![Notification for admission to Basra IIT - Sakshi](/styles/webp/s3/article_images/2018/04/26/rggg.jpg.webp?itok=YorFNkFW)
బాసర: నిర్మల్ జిల్లా బాసరలోని రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (ఆర్జీయూకేటీ)లో 2018–19 విద్యా సంవత్సరం ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. కళాశాల ఇన్‌చార్జి వీసీ డాక్టర్ అశోక్‌కుమార్ బుధవారం కళాశాలలో నోటిఫికేషన్ విడుదల చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ, ఆరేళ్ల బీటెక్ ఇంటిగ్రేటెడ్ కోర్సులో చేరేందుకు పదో తరగతి చదివిన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు.
స్థానికులకు (తెలంగాణ రాష్ట్రం) 85 శాతం, స్థానికేతరులకు 15శాతం సీట్లు కేటాయించినట్లు తెలిపారు. భర్తీ కాని సీట్లను గ్లోబల్, ఎన్‌ఆర్‌ఐ కోటా కింద 5 శాతం మేర కేటాయిస్తామని పేర్కొన్నారు. ఈ కోటా కింద బయట ఇంటర్ పూర్తి చేసినవారికి నేరుగా బీటెక్ ఫస్టియర్‌లో ప్రవేశం కల్పించనున్నట్లు వివరించారు. ఈ నెల 28 నుంచి జూన్ 1వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు. విద్యార్హతలు, ధ్రువీకరణ పత్రాలను జూన్4లోపు పంపించాలన్నారు. ఎంపికైన విద్యార్థుల జాబితా జూన్ 11న ప్రకటించి, 18, 19 తేదీల్లో కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు.
జూలై 2న ఓరియంటేషన్ నిర్వహించి, 3న తరగతులు ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. ఇతర వివరాలకు యూనివర్సిటీ వెబ్‌సైట్లు www.rgukt.ac.in, http://admissions.rgukt. ac.inలలో సంపద్రించాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment