సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ ఆదివారం ఫలితాలను విడుదల చేశారు. గత మార్చిలో నిర్వహించిన రెగ్యులర్ పరీక్షల ఫలితాల్లో దొర్లిన సాంకేతిక తప్పులు పునరావృతం కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని ఆయన తెలిపారు. మొదటి సంవత్సరం ఫలితాలను వారంలోపు విడుదల చేస్తామన్నారు. ఆన్‌లైన్ మెమోలను అందుబాటులో పెట్టామని, ఈ సారి ఆన్‌లైన్‌లో ఫిర్యాదులు తీసుకుంటామని చెప్పారు. పరీక్షలకు హాజరైన వారిలో 37.76 శాతం మంది ఉత్తీర్ణులైనట్లు ఆయన వెల్లడించారు. ఇందులో బాలికలు 41.35 శాతం, బాలురు 35.4 శాతం పాసయ్యారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment