ఇంటర్మీడియెట్‌లో ఎనిమిది పాయింట్ల గ్రేడింగ్ విధానాన్ని అమల్లోకి తెచ్చేందుకు ఇంటర్ బోర్డు కసరత్తు మొదలుపెట్టింది. ఈ అంశంపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించినట్లు తెలిసింది. ప్రభుత్వం త్వరలోనే సానుకూల నిర్ణయం తీసుకొని, గ్రేడింగ్ విధానం అమలుకు ఉత్తర్వులు జారీ చేయనుందని ఓ ఉన్నతాధికారి వెల్లడించారు.