grading system
-
తెలంగాణ: పదో తరగతి ఫలితాలు విడుదల
సాక్షి, హైదరాబాద్: పదో తరగతి పరీక్షల ఫలితాలను తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసింది. హైదరాబాద్‌లో విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సంబంధిత అధికారులతో కలిసి ఫలితాలను విడుదల చేశారు. మధ్యాహ్నం మూడు గంటలకు వెబ్సైట్లో ఫలితాలు అందుబాటులో ఉండనున్నాయి. కరోనా కారణంగా ఈసారి పదో తరగతి పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. దీంతో రాష్ట్రంలోని 5.21 లక్షల మంది పదో తరగతి విద్యార్థులందరినీ ఉత్తీర్ణులను చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఫలితాల కోసం bsetelangana.org ను సంప్రదించండి. ఇంటర్నల్ అసెస్మెంట్ మార్కుల ఆధారంగా విద్యార్థులకు గ్రేడ్ లను నిర్ణయించినట్లు మంత్రి సబిత తెలిపారు. పదో తరగతి పరీక్షల కోసం నమోదు చేసుకొన్న 5,21,073 మంది విద్యార్థులను ఉత్తీర్ణులను చేసినట్లు వెల్లడించారు. వీరిలో 5,16,578 మంది రెగ్యులర్ విద్యార్థులు కాగా 4,495 మంది గతంలో ఫెయిలై ప్రస్తుతం పరీక్ష ఫీజు చెల్లించినవారని వివరించారు. ఉత్తీర్ణత సాధించిన వారు బాలురు 2,62,917 బాలికలు 2,53,661 10/10 జీపీఏ సాధించిన విద్యార్థులు 2,10,647 10/10 జీపీఏ సాధించిన పాఠశాలలు 535 పాస్ మెమోలను సంబంధిత ప్రధానోపాధ్యాయుల ద్వారా తీసుకోవచ్చని మంత్రి సూచించారు. విద్యార్థుల పాస్ మెమోల్లో ఏవైనా పొరపాట్లు తలెత్తితే సంబంధిత ప్రధానోపాధ్యాయుల ద్వారా ఎస్సెస్సీ బోర్డుకు పంపాలని సూచించారు. పదో తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులు భవిష్యత్‌లో మంచి కోర్సులను ఎంపిక చేసుకొని తమ భవిష్యత్‌ను బంగారుమయం చేసుకోవాలని మంత్రి ఆకాంక్షించారు. విద్యార్థులకు ఫార్మేటివ్ అసెస్మెంట్ (ఎఫ్ఏ–1)లో వచ్చిన మార్కులను పరిగణనలోకి తీసుకోనుంది. ఆయా సబ్జెక్టులకు ఎఫ్ఏ–1లో నిర్దేశిత 20 శాతం మార్కుల ప్రకారం ప్రతి విద్యార్థి వాటిల్లో సాధించిన మార్కుల ఆధారంగా గ్రేడింగ్ ఇచ్చింది. ఎఫ్ఏ–1 పరీక్షలకు 5.21 లక్షలమంది విద్యార్థులు హాజరైనట్లు గుర్తించిన విద్యాశాఖ వారికి ఆ పరీక్షల్లో వచ్చిన మార్కులను ఐదింతలు చేసి (20 శాతాన్ని 100 శాతానికి పెంచి) గ్రేడ్లు ఇచ్చేలా చర్యలు చేపట్టింది. విద్యార్థులకు ఒక్కో సబ్జెక్టులో వచ్చిన మార్కుల ప్రకారం గ్రేడింగ్, గ్రేడ్ పాయింట్లు ఇచ్చి, అన్ని సబ్జెక్టులకు కలిపి గ్రేడ్ పాయింట్ యావరేజ్(జీపీఏ)ను ప్రకటించింది. 2.2 లక్షల మంది విద్యార్థులకు 10/10 జీపీఏ వచ్చినట్లు తెలిసింది. -
డిగ్రీలో ఒకే తరహా గ్రేడింగ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో డిగ్రీ కోర్సుల్లో సిలబస్ భారం తగ్గనుంది. ప్రతి కోర్సులో, ప్రతి సబ్జెక్టులో కొన్ని పాఠ్యాంశాలను తగ్గించి కొత్త పుస్తకాలను అందుబాటులోకి తెచ్చేందుకు ఉన్నత విద్యామండలి చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ప్రస్తుతమున్న 180 క్రెడిట్ పాయింట్లను 150 క్రెడిట్లకు తగ్గించాలని నిర్ణయించింది. అలాగే పది పాయింట్ల యూనిఫామ్ గ్రేడింగ్ విధానాన్ని అమల్లోకి తెచ్చేలా చర్యలు చేపట్టింది. దీంతోపాటు డిగ్రీలో ఔట్‌కమ్ బేస్డ్ విద్యా విధానాన్ని అమల్లోకి తెచ్చేలా చర్యలు చేపట్టింది. ప్రతి పాఠ్యాంశానికి ముందు, ప్రతి పుస్తకానికి ముందు పేజీల్లో దానిని చదివితే ఒనగూరే ప్రయోజనాలను వివరిస్తూ ముందుమాట పొందుపరిచేందుకు చర్యలు చేపట్టింది. ఆయా కోర్సు చదివితే భవిష్యత్తులో ఉండే అవకాశాలపై విద్యార్థులకు అవగాహన కలిగేలా విషయాన్ని పుస్తకాల్లో పొందుపరుచాలని నిర్ణయించింది. చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టం (సీబీసీఎస్) అమల్లోకి తెచ్చి మూడేళ్లు పూర్తయిన నేపథ్యంలో ఉన్నత విద్యా మండలి ఆ విధానంపై సమీక్షించి ఈ నిర్ణయాలు తీసుకుంది. అంతేకాదు విద్యా ర్థుల్లో సామర్థ్యాలు, నైపుణ్యాల పెంపునకు డిగ్రీలో ప్రాధాన్యం ఇవ్వనుంది. కోర్ సబ్జెక్టులు, ఎలక్టివ్స్‌తోపాటు వీటిని తప్పనిసరి అంశాలుగా చేర్చింది. ఈ మేరకు సిలబస్‌లో మార్పులు తెస్తోంది. ఇందులో భాగంగా వివిధ యూనివర్సిటీలకు చెందిన తెలుగు, హిందీ, ఉర్దూ, ఆంగ్లం, కన్నడ, సంస్కృతం, పర్షియన్, అరబిక్, మరాఠీ విభాగాలకు చెందిన బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్లు, విభాగాధిపతులతో ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి, వైస్ చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి భేటీ అయ్యారు. భాషల్లో తీసుకురావాల్సిన మార్పులపై చర్చించారు. మిగతా సబ్జెక్టుల వారితోనూ సమావేశమై సిలబస్ తగ్గింపునకు చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. ఈ మార్పు లను 2019–20 విద్యా సంవత్సరం నుంచే అమల్లోకి తేవాలని మండలి నిర్ణయించింది. ఒక్కో వర్సిటీలో ఒక్కోలా గ్రేడింగ్ ప్రస్తుతం రాష్ట్రంలోని ఒక్కో వర్సిటీలో ఒక్కో తరహా గ్రేడింగ్, మార్కుల విధానం ఉంది. ఒక వర్సిటీలో గ్రేడింగ్ ఎ+ నుంచి ప్రారంభిస్తే కొన్నింట్లో ఎ నుంచి ఉంది. కొన్ని వర్సిటీల్లో 80 శాతం నుంచి 100 శాతం మార్కులు వస్తే ఎ గ్రేడ్ ఉండగా, కొన్నింట్లో 90 శాతం నుంచి 100 శాతం మార్కులు వచ్చినా ఎ గ్రేడ్ ఉంది. ఈ నేపథ్యంలో అన్ని వర్సిటీల్లో ఒకే తరహా గ్రేడింగ్, మార్కుల విధానం తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టింది. యూజీసీ నిబంధనల మేరకు.. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నిబంధనలకు అనుగుణంగా డిగ్రీలో ఉన్న క్రెడిట్స్‌ను తగ్గించాలని నిర్ణయించింది. యూజీసీ నిబంధనల ప్రకారం 120 క్రెడిట్స్‌తో మూడేళ్ల డిగ్రీ కోర్సును పూర్తి చేయవచ్చు. అయితే రాష్ట్రంలో ఇప్పటి వరకు 180 క్రెడిట్స్‌తో డిగ్రీ కోర్సును నిర్వహిస్తున్నారు. దీంతో విద్యార్థులపై భారం పెరిగింది. ఈ నేపథ్యంలో ప్రతి సెమిస్టర్లో 25 క్రెడిట్స్ చొప్పున మూడేళ్లలో ఆరు సెమిస్టర్లకు 150 క్రెడిట్స్‌తో డిగ్రీని పూర్తి చేసేలా చర్యలు చేపట్టారు. ఆ మేరకు పాఠ్యాంశాలను తగ్గించాలని నిర్ణయించారు. ఔట్‌కమ్ బేస్డ్ విద్యా విధానం సిలబస్ మార్పులతోపాటు డిగ్రీలో ఔట్‌కమ్ బేస్డ్ విద్యా విధానానికి శ్రీకారం చుట్టింది. ఔట్‌కమ్ బేస్డ్ లెర్నింగ్, ఔట్ కమ్ బేస్డ్ టీచింగ్‌ను అమలు చేయాలని నిర్ణయించింది. ఒక విద్యార్థి ఒక కోర్సులో చేరుతున్నప్పుడు ఆ కోర్సులో చేరితే చేకూరే ప్రయోజనాలు, భవిష్యత్‌లో అవకాశాలను లెక్చరర్లు క్షుణ్ణంగా వివరిస్తారు. అలాగే ప్రతి సబ్జెక్టులో ముందు పేజీల్లో దాన్ని చదివితే విద్యార్థికి లభించే ప్రయోజనాలు, అందే విజ్ఞానం గురించి చెబుతారు. ప్రతి పాఠ్యాంశం ముందు కూడా అలాగే ప్రయోజనాలను పొందుపరుస్తారు. మూడేళ్ల పాటు భాషలు, ఇతర మార్పులు భాషా సబ్జెక్టులు ప్రస్తుతం డిగ్రీ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లోనే 4 సెమిస్టర్లలో ఉన్నాయి. వాటిని ఇకపై మూడేళ్లపాటు ఆరు సెమిస్టర్లలో కొనసాగిస్తారు. వీటికి 20 క్రెడిట్స్ ఇచ్చేలా చర్యలు చేపట్టారు. వీటితోపాటు.. - ఐదో సెమిస్టర్లో జనరల్ ఎలక్టివ్‌కు 4 క్రెడిట్స్, ఆరో సెమిస్టర్లో ప్రాజెక్టు వర్క్ పెట్టి దానికి 4 క్రెడిట్స్ ఇవ్వాలని మండలి నిర్ణయించింది. - ఎబిలిటీ ఎన్హాన్స్మెంట్ కోర్సు, స్కిల్ ఎన్హాన్స్మెంట్ కోర్సును తప్పనిసరి సబ్జెక్టులుగా అమలు చేయనున్నారు. ఇందులో ఎన్విరాన్మెంట్ సైన్స్, బేసిక్ కంప్యూటర్ స్కిల్స్‌తోపాటు ఇతర అంశాలు నేర్పిస్తారు. - ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ, ఇతర స్పోర్ట్స్‌కు మొత్తంగా 6 క్రెడిట్స్ ఇవ్వనున్నారు. - విద్యార్థులకు 6 వారాల పాటు సమ్మర్ ఇంటర్న్‌షిప్ అమలు చేయనుంది. ప్రథమ సంవత్సరం పూర్తయ్యాక లేదా ద్వితీయ సంవత్సర పూర్తయిన తరువాత దీనిని అమలు చేయనుంది. దానికి 2 క్రెడిట్స్ ఇవ్వనుంది. - అలాగే బీకాంలో కొత్త కోర్సులను ప్రవేశ పెట్టేలా చర్యలు చేపట్టింది. బీకాంతోపాటు బీకాం కంప్యూటర్ అప్లికేషన్స్, బీకాం అడ్వర్టైజింగ్ అండ్ సేల్స్ మేనేజ్మెంట్, బీకాం టాక్స్ ప్రొసీజర్స్, బీకాం ఫారిన్ ట్రేడ్, బీకాం హానర్స్ కోర్సులను నిర్వహించాలని నిర్ణయించింది. - ఇప్పటివరకు ఉన్న బీకాం కంప్యూటర్స్, బీకాం ఈ కామర్స్ రెండింటిని కలిపి బీకాం కంప్యూటర్ అప్లికేషన్స్‌గా నిర్వహించనుంది. -
చిన్న రైతు ఆదాయం పెంచే గ్రేడింగ్ యంత్రం!
