‘జంబ్లింగ్’ రద్దు కోసం ధర్నా
‘జంబ్లింగ్’ రద్దు కోసం ధర్నా
Published Tue, Jan 31 2017 12:27 AM | Last Updated on Tue, Sep 5 2017 2:29 AM
కర్నూలు సిటీ: ఇంటర్మీడియట్ కాలేజీ విద్యార్థులకు ప్రాక్టికల్‌లో అమలు చేస్తున్న జంబ్లింగ్ విధానాన్ని రద్దు చేయాలని ప్రైవేటు జూనియర్ కాలేజీల యాజమాన్య సంఘం డిమాండ్ చేసింది. సోమవారం ఆ సంఘం ఆధ్వర్యంలో రాజ్‌విహార్ సెంటర్ నుంచి పెద్దపార్కు, పాత కంట్రోల్ రూం మీదుగా భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్‌ఐఓ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆ సంఘం నాయకులు శేషిరెడ్డి, వెంకటేశ్వర్లు, చంద్రశేఖర్‌లు మాట్లాడుతూ.. ఇంటర్ ప్రాక్టికల్స్‌లో మొట్ట మొదటి సారిగా అమలు చేస్తున్న జంబ్లింగ్ విధానంతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు కాలేజీలన్నీ ప్రభుత్వ విధానాన్ని వ్యతిరేకిస్తున్నాయన్నారు. అనంతరం ఆర్‌ఐఓ వై.పరమేశ్వరరెడ్డికి వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు రామచంద్రారెడ్డి, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Advertisement