English subject
-
ఇంటర్ ఆంగ్లంలోనూ ప్రాక్టికల్స్
సాక్షి, హైదరాబాద్: ఇప్పటివరకు ఇంటర్మీడియె ట్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీల్లోనే ప్రాక్టి కల్స్ పరీక్షలు ఉండగా ఈ ఏడాది నుంచి కొత్తగా ఆంగ్లం సబ్జెక్టులోనూ ప్రాక్టికల్స్ పరీక్షలు ఉండబో తున్నాయి. మొత్తం నాలుగు విభాగాలుగా ప్రాక్టి కల్స్ను విడగొట్టి ఒక్కో విభాగానికి 4 మార్కులు చొప్పన కేటాయించనున్నారు. దీంతోపాటే మొద ట్నుంచీ క్లాస్‌వర్క్ మాదిరి రికార్డు రాయడాన్ని చేర్చనున్నారు. దీనికి కూడా 4 మార్కులు ఇవ్వను న్నారు. మొత్తం 20 మార్కులకు ప్రాక్టికల్స్ ఉంటా యి. ఇందులో విద్యార్థులు కనీసం 7 మార్కులు తెచ్చుకోవాలి. థియరీని 80 మార్కులకు నిర్వహించనుండగా అందులో కనీసం 28 మార్కులు రావా లి. ఈ ఏడాది ఇంటర్ ప్రథమ సంవత్సరంలోనే ప్రాక్టికల్స్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఇందుకోసం ఇ ప్పటికే కసరత్తు చేపట్టిన ఇంటర్ బోర్డు... నిపుణుల చేత ఆంగ్ల ప్రాక్టికల్ విధానంపై వివరాలను క్రోడీ కరించి ముఖ్య విషయాలను పరిగణనలోకి తీసు కుంది. ఆంగ్ల భాష కీలకమైనది కావడం, ఇంటర్ పూర్తయినా విద్యార్థులకు దీనిపై పట్టులేకపోవడంతో ప్రాక్టికల్స్‌ను అనివార్యంగా భావిస్తోంది. కేంద్ర, రాష్ట్ర అధ్యయనాలు సైతం ఇంటర్ విద్యార్థులు ఆంగ్లంపై పట్టు సాధించాలని చెబుతుండటం, విదేశీ విద్యకు వెళ్లేందుకూ ఆంగ్లంపై పట్టు అనివార్యం కావడంతో ఈ దిశగా చర్యలు చేపట్టింది. కాలేజీలకు సూచనలు... ఆంగ్ల సబ్జెక్టులో ప్రాక్టికల్స్ విధానంపై క్షేత్రస్థాయిలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకొనేందుకు ఇంటర్ బోర్డు సిద్ధమవుతోంది. పరీక్షలకు కావల్సిన సమయం ఉన్నప్పటికీ బోధన సమయంలోనే విద్యార్థులను సిద్ధం చేయాలని అధికారులు భావిస్తున్నారు. ప్రాక్టి కల్స్ ఆవశ్యకత, సన్నద్ధత ఎలా ఉండాలనే దానిపై ప్రతి కాలేజీలోనూ అవగాహన కల్పించాలని ప్రభు త్వ, ప్రైవేటు కాలేజీలను ఉన్నతాధికారులు ఆదేశించారు. ప్రధానంగా కమ్యూనికేషన్ స్కిల్స్‌కు ప్రా ధాన్యం ఇవ్వాలని సూచిస్తున్నారు. తరగతి గదిలో పరస్పర సంభాషణలు, ఏదైనా అంశంపై మాట్లా డించే పద్ధతిని అనుసరించాలని సూచించారు. వారానికి ఒక గంటపాటు ఈ తరహా కసరత్తు చేయాలని పేర్కొన్నారు. ఆంగ్లంలో ధారాళంగా చదవడం, రాయడం కూడా అభివృద్ధి చేయాల న్నారు. దీంతోపాటే స్పెల్లింగ్లపైనా పట్టు సాధించేలా ప్రోత్సహించాలని, ఆంగ్ల దినపత్రికలను చదవడం ద్వారా దీన్ని పెంచాలని భావిస్తున్నారు. కోవిడ్ దెబ్బతో సాధ్యమా? ఇంగ్లిష్ సబ్జెక్టులో ప్రాక్టికల్స్ నిర్వహణ సాధ్యా సాధ్యాలపై అధ్యాపకుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. గత రెండేళ్లుగా టెన్త్‌లో కోవిడ్ ప్రభావం కన్పిస్తోంది. లెర్నింగ్ లాస్ ఎక్కువగా ఉందని విద్యాశాఖ సైతం పేర్కొంది. ముఖ్యంగా ఆంగ్ల భాషలో గ్రామర్, స్పెల్లింగ్లపై విద్యార్థులు సరైన స్థాయిలో పట్టు సాధించలేదనే భావన సర్వత్రా వ్యక్తమవుతోంది. ఇంటర్ ప్రాక్టికల్స్‌లోకి తీసుకొనే అంశాలన్నీ గ్రామర్‌తో ముడివడి ఉన్నాయి. గ్రామర్‌లో బేసిక్స్ లేకుండా సరైన కమ్యూనికేషన్ స్కిల్స్‌ను గుర్తించడం కష్టమని అధ్యాపకులు అంటున్నారు. రోల్ ప్లే, లిజనింగ్ కాంప్రహెన్షన్లోనూ విద్యార్థులు వెనుకబడొచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేక శిక్షణ ఇస్తాం ఇంగ్లిష్ సబ్జెక్టులో ప్రాక్టికల్స్ నిర్వహణపై రాష్ట్ర వ్యాప్తంగా శిక్షణ ఇస్తాం. ఇంటర్ అడ్మిషన్లు పూర్తయ్యాక ప్రతి జిల్లాలోనూ సబ్జెక్టు లెక్చరర్లకు ప్రత్యేక శిక్షణ నిర్వహిస్తాం. విద్యార్థులను అన్ని విధాలా సిద్ధం చేయడం దీని ముఖ్యోద్దేశం. ప్రాక్టికల్స్ కొత్తగా చేపడుతున్నా విద్యార్థులను మానసికంగా సిద్ధం చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటాం. – జయప్రదాబాయ్, ఇంటర్ పరీక్షల విభాగం ముఖ్య అధికారి -
ఇంగ్లిష్‌కూ ప్రాక్టికల్స్! 20 నుంచి 25 మార్కులు?
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్‌లో వచ్చే ఏడాది నుంచి గుణాత్మక మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నట్టు ఇంటర్ బోర్డ్ కార్యదర్శి నవీన్ మిత్తల్ తెలిపారు. జాతీయస్థాయిలో పోటీ పడేలా సరికొత్త విధానాలను అనుసరిస్తున్నామని చెప్పారు. ఇప్పటికే ఈ దిశగా తాము వేసిన కమిటీ కసరత్తు ముమ్మరం చేసిందన్నారు. ‘సాక్షి’తో మంగళవారం నవీన్ మిత్తల్ ప్రత్యేకంగా మాట్లాడారు. ‘జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విద్యావిధానంలో మార్పులు వస్తున్నాయి. దీనికి అనుగుణంగానే తెలంగాణ కాలేజీ విద్యను తీర్చిదిద్దాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. ఉన్నత విద్యకు కీలకమైన ఇంటర్మీడియెట్‌లో అత్యున్నత ప్రమాణాలు తెచ్చే ప్రయత్నం కీలక దశకు చేరుకుంది. ఉన్నత విద్యలో ఇప్పటివరకు కేవలం విద్యార్థి మెమరీని గుర్తించడానికి పరీక్ష పెట్టారు. ఇక నుంచి వారిలోని సృజనాత్మకత, ఆలోచన విధానం వెలికితీసేలా పరీక్ష తీరు ఉండాలని నిపుణులు భావిస్తున్నారు. దీనికి