అనంతపురం ఎడ్యుకేషన్ : ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. తొలిసంవత్సరం ఫలితాల్లో జిల్లా రాష్ట్రంలోనే చివరిస్థానంలో నిలవగా, ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో 8వ స్థానం దక్కించుకుంది. మొదటి సంవత్సరం పరీక్షలకు సంబంధించి మొత్తం 24,620 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 17,166 మంది 70 శాతం ఉత్తీర్ణత సాధించారు. వీరిలో 12,633 బాలురకు గానూ 8,293 మంది 66 శాతం ఉత్తీర్ణులయ్యారు.
అలాగే 11,987 మంది బాలికలకు గానూ 8873 మంది 74 శాతం ఉత్తీర్ణులయ్యారు. ద్వితీయ సంవత్సరం పరీక్షలకు సంబంధించి 8986 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 4180 మంది 47 శాతం ఉత్తీర్ణత సాధించారు. వీరిలో 5366 మంది బాలురకు గానూ 2413 మంది 45 శాతం ఉత్తీర్ణత సాధించారు. అలాగే 3620 మంది బాలికలను గానూ 1767 మంది 49 శాతం ఉత్తీర్ణత సాధించారు.
ఇంటర్ అడ్వాన్స్‌డ్‌లో ‘అనంత’ ఆఖరు
Published Thu, Jun 8 2017 11:03 PM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM
Advertisement