రేపటి నుంచి ఇంటర్‌ప్రాక్టికల్స్
రేపటి నుంచి ఇంటర్‌ప్రాక్టికల్స్
Published Wed, Feb 1 2017 10:13 PM | Last Updated on Tue, Sep 5 2017 2:39 AM
ఈ ఏడాది నుంచి జంబ్లింగ్
పరీక్షలకు సర్వసిద్ధం చేసిన జిల్లా ఇంటర్‌బోర్డు అధికారులు
జిల్లాలో హాజరుకానున్న 33,594 మంది విద్యార్థులు
ఈ ఏడాది నుంచి జంబ్లింగ్
కంబాలచెరువు : ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలకు సర్వసిద్ధమైంది. శుక్రవారం నుంచి ప్రారంభంకానున్న ఈ పరీక్షలకు జిల్లా ఇంటర్‌బోర్డు అధికారులు సమయాత్తమయ్యారు. ఇంటర్ విద్యాశాఖ అధికారులు టెలికాన్ఫరెన్స్ ద్వారా జిల్లా అధికారులతో మాట్లాడారు.
జిల్లా వ్యాప్తంగా 96 కళాశాలల్లో..
ఈనెల మూడోతేదీ నుంచి 22 వరకు ఈ పరీక్షలు జిల్లావ్యాప్తంగా మొత్తం 96 కళాశాలల్లో జరగనున్నాయి. వీటికి మొత్తం 33,594 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఉదయం తొమ్మిది నుంచి మ«ధ్యాహ్నం 12 వరకు, మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు రెండు సెషన్లుగా వీటిని నిర్వహించనున్నారు. నాలుగు స్పెల్స్‌లో జరిగే ఈ పరీక్షలు ప్రథమ స్పెల్‌గా 43 కళాశాలలు, రెండో స్పెల్‌లో 48 కళాశాలలు, మూడో స్పెల్‌లో 51 కళాశాలలు, నాలుగో స్పెల్స్‌లో 43 కళాశాలల్లో జరగనున్నాయి. సైన్స్ విద్యార్థులకు బోటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ విభాగాల్లో, ఒకేషనల్ విద్యార్థులకు 19 రకాల సబ్జెక్టుల్లో ఈ పరీక్షలు జరుగుతాయి. ప్రైవేట్ కళాశాలల్లో జరిగే ప్రాక్టికల్స్‌కి 32 మంది డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్లను నియమించారు. ఈ ఏడాది నుంచి జంబ్లింగ్ విధానం అమలు చేస్తున్నారు. అలాగే నాలుగు ఫ్లయింగ్ స్క్వాడ్స్, కలెక్టర్‌తో ఉండే హైపవర్ కమిటీలో అధికారిగా జిల్లా ఆర్‌ఐవోగా పనిచేసిన వెళ్లిన కేపీ దాశరథి వ్యహరించనున్నారు. వీరితో పాటు రెవెన్యూ స్క్వాడ్, పోలీస్‌శాఖ ఉంటుంది. ఆర్జేడీ ఎ.అన్నమ్మ, ఆర్‌ఐఓ ఎ.వెంకటేష్, డీవీఈవో కె.హెప్సీరాణి ఆధర్యంలో ఈనెల 24న సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రాక్టికల్స్, మార్చిలో జరిగే పరీక్షలకు సంబంధించి ఎటువంటి అవాంతరాలు రాకుండా ముందస్తు జాగ్రత్తగా చర్యలు తీసుకున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీస్‌శాఖ వి««ధులపై ఆ శాఖాధికారితో, ఆరోగ్య సమస్యలపై మెడికల్ అధికారులతో, పరీక్ష సమయంలో విద్యుత్ అవాంతరాలు రాకుండా విద్యుత్ అధికారులతో సమీక్షించారు. పరీక్షా కేంద్రంలోకి విధులు నిర్వర్తించే డిపార్ట్‌మెంట్ ఆఫీసర్లతో సహా ఎవరూ సెల్‌ఫోన్ వాడరాదని ఉత్తర్వులు జారీచేశారు.
Advertisement