ఇంటర్‌ ప్రాక్టికల్స్‌ ‘జంబ్లింగ్‌’ | inter practical jumbling | Sakshi
Sakshi News home page

ఇంటర్‌ ప్రాక్టికల్స్‌ ‘జంబ్లింగ్‌’

Published Wed, Oct 5 2016 11:26 PM | Last Updated on Mon, Sep 4 2017 4:17 PM

inter practical jumbling

–జిల్లాలో 61 పరీక్షా కేంద్రాలు 
– మూడునెలల ముందే ప్రకటన
ఏలూరు సిటీ : 
ఇంటర్మీడియెట్‌ విద్యార్థులు ఈ ఏడాది జంబ్లింగ్‌ విధానంలో ప్రాక్టికల్‌ పరీక్షలు రాయాల్సి ఉంది. కొన్నేళ్లుగా ప్రాక్టికల్‌ పరీక్షల్లో జంబ్లింగ్‌ విధానాన్ని వాయిదా వేస్తూ వచ్చిన ఇంటర్మీడియట్‌ విద్యామండలి ఈసారి కచ్చితంగా అమ లు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు మూడు నెలల ముందే జంబ్లింగ్‌ పరీక్షా కేంద్రాలను ప్రకటించారు. జిల్లావ్యాప్తం గా ప్రాక్టికల్‌ పరీక్షలకు 61 పరీక్షా కేంద్రాలను ఎంపిక చేశారు. ఆయా  కళాశాలల యాజమాన్యాలు తగు జాగ్రత్తలు పాటిం చాల్సి ఉంది. నిర్దేశించిన పరీక్షా కేంద్రం లో ఆయా కాలేజీల విద్యార్థులు ల్యాబ్‌లకు వెళ్లి అవగాహన తెచ్చుకునే వెసులుబాటు కల్పించారు. ఫిబ్రవరిలో జరిగే ప్రాక్టికల్‌ పరీక్షలకు ముందుస్తు చర్యల్లో భాగంగానే కేంద్రాలను ప్రకటించారు. జిల్లాలోని 254 జూనియర్‌ కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులను సిద్ధం చేసేందుకు అవకాశం కల్పించారు. 
 
పరీక్షా కేంద్రాలివే..
∙తాడేపల్లిగూడెం : తాడేపల్లిగూడెం ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, డాక్టర్‌ గోయెంకా జూనియర్‌ కాలేజ్, ప్రభుత్వ జూనియర్‌ కాలేజ్, పెంటపాడు, శ్రీ వాసవీ కాలేజ్, తాడేపల్లిగూడెం.
∙పాలకొల్లు : ఆదిత్య కళాశాల, పాలకొల్లు, ప్రభుత్వ బాలుర కళాశాల పాలకొల్లు, ప్రభుత్వ బాలికల కళాశాల, పాలకొల్లు, కేవీఎం చాంబర్స్‌ కళాశాల, పాలకొల్లు.  
∙భీమవరం : డాక్టర్‌ సీఎస్‌ఎన్‌ కాలేజ్, శ్రీచైతన్య జూనియర్‌ కాలేజ్, డీఎన్‌ఆర్‌ కాలేజ్, ఆదిత్య జూనియర్‌ కాలేజ్, శ్రీ సాయి ఆదిత్య కాలేజ్, బ్రౌనింగ్‌ జూనియర్‌ కాలేజ్‌ 
∙తణుకు: ఎస్‌సీఐఎం జీజేసీ, తణుకు, ప్రగతి కాలేజ్, నారాయణ కాలేజ్, శశి జూనియర్‌ కాలేజ్, ఎస్‌ఎన్‌వీటీ జీజేసీ తణుకు.  
∙ఏలూరు: ప్రభుత్వ జూనియర్‌ కాలేజ్, ఏలూరు, ఎస్‌పీడీబీటీ కాలేజ్, సెయింట్‌ థెరిస్సా బాలికల కాలేజ్, ఎన్‌ఆర్‌ఐ కాలేజ్, సర్‌ సీఆర్‌ఆర్‌ కాలేజ్, శశి జూనియర్‌ కాలేజ్‌ ఏలూరు, డీపాల్‌ కాలేజ్, పినకడిమి
∙నరసాపురం: ఆదిత్య కళాశాల, బీజీబీఎస్‌ ఉమెన్స్‌ కాలేజ్‌ నరసాపురం.
∙కొవ్వూరు : జీజేసీ బాలుర కళాశాల, జీజేసీ బాలికల కళాశాల కొవ్వూరు, శ్రీచైతన్య వేములూరు 
∙నిడదవోలు : జీజేసీ బాలుర కళాశాల, జీజేసీ బాలికల కళాశాల నిడదవోలు 
∙పోలసానిపల్లి : ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌ (బాలిక) పోలసానిపల్లి 
∙కొయ్యలగూడెం : ప్రభుత్వ జూనియర్‌ కాలేజ్‌ కొయ్యలగూడెం 
∙గోపాలపురం :  ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌ బాలికల కళాశాల, గోపాలపురం 
∙చింతలపూడి : ప్రభుత్వ జూనియర్‌ కాలేజ్‌ చింతలపూడి
∙జంగారెడ్డిగూడెం : ప్రభుత్వ జూనియర్‌ కాలేజ్, సూర్య కాలేజ్‌ జంగారెడ్డిగూడెం, బుట్టాయగూడెం ప్రభుత్వ జూనియర్‌ కాలేజ్‌ 
∙అత్తిలి జోన్‌: ఎస్‌వీఎస్‌ఎస్‌ జీజేసీ, అత్తిలి
∙పెనుగొండ : ఎస్‌వీకేపీ అండ్‌ పీవీ కాలేజ్‌ పెనుగొండ, ఎంవీఆర్‌ జీజేసీ ఆచంట
∙వీరవాసరం : వీఈసీ కళాశాల, వీరవాసరం 
∙వేగేశ్వరపురం : ప్రభుత్వ జూనియర్‌ కాలేజ్, వేగేశ్వరపురం 
∙నల్లజర్ల : డాక్టర్‌ ఎస్‌ఆర్‌కే అండ్‌ కేఎస్‌ఆర్‌ కో–ఆప్‌ కాలేజ్‌ 
∙దుంపగడప ఏకేపీఎస్‌ జీజేసీ
∙నారాయణపురం జీజేసీ ∙గణపవరం జీజేసీ 
∙పెదవేగి ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌(బీ) ∙యండగండి జీజేసీ
∙జీలుగుమిల్లి జీజేసీ ∙వేరేరుపాడు జీజేసీ 
∙కుకునూరు జీజేసీ 
 
ల్యాబ్‌లపై అవగాహన కోసం..
ఈ విద్యాసంవత్సరం నుంచి ఇంటర్‌ విద్యార్థులకు ప్రాక్టికల్‌ పరీ క్షలు జంబ్లింగ్‌ విధానంలో నిర్వహించేం దుకు చర్యలు చేపట్టాం. విద్యార్థులు కావాలంటే పరీక్షా కేంద్రాలకు వెళ్లి అక్కడ ప్రాక్టికల్స్‌పై అవగాహన పెంచుకోవచ్చు. ప్రాక్టికల్‌ పరీక్షలపై విద్యార్థులు భయపడకుండా ఉండేలా అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకున్నాం. పారదర్శకంగా పరీక్షలు నిర్వహిస్తాం. 
– ఎస్‌ఏ ఖాదర్, ఆర్‌ఐవో
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement