అనంతపురం ఎడ్యుకేషన్: సార్వత్రిక విద్యా పీఠం (ఓపెన్ స్కూల్) ఆధ్వర్యంలో పదో తరగతి, ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. స్థానిక రాజేంద్ర నగరపాలక ఉన్నత పాఠశాల కేంద్రాన్ని జాయింట్ కలెక్టర్ ఖాజా మొహిద్దీన్ తనిఖీ చేశారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని డీఈఓ లక్ష్మీనారాయణ, ఆర్‌ఐఓ సురేష్‌ను ఆయన ఆదేశించారు. ముఖ్యంగా అన్ని కేంద్రాల్లోనూ ఫర్నీచర్ సమస్య తలెత్తకుండా చూడాలన్నారు. ఇంటర్ పరీక్షకు 585 మంది విద్యార్థులకు గాను 438 మంది హాజరయ్యారు. పదో తరగతి పరీక్షకు సంబంధించి ఐదుగురుకు గాను గాను ముగ్గురు హాజరైనట్లు వివరించారు.