కలల సాకారానికి ‘సాక్షి’ కెరీర్ ఫెయిర్ | Respective 'Sakshi' Career Fair | Sakshi
Sakshi News home page

కలల సాకారానికి ‘సాక్షి’ కెరీర్ ఫెయిర్

Published Sun, Jun 1 2014 4:11 AM | Last Updated on Mon, Aug 20 2018 8:10 PM

కలల సాకారానికి ‘సాక్షి’ కెరీర్ ఫెయిర్ - Sakshi

కలల సాకారానికి ‘సాక్షి’ కెరీర్ ఫెయిర్

సాక్షి, సిటీబ్యూరో: టెన్త్, ఇంటర్ తర్వాత ఉజ్వల భవితను కోరుకునే విద్యార్థులకు వివిధ కోర్సులపై అవగాహన కల్పించే ఉద్దేశంతో ‘సాక్షి’ కెరీర్ ఫెయిర్‌ను నిర్వహించిందని సాక్షి టీవీ మార్కెటింగ్ డెరైక్టర్ రాణిరెడ్డి అన్నారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్న వివిధ రంగాలకు సంబంధించిన నిపుణులు ఈ కెరీర్ ఫెయిర్‌లో విద్యార్థులకు అవగాహన కల్పిస్తారని ఆమె చెప్పారు.

బంజారాహిల్స్‌లోని సుల్తాన్ ఉలుమ్ ఇంజనీరింగ్ కళాశాలలో శనివారం సాక్షి టీవీ నిర్వహించిన కెరీర్ ఫెయిర్‌కు నగరవాసుల నుంచి మంచి స్పందన లభించింది. ఈ సందర్భంగా సుల్తాన్ ఉలుమ్ ఎడ్యుకేషన్ సొసైటీ కార్యదర్శి జాఫర్ జావెద్ మాట్లాడుతూ.. సంప్రదాయ కోర్సులకు భిన్నంగా ఉపాధి అవకాశాలున్న కోర్సులపై అవగాహన కల్పించడం ఎంతో అవసరమని, ఈ దిశగా సాక్షి టీవీ యాజమాన్యం చేసిన ప్రయత్నం అభినందనీయమన్నారు.

ఓయూ కెమిస్ట్రీ విభాగాధిపతి పార్థసారథి మాట్లాడుతూ.. విద్యార్థి దశ నుంచే కెరీర్‌కు దోహదపడే అంశాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ప్రపంచవ్యాప్తంగా లభిస్తున్న సమాచారాన్ని, అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు.
 
గాయత్రి అకాడ మీ చైర్మన్ పీవీఆర్‌కే మూర్తి మాట్లాడుతూ.. టెన్త్, ఇంటర్, గ్రాడ్యుయేషన్ స్థాయిల్లో కెరీర్ ఫెయిర్లు నిర్వహించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఎంపీసీ కోర్సు కన్నా, బైపీసీ కోర్సు చదివిన విద్యార్థులకు ఉన్నత విద్యావకాశాలు మెండుగా ఉన్నాయన్నారు. ఐసీఎస్‌ఐ హైదరాబాద్ చాప్టర్ చైర్మన్ వాసుదేవరావు మాట్లాడుతూ.. పరిశ్రమ అవసరాలకు తగిన విధంగా విద్యార్థులు తయారు కావాలని, వారిని ఆ దిశగా నడిపించాల్సిన బాధ్యత అధ్యాపకులదేనన్నారు.

కెరీర్‌లో ఉన్నత స్థాయికి చేరేందుకు కామర్స్ కోర్సులు ఎంతగానో దోహద పడతాయన్నారు. ఉద్యోగి స్థాయి నుంచి యజమాని స్థాయికి ఎదిగేందుకు కంపెనీ సెక్రటరీ కోర్సు చక్కని సోపానమన్నారు. కార్యక్రమంలో బటర్ ఫ్లై ఫౌండేషన్ వ్యవస్థాపకుడు కె.శరత్‌చంద్ర, రిషీకేశ్ హంబే తదితరులు పాల్గొన్నారు.
 
నేడు కూడా...

సాక్షి కెరీర్ ఫెయిర్‌ను ఆదివారం కూడా కొనసాగించనున్నారు. ఇందులో దక్కన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైన్, లకోటియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైన్, నియో ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ అండ్ టెక్నాలజీ, ఈ మార్గ్ అబ్రాడ్ ఎడ్యుకేషన్, ఇక్ఫయ్ హయ్యర్ ఎడ్యుకేషన్, షైన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ, రేవ్ ఇనిస్టిట్యూట్ , ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ కంప్యూటర్ డిజైన్స్, ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైన్స్ తదితర సంస్థలు పాల్గొన్నాయి. ‘సాక్షి భవిత’ నిర్వహించిన కంప్యూటర్ ఆప్టిట్యూడ్ టెస్ట్‌కు విద్యార్థుల నుంచి మంచి స్పందన లభించింది.
 
 రెగ్యులర్‌కు భిన్నంగా
 ఇంటర్‌మీడియేట్ పూర్తయింది. సాక్షి కెరీర్ ప్రోగ్రామ్ ద్వారా రెగ్యులర్‌గా చదివే వాటికి భిన్నమైన కోర్సుల గురించి తెలుసుకోగలిగా. ఇలాంటి ఉపయోగకర కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సాక్షికి కృతజ్ఞతలు.     
- అభినవ్, ఇంటర్
 
 అవగాహన పెరిగింది
 ఇంటర్ తర్వాత వేసే అడుగే కెరీర్‌కు ముందడుగు. ఇంజనీరింగ్, మెడిసిన్ కాకుండా ఇంకా అనేక రకాల కోర్సులు ఉన్నాయని తెలిసింది. వాటిలో చేరితే ఎలాం టి అవకాశాలు వస్తాయో ఇక్కడ వివరించారు.      
- ఈశ్వర్, ఇంటర్
 
 విభిన్న కోర్సులు తెలిశాయి
 ఇటీవలే టెన్త్ పూర్తయింది. తరువాత ఇంటర్ కాకుండా ఏంచేయాలన్నదానిపై అవగాహన కోసం ఇక్కడకు వచ్చా. విభిన్న కోర్సుల గురించి తెలుసుకోగలిగా. ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన సాక్షికి ధన్యవాదాలు.     
- నారాయణ, టెన్త్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement