంటర్ ప్రాక్టికల్స్, థియరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. థియరీ పరీక్షలు పూర్తయ్యేనాటికే పేపర్ వాల్యుయేషన్ ప్రక్రియను ప్రారంభిస్తామన్నారు. గతేడాది మాదిరిగానే సమాధానపత్రాలు రాష్ర్టంలోని ఏ జిల్లాకైనా వెళ్లవచ్చన్నారు. ఒకవేళ అప్పటిలోగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఏ ప్రాంతానికి చెందిన పేపర్లు ఆయా ప్రాంతాల్లోనే వాల్యుయేషన్ చేస్తారన్నారు. అంతకుముందు ఆర్ఐఓ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, సిద్ధార్థ, అంబేద్కర్, సింధు, చైతన్య, విజ్ఞాన్ కళాశాలలను తనిఖీచేశారు. ముఖ్యంగా ప్రాక్టికల్స్ నిర్వహణకు కావాల్సిన ప్రయోగశాలలను పరిశీలించారు. ఆయన వెంట డెక్ సభ్యుడు బాలకృష్ణ ఉన్నారు.