Advanced Supplementary Examination Results
-
టెన్త్ అడ్వాన్స్‌డ్‌లో 73.03% ఉత్తీర్ణత
సాక్షి, హైదరాబాద్: పదవ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాల్లో 34,126 మంది ఉత్తీర్ణులయ్యారు. బాలురు 20,694 మంది పాసైతే, బాలికలు 13432 మంది పాసయ్యారు. 73.03 శాతం ఉత్తీర్ణత నమోదైంది. టెన్త్ కామన్ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల 3 నుంచి 13వ తేదీ వరకూ నిర్వహించారు. మొత్తం 46,731 మంది హాజరయ్యారు. పరీక్ష ఫలితాలను టెన్త్ పరీక్షల విభాగం శుక్రవారం హైదరాబాద్‌లో విడుదల చేసింది. నిర్మల్ జిల్లా 100 శాతం ఉత్తీర్ణతతో మొదటి స్థానంలో నిలిస్తే, వికారాబాద్ జిల్లాలో అతి తక్కువ ఉత్తీర్ణత (42.14 %) నమోదైంది. హైదరాబాద్‌లో 71.22 శాతం విద్యార్థులు పాసయ్యారు. కొంతమంది విద్యార్థులకు సంబంధించిన సరైన సమాచారం లేనందున వారి ఫలితాలను విత్‌హెల్డ్‌లో ఉంచారు. త్వరలో వీరి ఫలితాలు వెల్లడిస్తామని అధికారులు తెలిపారు. ఫలితాలు ఠీఠీఠీ.bట్ఛ.్ట్ఛ ్చnజ్చn్చ.జౌఠి.జీn వెబ్సైట్లో పది రోజుల పాటు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. రీ కౌంటింగ్‌కు జూలై 8 వరకూ చాన్స్ మూల్యాంకన పత్రాలు, మార్కులపై అభ్యంతరాలు ఉన్న విద్యార్థులు రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. జూలై 8వ తేదీ వరకూ ప్రతి సబ్జెక్టుకు రూ. 500 చెల్లించి రీ కౌంటింగ్ చేయించుకోవచ్చని అధికారులు తెలిపారు. రీ వెరిఫికేసన్ కోరే విద్యార్థులు హాల్ టికెట్ జిరాక్స్, కంప్యూటరైజ్డ్ ప్రింటెడ్ మెమో కాపీతో సంబంధిత పాఠశాలలో దరఖాస్తు చేసుకోవాలి. రీ వెరిఫికేసన్ కోసం ఒక్కో సబ్జెక్టుకు రూ.1,000 చెల్లించాల్సి ఉంటుంది. -
ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ ఆదివారం ఫలితాలను విడుదల చేశారు. గత మార్చిలో నిర్వహించిన రెగ్యులర్ పరీక్షల ఫలితాల్లో దొర్లిన సాంకేతిక తప్పులు పునరావృతం కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని ఆయన తెలిపారు. మొదటి సంవత్సరం ఫలితాలను వారంలోపు విడుదల చేస్తామన్నారు. ఆన్లైన్ మెమోలను అందుబాటులో పెట్టామని, ఈ సారి ఆన్లైన్లో ఫిర్యాదులు తీసుకుంటామని చెప్పారు. పరీక్షలకు హాజరైన వారిలో 37.76 శాతం మంది ఉత్తీర్ణులైనట్లు ఆయన వెల్లడించారు. ఇందులో బాలికలు 41.35 శాతం, బాలురు 35.4 శాతం పాసయ్యారని తెలిపారు. -
ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఇంటర్మీడియెట్ మొదటి, రెండవ సంవత్సర అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. ఇంటర్మీడియెట్ బోర్డు కార్యాలయంలో విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య ఈ ఫలితాలను విడుదల చేశారు. తాజాగా విడుదల చేసిన ఫలితాలతో ఫస్టియర్ ఉత్తీర్ణత శాతం 72.2 శాతం, సెకండియర్ ఉత్తీర్ణత శాతం 78.7 శాతానికి చేరింది. ఈ నెల 18 వరకు రీవాల్యుయేషన్, కౌంటింగ్‌కు అవకాశముంది. www.sakshieducation.com వెబ్సైట్లో ఫలితాలను చూసుకోవచ్చు. -
నేడు ‘ఇంటర్ సప్లిమెంటరీ’ ఫలితాలు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను శుక్రవారం విడుదల చేసేందుకు ఇంటర్ బోర్డు ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉదయం 10 గంటలకు బోర్డు కార్యాలయంలో విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు. www.sakshi.com, www.sakshieducation.com, https://tsbie.cgg.gov.in, http://bie.tg.nic.in, http://examresults.ts.nic.in, http://results.cgg.gov.in, www.exam.bie.telangana.gov.in, www.bie.telangana.gov.in తదితర వెబ్సైట్లలో ఫలితాలను చూసుకోవచ్చు. టీఎస్‌బీఐఈ సర్వీసెస్ మొబైల్ యాప్ ద్వారా కూడా ఫలితాలను పొందవచ్చు. జూనియర్ కాలేజీల వారీ ఫలితాలను http://admi. tsbie. cgg.gov.in వెబ్సైట్లో పొందవచ్చు. ప్రిన్సిపాళ్లు తమ యూజర్ ఐడీ, పాస్వర్డ్ ఉపయోగించి వాటిని డౌన్లోడ్ చేసకోవచ్చని ఇంటర్ బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది. గత నెల 14 నుంచి 28వ తేదీ వరకు నిర్వహించిన ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 4 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. -
టెన్త్ అడ్వాన్స్‌డ్‌లో 59.93% ఉత్తీర్ణత
సాక్షి, హైదరాబాద్: పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. ఈ పరీక్షల్లో 59.93% మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. పాఠశాల విద్యా డైరెక్టరేట్‌లో ఫలితాలను పాఠశాల విద్యా ఇన్చార్జి కమిషనర్ విజయ్‌కుమార్ విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ.. ‘ఈ పరీక్షల్లో బాలుర కంటే బాలికలు 6.27% అధిక ఉత్తీర్ణత సాధిం చారు. బాలురు 57.24% మంది ఉత్తీర్ణులవ్వగా, బాలికలు 63.51% ఉత్తీర్ణత సాధించారు. ఈ పరీక్షలకు బాలురు 50,814 మంది హాజరుకాగా, 29,085 మంది ఉత్తీర్ణులయ్యారు. బాలికలు 38,312 మంది హాజరుకాగా, 24,332 మంది ఉత్తీర్ణత సాధించారు. 87.33% ఉత్తీర్ణతతో వరంగల్ రూరల్ ప్రథమ స్థానంలో నిలువగా, 26.76% ఉత్తీర్ణతతో జనగామ చివరి స్థానంలో నిలిచింది. గతేడాది అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలతో పోల్చితే ఈసారి 1.34% ఉత్తీర్ణత తగ్గింది’ అని అన్నారు. పరీక్షలకు 89,126 మంది హాజరవగా.. 53,417 మంది (59.93%) ఉత్తీర్ణులయ్యారు. పది రోజుల్లో మార్కుల మెమోలు.. పరీక్షల్లో పాస్, ఫెయిల్ అయిన విద్యార్థులకు 10 రోజుల్లో మార్కుల మెమోలను పంపిస్తామని విజయ్‌కుమార్ తెలిపారు. పాస్ అయిన విద్యార్థులకు సర్టిఫికెట్లను కూడా పంపిస్తామని పేర్కొన్నారు. విద్యార్థులు రీకౌంటింగ్ కోసం ఈ నెల 7 నుంచి 15లోగా ప్రభుత్వ పరీక్షల విభాగం కార్యాలయంలో పోస్టు ద్వారా లేదా స్వయంగా వచ్చి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఒక్కో సబ్జెక్టుకు రూ.500 చెల్లించాలన్నారు. రీవెరిఫికేషన్ కమ్ ఫొటో కాపీ కోసం సంబంధిత హెడ్మాస్టర్ సంతకం చేయించుకొని ఆయా జిల్లాల డీఈవో కార్యాలయాల్లో ఈ నెల 7 నుంచి 15లోగా దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. ఒక్కో సబ్జెక్టుకు రూ.1,000 చెల్లించాలని, http://bse.telangana.gov.inలో దరఖాస్తు ఫారం నమూనాను ఉంచినట్లు తెలిపారు.