రైతులు ఆరుగాలం కష్టపడి, కరువును, తుపాన్లను, చీడపీడలను తట్టుకొని పండించి నూర్పిడి చేసిన తిండి గింజలు, పప్పు ధాన్యాలు, నూనె గింజల్లో చిన్న చిన్న రాళ్లు, మట్టిపెళ్లలు, ఇసుక వంటివి కలిసి ఉండటం వల్ల గిట్టుబాటు ధర పొందలేని దుస్థితి నెలకొంటున్నది. పండించిన ధాన్యాల్లో రాళ్లు, మట్టి పెళ్లలు, ఇసుక వంటివి కలవటం ఒక సమస్య అయితే.. ఒకే పొలంలో కలిపి పండించిన వివిధ రకాల ధాన్యాలు కలిసిపోవటం, వాటిని వేరు చేయడం చాలా శ్రమ, ఖర్చుతో కూడిన మరో సమస్య. ముఖ్యంగా కొద్ది విస్తీర్ణంలో వివిధ ఏకదళ, ద్విదళ పంటలను కలిపి ఒకే పొలంలో సేంద్రియ/ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పండించే చిన్న, సన్నకారు మెట్ట ప్రాంతాల రైతులకు ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంది. చిన్న, సన్నకారు రైతుల ఆదాయం పెరగాలంటే ఈ సమస్యలను పొలం దగ్గరే సులభంగా పరిష్కరించుకునే తక్కువ ఖర్చుతో కూడిన మొబైల్ యంత్రం అవసరం ఉంది. ఈ అవసరాన్ని తీర్చేందుకు ముగ్గురు ఇంజనీర్లు ఏడాదిన్నరగా చేసిన కృషి ఫలించి.. ‘మల్టీపర్పస్ మొబైల్ గ్రేడింగ్ మిషన్’ సిద్ధమైంది. ముగ్గురు మిత్రుల పరిశోధన.. పీటర్, దినే‹శ్, కిరణ్.. ఈ ముగ్గురూ మంచి మిత్రులు, ఇంజనీర్లు కూడా. పీటర్ ఆస్ట్రేలియాలో పుట్టారు. మెరైన్ ఇంజనీర్. పదేళ్లు ఓడల్లో ఉద్యోగాలు చేస్తూ దేశవిదేశాలు తిరిగారు. ఆ క్రమంలో వెన్నెముకకు దెబ్బ తగిలి.. పాండిచ్చేరిలో ఆశ్రమానికి చేరారు. ఆరోగ్యం మెరుగుపడిన తర్వాత ఇక్కడే స్థిరపడిపోయారు. 22 ఏళ్లుగా గ్రామీణ వ్యవసాయ సాంకేతికతలు, జీవనోపాధులపై పనిచేస్తున్నారు. ప్రస్తుతం అనంతపురం జిల్లా కదిరిలో ఉంటూ దినేష్‌తో కలిసి పనిచేస్తున్నారు. కర్ణాటకలో పుట్టిన దినేష్ ఇంజనీరింగ్ చదువుకుని కదిరిలో స్థిరపడి ఎర్త్ 360 సంస్థను స్థాపించారు. చిరుధాన్యాల సాగు, వినియోగం వ్యాప్తికి కృషి చేస్తున్నారు. తెలుగు వారైన విస్సా కిరణ్ మద్రాస్ ఐఐటీలో ఈసీఈలో ఇంజనీరింగ్ చదువుకుని అమెరికాలో కొన్నేళ్లు ఉద్యోగం చేసి తిరిగి స్వదేశంలో రైతుల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారు. దేశంలో 80 శాతంగా ఉన్న చిన్న, సన్నకారు రైతులకు బాసటగా నిలిచే పనులు చేయడం అన్నదే– ఈ ముగ్గురు మిత్రుల లక్ష్యం. చిన్న, సన్నకారు రైతులు అప్పులు, ఆత్మహత్యల బారిన పడకుండా ఉండాలి. వీరు పచ్చగా ఉండాలంటే వాణిజ్య పంటల జోలికి వెళ్లకుండా వాతావరణ మార్పులను తట్టుకునే తమవైన స్థానిక ఆహార పంటలనే మిశ్రమ సేంద్రియ సాగు ద్వారా పండించుకుని తింటూ, మిగులు ఉత్పత్తులను మంచి ధరకు విక్రయించుకోగలగాలి. ఇది సాధ్యం కావాలంటే తక్కువ ఖర్చుతో, తక్కువ శ్రమతో రాళ్లు, ఇసుక, మట్టిపెడ్డలు, పుల్లలు లేకుండా శుద్ధమైన ధాన్యాలను రైతు ఇంటికి తెచ్చుకోవటం ముఖ్యం. అయితే, పొలం దగ్గరే గ్రేడింగ్ చేసే యంత్రాలు అందుబాటులో లేవు. పెద్ద మొబైల్ కంబైన్ హార్వెస్టర్లు ఉన్నా అవి పెద్ద కమతాలున్న పెద్ద రైతులకే అందుబాటులో ఉంటాయి. అందువల్ల తక్కువ ధరకే తమ ధాన్యాలను దళారులకు అమ్మేసుకోవడం తప్ప చిన్న రైతులకు వేరే దారి లేకుండా పోతోంది. ఈ సమస్యను పరిష్కరించాలంటే పొలం దగ్గరకు సులువుగా తీసుకెళ్లి ఎన్ని రకాల ధాన్యాలనైనా రాళ్లు, ఇసుక తీసేసి, వేటికి వాటిని వేరు చేసిచ్చే గ్రేడింVŠ యంత్రాన్ని తామే తయారు చేయాలని వీరు నాలుగేళ్ల క్రితం నిర్ణయించుకున్నారు. ఏడాదిన్నర క్రితం పూర్తిగా దృష్టి కేంద్రీకరించారు. కదిరిలోనే ప్రయోగాలు చేపట్టి, ఎట్టకేలకు తాము ఆశించిన యంత్రాన్ని రూపొందించారు. 8 నెలల క్రితం నుంచి రైతుల అభిప్రాయాలను తెలుసుకుంటూ ఈ యంత్రాన్ని మెరుగుపరిచి తుది రూపు ఇచ్చారు. మొబైల్ గ్రేడర్ ప్రత్యేకతలు ఈ యంత్రం రాళ్లు, ఇసుక, పుల్లలు, మట్టిపెళ్లలతోపాటు తాలు గింజలను కూడా వివిధ ధాన్యాల నుంచి సమర్థవంతంగా వేరు చేస్తుందని పీటర్, దినేశ్, కిరణ్ తెలిపారు. 4 అడుగుల వెడల్పు, 6 అడుగుల పొడవు, 80 కిలోల బరువు ఉంటుంది. దీనికి మొత్తం 3 జల్లెడలు అమర్చారు. 0.5 హెచ్.పి. మోటరుతో సింగిల్ ఫేజ్ ఎ.సి. కరెంటుతో.. అంటే, మారుమూల గ్రామాల్లో ఇళ్లకు ఉండే విద్యుత్‌తో కూడా నడుస్తుంది. గంటకు 10 క్వింటాళ్ల ధాన్యాలను గ్రేడ్ చేస్తుంది. రాళ్లు రప్పలు, ఇసుక, తాలను వేరు చేయడంతోపాటు.. కలిసిపోయిన రకరకాల ధాన్యాలను కూడా వేటికవి వేరు చేస్తుంది. దీనికి అడుగున ముందు వైపు రెండు టైర్లను అమర్చారు. ఎడ్లబండి లేదా ట్రాక్టరుకు కట్టి దీన్ని పొలాల దగ్గరకు తీసుకెళ్లి ఉపయోగించుకునేలా రూపొందించారు. సోలార్ విద్యుత్‌తో కూడా నడిపే ప్రయత్నం చేస్తున్నారు. మిల్లెట్ మెషీన్స్ అండ్ టూల్స్ పేరిట సంస్థను ఏర్పాటు చేసి.. రూ. 50 వేల ధరకు ఈ గ్రేడర్‌ను అనంతపురం జిల్లా కదిరిలో ఈ యంత్రాన్ని రైతులకు అందుబాటులోకి తెచ్చారు. వ్యవసాయ యంత్రాల పరీక్షణ, ధుృవీకరణ సంస్థల ద్వారా సర్టిఫికెట్ పొందటం ద్వారా ప్రభుత్వ సబ్సిడీపై చిన్న, సన్నకారు రైతులందరికీ ఈ యంత్రాన్ని అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నామని దినేశ్ తెలిపారు. చిరుధాన్యాల పైపొట్టు తీసే డీహల్లర్ యంత్రాన్ని తక్కువ ధరలో రూపొందిస్తున్నామని, కొద్ది నెలల్లోనే రైతులకు అందిస్తామన్నారు. చిన్న, సన్నకారు రైతులకు ఉపయోగపడే మరికొన్ని వ్యవసాయ ఉపకరణాలు, యంత్రాలపై కూడా పరిశోధనలు కొనసాగుతున్నాయన్నారు. బహుళ ప్రయోజనకారి అయిన ఈ యంత్రం ఇటీవల వైబ్రంట్ గుజరాత్ టెక్నాలజీ సమ్మిట్– 2018లో వ్యవసాయ యంత్రాల విభాగంలో అవార్డును గెల్చుకున్నదని, ఒడిశా ప్రభుత్వం ఈ యంత్రంపై ఆసక్తి చూపిందన్నారు. ఈ నెల మొదటి వారంలో అహ్మదాబాద్‌లో జరిగిన జాతీయ రైతు సమ్మేళనంలో ఈ యంత్రం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. వివరాలకు.. దినేశ్ – 94408 70875. milletmachinesandtools@gmail.com -
‘గ్రేడింగ్’పై వెనక్కి!
⇒ కేవలం గ్రేడింగ్ మాత్రమే ⇒ అమలు చేయడం కష్టమే ⇒ జేఈఈలో 75 శాతం మార్కుల నిబంధనతో సమస్యలు ⇒ ర్యాంకుల ఖరారులో వెయిటేజీతో ఇబ్బందులు ⇒ కొందరి మార్కులు వెల్లడించాల్సి వస్తే ఎలాగన్న సందేహాలు ⇒ సాధ్యాసాధ్యాలపై ⇒ మళ్లీ కమిటీ పరిశీలన సాక్షి, హైదరాబాద్ : విద్యార్థులను మార్కుల ఒత్తిడి నుంచి దూరం చేసేందుకు, కార్పొరేట్ యాజమాన్యాల అడ్డగోలు ప్రచారానికి తెరవేసేందుకు అమల్లోకి తేవాలని నిర్ణయించిన గ్రేడింగ్ విధానంపై ఇంటర్మీ డియట్ బోర్డు వెనకడుగు వేస్తోంది. ప్రభుత్వం కూడా దీనిలోని ఇబ్బందులు, సందేహాలను లేవనెత్తడంతో గ్రేడింగ్ విధానం అమలును విరమించు కునే అవకాశం కనిపిస్తోంది. తల్లిదండ్రులు, కాలేజీ యాజమాన్యాలు, విద్యావేత్తలు, అధికారులతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇంటర్ బోర్డు సలహా కమిటీ సిఫార్సు మేరకు ఇంటర్ బోర్డు గ్రేడింగ్ విధానం అమలుపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిన విషయం తెలిసిందే. వాటిని పరిశీలించిన ఉన్నతాధికారులు గ్రేడింగ్ అమలుతో తలెత్తే సమస్యలు, సందేహాలను లేవనెత్తారు. ప్రస్తుతం దేశంలో తెలంగాణ, ఏపీలతోపాటు ఐదారు రాష్ట్రాల ఇంటర్ బోర్డులు మార్కులను మాత్రమే ఇస్తుండగా.. సీబీఎస్ఈతోపాటు మరికొన్ని రాష్ట్రాల బోర్డులు మార్కులతోపాటు గ్రేడ్లను ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేవలం గ్రేడింగ్ మాత్రమే ఎలా అమలు చేస్తారని ప్రశ్నించినట్లు తెలిసింది. కమిటీ నివేదిక తరువాత తుది నిర్ణయం గ్రేడింగ్ విధానంపై సందేహాలు వస్తున్న నేపథ్యంలో.. సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయిస్తామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ప్రకటించారు. గ్రేడింగ్ విధానాన్ని సిఫారసు చేసిన కమిటీకే ప్రభుత్వం లేవనెత్తిన ప్రశ్నలు, వాటికి సమాధానాలను సూచించడంతోపాటు అసలు గ్రేడింగ్ సాధ్యాసాధ్యాలను తేల్చే పని అప్పగించారు. అయితే ప్రభుత్వం లేవనెత్తిన అంశాలకు తగిన పరిష్కారాలు లేవని, అందువల్ల గ్రేడింగ్‌పై వెనక్కి తగ్గే పరిస్థితి ఉందని ఇంటర్ బోర్డు వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే కమిటీ తమ తుది నివేదికను ఇచ్చాక ప్రభుత్వం నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశముంది. ఇంటర్ బోర్డు ప్రతిపాదనలివీ.. ఎంసెట్ తుది ర్యాంకుల ఖరారులో ఇంటర్ మార్కులకు వెయిటేజీ ఉండటం, ఎన్ఐటీ, ట్రిపుల్ఐటీ, ఐఐటీల్లో ప్రవేశాలు పొందేవారు జేఈఈ ర్యాంకుతోపాటు ఇంటర్లో 75 శాతం మార్కులు (ఎస్సీ, ఎస్టీలకు 65 శాతం) ఉండాలన్న నిబంధన నేపథ్యంలో ఇంటర్ బోర్డు మూడు రకాల ప్రతిపాదనలు చేసింది. 1. ఎంసెట్ ర్యాంకుల ఖరారులో ఇంటర్ మార్కులకు వెయిటేజీని తొలగించి.. ఎంసెట్ మెరిట్ ఆధారంగానే ప్రవేశాలు చేపట్టడం. 2. మార్కులకు బదులు సబ్జెక్టుల వారీగా గ్రేడ్లను పరిగణనలోకి తీసుకోవడం. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టుల్లో వచ్చే గ్రేడ్లను బట్టి వెయిటేజీని లెక్కించడం. 3. విద్యార్థులకు గ్రేడ్లు ఇచ్చినా, బోర్డు వద్ద మార్కులు ఉంటాయి. కాబట్టి ఎంసెట్ ర్యాంకుల ఖరారులో ఆ మార్కుల ఆధారంగా వెయిటేజీ ఇవ్వడం. అలాగే జేఈఈ, అడ్వాన్స్డ్ పరీక్షలు నిర్వహించే సీబీఎస్ఈ, ఐఐటీలకు మా ర్కుల జాబితాలు అందజేయడం.. అయితే ఈ మూడు రకాల ప్రతిపాదనలపై ఉన్నతాధికారులు అనేక అనుమానాలు వ్యక్తం చేశారు. ‘గ్రేడింగ్’పై సందేహాలివీ.. ► ఎన్ఐటీ, ట్రిపుల్ఐటీ, ఐఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్, జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షల్లో విద్యార్థుల మధ్య పోటీ ఒకటీ రెండు మార్కుల వ్యత్యాసంతోనే ఉంటుంది. ఉదాహరణకు నలుగురు విద్యార్థులకు జేఈఈలో మంచి ర్యాంకు వచ్చి, ఆ నలుగురికీ ఇంటర్లో 70–79 శాతం గ్రేడ్ ఉంటే.. ఎవరికి ఎక్కువశాతం మార్కులు ఉన్నాయన్నది తెలియదు. సీబీఎస్ఈకి మార్కులు ఇచ్చినా విద్యార్థుల్లో సందేహాలు తలెత్తుతాయి. అలాంటపుడు వారి అనుమానాల నివృత్తి ఎలాగనే సందేహాలు తలెత్తుతున్నాయి. ► సందేహం వ్యక్తం చేసిన విద్యార్థులకు మార్కులను ఇచ్చి, మిగతావారికి ఇవ్వకపోవడం కుదరదు. ► ఎంసెట్‌లో వెయిటేజీ కోసం మార్కులు ఇచ్చినపుడు విద్యార్థులకు ఎందుకు ఇవ్వరనేదానిపై న్యాయస్థానాలకు వెళ్లే అవకాశం ఉంటుంది. ► తక్కువ గ్రేడ్ వచ్చిన వారు ఇంప్రూవ్మెంట్ కోసం పరీక్షలు రాయాలంటే ఎలా? రాసినా ముందు ఎన్ని మార్కులు వచ్చాయి, ఇప్పుడెన్ని పెరిగాయనేది తెలిసేదెలా? అన్న సందేహాలు వస్తున్నాయి. -
ఇంటర్మీడియెట్‌లో 8పాయింట్ల గ్రేడింగ్
-
8పాయింట్ల గ్రేడింగ్
సాక్షి, హైదరాబాద్ : ఇంటర్మీడియెట్‌లో ఎనిమిది పాయింట్ల గ్రేడింగ్ విధానాన్ని అమల్లోకి తెచ్చేందుకు ఇంటర్ బోర్డు కసరత్తు మొదలుపెట్టింది. ఈ అంశంపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించినట్లు తెలిసింది. ప్రభుత్వం త్వరలోనే సానుకూల నిర్ణయం తీసుకొని, గ్రేడింగ్ విధానం అమలుకు ఉత్తర్వులు జారీ చేయనుందని ఓ ఉన్నతాధికారి వెల్లడించారు. 2018 మార్చిలో జరిగే వార్షిక పరీక్షల్లో ప్రథమ సంవత్సరం విద్యార్థులకు, 2019లో రెండో సంవత్సర విద్యార్థులకు ఈ విధానాన్ని వర్తింపజేసే అవకాశం ఉంది. మార్కుల విధానం వల్ల తల్లి దండ్రులు, ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాల నుంచి తీవ్ర ఒత్తిడి నెలకొనడంతో ఆ అంచనాలను అందుకోలేని విద్యార్థులు ఆత్మహత్యలవైపు మళ్లుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మార్కుల విధానానికి స్వస్తిపలికి కేవలం గ్రేడింగ్ విధానాన్ని అమల్లోకి తేవాలని ఇంటర్ బోర్డు, తల్లిదండ్రులు, ప్రైవేటు యాజమాన్య ప్రతినిధులతో ఏర్పాటైన సలహా కమిటీ నిర్ణయించింది. ప్రస్తుతం ఇంటర్లో గ్రేడింగ్ విధానం ఉన్నా ఏ గ్రేడ్‌లో ఎంత మంది ఉత్తీర్ణులవుతున్నారనే వివరాలను మాత్రమే బోర్డు ఇస్తోంది. విద్యార్థుల మెమోల్లో గ్రేడ్లను ఇవ్వడం లేదు. కానీ ఇకపై మార్కులు ఇవ్వకుండా గ్రేడింగ్ విధానాన్ని అమల్లోకి తేవాలని బోర్డు నిర్ణయానికి వచ్చింది. పదో తరగతి తరహాలోనే.... రాష్ట్రంలో పదో తరగతి తరహాలోనే ఇంటర్లో గ్రేడింగ్ విధానాన్ని బోర్డు అమల్లోకి తేనుంది. ఎనిమిది పాయింట్లుగా తీసుకురానున్న ఈ విధానంలో ప్రతి సబ్జెక్టుకు మార్కుల పరిధిని బట్టి గ్రేడ్ పాయింట్లు, గ్రేడ్, అన్ని సబ్జెక్టుల్లో గ్రేడ్ పాయింట్లనుబట్టి గ్రేడ్ పాయింట్ల యావరేజ్ ఇస్తారు. అలాగే ప్రథమ, ద్వితీయ సంవత్సరంలో వచ్చిన గ్రేడ్లు, గ్రేడ్ పాయింట్ల యావరేజ్నుబట్టి ఓవరాల్ గ్రేడ్ ఇచ్చేలా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఫెయిల్ అయిన వారికి మాత్రం జీరో గ్రేడ్ పాయింట్‌తో ఈ గ్రేడ్ ఇస్తారు. ఎంసెట్‌లో వెయిటేజీపై 3 ప్రతిపాదనలు... గ్రేడింగ్ విధానం అమలు నేపథ్యంలో ఇంటర్ మార్కులకు ఉన్న వెయిటేజీ విషయంలో బోర్డు ప్రభుత్వానికి పంపేందుకు మూడు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఇందులో తొలి ప్రతిపాదన ఎంసెట్ ర్యాంకుల ఖరారులో ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజీని తొలగించి ఎంసెట్ మెరిట్ ఆధారంగానే ప్రవేశాలు చేపట్టడం. ఇక రెండోది మార్కులకు బదులు సబ్జెక్టులవారీగా గ్రేడ్లను పరిగణనలోకి తీసుకోవడం. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టుల్లో వచ్చే గ్రేడ్లనుబట్టి వెయిటేజీని లెక్కించి ఇవ్వడం. ఇక మూడోది విద్యార్థులకు గ్రేడ్లు ఇచ్చినా బోర్డు వద్ద మార్కులు ఉంటాయి కాబట్టి ఎంసెట్ ర్యాంకుల ఖరారు కోసం విద్యార్థుల మార్కులను బోర్డు ఎంసెట్ కన్వీనర్‌కు అందజేస్తే ఆ మార్కుల ఆధారంగా వెయిటేజీ లెక్కించి ఎంసెట్ ర్యాంకులు ఖరారు చేయడం. అయితే ఈ మూడు ప్రతిపాదనల్లో వెయిటేజీ రద్దుపైనే బోర్డు దృష్టిసారిçంచినట్లు తెలిసింది. ఎందుకంటే విద్యార్థులు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీలో ఇంప్రూవ్మెంట్ రాసినా, ఇంటర్ మార్కుల కోసం లేదా జవాబు పత్రం ఫొటోకాపీ కోసం దరఖాస్తు చేసుకున్నా మార్కులు వారికి తెలిసేటప్పటికి ప్రవేశాలు పూర్తవుతాయి కాబట్టి ఇబ్బంది ఉండదని అధికారులు పేర్కొంటున్నారు. -
