వాట్ నెక్ట్స్ | what next | Sakshi
Sakshi News home page

వాట్ నెక్ట్స్

Published Fri, Feb 20 2015 11:35 PM | Last Updated on Sat, Sep 2 2017 9:38 PM

వాట్ నెక్ట్స్

వాట్ నెక్ట్స్

టెన్త్ తరువాత ఇంటర్... ఆపై ఇంజనీరింగో... డిగ్రీనో... ఎడ్యుకేషనల్ ప్రాసెస్‌లో రొటీన్‌గా జరిగిపోతాయి. కానీ... డిగ్రీ తరువాత! పీజీ... అని ఠక్కున చెప్పలేం. తేల్చుకోవడం కష్టం.
 విజ్ఞానంతో పాటు వయసు, ఆలోచన, అన్నింటికీ మించి పరిస్థితుల ప్రభావం మన కెరీర్‌ను, ఇంకా చెప్పాలంటే లైఫ్ లైన్‌ను డిసైడ్ చేసే సందర్భం ఇదే. ఏ బాదరబందీ లేకుండా సరదాగా సాగిపోయే కాలేజీ డేస్ నుంచి ఒక్కసారిగా డైవర్షన్ తీసుకోవడం ఎవరికైనా ఇబ్బందే.
 సనత్‌నగర్ ‘హిందూ కాలేజ్ ఫర్ ఉమెన్’ ఫైనలియర్ డిగ్రీ విద్యార్థినులను ఇదే ప్రశ్న వేస్తే... కొందరిలో ఎటూ తేల్చుకోలేక కన్‌ఫ్యూజన్... ఇంకొందరిలో భవిష్యత్‌పై భయం... మరికొందరిలో ఏంచేయాలనే స్పష్టత... మొత్తానికి అంతా కలసి ‘వాట్ నెక్ట్స్’ అన్నదానికి
 ఓ కన్‌క్లూజన్ కోసం ప్రయత్నించారు.  
 
 మనీష: డిగ్రీ తర్వాత పీజీ అనేది టెన్త్ తర్వాత కాలేజ్ అన్నంత ఈజీకాదు.
 శ్రీలత: అమ్మాయిలం కదా! డిగ్రీ తర్వాత జాబ్ చెయ్యాలా.. ఫర్‌దర్ స్టడీస్‌కి వెళ్లాలా.. లేదంటే ఇంట్లోవాళ్లు పెళ్లంటే.. మీ ఇష్టం అనాలా... డిసైడ్ చేసుకునే సమయం.
 రాజశ్రీ: అందరికీ ఫర్‌దర్ స్టడీస్‌కి వెళ్లాలని, లేదంటే జాబ్ చేయాలని ఉంటుంది. కానీ చాయిస్‌లన్నీ మాచేతుల్లో ఉండే వయసు కాదు కదా! ఇంట్లోవాళ్లు పెళ్లి తప్పదంటే!
 తేజ: ఏముంది... కుదరదు చదువుకుంటామనో, జాబ్ చేస్తామనో గట్టిగా చెప్పేయడమే.
 రాజశ్రీ: అందరి పరిస్థితులు ఒక్కలా ఉండవు కదా! నేను మాత్రం ఇంకా చదవాలనుకుంటున్నాను.
 మౌనిక: నేను మాత్రం జాబ్ చేయాలనుకుంటున్నాను. నేనే కాదు... ఇక్కడున్న నా స్నేహితురాళ్లు చాలామంది చాయిస్ కూడా అదే. నావరకూ నేను అప్పుడే జాబ్ సెర్చ్ మొదలుపెట్టేశాను.
 తేజ: మా ప్రియాంక అయితే ఆల్‌రెడీ మంచి జాబ్ కొట్టేసింది.
 ప్రియాంక: అవును... ఈ మధ్యనే నాకు టీసీఎస్‌లో జాబ్ వచ్చింది.
 ధారాపటేల్: నేను మాత్రం ఎమ్మెస్సీ మైక్రో బయాలజీ చదువుదామనుకుంటున్నా  
 మాధురి: డిగ్రీ వరకూ అంటే పూర్తిగా తల్లిదండ్రులు మీద ఆధారపడి చదువుకుంటాం. ఆ తర్వాత కూడా అంటే అందరికీ సాధ్యం కాకపోవచ్చు. నేను పార్ట్‌టైం జాబ్ చేసుకుంటూ చదువుకుందాం అనుకుంటున్నా.
 నందినిగాయిత్రి: నేను నేషనల్ లెవల్ వాలీబాల్ ప్లేయర్‌ని. ఇంట్లోవాళ్లు చదువు, జాబ్,
 
 
 పెళ్లి ఏదైనా నా నిర్ణయమే తమదంటారు.
 శ్రీలత: నా చాయిస్ కూడా జాబే.
 దీక్షిత: ఏం జాబ్‌లో ఏమోనండి. బయట చాలా కాంపిటీషన్ ఉంది. చాలామంది అమ్మాయిలు డిగ్రీ అవ్వగానే సర్టిఫికెట్స్ పట్టుకుని ఇంటర్వ్యూలకు రెడీ అయిపోతున్నారు. అబ్బాయిలు కూడా ఉంటారు కదా!
 మయూరి: ఇప్పుడు కాలేజీలో కూర్చుని ఇలా ఎన్ని కబుర్లయినా చెప్పుకోవచ్చు. ఇంటికెళ్లాక మన పెద్దవాళ్ల మాటలు విన్నాక చాలా విషయాల్లో కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. ముఖ్యంగా పెద్ద చదువులా... పెళ్లా అన్నదగ్గర!
 మౌనిక: కాంప్రమైజ్ అనే పదం మనల్ని నీడలా వెంటాడుతూనే ఉంటుంది.
 బదర్ సుల్తానా: అమ్మాయి అంటేనే కాంప్రమైజ్ అని అర్థం కదా! స్కూల్లో ఉన్న ఆలోచనలు కాలేజీకి వచ్చాక మారిపోతాయి. కాలేజీలో ఉన్న ప్లానింగ్ డిగ్రీకొచ్చాక ఉండదు. డిగ్రీ పూర్తయ్యాక అప్పటి పరిస్థితులను బట్టి ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే అమ్మానాన్నల ప్లానింగ్‌ని ఫాలో అవ్వాల్సి వస్తుంది.  
 కరిష్మా: ఆ మాట అనాల్సింది అమ్మాయిలు
 
 కదా! మనకెందుకు ఇలాంటి ఫీలింగ్ కలుగుతోంది! (నవ్వుతూ)
 మౌనిక: అఫ్కోస్... మా ఉమెన్ కాలేజీలో మాతో కలిసి చదువుతున్న ఒకే ఒక అబ్బాయి తేజ.
 (నవ్వుతూ)
 మల్లీశ్వరి: కాలం మారిందండి. పేరెంట్స్ చాలావరకు మాకే చాయిస్ ఇస్తున్నారు.
 సౌమ్య: ఎంత చాయిస్ ఇచ్చినా ఒక వయసొచ్చాక.. చాలావరకూ ఇంటి పరిస్థితులను బట్టే నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement