నేడు ‘ఇంటర్‌ సప్లిమెంటరీ’ ఫలితాలు | Telangana Intermediate Advanced Supplementary 2018 Results | Sakshi
Sakshi News home page

నేడు ‘ఇంటర్‌ సప్లిమెంటరీ’ ఫలితాలు

Published Fri, Jun 8 2018 9:23 AM | Last Updated on Fri, Jun 8 2018 9:23 AM

Telangana Intermediate Advanced Supplementary 2018 Results - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఇంటర్మీడియెట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను శుక్రవారం విడుదల చేసేందుకు ఇంటర్‌ బోర్డు ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉదయం 10 గంటలకు బోర్డు కార్యాలయంలో విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్‌ ఆర్‌ ఆచార్య ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు. www.sakshi.com, www.sakshieducation.com, https://tsbie.cgg.gov.in,  http://bie.tg.nic.in, http://examresults.ts.nic.in, http://results.cgg.gov.in, www.exam.bie.telangana.gov.in, www.bie.telangana.gov.in తదితర వెబ్‌సైట్లలో ఫలితాలను చూసుకోవచ్చు.

టీఎస్‌బీఐఈ సర్వీసెస్‌ మొబైల్‌ యాప్‌ ద్వారా కూడా ఫలితాలను పొందవచ్చు. జూనియర్‌ కాలేజీల వారీ ఫలితాలను  http://admi. tsbie. cgg.gov.in వెబ్‌సైట్‌లో పొందవచ్చు. ప్రిన్సిపాళ్లు తమ యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ ఉపయోగించి వాటిని డౌన్‌లోడ్‌ చేసకోవచ్చని ఇంటర్‌ బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది. గత నెల 14 నుంచి 28వ తేదీ వరకు నిర్వహించిన ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 4 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement