సాక్షి, హైదరాబాద్: ఇప్పటివరకు ఇంటర్మీడియె ట్‌లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీల్లోనే ప్రాక్టి కల్స్ పరీక్షలు ఉండగా ఈ ఏడాది నుంచి కొత్తగా ఆంగ్లం సబ్జెక్టులోనూ ప్రాక్టికల్స్ పరీక్షలు ఉండబో తున్నాయి. మొత్తం నాలుగు విభాగాలుగా ప్రాక్టి కల్స్‌ను విడగొట్టి ఒక్కో విభాగానికి 4 మార్కులు చొప్పన కేటాయించనున్నారు. దీంతోపాటే మొద ట్నుంచీ క్లాస్‌వర్క్ మాదిరి రికార్డు రాయడాన్ని చేర్చనున్నారు. దీనికి కూడా 4 మార్కులు ఇవ్వను న్నారు.
మొత్తం 20 మార్కులకు ప్రాక్టికల్స్ ఉంటా యి. ఇందులో విద్యార్థులు కనీసం 7 మార్కులు తెచ్చుకోవాలి. థియరీని 80 మార్కులకు నిర్వహించనుండగా అందులో కనీసం 28 మార్కులు రావా లి. ఈ ఏడాది ఇంటర్ ప్రథమ సంవత్సరంలోనే ప్రాక్టికల్స్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఇందుకోసం ఇ ప్పటికే కసరత్తు చేపట్టిన ఇంటర్ బోర్డు... నిపుణుల చేత ఆంగ్ల ప్రాక్టికల్ విధానంపై వివరాలను క్రోడీ కరించి ముఖ్య విషయాలను పరిగణనలోకి తీసు కుంది.
ఆంగ్ల భాష కీలకమైనది కావడం, ఇంటర్ పూర్తయినా విద్యార్థులకు దీనిపై పట్టులేకపోవడంతో ప్రాక్టికల్స్‌ను అనివార్యంగా భావిస్తోంది. కేంద్ర, రాష్ట్ర అధ్యయనాలు సైతం ఇంటర్ విద్యార్థులు ఆంగ్లంపై పట్టు సాధించాలని చెబుతుండటం, విదేశీ విద్యకు వెళ్లేందుకూ ఆంగ్లంపై పట్టు అనివార్యం కావడంతో ఈ దిశగా చర్యలు చేపట్టింది.
కాలేజీలకు సూచనలు...
ఆంగ్ల సబ్జెక్టులో ప్రాక్టికల్స్ విధానంపై క్షేత్రస్థాయిలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకొనేందుకు ఇంటర్ బోర్డు సిద్ధమవుతోంది. పరీక్షలకు కావల్సిన సమయం ఉన్నప్పటికీ బోధన సమయంలోనే విద్యార్థులను సిద్ధం చేయాలని అధికారులు భావిస్తున్నారు. ప్రాక్టి కల్స్ ఆవశ్యకత, సన్నద్ధత ఎలా ఉండాలనే దానిపై ప్రతి కాలేజీలోనూ అవగాహన కల్పించాలని ప్రభు త్వ, ప్రైవేటు కాలేజీలను ఉన్నతాధికారులు ఆదేశించారు.
ప్రధానంగా కమ్యూనికేషన్ స్కిల్స్‌కు ప్రా ధాన్యం ఇవ్వాలని సూచిస్తున్నారు. తరగతి గదిలో పరస్పర సంభాషణలు, ఏదైనా అంశంపై మాట్లా డించే పద్ధతిని అనుసరించాలని సూచించారు. వారానికి ఒక గంటపాటు ఈ తరహా కసరత్తు చేయాలని పేర్కొన్నారు. ఆంగ్లంలో ధారాళంగా చదవడం, రాయడం కూడా అభివృద్ధి చేయాల న్నారు. దీంతోపాటే స్పెల్లింగ్‌లపైనా పట్టు సాధించేలా ప్రోత్సహించాలని, ఆంగ్ల దినపత్రికలను చదవడం ద్వారా దీన్ని పెంచాలని భావిస్తున్నారు.
కోవిడ్ దెబ్బతో సాధ్యమా?
ఇంగ్లిష్ సబ్జెక్టులో ప్రాక్టికల్స్ నిర్వహణ సాధ్యా సాధ్యాలపై అధ్యాపకుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. గత రెండేళ్లుగా టెన్త్‌లో కోవిడ్ ప్రభావం కన్పిస్తోంది. లెర్నింగ్ లాస్ ఎక్కువగా ఉందని విద్యాశాఖ సైతం పేర్కొంది. ముఖ్యంగా ఆంగ్ల భాషలో గ్రామర్, స్పెల్లింగ్‌లపై విద్యార్థులు సరైన స్థాయిలో పట్టు సాధించలేదనే భావన సర్వత్రా వ్యక్తమవుతోంది.
ఇంటర్ ప్రాక్టికల్స్‌లోకి తీసుకొనే అంశాలన్నీ గ్రామర్‌తో ముడివడి ఉన్నాయి. గ్రామర్‌లో బేసిక్స్ లేకుండా సరైన కమ్యూనికేషన్ స్కిల్స్‌ను గుర్తించడం కష్టమని అధ్యాపకులు అంటున్నారు. రోల్ ప్లే, లిజనింగ్ కాంప్రహెన్షన్‌లోనూ విద్యార్థులు వెనుకబడొచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రత్యేక శిక్షణ ఇస్తాం
ఇంగ్లిష్ సబ్జెక్టులో ప్రాక్టికల్స్ నిర్వహణపై రాష్ట్ర వ్యాప్తంగా శిక్షణ ఇస్తాం. ఇంటర్ అడ్మిషన్లు పూర్తయ్యాక ప్రతి జిల్లాలోనూ సబ్జెక్టు లెక్చరర్లకు ప్రత్యేక శిక్షణ నిర్వహిస్తాం. విద్యార్థులను అన్ని విధాలా సిద్ధం చేయడం దీని ముఖ్యోద్దేశం. ప్రాక్టికల్స్ కొత్తగా చేపడుతున్నా విద్యార్థులను మానసికంగా సిద్ధం చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటాం. – జయప్రదాబాయ్, ఇంటర్ పరీక్షల విభాగం ముఖ్య అధికారి
Comments
Please login to add a commentAdd a comment