గ్రేడింగ్ ప్రకటనలతో ఆత్మహత్యలు ఆగవు
ఒంగోలు: గ్రేడింగ్ ప్రకటనతో విద్యార్థుల ఆత్మహత్యలు ఆగుతాయనుకోవడం భ్రమే అవుతుందని ఏపీ ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి తిప్పారెడ్డి వెంకటేశ్వరరెడ్డి పేర్కొన్నారు. స్థానిక ఏకేవీకే కాలేజీలో శుక్రవారం అసోసియేషన్ జనరల్ సెక్రటరీ తిప్పారెడ్డి వెంకటేశ్వరరెడ్డి, కార్యదర్శి కె.విశ్వనా«థబాబు, జోనల్ అధ్యక్షుడు కె.రాజేంద్రబాబు తదితరులు పాల్గొని పలు అంశాలపై తీర్మానించారు. అనంతరం తీర్మానించిన అంశాలను తిప్పారెడ్డి వెంకటేశ్వరరెడ్డి మీడియాకు వివరించారు. మార్కులు, ర్యాంకులే లక్ష్యంగా రోజుకు 16 నుంచి 18 గంటలు యాంత్రికంగా బట్టీపట్టించడం, లక్ష్యం చేరుకోలేదంటూ విద్యార్థుల పట్ల యాజమాన్య వికృత పోకడల కారణంగా మానసిక ఒత్తిడి శ్రుతిమించి విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడికిలోనై ఆత్మహత్యలు చేసుకుంటారని పేర్కొన్నారు. ఆత్మహత్యలు పెరిగినపుడల్లా ప్రభుత్వాలు కమిటీలు వేయడం, నామమాత్రపు చర్యలతో చేతులు దులుపుకోవడం పరిపాటిగా మారుతుందని, అందులో భాగమే నీరదారెడ్డి కమిటీ, మాజీ కమిషనర్ చక్రపాణి, కమిషన్ సూచనలు బుట్టదాఖలా అని పేర్కొన్నారు. పదిరోజులుగా ఆత్మహత్యలపై ఆందోళనలు తీవ్రమైన నేపథ్యంలో విద్యాశాఖామంత్రి స్పందించి ఈ ఏడాది నుంచి ర్యాంకుల బదులు గ్రేడింగ్ అంటూ ప్రకటించడం కేవలం సమస్యను పక్కదారి పట్టించడంగానే భావిస్తున్నామన్నారు. కార్పొరేట్ విద్యాసంస్థల్లో పనితీరు, పనిగంటలు, బోధనా పద్ధతులు మారనంత వరకు ఆత్మహత్యలు ఆగవన్నారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో సాగాల్సిన విద్యను తీవ్ర మానసిక ఒత్తిడితో విద్యార్థులను చదివించడం తగదని, ప్రతి గ్రూపుకు కేవలం 2 నుంచి 3 సెక్షన్లు మాత్రమే ఉండాలన్నారు. ఇంటర్ బోర్డు అకడమిక్ సిలబస్‌ను మాత్రమే బోధించాలని, ఎంసెట్, ఐఐటీ కోచింగ్‌లు సమాంతరంగా బోధించకుండా నిరోధించాల్సిన అవసరం ఉందన్నారు. ఒంటరితనాన్ని పారదోలి ఒత్తిడి తగ్గించేటట్లు అకడమిక్ క్యాలెండర్ రూపొందించాలని ప్రభుత్వానికి ఏపీ ప్రభుత్వ జూనియన్ లెక్చరర్ల సంఘం విజ్ఞప్తి చేస్తుందని, ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శిని ఒకటి రెండు రోజుల్లో కలిసి తమ తీర్మానాలను అందిస్తామని వెంకటేశ్వరరెడ్డి పేర్కొన్నారు. -
కాయలు మిలమిల...లాభాలు ధగధగ
‘ఫ్రూట్ గ్రేడింగ్’తో అదనపు ఆదాయం మార్కెట్‌యార్డులో అందుబాటులో ఉన్న యూనిట్ చీనీ, కమలా రైతులకు ప్రయోజనం చీనీ కాయలైనా...కమలాలైనా చిన్నవి, పెద్దవి, మధ్యస్థంగా ఉన్నవి అన్నీ కలిపేసి విక్రయిస్తే రైతులకు వచ్చే లాభం తగ్గుతుంది. అదే వేటికవి వేరుచేసి విక్రయిస్తే వచ్చే రాబడి తప్పకుండా పెరుగుతుంది. ఇందుకోసం స్థానిక మార్కెట్‌యార్డులో ‘ఫ్రూట్ గ్రేడింగ్’ యూనిట్‌ను అందుబాటులో ఉంచారు. ఈ యూనిట్ ద్వారా సహజపద్ధతుల్లోనే పండ్ల రంగును కూడా మెరుగుపరుచుకోవచ్చు. మార్కెట్లో కాయలు మెరిస్తే...రేటు ధగధగ లాడుతుందని నిపుణులు చెబుతున్నారు. అనంతపురం అగ్రికల్చర్: ‘ఫ్రూట్ గ్రేడింగ్’తో చీనీ, కమలాలు పండించే రైతులు అదనపు ఆదాయం లభిస్తుంది. వాస్తవంగా పంటనంతా కలిపి అమ్మితే మార్కెట్లో ఒకే ధర పలకడం జరుగుతుంది. దీని వల్ల రైతులు ఆదాయాన్ని కోల్పోతారు. అందువల్ల చిన్నవాటిని, పెద్ద వాటిని వేర్వేరుగా అమ్మితే ధరల్లో వ్యత్యాసం ఉంటుంది. అలా చేయడమే గ్రేడింగ్ అంటారు. గ్రేడింగ్ చేయడం వల్ల పెద్దవాటికి మంచి ధర తప్పనిసరిగా వస్తుంది. దీనికి రైతు కొంత ఖర్చు చేసినా....