అనుసరించాల్సిన విధానాలపై ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ)తో కమిటీ వేశాం. మరికొన్ని నెలల్లోనే ఇది తమ ప్రతిపాదనలను సమర్పిస్తుంది’ అని చెప్పారు. ఇంగ్లిష్ ఉచ్ఛారణపై అవగాహన పెంపు ఇంటర్లో ఇప్పటివరకు సైన్స్ సబ్జెక్టులో ప్రాక్టికల్స్ ఉండేవని, ఇక నుంచి ఇంగ్లిష్ సబ్జెక్టుకూ దీన్ని విస్తరించాలని బోర్డ్ నిర్ణయించిందని నవీన్ మిత్తల్ చెప్పారు. ఇది ఏ విధంగా ఉండాలనేదానిపై వివిధ వర్గాల సలహాలు, సూచనలు తీసుకున్నామని, త్వరలోనే దీనిపై స్పష్టత వస్తుందని చెప్పారు. ఇంగ్లిష్‌లో మాట్లాడటాన్ని ప్రాక్టికల్‌గా భావిస్తారని, దీనికి 20 నుంచి 25 మార్కులు ఉండే అవకాశముందన్నారు. ఇంగ్లిష్‌లో ప్రాక్టికల్స్ పెట్టడం వల్ల మొదట్నుంచీ ఇంగ్లిష్ ఉచ్ఛారణపై విద్యార్థుల్లో అవగాహన పెరుగుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఇంటర్ సిలబస్‌పై సిలబస్ కమిటీని నియమించామని, ఇటీవలే ఈ కమిటీతో భేటీ జరిగిందని చెప్పారు. రాష్ట్ర సిలబస్ చదివిన విద్యార్థి జాతీయస్థాయి పోటీ పరీక్షలైన జేఈఈ, నీట్, కామన్ యూనివర్సిటీ ప్రవేశ పరీక్షలను తేలికగా రాసేలా సిలబస్ రూపొందించాలన్నది ప్రభుత్వ ఉద్దేశమని చెప్పారు. చరిత్ర విషయంలో రాష్ట్ర చరిత్రకే అత్యధిక ప్రాధాన్యం ఉంటుందని, సైన్స్ సబ్జెక్టుల్లోనే అంతర్జాతీయస్థాయి ప్రమాణాలను మేళవించాలని భావిస్తున్నట్టు చెప్పారు. ఉపాధి అవకాశాలున్న అనేక కోర్సుల మేళవింపు, ఏయే సబ్జెక్టుల్లో ఎంత వరకు పాఠాలు అవసరం అన్నది పరిశీలించి మార్పు చేస్తామన్నారు. జనవరి 18 నుంచి అఫిలియేషన్లు ప్రైవేటు ఇంటర్ కాలేజీల అఫిలియేషన్ విషయంలో గతంలో మాదిరి ఆలస్యం చేయకూడదని నిర్ణయించినట్లు నవీన్ మిత్తల్ చెప్పారు. వచ్చే విద్యాసంవత్సరానికి సంబంధించి ఈ ప్రక్రియను జనవరి 18 నుంచి మొదలుపెడతామని, మార్చి 15 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ఏప్రిల్ 15 నాటికి అనుబంధ గుర్తింపు జాబితాను ప్రకటిస్తామన్నారు. ఆ తర్వాత ఎట్టి పరిస్థితుల్లో గుర్తింపు అంశాన్ని పరిగణనలోనికి తీసుకోబోమని తేల్చిచెప్పారు. దీనివల్ల ఇంటర్ విద్యార్థుల్లో గందరగోళ పరిస్థితులు ఉండబోవని తెలిపారు. పరీక్షలు దగ్గరపడుతున్న నేపథ్యంలో ఇంటర్లో మరికొన్ని మార్పులకు అవకాశం లేకుండా పోయిందని, వచ్చే సంవత్సరం నుంచి ప్రాక్టికల్స్ విషయంలో జంబ్లింగ్ విధానం అమలు చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలిపారు. -
ఇంగ్లిష్, లెక్కలు లేని విద్య వృధా ప్రయాసే..!