అంతకు రెండు మూడు రెట్లు ఆదాయం ఉంటుంది. ఈ క్రమంలో పండ్లతోటల రైతులకు కొంతలో కొంత ఉపయోగపడేలా గ్రేడింగ్ ప్రక్రియ అందుబాటులోకి వచ్చింది. పండ్లతోటల సంక్షేమ సహకార సంఘం ఆధ్వర్యంలో స్థానిక వ్యవసాయ మార్కెట్‌యార్డులో గ్రేడింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేశారు. సంఘం సభ్యులైన ప్రదీప్‌రెడ్డి, శ్రీనివాసచౌదరిలు మూలనబడిన మిషన్‌కు మరమ్మతులు చేయించి అందుబాటులోకి తీసుకువచ్చారు. రైతులు పండించిన చీనీకాయలకు అదనంగా ధర పలకాలంటే ఇక్కడ ఏర్పాటు చేసిన రైపనింగ్ ఛాంబర్లో ఇథలీన్గ్యాస్ ద్వారా రంగు (కలర్) మెరుగుపరచుకోవడంతో పాటు సైజుల వారీగా వ్యాక్సీ గ్రేడింగ్ చేసుకోవడం ద్వారా టన్నుపై రూ.5 వేల వరకు అదనంగా తీసుకోవచ్చని వారు చెబుతుూన్నారు. అయితే టన్నుకు రైతులు రూ.1,500 ఖర్చు చేయాల్సి వస్తుందన్నారు. అదనపు ఆదాయం సాధారణంగా టన్ను చీనీ మార్కెట్లో రూ.20 వేలు పలికితే... ఇలా గ్రేడింగ్ చేసినవి ఎంతలేదన్నా రూ.25 వేల వరకు పలుకుతాయని ఫ్రూట్ గ్రేడింగ్ నిర్వాహకులు తెలిపారు. అంటే పది టన్నులు అమ్మితే రూ.2 లక్షలకు బదులుగా రూ.2.50 లక్షల వరకు తీసుకోవచ్చని చెబుతున్నారు. ఎక్కువగా చీనీకాయలు పండించే రైతులకు పెద్ద ఎత్తున లాభం వస్తుందనీ, కినో కమలాలకు అయితే మరింత ఎక్కువ ధర లభించే అవకాశం ఉందని చెబుతున్నారు. చాలా మంది రైతులు పంట పండించడానికి ఎంతైనా కష్టపడతారు కానీ... మార్కెటింగ్ చేసుకోవడంలో ఆసక్తి చూపరనీ, దీనివల్ల వారు నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. అందువల్ల మార్కెటింగ్‌పై ఎంత దృష్టి పెడితే అంత లాభాలు గడించడానికి అవకాశం ఉందని చెబుతున్నారు. బెంగళూరుకు చెందిన బిగ్‌బాస్కెట్ కంపెనీతో అంగీకారం ఉన్నందున పెద్దగా లాభం ఆశించకుండా తామే రైతుల నుంచి చీనీకాయలు కొనుగోలు చేసి రైపనింగ్, గ్రేడింగ్ చేసి వ్యాపారం కొనసాగిస్తున్నట్లు ఫ్రూట్ గ్రేడింగ్ యూనిట్ నిర్వాహకులు తెలిపారు. మార్కెట్‌యార్డులోని ‘ఫ్రూట్ గ్రేడింగ్’ యూనిట్‌కు రోజుకు 20 టన్నుల వరకు గ్రేడింగ్ చేసే సామర్థ్యం ఉందన్నారు. క్యాల్షియం కార్భైడ్‌తో కాకుండా ప్రభుత్వ నిబంధనల మేరకు ఇథలీన్, వ్యాక్స్ ద్వారా ఈ ప్రక్రియ చేపడుతున్నట్లు తెలిపారు. చీనీకాయలతో పాటు కినో అనే కొత్తరకం కమలాకాయలు ఇక్కడ గ్రేడింగ్ చేస్తున్నామన్నారు. ప్రస్తుతం తామే రైతుల నుంచి కొనుగోలు చేసి గ్రేడింగ్ యూనిట్ నిర్వహిస్తున్నామని తెలిపారు. రైతులు ఒక్కసారి దీనికి అలవాటు పడితే గ్రేడింగ్ యూనిట్‌కు డిమాండ్ అధికంగా ఉంటుందని వారు భావిస్తున్నారు. ఫ్రూట్ గ్రేడింగ్‌కు సంబంధించిన మరిన్ని వివరాలకు 91609 27999, 94900 55366 నంబరల్లో సంప్రదించవచ్చు. మార్కెటింగ్ తరఫున ప్రోత్సాహం ఇటీవల మార్కెటింగ్‌శాఖ కమిషనర్ శ్యామూల్ ఆనంద్ గ్రేడింగ్ యూనిట్‌ను సందర్శించి మంచి ప్రయోగం చేస్తున్నారని నిర్వాహకులను అభినందించారు. మార్కెటింగ్‌శాఖ తరఫున ప్రోత్సహించడానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. -
మంత్రుల పనితీరుపై చంద్రబాబు గ్రేడింగ్
-
మంత్రుల పనితీరుపై చంద్రబాబు గ్రేడింగ్
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు... మంత్రుల పనితీరుపై గ్రేడింగ్ ఇవ్వనున్నారు. రాష్ట్ర కేబినెట్ సోమవారం ఉదయం పది గంటలకు సమావేశం కానుంది. ఈ సందర్భంగా వివిధ శాఖల వందరోజుల ప్రణాళికలపై చంద్రబాబు సమీక్షించనున్నారు. అలాగే రాజధానిపై భూసేకరణకు సంబంధించి విధివిధానాలపై కేబినెట్ చర్చించనుంది. దీనితో పాటు ఎన్టీఆర్ సుజల స్రవంతి, ఫించన్ల పెంపుపై రాష్ట్ర మంత్రి వర్గం నిర్ణయం తీసుకోనుంది.