ఎక్కువ మంది విద్యార్థులను ఫెయిల్ చేస్తున్న ఇంగ్లిష్, గణితాన్ని సబ్జెక్టులుగా తొలగించి ఐచ్చికాంశాలుగా మాత్రమే కొనసాగించాలని మహారాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఉపాధికి సంబంధించి అత్యంత కింది స్థాయి ఉద్యోగాలకు మాత్రమే ప్రజారాసులను సిద్ధం చేసే పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పాఠశాల విద్యను ప్రోత్స హించే లక్ష్యం కోసం భారత్‌లో విచిత్రమైన పరిణా మాలు జరుగుతున్నాయి. దీని కోసం త్రిభాషా సూత్రాన్ని తీసుకొచ్చారు. కొద్ది సంవత్స రాలు పాస్ కాకున్నా పై తర గతిలో చేరేందుకు అనుమతించారు. బాలికలకు ఉచిత విద్యను అందించారు. బాలికలు బడి మానకుండా చేయ డానికి టాయ్లెట్లను నిర్మించే ప్రయత్నం చేశారు. విద్యా హక్కును కూడా తీసుకొచ్చారు. వీటిలో ఏ ఒక్కటీ ఫలి తాలను ఇవ్వలేదు. విద్యావ్యాపారంలో ప్రైవేట్ రంగా నికి ప్రభుత్వమే తలుపులు బార్లా తెరుస్తున్నందున, పాఠశాలకు బాలికలను తీసుకురావడం ఖరీదైన వ్యవ హారంగా మారిపోయింది. ఇప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వం ఇంగ్లిష్, గణితాన్ని స్కూల్ సబ్జెక్టులుగా తొలగించి వాటిని ఐచ్ఛికాంశాలుగా కొనసాగించాలని భావిస్తోంది. ఎందుకంటే ఈ రెండు సబ్జెక్టుల వల్లే పాఠశాలల్లో అనేకమంది ఫెయిల్ అవు తున్నారు. రాష్ట్ర విద్యామంత్రి వినోద్ తావ్డే సైతం విద్యాబోధన స్థాయి, పాఠశాలల పర్యవేక్షణను పక్కన బెట్టి, ఈ రెండు సబ్జెక్టులే విద్యా ప్రమాణాల వినాశ కారులని చూపిస్తున్న సమాచార పత్రాల గురించి మాట్లాడుతున్నారు. ప్రభుత్వ నియంత్రణ పరిధికి వెలు పల పాఠశాలలు ‘అంతర్జాతీయం’ అయిపోతున్నాయి. మరోవైపు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నిపుణత గురించి కేంద్రంతో చర్చిస్తున్నందున రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్న ఈ చర్య సీరియస్ వ్యవహా రంగా కనిపిస్తోంది. పరీక్షల్లో తక్కువ మార్కులు సాధిం చిన లేదా తమ పరీక్షల్లో నెగ్గని విద్యార్థులకు పాస్ అయ్యారు అని, నిపుణతలకు తగినవారుఅని సర్టిఫికెట్ రూపొందించడం ద్వారా పదవ తరగతిలో ఏ విద్యార్థినీ ఫెయిల్ చేయని తరహా వ్యవస్థ రూపకల్పనపై రాష్ట్ర ప్రభుత్వం నిమగ్నమైంది. ప్రశ్నించదగిన ప్రమాణాలు కలిగిన వ్యవస్థలో కనీస కొలబద్దను కూడా ఇప్పుడు ఇంకాస్త తక్కువ స్థాయికి దించుతున్నారన్నమాట. దేశవ్యాప్తంగా పంచాయతీల నుంచి పురపాలక సంస్థలకు సంబంధించి, ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఉన్నత పాఠశాల విద్యార్థులలో సగంమంది మూడో తరగతిలో నేర్చుకున్న పాఠాలను కూడా చదవలేకపోతున్నారని మనందరికీ తెలుసు. అంటే అన్ని రాష్ట్రాలూ తమకు గర్వ కారణంగా భావిస్తున్న మాతృభాషలో కూడా వీరు పదా లను, వాక్యాలను రాయలేకపోతున్నారు. అదే క్రమంలో వీరు లెక్కలు కూడా చేయలేరు. అంటే భావ వ్యక్తీకరణ లోనూ, మార్పులను గణించడంలోనూ వీరంతా పేలవ మైన సామర్థ్యాన్ని కలిగి ఉన్నారని అర్థం. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే,. ఆధునిక ప్రపంచానికి తలుపులు తెరుస్తున్నట్లు తాము భావిస్తున్న ఇంగ్లిష్ మీడియం విద్యవైపు తల్లిదండ్రులు పరుగులు పెడుతున్న దశలో ఇది వెలుగు చూస్తోంది. ప్రభుత్వం లేక వ్యవస్థను నడిపిస్తున్న రాజకీయ నేతల్లా కాకుండా, ప్రపంచంతో తమ పిల్లలను అనుసంధానించడంలో ఉన్న ప్రాధాన్యతను తల్లిదండ్రులు గ్రహిస్తున్నారు. అదే సమ యంలో ప్రభుత్వం.. మాతృభాషను ఇంగ్లిష్‌పై ఉన్న భ్రమలకు సహజ నివారణగా భావిస్తూ దాని పట్ల అనురక్తిని ప్రదర్శిస్తున్నట్లు కనబడుతోంది. విద్య విషయంలో దేశంలోనే తీవ్ర నేరస్తురాలిగా పక్కన పెట్టనప్పటికీ, మహారాష్ట్ర ఈ కొత్త పరిణామానికి ఉదాహరణగా నిలుస్తోంది. వార్షిక స్థిర విద్యా నివేదికలు విద్యలో అల్ప ప్రమాణాల గురించి ఒకేరకమైన వివరణ లను పదే పదే వెలువరిస్తున్న నేపథ్యంలో... తగిన మానవ వనరుల పునాదిని అభివృద్ధి చేయడంలో తోడ్పాటు నందించే కొన్ని విలువైన సవరణలను కొన్ని రాష్ట్రాలు తీసుకొచ్చాయి. అయితే ఉపాధికి సంబంధించి అత్యంత కింది స్థాయి ఉద్యోగాలకు మాత్రమే ప్రజా రాసులు సిద్ధమవుతున్నారా అనిపించేలా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దేశం విద్యారంగంలో ఎంత చక్కగా పనిచేస్తోంది అనే అంశాన్ని నిర్ధారించడానికి, పాఠశాలల్లో ప్రవేశం అనేది కొలబద్ద కాదు. చక్కటి విద్యా బోధనా స్థాయి, నేర్చుకోవ డానికి సంబంధించి విద్యార్థులకు తోడ్పాడు నందించడంలో దాని సానుకూల ప్రభావం అనేవి పాఠశాల ప్రవేశంతోటే సిద్ధించవు. మీకు విద్యా హక్కు ఉండవచ్చు కానీ, ఏక గది పాఠశాలలు, విజ్ఞానాన్ని అందించడంలో సందేహాస్పదమైన సామర్థ్యం కలిగిన ఉపాధ్యాయుల గైర్హాజర్ అనేవి విద్యాబోధనను మొత్తంగా అపహాస్యం చేస్తున్నాయి. విద్యకోసం కేటా యించే బడ్జెట్ల కంటే అది తీసుకువస్తున్న ఫలితమే నిజమైన కొలబద్ద. అయితే ప్రమాణాలను తగ్గించడం ద్వారా గోల్ పోస్టును మార్చడానికి దేశంలో కనీసం ఒక రాష్ట్రమైనా ఇప్పుడు సంసిద్ధతను ప్రదర్శిస్తున్నట్లు కన బడుతోంది. వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు - మహేష్ విజాపుర్కార్ ఈ మెయిల్ : mvijapurkar@gmail.com -
ఎంత చదివినా ఇంగ్లిష్ రావడం లేదని..
తిరువాన్నమలై (తమిళనాడు): ఎంత కష్టపడి చదివినా ఇంగ్లిష్ రాకపోవడంతో మనస్తాపం చెందిన ఓ 16 ఏళ్ల విద్యార్థిని తీవ్ర నిర్ణయం తీసుకుంది. పదో తరగతి చదువుతున్న భవాని ఇంగ్లిష్ సబ్జెక్టులో తనకు తక్కువ మార్కులు రావడంతో బలవన్మరణానికి పాల్పడింది. గత సోమవారం ఉదయం ఇంట్లో ఎవరూలేని సమయంలో ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకొంది. తిరువాన్నమలై పట్టణానికి చెందిన కష్టవలి, పుంగోడి దంపతుల కూతురైన భవాని స్థానిక మున్సిపల్ హైస్కూల్లో పదో తరగతి చదువుతోంది. ఇంగ్లిష్‌పై తనకు పట్టు లేకపోవడంతో భవాని చాలాసార్లు తీవ్ర నిరాశ చెందింది. ఈ సబ్జెక్ట్ టెస్టుల్లోనూ తక్కువ మార్కులు రావడంతో మనస్తాపం చెందిన ఆమె తనకు స్కూలుకు వెళ్లడం ఇష్టంలేదని పలుసార్లు తోబుట్టువులకు చెప్పిందని, ఈ నేపథ్యంలోనే భవాని ఆత్మహత్య చేసుకుందని తల్లిదండ్రులు తెలిపారని పోలీసులు చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. -
చీటింగ్ ఉపాధ్యాయులపై కేసు నమోదు
సాక్షి, నెల్లూరు : అక్రమంగా స్కూలు అసిస్టెంట్లుగా పదోన్నతులు పొందిన ట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న జిల్లాకు చెందిన 87 మంది సెకండరీ గ్రేడ్ టీచర్ల (ఎస్జీటీ)పై చీటింగ్, ఫోర్జరీలకు సంబంధించి 420, 468, 471 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ వ్యవహారంలో గతనెల 30న సీఐడీ విభాగం రాష్ట్రవ్యాప్తంగా కేసులు నమోదు చేసింది. ఈ పదోన్నతుల వ్యవహారం ఇప్పటిది కాకపోయినా కేసులు మాత్రం తాజాగా నమోదయ్యాయి. జిల్లాకు చెందిన 272 మంది ఇంగ్లిష్ సబ్జెక్టులో పదోన్నతులు పొందగా వారిలో 87 మందిపై కేసులు నమోదయ్యాయి. ఎస్జీటీలుగా పనిచేస్తున్న ఉపాధ్యాయులకు 2000 సంవత్సరం తరువాత పదోన్నతులు లేకపోవడంతో 2009లో ప్రభుత్వం భారీ సంఖ్యలో ప్రమోషన్లు కల్పించింది. అన్ని సబ్జెక్టులకు సంబంధించి పదోన్నతులు ఇచ్చినప్పటికీ ఇంగ్లిషు సబ్జెక్టులో పదోన్నతుల సంఖ్య ఎక్కువగా ఉంది. అప్పట్లో పదోన్నతి పొందేందుకు అర్హులైన (ఎంఏ, ఇంగ్లిషు) వారు లేకపోవడమే ఇందుకు కారణం. అయితే కొంత మంది ఉపాధ్యాయులు చెల్లుబాటు కాని ఇతర రాష్ట్రాల్లోని యూనివర్సిటీల సర్టిఫికెట్లను పొందుపరిచి పదోన్నతులు పొందారు. తదుపరి పదోన్నతులు పొందాల్సిన తమకు తీవ్రంగా అన్యాయం జరగడంతో ఈ అక్రమాలపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారం అప్పట్లో పెద్ద దూమారమే లేపింది. పదోన్నతుల కోసం ఎస్జీటీలు ఇంగ్లిషు సబ్జెక్టుకు సంబంధించి తమిళనాడులోని అన్నామలై, అళగప్ప, మధురై కామరాజ్, యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్, ఎంఎస్ యూనివర్సిటీ, వినాయక మిషన్ నుంచి, జెఎన్ఆర్వీ (రాజస్థాన్), కువెంఫు (కర్ణాటక), భోజ్ (మధ్యప్రదేశ్), మగధ (బీహార్) యూనివర్సిటీల నుంచి ఎంఏ (ఇంగ్లిషు) పట్టాలు పొంది వాటిని తమ పదోన్నతులకు జతపరిచారు. పదోన్నతులు కల్పించేప్పుడు ప్రభుత్వం నుంచి ఇతర రాష్ట్రాల యూనివర్సిటీల నుంచి పొందిన పట్టాలు చెల్లుబాటు కావనే అంశం ఎక్కడా పేర్కొనకపోవడంతో సదరు పట్టాలు పొందారు. అప్పట్లో ఈ వ్యవహారంపై ప్రభుత్వం శాఖాపరంగా చేపట్టిన విచారణ నత్తనడకన సాగడంతో పలువురు ఉప లోకాయుక్తను ఆశ్రయించారు. దీంతో ఉప లోకాయుక్త సీఐడీతో విచారణకు ఆదేశించింది. దీంతో విచారణ చేసిన సీఐడీ అక్రమ పదోన్నతులపై ఒక నివేదిక రూపొందించింది. ఈమేరకు జిల్లాలోని కావలి, నాయుడుపేట, ఏఎస్‌పేట, దొరవారిసత్రం, తోటపల్లిగూడూరు, సీతారామపురం, కోట, మనుబోలు, చేజర్ల, నెల్లూరు రూరల్, అనంతసాగరం, ఓజిలి, సుళ్లూరుపేట, వెంకటాచలం, చిల్లకూరు, బాలాయపల్లి, బోగోలు, రాపూరు, బుచ్చిరెడ్డిపాలెం, వాకాడు, డక్కిలి, సైదాపురం, ఆత్మకూరు, జలదంకి, గూడూరు, కొండాపురం, చిట్టమూరు, ఇందుకూరుపేట, సంగం, కొడవలూరు, వరికుంట పాడు, ఉదయగిరి, ముత్తుకూరు, కలువాయి, పొదలకూరు, తడ మండలాల్లో ఎస్జీటీలుగా పనిచేసి స్కూలు అసిస్టెంట్లుగా పదోన్నతులు పొందిన 87 మందిపై కేసులు నమోదయ్యాయి.